జనసేన కార్యాలయం​ ఖాళీ.. | Janasena Party Offices Shut Down in Prathipadu Constituency | Sakshi
Sakshi News home page

ప్రత్తిపాడులో జనసేన కార్యాలయం​ ఖాళీ..

Published Mon, Aug 26 2019 8:13 AM | Last Updated on Mon, Aug 26 2019 1:56 PM

Janasena Party Offices Shut Down in Prathipadu Constituency - Sakshi

సాక్షి, ప్రత్తిపాడు: గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయింది. పార్టీ లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను తొలగించకుండానే యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. భవన యజమాని టూలెట్‌ బోర్డు ఏర్పాటు చేశాడు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని అందులో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో  ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల ముందు రావెల కిషోర్‌బాబు టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఎన్నికల్లో జనసేన పరాజయంతో రావెల కిషోర్‌ బాబు పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి విదితమే. దీంతో పార్టీ కార్యాలయం కూడా ఖాళీ అయింది. అలాగే ఏపీలో పలు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ కార్యాలయాలకు టూలెట్‌ బోర్డులు దర్శనం ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పలువురు జనసేన నాయకులు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు మూతపడ్డాయి.

 



No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement