‘ఉపాధి’ వేతనాలకు ఢోకా లేదు
‘ఉపాధి’ వేతనాలకు ఢోకా లేదు
Published Fri, Mar 17 2017 11:49 PM | Last Updated on Sat, Sep 29 2018 6:11 PM
- 31లోగా పేమెంట్స్ అప్‌లోడ్ చేయండి
- గ్రామీణాభివృద్ధి జాయింట్ కమిషనర్ బాల సుబ్రమణ్యం
కర్నూలు(అర్బన్): జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కూలీల వేతనాలకు ఎలాంటి ఢోకా లేదని గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ బాలసుబ్రమణ్యం తెలిపారు. బకాయి పడ్డ బిల్లులన్నింటినీ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. శుక్రవారం ఆయన డ్వామా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూలీల వేతనాలు, మెటీరియల్ పేమెంట్స్‌తో పాటు ఇతర పేమెంట్స్‌కు సంబంధించిన బిల్లులను ఈ నెల 31వ తేదీలోగా అప్‌లోడ్ చేయాలన్నారు. వారంలోగా బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే వాటి విషయంలో కొంత జాప్యం జరుగుతున్నందునా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి బకాయిపడిన మొత్తాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కూలీల సంఖ్యను పెంచి పనుల లక్ష్యాన్ని సాధించాలన్నారు. హార్టికల్చర్ అవెన్యూ కింద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారని, వాటిలో బతికి ఉన్న మొక్కలకు సంబంధించి కూడా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేస్తామన్నారు. సమావేశంలో డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డి, ఏపీడీలు మురళీధర్, బీఎన్ సులోచన పాల్గొన్నారు.
Advertisement