మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ రూ.1 కోటి మేర ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టి, అడ్డంగా దొరికిపోయాడు.
మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ రూ.1 కోటి మేర ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టి, అడ్డంగా దొరికిపోయాడు. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మాణయ్య.. కొన్ని నెలల క్రితం జాయింట్ డెరైక్టర్ వద్ద ఉన్న 12 చెక్కులను దొంగిలించి రూ.1.03 కోట్ల మేర వేర్వేరు పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు. చెక్కులు కనిపించకపోవటంతో జాయింట్ డెరైక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సంగారెడ్డి రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.