డ్వామా కార్యాలయం ఎదుట వర్క్ ఇన్‌స్పెక్టర్ల ధర్నా
అనంతపురం సెంట్రల్ : ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తామంతా రోడ్డున పడ్డామని, వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అవుట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం డ్వామాహాలులో మంత్రి రావెల కిశోర్‌బాబు ఎస్సీ,ఎస్టీ, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించిన మంత్రి వెంటనే కిందకు దిగివచ్చారు. ఆందోళనకారులతో మంత్రి మాట్లాడారు.
వర్క్ ఇన్‌స్పెక్టర్లు మంత్రికి తమ గోడు వినిపించారు. 9 సంవత్సరాలుగా 93 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్నామన్నారు. దీర్ఘకాలికంగా నుంచి పనిచేస్తుడడంతో కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగ వయో నియామక పరిమితి కూడా దాటిపోయిందన్నారు. ఈ సమయంలో అర్ధంతరంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తే తమ జీవితా లు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీని పై మంత్రి స్పంది స్తూ గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళినితో చర్చించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో సీఐటియూ జిల్లా అధ్యక్షులు ఇంతి యాజ్, జిల్లా కార్యదర్శి నాగేంద్రకుమా ర్, అవాజ్ నాయకులు ముస్కిన్, సీఐటి యూ నాయకురాలు నాగవేణి, అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.
మంత్రి రావెలకు ‘హౌసింగ్’ సెగ
Published Sat, May 16 2015 3:39 AM | Last Updated on Sat, Sep 29 2018 6:11 PM
Advertisement
Advertisement