అర్హత: ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత. నావల్ అకాడమీకి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. ఫైనలియర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే మహిళలు అర్హులు.
ఖాళీలు:
ఇండియన్ మిలిటరీ అకాడమీ 200
ఇండియన్ నావల్ అకాడమీ 45
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 175
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 05
వయోపరిమితులు:
ఇండియన్ మిలిటరీ అకాడమీకి దరఖాస్తు చేసుకునే అవివాహ పురుష అభ్యర్థులు 2-1-1993 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి. ఇండియన్ నావల్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థులు 2-1-1993 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 2-1-1993 నుంచి 1-1-1997 మధ్య జన్మించి ఉండాలి. అయితే కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉన్న వారికి 26 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. అంటే 2-1-1991 నుంచి 1-1-1997 మధ్య జన్మించి ఉండాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే వివాహ లేదా అవివాహ పురుష అభ్యర్థులు 2-1-1992 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి. అవివాహ మహిళా అభ్యర్థులు 2-1-1992 నుంచి 1-1-1998 మధ్య జన్మించి ఉండాలి.
పరీక్ష విధానం:
సీడీఎస్ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఔత్సాహికులకు ఒక విధంగా, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఔత్సాహికులకు మరోవిధంగా ఉంటుంది.
మిలిటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ రాతపరీక్ష:
పేపర్ సబ్జెక్టు మార్కులు సమయం
పేపర్-1 ఇంగ్లీష్ 100 2 గంటలు
పేపర్-2 జన రల్ నాలెడ్జి 100 2 గంటలు
పేపర్-3 ఎలిమెంటరీ
మ్యాథమేటిక్స్ 100 2 గంటలు
ఓటీఏ పరీక్ష విధానం:
పేపర్ సబ్జెక్టు మార్కులు సమయం
పేపర్-1 ఇంగ్లిష్ 100 2 గంటలు
పేపర్-2 జనరల్ నాలెడ్జి 100 2 గంటలు
ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలో ఆయా సబ్జెక్టుల్లో పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలడుగుతారు.
ఇలా ప్రిపేరవ్వాలి..
జనరల్ ఇంగ్లిష్: అభ్యర్థుల్లో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే రీతిలోనే ప్రశ్నలుంటాయి. దీనికోసం వర్డ్‌పవర్ మేడ్ ఈజీ, ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వంటి పుస్తకాలు చదవడం ఉపకరిస్తుంది. జనరల్ నాలెడ్‌జ: భారతదేశ చరిత్ర నుంచి నేటి సమకాలీన అంశాల వరకు అన్ని సబ్జెక్టుల్లో అంటే జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వాటిల్లో ప్రాథమిక పరిజ్ఞానం తెలుసుకునే విధంగా ప్రశ్నలుంటాయి. మ్యాథమేటిక్స్: వాస్తవానికి సీడీఎస్ పరీక్షలో ఈ పేపర్‌ను ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌గా పేర్కొన్నారు.
ఇందులో పదోతరగతి స్థాయిలోని మ్యాథమేటిక్స్ అంశాలను ప్రశ్నలుగా అడుగుతారు. అర్థమెటిక్‌కు సంబంధించి నంబర్ సిస్టమ్, రియల్ నంబర్స్, దూరం-కాలం, పని; శాతాలు; వడ్డీరేట్లు; లాభనష్టాలు వంటి ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. ఇక ఆల్జీబ్రాలో రిమైండర్ థీరమ్, హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం, పాలినామియల్ థీరమ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, రూట్స్ అండ్ కో ఎఫిషియెంట్స్ వంటి అంశాలను అధ్యయనం చేయాలి. అదేవిధంగా పదో తరగతి స్థాయిలోని ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ సంబంధ ఫార్ములాలు, సిద్ధాంతాలు, భావనలు తెలుసుకోవాలి.
రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ:
రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలెక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. దీనితోపాటుగా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. శిక్షణ తీరుతెన్నులు: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య, ఆరోగ్య పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి వారు ఎంచుకున్న ప్రాధాన్యం, మెరిట్, అవకాశాన్ని బట్టి సర్వీస్‌కు ఎంపిక చేస్తారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ-డెహ్రాడూన్, నేవల్ అకాడమీ-గోవా, ఎయిర్స్‌ఫోర్స్ అకాడమీ-హైదరాబాద్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ-చెన్నైల్లో 18 నెలలపాటు, ఓటీఏలో అభ్యర్థులకు 11 నెలలపాటు శిక్షణ ఉంటుంది.
ఉద్యోగ పరిధి: ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ప్లైయింగ్ ఆఫీసర్ హోదాతో కెరీర్ ఆరంభమవుతుంది. రెండు, మూడేళ్లకోసారి ప్రమోషన్లు ఉంటాయి. పన్నెండేళ్లు సర్వీస్‌లో కొనసాగితే సంబంధిత విభాగంలో లెఫ్టినెంట్ కల్నల్, కమాండర్, వింగ్ కమాండర్ హోదా పొందొచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పంపాలి. దరఖాస్తుతోపాటు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు రూ. 200. ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ఎస్‌బీఐ, అనుబంధ బ్యాంకుల్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవ చ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రారంభం: 7-11-2015
దరఖాస్తుల ముగింపు తేదీ: 4-12-2015
పరీక్షాకేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్
Published Wed, Nov 18 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM
Advertisement