మోర్తాడ్ : గ్రామ పంచాయతీల కంప్యూటరీకరణకు సంబంధించి ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో పనులు సాగడం లేదు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలను 477 క్లస్టర్‌లుగా విభజించారు. క్లస్టర్ పంచాయతీలలోనే కంప్యూటర్‌లను ఏర్పాటు చేసి పంచాయతీ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 287 క్లస్టర్ పంచాయతీలకు కంప్యూటర్‌లను కేటాయించారు. ఇంకా 190 క్లస్టర్‌లకు కంప్యూటర్‌లు అందజేయాల్సి ఉంది.
ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు...
ఆపరేటర్లను పంచాయతీలు నేరుగా నియమించుకోకుండా ప్రభుత్వమే ఔట్‌సోర్సింగ్ విధానంలో ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన కార్వే సంస్థ ఆపరేటర్ల నియామక బాధ్యతలను తీసుకుంది. వేసవిలోనే ఆపరేటర్లను ‘కార్వే’ సంస్థ ఎంపిక చేసి వారికి కొంత శిక్షణ ఇచ్చింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆపరేటర్లతో పంచాయతీ పనులు సాగించాలని ‘కార్వే’ సంస్థ నిర్ణయిం చింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆపరేటర్ల నియామకాలకు సంబంధించిన ఏజెన్సీకి ఇంకా పచ్చజెండా ఊపలేదు.
దీంతో ఆ సంస్థ ఏమి చేయడం లేదు. పంచాయతీలకు వసూలయ్యే పన్నులు, చేసే ఖర్చులు, ప్రభుత్వం ద్వారా మంజూరు అయ్యే నిధులు, చేపట్టే పనులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. పంచాయతీల ఆన్‌లైన్‌కు సంబంధించి ప్రత్యేకంగా ‘ప్రియా’ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం రూపొందించింది. తాజాగా ‘మన ఊరు మన ప్రణాళిక’కు అవసరమైన పూర్తి వివరాలను ఆన్‌లైన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదే శించింది.
ఆ న్‌లైన్ చేయడానికి గడువు ఎక్కువగా లేకపోవడం, ఆ పరేటర్ల నియామకం జరగకపోవడంతో కార్యదర్శులు నలిగిపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్‌లు ఉన్నా ఆపరేటర్లు లేని కారణంగా అవి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ప్రభుత్వం స్పందించి కంప్యూటర్‌ల ఆపరేటర్ల నియామకానికి చర్యలు తీసుకుంటేనే పంచాయతీల్లో పనులు సాగనున్నాయి.
‘ఆపరేటర్ల’ నియామకంలో ప్రతిష్టంభన
Published Mon, Jul 28 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement