Combined
-
కలసి ఉంటేనే కలదు విజయం
ఈ భూమి మీద విజయం సాధించిన వారంతా కేవలం తామొక్కరుగానే ఆ విజయాన్ని సాధించలేదు. వారందరికీ ఏదో సమయంలో అనేక మంది సహకరించడం వల్లనే ఆ విజయం సం్రపాప్తించిందన్నది జగమెరిగిన సత్యం. ఏ మనిషైనా ఎన్ని ప్రతిభా సామర్ధ్యాలున్నప్పటికీ, ఎంతటి పండితులైనప్పటికీ, అపారమైన మేధో సంపత్తి ఉన్నప్పటికీ, ఆయా సామర్థ్యాలను సాధించడానికి వారు చేసిన కృషి ఒక ఎత్తయితే, ఆ కృషి చేయడానికి సహకరించిన చేతులు అనేకం అని చెప్పక తప్పదు.ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి గురించి మాట్లాడినపుడు వారు పడిన శ్రమను, కష్టం గురించి మాట్లాడడం జరుగుతుంది తప్ప, వారికి అంతర్లీనంగా సహకరించిన పెద్దలను, మహనీయులను, గురువులను, స్నేహితులను, మిత్రులను గాలికి వదిలేస్తాం. నిజానికి వారందరి సహకారం లేనిదే ఆ వ్యక్తి అంతటి ఉన్నత శిఖరాలకు చేరుకుని ఉండేవారు కాదన్నది వాస్తవం. ఒకవేళ ఆ వ్యక్తి తనకు తానుగా గొప్పవాడిగా భావించుకుని అందరినీ దూరంగా జరిపితే ఆయా విజయాల దరిదాపుల్లోకి వెళ్ళేవాడు కాదన్నది అక్షరాల నిజం. అందుకే కలిసుంటే కలదు సుఖమే కాదు... అది జీవిత సత్యంగా కూడా ఆకళింపు చేసుకోవాలి. మన పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఏ ఒక్క యుగ పురుషుడు కూడా ఐకమత్యం సాధించకుండా విజయ బావుటా ఎగురవేయలేదన్న విషయంలో ఎంత వాస్తవం ఉందో, ఐకమత్యం లేకపోతే ఆ విజయాలు సాధ్యం కావన్న విషయంలోనూ అంతే నిజం ఉంది.అందువల్ల ఏదైనా ముఖ్యమైన విజయాన్ని సాధించడానికి, అత్యంత అవసరమైన అంశం ఐకమత్యం. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐకమత్యం అండగా నిలుస్తుంది. కనుక మన భవిష్యత్ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అన్ని శక్తులు, సామర్థ్యాలు, వనరులు వాడుకోవాలి. ఇవన్నీ ఏ ఒక్కరిలోనో ఉండవు. సహాయం, సహకారం అవసరమున్నప్పుడు అర్ధించడం బలహీనతకు సూచన కాదు. అది వివేకవంతుల లక్షణం కూడా.దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేయడానికి సాక్షాత్తు ఆ జగన్మాతే ఐకమత్యంతో అసురులపై విజయం సాధించింది. చండ, ముండాసురులను, మహిషాసురుని సంహరించి జగజ్జేతగా నిలిచింది. ఆ జగన్మాతకు విజయం దక్కడానికి ముక్కోటి దేవతలు ఒక్కటయ్యారు. తమకు కంటకంగా మారిన అసురులను సంహరించడానికి ఆ తల్లికి సహకరించారు. సృష్టి స్థితి, లయాలకు కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులతో పాటు, ముక్కోటి దేవతలు ఆ తల్లికి తమకున్న శక్తులన్నింటినీ ధారపోశారు. తమకున్న అపార యంత్ర, తంత్ర, అద్వితీయ శక్తులను జగన్మాతకు ఇచ్చి, ఆ తల్లిని శక్తి స్వరూపిణిగా నిలబెట్టారు. చివరకు అసుర సంహారం చేశారు. అందువల్ల మన నిజమైన సామర్థ్యాలు మన ఒక్కరిలో ఉన్నవే కాదు. మన తోటి వాళ్ళందరితో కలిసి ఉంటేనే అవి సర్వశక్తిమంతులుగా మార్చుతాయి. ఇది ఐకమత్యంతోనే సాధ్యమవుతుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి మసలుకుని విజయులమవుదాం.ఐకమత్యమే మహాబలం, మహాభాగ్యం అన్నారు పెద్దలు. అవును నిజమే.. మన పెద్దలు చెప్పినట్టు ఐకమత్యంగా ఉంటే ఎన్నో పనులు చెయ్యచ్చు.. శత్రువులను సైతం తరిమి తరిమి కొట్టచ్చు. ఎలాంటి దుస్సాధ్యమైన పనైనా సునాయాసంగా చేయచ్చు. ఐకమత్యం బలాన్ని, ప్రేమను, అనురాగాలను పెంచుతుంది. ఇది నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. ఏకత్వాన్ని సూచిస్తుంది, ఆనందాన్నిస్తుంది. కష్టాలలో పాలు పంచుకునే అవకాశాన్నిస్తుంది. శక్తిని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఏకత్వాన్ని కలిగిస్తుంది. వ్యక్తుల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. జీవితంలోని సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించడానికి ఇది మనకు ఎంతగానో దోహదం చేస్తుంది. – దాసరి దుర్గా ప్రసాద్ -
‘గగన’ విజయం
సాక్షి, హైదరాబాద్: కలలు కన్నారు.. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడ్డారు.. వ చ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ గగనతలంలో విజయబావుటా ఎగురవేశారు ఈ యువ ఫ్లయింగ్ కేడెట్లు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం అయినా..అంతిమ లక్ష్యం మాత్రం భరతమాత సేవలో తాము ఉండాలన్నదే. ఆదివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొని భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా యువ అధికారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. దేశ సేవలో నేను మూడో తరం.. దేశ సేవలో మా కుటుంబ నుంచి మూడో తరం అధికారిగా నేను ఎయిర్‌ఫోర్స్‌లో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. మా తాతగారు పోలీస్ అఫీసర్‌గా చేశారు. మా నాన్న కర్నల్ రాజేశ్ రాజస్థాన్‌లో పనిచేస్తున్నారు. నేను ఇప్పుడు ఎయిర్ ఫోర్స్‌లో నావిగేషన్ బ్రాంచ్‌లో సెలక్ట్ అయ్యాను. వెపన్సిస్టం ఆపరేటర్‌గా నాకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇది ఎంతో చాలెంజింగ్ జాబ్. శిక్షణ సమయంలో ఎన్నో కఠిన పరిస్థితులను దాటిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి బాధ్యత అయినా నిర్వర్తించగలనన్న నమ్మకం పెరిగింది. మా స్వస్థలం జైపూర్. నేను బీటెక్ ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టం అమేథీలో చేశాను. – ఫ్లయింగ్ కేడెట్ థాన్యాసింగ్, జైపూర్ నాన్నే నాకు స్ఫూర్తి... మాది వికారాబాద్ జిల్లా చీమల్‌దరి గ్రామం. నాన్నపేరు శేఖర్. ప్రైవేటు ఉద్యోగి, అమ్మ బాలమణి టైలర్. చిన్నప్పటి నుంచి నాన్న స్ఫూర్తితోనే నేను డిఫెన్స్ వైపు రాగలిగాను. కార్గిల్ యుద్ధంలో సూర్యకిరణ్ పైలెట్ బృందం ఎంతో కీలకంగా పనిచేసిందన్న వార్తలను చూసి మా నాన్న నాకు సూర్యకిరణ్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే నన్ను డిఫెన్స్‌కు వెళ్లేలా ప్రోత్స హించారు. అలా నేను ఏడో తరగతిలో డెహ్రాడూన్‌లోని రాష్ట్రాయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌కు ప్రవేశ పరీక్ష రాసి 8వ తరగతిలో చేరాను. అందులో రాష్ట్రానికి ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తారు. అంత పోటీలోనూ నేను సీటు సాధించాను. అక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదివాను. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రెండేళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సెలక్ట్ అయ్యాను. – సూర్యకిరణ్, చీమల్‌దరి, వికారాబాద్ జిల్లా భారత సైన్యంలో చేరడం నా కల.. నా పేరు లతా కౌషిక్. మాది హరియాణా రాష్ట్రంలోని జజ్జర్ జిల్లా దుబల్దాన్ గ్రామం. మానాన్న రైతు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలోని మిరండా కాలేజీలో బీఎస్సీ హానర్స్, మ్యాథ్స్ చదివాను. డిఫెన్స్ ఫోర్స్‌లో చేరడం ద్వారా దేశానికి, ప్రజల రక్షణకు పనిచేయవచ్చని నా కోరిక. ఆడపిల్ల డిఫెన్స్‌లోకి ఎందుకు అని ఏనాడు మా ఇంట్లో వాళ్లు అనలేదు. మా నాన్నతో సహా కుటుంబం అంతా నన్ను ప్రోత్సహించడంతోనే నేను ఎయిర్‌ఫోర్స్‌కి వచ్చాను. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదీ మనల్ని అడ్డుకోలేదు. అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. – లతా కౌషిక్, ఫ్లయింగ్ ఆఫీసర్, హరియాణా ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కని నేను ఫైటర్ పైలట్ అయ్యాను.. నాపేరు జోసెఫ్. నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఫైటర్ పైలెట్ కావడం సంతోషంగా ఉంది. మా సొంత ప్రాంతం గుంటూరు. నేను టెన్త్ వరకు గుంటూరులో చదివాను. ఎయిర్‌ఫోర్స్‌కి రావాలని అనుకోలేదు. ఇంటర్మిడియెట్ తర్వాత ఎన్డీఏ గురించి తెలుసుకుని ఈ కెరీర్‌ని ఎంచుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాను. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లగలిగాను. అక్కడ నుంచి భారత వాయుసేనలో సెలక్ట్ అయ్యాను. మా తల్లిదండ్రు ల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరాను. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పిల్లలు ఏదీ సాధించలేరు. తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తేనే పిల్లలు వారి కలలు నిజం చేసుకోగలుగుతారు. – జోసెఫ్, ఫైటర్ పైలట్, గుంటూరు -
సాయుధ దళాలు.. వినూత్నంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సాయుధ దళాలలో సంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే.. కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలు తేవాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. కొత్త ఆలోచనలు చేయకుండా చాలా కాలం ఒకే తరహా సంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. యువ అధికారులు తమలో నూతనత్వానికి, వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ( ఇఎ్క) జరిగింది. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 213 ఫ్లైట్ కేడెట్లు (వీరిలో 25 మంది మహిళలు) పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించి.. పరేడ్‌కు సమీక్ష అధికారిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యువ కేడెట్లు భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లోకి చేరడానికి సూచికగా వారందరికీ అధికారిక హోదా కల్పిస్తూ రాష్ట్రపతి కమిషన్ (అధికారిక బ్యాడ్జ్‌లను)ను ప్రదానం చేశారు. తర్వాత రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించారు. ‘‘నిరంతరం అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలు, ఆవిష్కర ణల మధ్య సమతుల్యత సాధించండి. సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తే.. మనం ఎండిపోయిన సరస్సులా మారిపోతాం. మనం ప్రవహించే నదిలా ఉండాలి. ఇందుకు సంప్రదాయంతోపాటు కొత్తదనాన్ని తీసుకురావాలి. వాయుసేన అధికారులుగా మీరు ఆకాశంలో ఎగురుతూ ఉండండి. ఎక్కు వ ఎత్తును తాకండి, కానీ నేలతో మీ సంబంధాన్ని కొనసాగించండి’’అని పిలుపునిచ్చారు. అకాడమీలో భారత వాయుసేనకు చెందిన అధికారులతోపాటు నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నుంచి 9 మంది, స్నేహపూర్వక దేశమైన వియత్నాం నుంచి ఇద్దరు అధికారులు కూడా ఫ్లయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నుంచి అవార్డులు అందుకున్నారు. శిక్షణలో టాపర్‌గా నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ రాష్ట్రపతి ఫలకాన్ని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్‌ను రాజ్‌నాథ్ చేతులమీదుగా అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లలో మెరిట్లో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అమరీందర్ జీత్ సింగ్‌కు రాష్ట్రపతి ఫలకం లభించింది. అంతకుముందు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, యువ కేడెట్లతో ప్రమాణం చేయించారు. ఆకట్టుకున్న కవాతు శిక్షణలో ప్రథమస్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ ఆదివారం నాటి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువ ఫ్లయింగ్ కేడెట్లు చేసిన కవాతు ఆకట్టుకుంది. పరేడ్ అనంతరం భారత వాయుసేన నిర్వహించిన వైమానిక ప్రదర్శన అలరించింది. సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృంద విన్యాసాలు, సుఖోయ్–30 ఎంకేఐ గగనతల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులతోపాటు యువ ఫ్లయింగ్ ఆఫీసర్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. -
President Draupadi Murmu: కంబైన్డ్ గ్యాడ్యుయేషన్ పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ఫొటోలు)
-
పాఠశాల విద్యలోకి ఇంటర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం మూడంచెలుగా ఏర్పాటైన ఉన్నత, మాథ్యమిక, ప్రాథమిక విద్యా వ్యవస్థను త్వరలో రెండంచెల వ్యవస్థగా మార్చనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో మిళితం చేయనున్నట్లు ప్రకటించారు. ఇంటర్ విద్య ఇప్పటికే జాతీయ స్థాయిలో పాఠశాల విద్యలో భాగంగానే ఉందని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ‘విజ్ఞాన భూమి’ (నాలెడ్జ్ హబ్)గా తీర్చిదిద్దేందుకు విశ్వవిద్యాలయాల నుంచి తక్షణం కార్యాచరణను ఆరంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ లక్ష్య సాధనలో కీలకపాత్ర వహించాలని రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు చెందిన వీసీలకు పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన వీసీల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. వచ్చే వారం నుంచి ‘జ్ఞానధార’ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకుం టున్న 18 లక్షల మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే కార్యక్రమా నికి రూపకల్పన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. సాంకేతిక అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి, నవ్యావిష్కరణలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం లాంటి లక్ష్యాలతో జూలై మూడో వారం నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమానికి ‘జ్ఞానధార’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఇంతకంటే మంచి పేరును సూచిస్తే పరిశీలిస్తామని చెప్పారు. విద్య, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో పేరు పొందిన ప్రముఖులను ఆహ్వానించి వారి నుంచి ప్రేరణ పొందేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సీఎం సూచించారు. విద్యార్ధులతో మరిన్ని ఈవెంట్లు ఒక్కో వర్శిటీలో ఒక్కో రోజు నిర్వహించే ఈ కార్యక్రమానికి తాను హాజరై 10 వేల మంది విద్యార్థులతో నేరుగా మాట్లాడతానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో పాల్గొనే విద్యార్థులను వివిధ పోటీల ద్వారా ఎంపిక చేయాలని సూచించారు. పోలవరం, అమరావతి, ఇస్రో ప్రగతి, ఐటీఐవోటీ, స్టార్టప్స్ లాంటి అంశాలపై విద్యార్థులకు సదస్సు నిర్వహించాలన్నారు. సీఐఐతోపాటు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను ఇందులో భాగస్వాములుగా చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణ, సమన్వయ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యామండలి, ఆయా వర్శిటీలే దీనికి అవసరమైన నిధులను సమకూర్చుకోవాలన్నారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్లన్నీ ప్రత్యేకంగా రూపొందించే యాప్ ద్వారా జరుగుతాయి. 18న శ్రీకాకుళం నుంచి ప్రారంభం ఈనెల 18న శ్రీకాకుళం డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నుంచి ‘జ్ఞానధార’ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 2న విజయనగరం జేఎన్టీయూలో, ఆగస్టు 17న విశాఖ ఏయూలో, ఆగస్టు 31న పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ ఉద్యాన వర్శిటీలో, సెప్టెంబరు 14న రాజమహేంద్రిలోని నన్నయ్య విశ్వవిద్యాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి. మచిలీపట్నం కృష్ణా వర్శిటీ, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీలకు కలిపి సెప్టెంబరు 30న కార్యక్రమం ఏర్పాటవుతుంది. అక్టోబరు 12న నాగార్జున, ఎన్జీ రంగా విశ్వవిద్యాలయాలకు కలిపి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మిగిలిన వర్సిటీల్లో కూడా వరుసగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అవసరాన్ని బట్టి తేదీల్లో మార్పులు చేస్తారు. ప్రతి లక్ష మంది జనాభాకు 48 కళాశాలలతో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచిందని వీసీ సమావేశంలో ఉన్నత విద్యపై నివేదిక సమర్పించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ తెలిపారు. 27 వర్శిటీలు, 7 జాతీయ ప్రాధాన్యం కలిగిన విద్యా సంస్థలు రాష్ట్రంలో వున్నాయన్నారు. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తిలో దేశంలో ఏపీ మూడవ స్థానంలో ఉందని చెప్పారు. చదువుకుంటూ పనిచేసే విధానం రావాలి నాలుగేళ్ల కళాశాల చదువు నలభై ఏళ్ల కెరియర్‌కు ఎలా ఉపకరిస్తుందో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని వీసీలను సీఎం కోరారు. పుస్తకాల్లో బోధించే సిద్ధాంతాలకు, వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంటోందన్నారు. ఆలోచనలు, ఆచరణకి దూరం పెరిగిపోయేలా మన విద్యావిధానం కొనసాగడం దురదృష్టకరమన్నారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటీవల ఐఎఎస్, ఎంసెట్, ఐఐటీలకు ఎంపికైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషమని చెప్పారు. ప్రతి వర్శిటీని నాలుగైదు పరిశ్రమలకు అనుసంధానం చేయడం ఇక నుంచి తప్పనిసరిగా జరగాలన్నారు. చదువుకుంటూ పనిచేసే అవకాశాలు కల్పిస్తూ ప్రతి విద్యార్ధిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే విధానాలు రావాలన్నారు. హెరిటేజ్‌ను ఈ–కామర్స్ వైపు వెళ్లమన్నా అందరూ ఐఐటీలోనే చదవాలనే ధోరణి సరికాదని, రానున్న కాలంలో ఆతిథ్యం, ఆహార పరిశ్రమకు ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సుల వైపు మళ్లాలని వీసీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఫ్లిప్‌కార్ట్ స్ఫూర్తితో తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌ను కూడా ఈ–కామర్స్ వైపు మళ్లమని సూచించానన్నారు. -
ఆ రెండు శాఖలకు ఒక్కరే..
డీఆర్డీఏ, డ్వామా విలీనం డీఆర్డీఓగా నామకరణం సహాయకులుగా ఇద్దరు డీఆర్డీఓలు దసరా నుంచి అమల్లోకి.. నల్లగొండ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఈ రెండు శాఖలు విలీనం చేశారు. ఒకే స్వరూపం కలిగిన శాఖలను విలీనం చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా తొలుత ఈ రెండు శాఖల్లో విలీన ప్రక్రియ ప్రార ంభించారు. డీఆర్డీఏ, డ్వామాను కలిపి కొత్తగా ‘డీఆర్డీఓ’ (జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయం)గా నామకరణం చేశారు. కార్యాలయం చివరన ఉండే ‘సంస్థ’ అనే పదాన్ని తొలగించి ‘ఆఫీస్’ అనే పదం చేర్చారు. కొత్తగా ఏర్పాటయ్యే డీఆర్డీఓ కార్యాలయ సేవలు దసరా నుంచి ప్రారంభమవుతాయి. ఈ కార్యాలయాన్ని ఇప్పుడున్న డ్వామా ¿¶ వనం నుంచే కొనసాగిస్తారు. ఇప్పటి వరకు రెండు శాఖలకు కలిపి ఇద్దరు పీడీలు ఉండగా ఇక నుంచి ఒక్కరే డీఆర్డీఓగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న అధికారిని డీఆర్డీఓగా నియమిస్తారు. డ్వామా పీడీని కొత్త జిల్లాకు పంపిస్తారు. డీఆర్డీఓకు సహాయకులుగా ఇద్దరు అదనపు డీఆర్డీఓలు ఉంటారు. వీరిలో ఒకరు ఉపాధి హామీ పథకానికి, మరొకరు ఐకేపీ పథకాలకు సమన్వయ కర్తలుగా పనిచేస్తారు. ఐకేపీ, ఉపాధి ఉద్యోగులు ఒకే దగ్గర కలిసి పనిచేసినప్పటికీ ఉద్యోగుల పని విషయాల్లో కానీ, వారి సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు. -
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్
అర్హత: ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత. నావల్ అకాడమీకి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. ఫైనలియర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే మహిళలు అర్హులు. ఖాళీలు: ఇండియన్ మిలిటరీ అకాడమీ 200 ఇండియన్ నావల్ అకాడమీ 45 ఎయిర్‌ఫోర్స్ అకాడమీ 32 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 175 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 05 వయోపరిమితులు: ఇండియన్ మిలిటరీ అకాడమీకి దరఖాస్తు చేసుకునే అవివాహ పురుష అభ్యర్థులు 2-1-1993 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి. ఇండియన్ నావల్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థులు 2-1-1993 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 2-1-1993 నుంచి 1-1-1997 మధ్య జన్మించి ఉండాలి. అయితే కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉన్న వారికి 26 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. అంటే 2-1-1991 నుంచి 1-1-1997 మధ్య జన్మించి ఉండాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే వివాహ లేదా అవివాహ పురుష అభ్యర్థులు 2-1-1992 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి. అవివాహ మహిళా అభ్యర్థులు 2-1-1992 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి. పరీక్ష విధానం: సీడీఎస్ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఔత్సాహికులకు ఒక విధంగా, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఔత్సాహికులకు మరోవిధంగా ఉంటుంది. మిలిటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ రాతపరీక్ష: పేపర్ సబ్జెక్టు మార్కులు సమయం పేపర్-1 ఇంగ్లీష్ 100 2 గంటలు పేపర్-2 జన రల్ నాలెడ్జి 100 2 గంటలు పేపర్-3 ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ 100 2 గంటలు ఓటీఏ పరీక్ష విధానం: పేపర్ సబ్జెక్టు మార్కులు సమయం పేపర్-1 ఇంగ్లిష్ 100 2 గంటలు పేపర్-2 జనరల్ నాలెడ్జి 100 2 గంటలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలో ఆయా సబ్జెక్టుల్లో పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలడుగుతారు. ఇలా ప్రిపేరవ్వాలి.. జనరల్ ఇంగ్లిష్: అభ్యర్థుల్లో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే రీతిలోనే ప్రశ్నలుంటాయి. దీనికోసం వర్డ్పవర్ మేడ్ ఈజీ, ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వంటి పుస్తకాలు చదవడం ఉపకరిస్తుంది. జనరల్ నాలెడ్‌జ: భారతదేశ చరిత్ర నుంచి నేటి సమకాలీన అంశాల వరకు అన్ని సబ్జెక్టుల్లో అంటే జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వాటిల్లో ప్రాథమిక పరిజ్ఞానం తెలుసుకునే విధంగా ప్రశ్నలుంటాయి. మ్యాథమేటిక్స్: వాస్తవానికి సీడీఎస్ పరీక్షలో ఈ పేపర్‌ను ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్గా పేర్కొన్నారు. ఇందులో పదోతరగతి స్థాయిలోని మ్యాథమేటిక్స్ అంశాలను ప్రశ్నలుగా అడుగుతారు. అర్థమెటిక్‌కు సంబంధించి నంబర్ సిస్టమ్, రియల్ నంబర్స్, దూరం-కాలం, పని; శాతాలు; వడ్డీరేట్లు; లాభనష్టాలు వంటి ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. ఇక ఆల్జీబ్రాలో రిమైండర్ థీరమ్, హెచ్‌సీఎఫ్, ఎల్సీఎం, పాలినామియల్ థీరమ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, రూట్స్ అండ్ కో ఎఫిషియెంట్స్ వంటి అంశాలను అధ్యయనం చేయాలి. అదేవిధంగా పదో తరగతి స్థాయిలోని ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ సంబంధ ఫార్ములాలు, సిద్ధాంతాలు, భావనలు తెలుసుకోవాలి. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలెక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. దీనితోపాటుగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. శిక్షణ తీరుతెన్నులు: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య, ఆరోగ్య పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి వారు ఎంచుకున్న ప్రాధాన్యం, మెరిట్, అవకాశాన్ని బట్టి సర్వీస్‌కు ఎంపిక చేస్తారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ-డెహ్రాడూన్, నేవల్ అకాడమీ-గోవా, ఎయిర్స్‌ఫోర్స్ అకాడమీ-హైదరాబాద్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ-చెన్నైల్లో 18 నెలలపాటు, ఓటీఏలో అభ్యర్థులకు 11 నెలలపాటు శిక్షణ ఉంటుంది. ఉద్యోగ పరిధి: ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ప్లైయింగ్ ఆఫీసర్ హోదాతో కెరీర్ ఆరంభమవుతుంది. రెండు, మూడేళ్లకోసారి ప్రమోషన్లు ఉంటాయి. పన్నెండేళ్లు సర్వీస్‌లో కొనసాగితే సంబంధిత విభాగంలో లెఫ్టినెంట్ కల్నల్, కమాండర్, వింగ్ కమాండర్ హోదా పొందొచ్చు. దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపాలి. దరఖాస్తుతోపాటు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు రూ. 200. ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ఎస్బీఐ, అనుబంధ బ్యాంకుల్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవ చ్చు. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్లో దరఖాస్తుల ప్రారంభం: 7-11-2015 దరఖాస్తుల ముగింపు తేదీ: 4-12-2015 పరీక్షాకేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. -
ఆ ప్రశ్నలు అటెంప్ట్ చేయొద్దు
టాప్ స్టోరీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన సివిల్స్ ప్రిలిమ్స్ 2014కు సర్వం సిద్ధం.. పరీక్షకు హాజరుకానున్న 60 వేలకుపైగా తెలుగు విద్యార్థులు జాతీయ స్థాయిలో నిరసనలు.. ఆందోళనలు.. ఇంగ్లిష్ మీడియం ప్రశ్నలపై ఆగ్రహావేశాలు.. వెరసి.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగం ప్రశ్నలను తదుపరి దశ మెయిన్స్‌కు మెరిట్ జాబితాలో పరిగణనలోకి తీసుకోబోమని యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2లోని ఈ విభాగం ప్రశ్నలను అసలు అటెంప్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్-2014కు సర్వం సిద్ధమైంది. మెయిన్స్‌కు మెరిట్ జాబితా ఇలా: మెయిన్స్ ఎగ్జామినేషన్‌కు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసే క్రమంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగాన్ని పరిగణనలోకి తీసుకోబోమని తేల్చేసిన యూపీఎస్సీ.. మెరిట్ జాబితా విషయంలో నిర్దిష్ట విధానాలను ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ ఒక్కో పేపర్ 200 మార్కులకు చొప్పున రెండు పేపర్లు మొత్తం 400 మార్కులకు జరుగుతుంది. ఇందులో 200 మార్కులకు నిర్వహించే పేపర్-1లో పొందే మార్కులు.. అదే విధంగా మరో 200 మార్కులకు జరిగే పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగం ప్రశ్నలకు(ఈ ప్రశ్నలు ఇంగ్లిష్‌లో మాత్రమే ముద్రితమై ఉంటాయి) కేటాయించిన మార్కులను మినహాయించగా పొందిన మొత్తం మార్కుల సగటు ఆధారంగా మెయిన్స్‌కు అర్హుల జాబితాను రూపొందించనుంది. ఆ మినహాయింపుపై భిన్నాభిప్రాయాలు: పేపర్-2లోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి అడి గే ప్రశ్నలను అటెంప్ట్ చేయొద్దని, ఈ విభాగానికి కేటాయించిన మార్కులను మెయిన్స్‌కు మెరిట్ జాబితా ఎంపికలో పరిగణనలోకి తీసుకోబోమని యూపీఎస్సీ స్పష్టం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హిందీయేతర, నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. 8 నుంచి 9 ప్రశ్నలతో దాదాపు 22 మార్కులకు అడిగే ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగాన్ని అటెంప్ట్ చేయొద్దనే ప్రకటనతో.. ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తాము మెరుగైన మార్కులు సాధించే అవకాశం కోల్పోయామని నిరుత్సాహానికి గురవుతున్నారు. ముఖ్యంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్, న్యూమరికల్ స్కిల్స్ వంటి మ్యాథమెటిక్స్ విభాగాలను కష్టంగా భావించే అభ్యర్థులు.. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లోనైనా మార్కులు సాధించొచ్చనే ఉద్దేశంతో ఉంటారని.. తాజా నిర్ణయం వారికి అశనిపాతంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఏపీలో విజయవాడ: గత ఏడాది వరకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష కేంద్రాలు ఉండేవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో కొత్తగా విజయవాడలోనూ పరీక్ష నిర్వహించనున్నారు. తొలిసారిగా నిర్వహిస్తున్నప్పటికీ.. విజయవాడలో 31 సెంటర్లలో మొత్తం 14,640 మంది అభ్యర్థులు హాజరవుతుండటం గమనార్హం. ఇదే సమయంలో విశాఖపట్నం కేంద్రంగా హాజరుకానున్న అభ్యర్థుల సంఖ్య గత ఏడాదితో పోల్చితే తగ్గింది. ఈ నగరంలో మొత్తం 1,710 మంది అభ్యర్థుల కోసం ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం ఈ సంఖ్య 7754. గతంలో విజయవాడ కేంద్రంగా లేకపోవడంతో శ్రీకాకుళం జిల్లా మొదలు ఇటు గుంటూరు వరకు అభ్యర్థులకు విశాఖపట్నం మాత్రమే అవకాశంగా ఉండేది. ఈ ఏడాది తిరుపతి కేంద్రంలో మొత్తం 7,796 మంది అభ్యర్థులు హాజరవనున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి శ్రీఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగాన్ని రద్దు చేయడం వల్ల ఆ విభాగంలో మార్కులు సాధించాలనుకునే అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారనడంలో సందేహం లేదు. కానీ.. పరీక్షకు అంతా సిద్ధమైంది. కాబట్టి విద్యార్థులు పరీక్ష హాల్లో సరైన సమయ పాలన పాటించాలి. వాస్తవానికి ఇప్పటి వరకు పేపర్-2లో అభ్యర్థులకు ఒక్కో ప్రశ్నకు సగటున 70 సెకన్ల సమయం అందుబాటులో ఉండేది. ఏ ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ప్రశ్నల రద్దు నేపథ్యంలో ఆ సమయాన్ని ఇతర విభాగాలకు బదిలీ చేసుకుని సరైన సమయ పాలన పాటించాలి. ఏ కాసింత పరిశీలన దృక్పథం, తార్కిక విశ్లేషణతో సమాధానాలు రాబట్టగలిగే డెసిషన్ మేకింగ్, లాజికల్ రీజనింగ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. రీడింగ్ కాంప్రహెన్షన్‌లో కూడా కొద్దిపాటి పరిశీలనతో సులభంగా సమాధానాలు ఇవ్వొచ్చు. ఏ అదే విధంగా పేపర్-1 జనరల్ స్టడీస్‌లోనూ సమయ పాలన కీలకం. సగటున ఒక్కో ప్రశ్నకు 90 సెకన్లలో సమాధానం ఇచ్చే విధంగా వ్యవహరించాలి. ఏ చాలా మంది అభ్యర్థులు చేస్తున్న పొరపాటు.. మొదటి పేపర్ తర్వాత తాము సరిగా రాయలేదనో లేదా మరో ఛాన్స్ ఉంది కదా.. అనే ఆలోచనలతో రెండో పేపర్‌కు గైర్హాజరవుతున్నారు. ఇది సరికాదు. ఒక్క పేపర్ రాసినా.. రెండు పేపర్లు రాసినా అందుబాటులోని అటెంప్ట్‌లలో ఒకటి కోల్పోయినట్లే. ఒకట్రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోయినా నిరుత్సాహానికి గురి కాకుండా.. ఆశావహ దృక్పథంతో పరీక్ష హాల్లో అడుగు పెట్టాల్ణి - ఆర్. సి. రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి. రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్