డాక్టర్ సార్ ఎప్పుడొస్తారయ్యా..?
డాక్టర్ సార్ ఎప్పుడొస్తారయ్యా..?
Published Tue, Aug 16 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
బాలాయపల్లి : బాలాయపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. డాక్టర్ ఉంటేనే సిబ్బందికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఒకవేళ వైద్యుడు రాకపోతే ఆపూట రోగులకు చికిత్స చేయడం ఆపేస్తున్నారు. మంగళవారం కేంద్రానికి ఇన్‌చార్జి డాక్టర్ రాకపోవడంతో రోగులుపడ్డ ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. ఈ సందర్భంగా పలువురు రోగులు మాట్లాడుతూ డాక్టర్ లేకపోతే మందులు లేవు వెంకటగిరి, బంగారుపేటకు వెళ్లాలని సిబ్బంది చెబుతున్నారని ఆవేనద వ్యక్తంచేశారు.
పిగిలాం కొత్తపాళెం, చుట్టి, మన్నూరు గ్రామం నుంచి జ్వరంతో వస్తే సూది మందు ఇవ్వాకుండా పంపేశారని కన్నీరు పెట్టుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేక ఇక్కడికే వస్తున్నామని, సిబ్బంది రోగులపట్ల దురుసుగా ప్రవరిస్తున్నారని వాపోయారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరారు. దీనిపై సూపర్‌వైజర్ లింగమూర్తిని వివరణ కోరగా ఇన్‌చార్జి డాక్టర్ వారంలో రెండు రోజులు వస్తారని, వైద్య సిబ్బందితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement