అంత్వార్‌లో మొక్కలు నాటుతున్న డ్వామా పీడీ
నారాయణపేట రూరల్ : హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నారాయణపేటకు వచ్చిన ఆయన మండలంలోని అంత్వార్ గ్రామ స్టేజీ దగ్గర మొక్కలునాటి నీళ్లు పోశారు. ప్రభుత్వం గ్రామాలను పచ్చగా మార్చడానికి ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపడుతోందని, ప్రజల సహకారం ఉంటేనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. అధికారులకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాలని, నాటిన మొక్కలకు కంచెలు ఏర్పాటు చేసి నీళ్ళుపోస్తూ కాపాడలన్నారు. రైతుల పొలాల గట్లపై నాటిన మొక్కలను పర్యవేక్షిస్తూ వారికి రావాల్సిన డబ్బులను సకాలంలో అందించాలన్నారు. అనంతరం ఈజీఎస్ ద్వారా నాటిన మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీడీ వెంట ఏపీఓ జయమ్మ, ఫీల్డ్‌అసిస్టెంట్ రేణుక, మాజీ సర్పంచ్ పాకాల వెంకటయ్య, టీఏలు గోపాల్, బాలరాజు, ఈసీ రంజిత్ ఉన్నారు.