ఆ రెండు శాఖలకు ఒక్కరే..
Published Fri, Oct 7 2016 11:29 PM | Last Updated on Sat, Sep 29 2018 6:11 PM
డీఆర్‌డీఏ, డ్వామా విలీనం
డీఆర్‌డీఓగా నామకరణం
సహాయకులుగా ఇద్దరు డీఆర్‌డీఓలు
దసరా నుంచి అమల్లోకి..
నల్లగొండ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఈ రెండు శాఖలు విలీనం చేశారు. ఒకే స్వరూపం కలిగిన శాఖలను విలీనం చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా తొలుత ఈ రెండు శాఖల్లో విలీన ప్రక్రియ ప్రార ంభించారు. డీఆర్‌డీఏ, డ్వామాను కలిపి కొత్తగా ‘డీఆర్‌డీఓ’ (జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయం)గా నామకరణం చేశారు. కార్యాలయం చివరన ఉండే ‘సంస్థ’ అనే పదాన్ని తొలగించి ‘ఆఫీస్’ అనే పదం చేర్చారు. కొత్తగా ఏర్పాటయ్యే డీఆర్‌డీఓ కార్యాలయ సేవలు దసరా నుంచి ప్రారంభమవుతాయి. ఈ కార్యాలయాన్ని ఇప్పుడున్న డ్వామా ¿¶ వనం నుంచే కొనసాగిస్తారు. ఇప్పటి వరకు రెండు శాఖలకు కలిపి ఇద్దరు పీడీలు ఉండగా ఇక నుంచి ఒక్కరే డీఆర్‌డీఓగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం డీఆర్‌డీఏ పీడీగా పనిచేస్తున్న అధికారిని డీఆర్‌డీఓగా నియమిస్తారు. డ్వామా పీడీని కొత్త జిల్లాకు పంపిస్తారు. డీఆర్‌డీఓకు సహాయకులుగా ఇద్దరు అదనపు డీఆర్‌డీఓలు ఉంటారు. వీరిలో ఒకరు ఉపాధి హామీ పథకానికి, మరొకరు ఐకేపీ పథకాలకు సమన్వయ కర్తలుగా పనిచేస్తారు. ఐకేపీ, ఉపాధి ఉద్యోగులు ఒకే దగ్గర కలిసి పనిచేసినప్పటికీ ఉద్యోగుల పని విషయాల్లో కానీ, వారి సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు.
Advertisement