
ఉచిత వీసాలపై దుబాయ్ వెళుతున్న తెలంగాణ కార్మికులు
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కంపెనీ ఏడీఎన్‌హెచ్.. 150 మంది వలస కార్మికులకు దుబాయ్ వెళ్లడానికి ఉచిత వీసాలు, విమాన టికెట్లు సమకూర్చింది. కార్మికులకు క్లీనింగ్, క్యాటరింగ్ సెక్షన్లలో ఉపాధి కల్పిస్తోంది. వలస కార్మికులకు వీసాలను జారీ చేయడానికి లైసెన్స్‌డ్ ఎజెన్సీలు, సబ్ ఏజెంట్లు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తారు.
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తూ, వివిధ పట్టణాల్లో బ్రాంచీలు కలిగి ఉన్న జీటీఎం కంపెనీ ద్వారా ఏడీఎన్‌హెచ్ రిక్రూట్ చేసుకుంది. ఉచిత వీసాల వల్ల వలస కార్మికులందరికీ కలిపి దాదాపు రూ.1.60 కోట్లు ఖర్చు తప్పింది. వీసాలు పొందిన కార్మికులు దుబాయ్ వెళ్లేందుకు ముంబైకి బయలుదేరి వెళ్లారు. గతంలో ఇదే కంపెనీ ఖతర్‌లో, అబుదాబీల్లో పనిచేయడానికి 2,200 మందికి ఉచిత వీసాలు అందజేసింది.
‘సాక్షి’కథనం వల్లే..
వలస కార్మికులకు బంపర్ ఆఫర్ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనం వల్ల జీటీఎం నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరయ్యాం. ఎలాంటి సొమ్ము చెల్లించకుండానే దుబాయ్‌కు వెళ్లడం సంతోషంగా ఉంది. పేద కార్మికులకు దీని వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోంది.
– పవన్ కళ్యాణ్, పెంబి, నిర్మల్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment