పీహెచ్‌సీ ముందు రోగుల ఆందోళన | doctor on leave patients lock to hospital in vizianagaram | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీ ముందు రోగుల ఆందోళన

Published Wed, Oct 28 2015 1:32 PM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

doctor on leave patients lock to hospital in vizianagaram

విజయనగరం:  ఆసుపత్రిలో ఉన్న ఒక్క  డాక్టరూ సెలవు పెట్టడంతో  రోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం గ్రామస్థులు, రోగులు పెద్ద ఎత్తున ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీనికి విజయనగరం జిల్లా జామి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేదికైంది.   ఇప్పటికే ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ఉన్న ఒక్క వైద్యుడు గత మూడురోజులుగా  సెలవులో ఉన్నాడు. అతని స్థానంలో ఇంఛార్జ్ వైద్యుడిని నియమించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బుధవారం ఉదయం పీహెచ్‌సీ గేటుకు తాళం వేసి స్థానికులు, రోగులు ఆందోళన చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement