సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సమగ్ర కుటుంబ సర్వేకు అధికార యంత్రాం గం సర్వ సన్నద్ధమైంది. ఒకే రోజు జిల్లాలోని 6,95,205 కుటుంబాలను సర్వే చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఇప్పటికే దశలవారీగా సమీక్షలు, శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి కుటుంబం నుంచి 32 రకాల వివరాలను సేకరించనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమయ్యే సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా వివరాలు సేకరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.
ఈ కార్య క్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి బి.జనార్దన్‌రెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించింది. కలెక్టర్ రొనాల్డ్ రాస్ వారం రో జులుగా రెవెన్యూ డివిజన్‌లవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఉద్యోగులను అ ప్రమత్తం చేశారు. సర్వేను సక్సెస్ చేయాలంటూ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు శాసనసభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తప్పులు లేకుండా
2011 లెక్కల ప్రకారం జిల్లాలో 25,51,335 మంది జనాభా ఉన్నారు. 6,95,205 కు టుంబాలున్నాయి. ఈ కుటుంబాలను స ర్వే చేసేందుకు ఐకేపీ, డ్వామా, ఆర్‌వీఎం, మెప్మా, పీఆర్, ఐసీడీఎస్ తదితర శాఖల ఉద్యోగులు, అధికారులు 30,680 మంది ని నియమించారు. పోలీసుశాఖ 1,498 మందిని కేటాయించింది. ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం కుటుంబ సభ్యుల వివరాలు నిర్దేశించిన నమూనా పట్టికలో తప్పులు దొర్లకుండా రాయాలని ప్రత్యేక అధికారి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రాస్ ఇదివరకే అధికారులను, ఎన్యూమరేటర్‌లను ఆదేశించారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగుల కోసం అల్పాహారం, మధ్యా హ్న భోజనం ఏర్పాటు చేయాలని ఆయా పంచాయతీల సర్పంచులు, మండల ప్ర త్యేకాధికారులను ఆదేశించారు. ఎన్యూమరేటర్లను 56 రిసెప్షన్ సెంటర్ల ద్వారా 979 వాహనాల్లో 718గ్రామాలకు తరలించారు.
ఇబ్బంది కలిగినా సొంతూళ్లకు
జిల్లాలో మొత్తం 36 మండలాలు, 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. హైదరాబాద్, మహారాష్ట్ర, బొంబాయి, భీవండి, షోలాపూర్, బీదర్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లినవారితోపాటు వివిధ ప్రాంతాలలో నివాసం ఉంటున్నవారు సోమవా రం రాత్రికే స్వగ్రామాలకు చేరుకున్నారు. కొంత ఇబ్బంది కలిగినా, ప్రభుత్వం ఇచ్చి న పిలుపు మేరకు ఒక్కరోజు ముందే జ నం స్వస్థలాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందుకు సం బంధించిన ధ్రువీకరణ పత్రాలను కుటుం బసభ్యులకు పంపించారు.
సర్వే ప్రారంభం
Published Tue, Aug 19 2014 2:03 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement