Janardhan Reddy
-
ఆదేశాలిచ్చినా కౌంటర్లు వేయరా?
సాక్షి, అమరావతి: తగినంత సమయం ఇస్తున్నా, ఆయా కేసుల్లో అధికారులు కౌంటర్లు దాఖలు చేయకపోతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల విషయంలో అధికారులు మందకొడిగా ఉన్నారని, ఇలా నిద్రపోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నంద్యాల జిల్లాలో లైమ్ స్టోన్ ఖనిజం ఉన్న భూములను అసైన్మెంట్ కింద భూమి లేని పేదలకు ఇస్తున్నారని, దీని వెనుక బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) ఉన్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ అప్పటి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి (ప్రస్తుతం ఎమ్మెల్యే) 2023లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గతంలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం అన్ని వివరాలతో మెరుగైన అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిని సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. గతంలో ఆదేశాల మేరకు కౌంటర్లు దాఖలు కాలేదని తెలుసుకున్న ధర్మాసనం ‘అసలు మీరు (అధికారులు) కోర్టును సీరియస్‌గా తీసుకుంటున్నారా.. లేదా?’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మరో అవకాశం ఇస్తున్నామని, అయితే అసాధారణ జాప్యానికి గాను కేంద్ర కార్యదర్శికి రూ.20 వేలు, కలెక్టర్‌కు సైతం రూ.10 వేలు ఖర్చులు విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని అడ్వొకేట్స్ క్లర్కుల సంక్షేమ నిధిలో జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఇలా జాప్యం చేసే ప్రతి కేసులోనూ జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ నాటికి మెరుగైన అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. -
13 రోజులకు పరామర్శకు వస్తారా?
పగిడ్యాల: మైనర్ బాలిక కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల చెక్‌ను అందజేయడానికి శుక్రవారం ముచ్చుమర్రికి వ చ్చిన మంత్రులకు భంగపాటు తప్పలేదు. ఘటన జరిగి 13 రోజులైన పరామర్శించడానికి మనస్సు రాలేదా? అంటూ సీపీఎం నేతలు, స్థానికులు మంత్రులను ప్రశ్నించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, పోలీసుల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు.. మంత్రి ఫరూక్‌ను కోరారు. దీంతో మంత్రి ఆగ్రహిస్తూ మాకు తెలుసంటూ చులకన భావంతో మాట్లాడారు. దీంతో సీపీఎం నాయకుల్లో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. ఘటన జరిగి 13 రోజులవుతున్నా ఇప్పటి వరకు మృతదేహాన్ని బాధిత తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారని నిలదీశారు. దీంతో కమ్యూనిస్టులకు, మంత్రులకు మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన పోలీసు ఉన్నతాధికారులు, రోప్ పార్టీ సిబ్బంది కమ్యూనిస్టులను కట్టడి చేసేందుకు యత్నించారు. సమాధానం చెప్పాలని, లేదంటే వాహనాలను కదలనిచ్చేది లేదని కమ్యూనిస్టులు స్వరం పెంచడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.వెంటనే స్పందించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సీపీఎం నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా కాకుండా రూ.25 లక్షలు చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
‘టీఎస్పీఎస్సీ’పై హైకోర్టు జడ్జితో..న్యాయ విచారణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణస్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీ కోణంలోనే కాకుండా ప్రతి విభాగంలో నెలకొన్న లోపాలపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయముర్తికి లేఖ రాయనున్నారు. విచారణకు ప్రత్యేకంగా సిట్టింగ్ జడ్జిని నియమించాలని ఆ లేఖలో కోరనున్నట్టు సమాచారం. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై గత ప్రభుత్వం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేయగా, ఆ దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ చైర్మన్ పదవికి బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయగా, సభ్యులుగా కొనసాగిన ఐదుగురు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సభ్యులంతా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రాలు పంపించారు. గవర్నర్‌ను అపాయింట్మెంట్ కోరినా, ఆమె సమయం ఇవ్వకపోవడంతో రాజీనామాలు పంపించినట్టు ఓ సభ్యుడు తెలిపారు. దీంతో కమిషన్‌లో చైర్మన్‌తో సహా సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇతర విభాగాల పనితీరు, లోపాలపై దృష్టి టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని ‘కోరం’వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30 వేలకు పైబడి ఉద్యోగాల భర్తీకి 23 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 19 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తి కాగా, గ్రూప్–2, గ్రూప్–3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్–1 ప్రిలిమినరీ పూర్తి చేసిన కమిషన్ మెయిన్ పరీక్షలు చేపట్టాల్సి ఉంది. ఇవి కాకుండా వివిధ ప్రభుత్వ కాలేజీల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నాలుగు పరీక్షలను రద్దు చేసి రెండుసార్లు నిర్వహించారు. మరికొన్నింటిని వాయిదాలు వేస్తూ పూర్తి చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీయే ఇందుకు కారణం. అయితే టీఎస్పీఎస్సీలోని ఇతర విభాగాల్లో పనితీరు, లోపాలు గుర్తించాలని రాష్ట్రం ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి విభాగంలో అధికారులు, ఉద్యోగుల పనితీరు, విధి నిర్వహణ, సమాచార వ్యవస్థ, గోప్యత తదితరాలను లోతుగా పరిశీలించనుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ఇతర విభాగాల అలసత్వం, అధికారుల ఉదాసీనతపై సమగ్రంగా విచారించనున్నారు. అక్రమాలకు పాల్పడిన, విధినిర్వహణలో అలసత్వం వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ దిశగా హైకోర్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలని సీజేకు లేఖ రాయనున్నారు. కొత్త కమిషన్ కొలువుదీరేలోపు... టీఎస్పీఎస్సీలో పదవులన్నీ ఖాళీ అయ్యాయి. సాధారణంగా కమిషన్‌లో సభ్యుల నిర్ణయం తప్పనిసరి. కనీసం ఇద్దరు సభ్యులున్నా అందులో సీనియర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎవరూ లేకపోవడంతో ఏ నిర్ణయమూ తీసుకునే అవకాశం లేదు. కొత్త కమిషన్ కొలువుదీరేలోపు విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విచారణకు ముందుగానే కొత్త కమిషన్ ఏర్పాటైతే తాజాగా చేపట్టదలచిన సమగ్ర విచారణకు ఆటంకాలు ఎదురవుతాయని, కొత్త కమిషన్‌కు నిర్ణయాధికారంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తు వేగవంతం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎస్పీఎస్సీ, సిట్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. వీలైనంత వేగంగా విచారణ చేపడితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడుగులు పడతాయన్న ఆశలో నిరుద్యోగులు ఉన్నారు. -
టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటివరకు ఆమోదించలేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. జనార్దన్‌రెడ్డి సోమవారం రాజీనామా సమర్పించగా, పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్‌కు దానిని ఆన్లైన్ ద్వారా పంపినట్టు అధికారులు తెలిపారు. బుధవారం గవర్నర్ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారని, రాజీనామాను ఆమోదించే విషయంలో అప్పుడే నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం చోటుచేసుకోవడంతో రాతపరీక్షలు రద్దు అయ్యాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు జరిపిన దర్యాప్తుపట్ల గవర్నర్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. -
టీఎస్పీఎస్సీ చైర్మన్...జనార్దన్‌రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రం సమ ర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. రాజీనామాకు ముందు సీఎం రేవంత్‌రెడ్డిని జనార్ధన్‌రెడ్డి కలిశారు. కమిషన్‌కు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ ముగిసిన వెంటనే జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం. దిగజారిన ప్రతిష్ట ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల విషయంలో టీఎస్పీఎస్సీ జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. పలు రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచింది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర ప్రక్రియలన్నీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేస్తూ విజయవంతంగా దూసుకెళ్లింది. 2021 మే 21వ తేదీన టీఎస్పీఎస్సీ చైర్మన్ బాధ్యతలు జనార్ధన్‌రెడ్డి స్వీకరించారు. ఆ తర్వాత నూతన జోనల్ విధానం అమలు నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యం జరిగింది. అయితే గతేడాది ఏప్రిల్ నుంచి క్రమంగా ఆ ప్రక్రియ ఊపందుకుంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో 503 ఉద్యోగాలతో గ్రూప్–1 నియామకాల ప్రకటన జారీ చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరుసగా దాదాపు 30 వేల ఉద్యోగాలకు నెలల వ్యవధిలోనే ప్రకటలు జారీ చేస్తూ వచి్చంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పూనుకోవడంతో ఇంటిదొంగలు తయారయ్యారు. గ్రూప్–1 సహా పలు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ పరపతి ఒక్కసారిగా దిగజారింది. పోలీసుల కేసులు, పలువురు ఉద్యోగులు జైలుపాలు కావడం, అప్పటికే నిర్వహించిన పరీక్షల రద్దు తదితరాలన్నీ కమిషన్ స్థాయిని పూర్తిగా దిగజార్చాయి. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌ను, సభ్యులను మార్చాలంటూ నిరుద్యోగులు ఒత్తిడి తెచ్చారు. క్రమంగా పరిస్థితులు కాస్త సద్దుమణగడం, పరీక్షల పునర్ నిర్వహణ తేదీలు ప్రకటించడంతో నిరుద్యోగులు సన్నద్ధతపై దృష్టి పెట్టారు. జనార్ధన్‌రెడ్డి వెటర్నరీ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లో గ్రూప్–1 అధికారిగా నియమితులయ్యారు. 1996లో కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలన, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, వ్యవసాయ శాఖల్లో కీలక హోదాల్లో పనిచేశారు. వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్‌గా సేవలందించారు. అత్యంత నిజాయితీ గల అధికారిగా పేరుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఆయన్ను టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డులో ప్రస్తుతం ఐదురుగు సభ్యులున్నారు. వారు కూడా ఒకట్రెండు రోజుల్లో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
ఓర్వలేకే ప్రతిపక్షాలు నీచ రాజకీయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ద్వారానే ప్రతీపశక్తులకు గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ నేత రాంపుల్లారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరగ్గా, దేవుడి దయతో బతికి బయటపడ్డారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎప్పుడూ ఇలాంటి హేయమైన రాజకీయాలు లేవని, హింసకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ అనేక రంగాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. నాగం చేరికతో పెరిగిన బీఆర్ఎస్ బలం నాటి తెలంగాణ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీ బలం మరింత పెరిగిందని కేసీఆర్ అన్నారు. పాలమూరులో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలో నాగం ఇంటికి వెళ్లి మరోమారు ఆయన అనుచరులతో భేటీ అవుతానని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి తన కుటుంబసభ్యుడి లాంటి వాడన్నారు. విష్ణు తండ్రి పి.జనార్దన్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన రాజకీయ భవిష్యత్తు తన బాధ్యత అని కేసీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. -
రాష్ట్ర ఎమ్మెల్యేల్లో 106 మంది కోటీశ్వరులే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ఎమ్మెల్యేల్లో 90శాతం అంటే 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. అధికార బీఆర్ఎస్కు చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది (92%), ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఐదుగురు (71%), ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు (67%), బీజేపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు (100%), ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల ఆస్తులు రూ.కోటి కంటే ఎక్కువేనని తెలిపింది. మొత్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.13.57 కోట్లు అని వెల్లడించింది. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.14.11 కోట్లు, ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.10.84 కోట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.22 కోట్లు, బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.32.61 కోట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.66 కోట్లుగా తేల్చింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఖాళీగా ఉంది. ఈ క్రమంలో మిగతా 118 నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు, నేర చరిత్ర తదితర అంశాలపై 2018 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ సంస్థ శనివారం తమ నివేదికను విడుదల చేసింది. బహిష్కరణకు గురైన, పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిక ఖరారుకాని ఇద్దరు ఎమ్మెల్యేలను స్వతంత్రులుగా చూపింది. పార్టీలు మారినవారు 16 మంది ఏడీఆర్ నివేదిక ప్రకారం.. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. అందులో 12 మంది కాంగ్రెస్ నుంచి గెలిచినవారుకాగా, ఇద్దరు టీడీపీ నుంచి, ఒకరు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచారు. వీరంతా బీఆర్ఎస్లో చేరారు. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రాడ్యుయేట్లు 58 శాతమే.. రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేలలో.. 43 మంది (36%) విద్యార్హత 5వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య ఉంది. మరో 69 మంది (58%) గ్రాడ్యుయేషన్/ఆపై విద్యార్హత కలిగి ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు డిప్లొమా చేశారు. ఒక ఎమ్మెల్యే తాను సాధారణ అక్షరాస్యుడినని ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యేల వయసును పరిశీలిస్తే.. 43 మంది (36%) వయసు 30 నుంచి 50ఏళ్ల మధ్య ఉండగా, 75 మంది (64%) వయసు 51 నుంచి 80 ఏళ్ల మధ్య ఉంది. మొత్తం 118 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు (5%) మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. రూ.161 కోట్లతో మర్రి జనార్దన్‌రెడ్డి టాప్ అత్యధిక ఆస్తులున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితాలో.. రూ.161 కోట్లతో నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి టాప్‌లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రూ.91 కోట్లతో కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు–బీఆర్ఎస్), రూ.91 కోట్లతో పైళ్ల శేఖర్‌రెడ్డి (భువనగిరి–బీఆర్ఎస్) నిలిచారు. మంత్రి కేటీఆర్‌కు రూ.41 కోట్లు ఆస్తులు, రూ.27 కోట్లు అప్పులు ఉండగా.. సీఎం కేసీఆర్‌కు రూ.23 కోట్లు ఆస్తులు, రూ.8కోట్లు అప్పులు ఉన్నట్లు గత అఫిడవిట్లలో చూపారు. బీఆర్ఎస్ను వీడి బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో చూపిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు రూ.56 కోట్లు, అప్పులు రూ.8 కోట్లు కావడం గమనార్హం. యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ రూ.19 లక్షల విలువైన ఆస్తులతో రాష్ట్రంలో తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యేగా ఉన్నారు. రూ.కోటికిపైగా అప్పులున్న ఎమ్మెల్యేల జాబితాలో రూ.94 కోట్లతో కందాల ఉపేందర్‌రెడ్డి టాప్‌లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రూ.63 కోట్లతో మర్రి జనార్దన్‌రెడ్డి, రూ.40 కోట్లతో దానం నాగేందర్ ఉన్నారు. సగానికిపైగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు రాష్ట్రంలో అన్నిపార్టీలు కలిపి ప్రస్తుతమున్న 118 మంది ఎమ్మెల్యేలకుగాను.. 72 మంది (61%)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. ఇందులో బీఆర్ఎస్ వారే 59 మంది అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. బీఆర్ఎస్కు ఉన్న 101 మంది ఎమ్మెల్యేల్లో ఇది 58శాతమని తెలిపింది. ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురిపై (86%), ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురిపై (67%), బీజేపీకి చెందిన ఇద్దరు (100%) ఎమ్మెల్యేలపై, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఒకరిపై (50%) క్రిమినల్ కేసులు ఉన్నట్టు వారు గత ఎన్నికల అఫిడవిట్లలో తెలిపారని వివరించింది. మొత్తంగా 46 మంది (39%) సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. అందులో బీఆర్ఎస్ వారు 38 మంది అని తెలిపింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, నలుగురిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని.. ఒక ఎమ్మెల్యేపై అత్యాచారానికి సంబంధించిన కేసు ఉందని వివరించింది. -
నన్ను కాదని.. నిన్నమొన్న వచ్చిన వారికి టికెట్లా?
పంజగుట్ట: ‘రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో సీనియర్‌ను.. అనుభవం ఉన్న వాడిని. కాంగ్రెస్ పార్టీని ఎన్నో సంవత్సరాలుగా నాగర్‌కర్నూల్‌లో కాపాడుకుంటూ వస్తున్నా. నన్ను కాదని నిన్న, మొన్న వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారు?’అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఒక వ్యక్తి పార్టీలోకి వస్తే ఏదో జరిగిపోతుందని ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్‌లో జగదీశ్వర్‌రావు పార్టీని కాపాడుతుంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన జూపల్లి కృష్ణారావు... కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల సీట్లు తన వారికే కావాలంటున్నాడని, ఆయన అంత పెద్ద నాయకుడు ఎప్పుడయ్యాడో అర్థం కావడంలేదన్నారు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ కేడర్‌కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉండి, ఏ ఎన్నికలు వచ్చినా ముందుండి పార్టీని నడిపిన మేము ఏం కావాలి? ఆయన గెలిచిన తర్వాత ఇక్కడే పార్టీలోనే ఉంటారన్న నమ్మకం ఉందా..ఆ గ్యారెంటీ ఎవరిస్తారని నాగం ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి... కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48 వేల కోట్ల అవినీతి జరిగిందని నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉండగా సీఎం కేసీఆర్ దాన్ని పక్కన పెట్టేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ అవినీతి గురించి మాట్లాడుతోందని, అయితే ఎవరూ ప్రశ్నించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు, టీపీసీసీ అధ్యక్షుడు దీనిపై తాడోపేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై త్వరలోనే ఏసీబీ డీజీని కలసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. -
మూడవ రోజు బీఆర్ఎస్ నేతల పై ఐటీ దాడులు..!
-
టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిపై ఈడీ ప్రశ్నలవర్షం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సుమారు రూ. 40 లక్షలు చేతులు మారినట్లు తేలడం, ఇందులో మనీలాండరింగ్ కోణం ఉండటంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)... తాజాగా పరీక్షల నిర్వహణ తీరుతెన్నులు, లీకేజీ పరిణామాలపై కమిషన్ చైర్మన్ బి. జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను సోమవారం సుదీర్ఘంగా విచారించింది. వారిని ఏకదాటిగా 11 గంటలపాటు విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. అన్ని కోణాల్లో ప్రశ్నలు..: ఈడీ అధికారుల నోటీసుల మేరకు జనార్ధన్‌రెడ్డి, అనితా రామచంద్రన్‌లు సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని వేర్వేరుగా అన్ని కోణాల్లో విచారించారు. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది..? ప్రశ్నపత్రాల తయారీ, వాటి భద్రత, చైర్మన్, కార్యదర్శిల పర్యవేక్షణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉద్యోగుల విధులు, ఆ విభాగంలోకి ఇతర ఉద్యోగులు వెళ్లేందుకు ఉన్న అవకాశాలు వంటి అంశాలపై వివరాలు సేకరించారు. అలాగే పేపర్ల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తీరు, తీసుకున్న చర్యలు తదితర అంశాలపైనా ప్రశ్నించారు. అనంతరం ఈ కేసులోని కీలక నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డిల పాత్రపై ఆరా తీసినట్లు తెలిసింది. ఉద్యోగంలో వారి చేరికతోపాటు విధులు, బాధ్యతలు, ప్రవర్తన ముఖ్యంగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చే మహిళా అభ్యర్థులతో ప్రవీణ్ స్నేహాల గురించి అనితా రామ్చంద్రన్ను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. లీకేజీకి పాల్పడిన ఉద్యోగులపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు...? ఈ మొత్తం వ్యవహారంలో ఇంకెవరైనా ఉద్యోగులకు సంబంధం ఉన్నట్టు మీ అంతర్గత దర్యాప్తులో ఏమైనా తెలిసిందా? అని జనార్దన్‌రెడ్డిని అడిగినట్లు తెలిసింది. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ఉద్యోగులను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలియవచ్చింది. ఈ కేసులో నిందితురాలైన గురుకుల టీచర్ రేణుకకు సంబంధించిన వివరాలపై ముగ్గురు గురుకుల టీచర్ల నుంచి కూడా ఈడీ అధికారులు సోమవారం వాంగ్మూలాలు తీసుకున్నట్లు సమాచారం. -
సిబ్బందే లీక్ చేస్తారని ఊహించలేదు
సాక్షి, హైదరాబాద్: కమిషన్‌లో పనిచేస్తున్న వ్యక్తులే పేపర్ల లీకేజీకి పాల్పడతారని ఊహించలేకపోయినట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సిట్ అధికారుల విచారణలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తమ దృష్టికి వచ్చిన దాని ప్రకారం ప్రవీణ్, రాజశేఖర్, రమేష్, షమీమ్‌లపై గతంలో ఎలాంటి ఆరోపణలు లేవని... ఈ నేపథ్యంలో ఇలాంటి లీకేజీ జరుగుతుందని ఊహించలేదని వివరణ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సోమవారం కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో చైర్మన్‌కు నోటీసులు పంపకుండా స్వయంగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. సిట్ చీఫ్‌గా ఉన్న అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సీసీఎస్ ఏసీపీ కె.నర్సింగ్‌రావుతో కూడిన బృందం టీఎస్పీఎస్సీకి వెళ్లి మూడు గంటలకుపైగా చైర్మన్‌ను ప్రశ్నించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి నుంచి స్వా«ధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను అధికారులు తమ వెంట తీసుకువెళ్లారు. ప్రధానంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, వాటి భద్రత తదితర అంశాలపైనే జనార్దన్‌రెడ్డిని విచారించారు. పర్యవేక్షణ బాధ్యత నాదే: చైర్మన్ ప్రశ్నపత్రాల తయారీ, భద్రత పర్యవేక్షణ తనదేనని విచారణ సందర్భంగా చైర్మన్ పోలీసులకు తెలిపారు. ప్రతి పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీకి సెట్టర్స్‌గా పిలిచే నిపుణుల సహాయం తీసుకుంటామని, వారినే వ్యక్తిగతంగా కాన్ఫిడెన్షియల్ విభాగానికి ఆహ్వానిస్తామని వివరించారు. అక్కడకు వచ్చే వరకు ఒక సెట్టర్ విషయం మరొకరికి తెలియకుండా జాగ్రత్తలు ఉంటాయన్నారు. వారు రూపొందించిన ప్రశ్నపత్రం కాపీలను కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్లో భద్రపరుస్తారని, ఓ డిజిటల్ కాపీని సెక్షన్‌లోని లాకర్లో ఉంచడం ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని జనార్దన్‌రెడ్డి సిట్ అధికారులకు తెలియజేశారు. తనతోపాటు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారులే ప్రశ్నపత్రం తయారీలో ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆయన వివరించారు. లీకేజీ వ్యవహారంలో కస్టోడియన్ నిర్లక్ష్యం సహా వివిధ అంశాలపై అంతర్గత విచారణ కూడా జరుగుతోందని, అది పూర్తయ్యాక వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారని తెలిసింది. వాంగ్మూల పత్రాలపై ఆయన సంతకాలు తీసుకున్న దర్యాప్తు అధికారులు వాటిని కోర్టులో దాఖలు చేయనున్నారు. పరీక్షలు రాసిన ఉద్యోగులపైనా ఆరా పరీక్షలకు హాజరైన టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో ఎందరు అనుమతి పొందారనే అంశాన్నీ సిట్ సేకరిస్తోంది. కమిషన్ ఉద్యోగులు, సభ్యులకు బంధువులు, స్నేహితులు, కుటుంబీకుల్లో ఎవరైనా టీఎస్పీఎస్సీ పరీక్షలు రాశారా? వారి పరిస్థితి ఏంటి? తదితర వివరాల పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తోంది. కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సిట్ అధికారులు కాన్ఫిడెన్షియల్ సెక్షన్, కస్టోడియన్ ఛాంబర్‌తో పాటు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రమేష్, షమీమ్‌లు కూర్చునే సీట్ల వద్దా తనిఖీలు చేశారు. అక్కడ నుంచి కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భద్రత పెంచాలని సూచించాం.. మా దర్యాప్తులో టీఎస్పీఎస్సీలో ఉన్న అనేక లోపాలను గుర్తించాం. ల్యాన్లో మార్పుచేర్పులు, యాక్సస్ కంట్రోల్, త్రీ స్టెప్ వెరిఫికేషన్ ఇలా అనేక ఆవశ్యకతలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాం. సైబర్ ఆడిట్ సిఫార్సుల ప్రకారం భద్రత పెంచాలని సూచించాం. – ఓ ఉన్నతాధికారి -
TSPSC: పేపర్ లీక్ కేసులో కీలక ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా ఈ కేసులో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కమిషన్‌లో ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. మరోవైపు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేయాలని సిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక, పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని సిట్ శనివారం విచారించింది. వీరిద్దరినీ వేరువేరుగా 2 గంటలపాటు సిట్ విచారించింది. ఇక, విచారణ సందర్బంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ గ్రూప్-1 పరీక్ష రాసినట్టు తనకు తెలుసని సిట్‌కు అనితా రామచంద్రన్ తెలిపారు. అయితే, పరీక్షల్లో ప్రవీణ్ అర్హత సాధించకపోవడంతో అతడిపై అనుమానం రాలేదని ఆమె చెప్పారు. మరోవైపు, లింగారెడ్డి మాత్రం తన పీఏ రమేష్ గ్రూప్-1 పరీక్ష రాసినట్లు తనకు తెలియదని అన్నారు. ఇక, మొత్తం పరీక్షల నిర్వహణను కాన్ఫిడెన్షియల్‌గా సిట్ సేకరించింది. సిట్ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం.. అంతకు ముందు.. అనిత రామ్‌చంద్రన్, లింగారెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్‌లు అక్కడే ఉన్నారు. వారిలో షమీమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా, రమేష్ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అరెస్టు అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీ చర్యల వల్ల కమిషన్ పరువుపోవడంతోపాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డట్లు తెలుస్తోంది. కమిషన్ ఉద్యోగులు, వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్ అనితను కోరింది. -
పరీక్షల నిర్వహణ యథాతథం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన తేదీల్లోనే అర్హత పరీక్షలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. కష్టపడి ఉద్యోగాలు సాధించాలన్న తపనతో లక్షలాది మంది నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. వారికి ఏమా త్రం అన్యాయం జరగకూడదనేదే మా లక్ష్యం. వాస్త వ పరిస్థితులకు భిన్నంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు జరుగుతున్నాయి. తొందరపడి వాటిని నమ్మి అభ్యర్థులు సమయాన్ని వృథా చేసుకోవద్దు’అని టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత 4–5 రోజుల పరిణామాల దృష్ట్యా ఆయన మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యులు, కార్యదర్శితో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు, ఇతరత్రా అంశాలపై పలు ప్రచారాల నేపథ్యంలో అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 17 వేల పోస్టులు... 26 ప్రకటనలు... ‘వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది. 17,134 కొలువులకు సంబంధించి ఏడాది కాలంలో 26 ప్రకటనలు జారీ చేశాం. ఇందులో 6 రకాల అర్హత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. గత ఏడేళ్లలో 35 వేల ఉద్యోగాల భర్తీ జరిగితే కేవలం ఏడాదిలోనే 17 వేల కొలువులకు ప్రకటనలు జారీ చేశాం. మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ చేయనున్నాం. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన క్రమంలో అంతర్గత సమాచారం అందింది. దీంతో వెంటనే ఆ రెండు పరీక్షల నిర్వహణను వాయిదా వేశాం. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 5న నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశ్నపత్రం లీకైందని గుర్తించాం. ఇది ఎందరికి చేరింది... ఏయే సమాచారం ఎవరెవరికి చేరిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సాంకేతికత ఆధారంగా లీకేజీని గుర్తించేందుకు ఫోరెన్సిక్, సైబ ర్ భద్రతా విభాగాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షపై బుధవారం మళ్లీ సమీక్షించాక నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని జనార్దన్‌రెడ్డి వివరించారు. కార్యాలయానికి కొత్త సాంకేతికత... ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సాంకేతికతను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నాం. కంప్యూటర్ల మార్పుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కొత్తగా తయారు చేసేందుకు చర్యలు మొదలుపెట్టాం. అతిత్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అర్హత పరీక్షల ప్రశ్నపత్రాలను తిరిగి రూపొందించాలని నిర్ణయించాం. అతిత్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి పరీక్షలు నిర్వహిస్తాం. ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష నుంచి అన్ని రకాల పరీక్షలను నిర్దేశించిన తేదీల్లోనే నిర్వహిస్తాం. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అత్యంత పారదర్శకతతో అర్హతలున్న వారిని ఎంపిక చేయడయే మా పని’అని జనార్దన్‌రెడ్డి తెలిపారు. నమ్మించి గొంతు కోసినట్లుగా... ‘ఒక కార్యాలయం అన్నాక ఎంతో మంది ఉద్యోగులుంటారు. ప్రతి సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకే ప్రయత్నిస్తాం. అదే సమయంలో సహోద్యోగులకు వివిధ బాధ్యతలు అప్పగించి కార్యక్రమాలను సజావుగా సాగేలా చూస్తాం. ప్రవీణ్‌కుమార్ ఇక్కడ ఏళ్లుగా పనిచేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. ప్రతి ఉద్యోగి ఎలాంటివాడు? అతని నేప థ్యం ఏమిటని ఆరాతీసే పరిస్థితి ఉండదు. కార్యాలయంలో పనిచేసే వ్యక్తి.. ఏళ్లుగా నమ్మకంతో ఉన్నందున వివిధ బాధ్యతలు అప్పగించాం. రాజశేఖర్‌రెడ్డి నెట్వర్క్ విభాగంలో పనిచేస్తున్నా డు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నమ్మించి గొంతుకోసిన చందంగా ఉంది. ప్రవీణ్ శాఖా పరంగా అనుమతి తీసుకొని గ్రూప్–1 ప్రిలిమిన రీ పరీక్ష రాశాడు. 103 మార్కులు వచ్చినట్లు తెలిసింది. కానీ పేపర్ కోడ్ సరిగ్గా వేయలేదని అనర్హుడైనట్లు సమాచారం. అయితే గ్రూప్–1 ప్రిలిమిన రీ అర్హుల్లో అత్యధిక మార్కులు 103 కంటే ఎక్కు వ. ప్రిలిమినరీ పరీక్షలో ర్యాంకులను పరిగణనలోకి తీసుకోం. దీంతో ఎక్కడా మార్కులు వెల్లడించలేదు. అభ్యర్థులకు మాత్రం వారి మార్కు లు చూసుకొనే వెసులుబాటు కల్పిస్తూ ఓఎంఆర్ పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. ఈ పరీక్ష లీకేజీపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవు. సామాజిక మాధ్యమాల్లో అనవసర రాద్ధాంతాన్ని పరిగణించొద్దు. ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరగదు. వాస్తవ పరిస్థితులను కనిపెట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం చర్యలుంటాయి’అని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
వదంతులను నమ్మొద్దు: టీఎస్పీఎస్సీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, అవకతవకలు జరిగే అవకాశమే లేదని.. వదంతులను ఆపేందుకే తాము మీడియా ముందుకు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఏఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం.. ఈ నేపథ్యంలో మిగతా పేపర్లూ లీక్ అయ్యాయంటూ సభ్యుల ఆందోళన.. తదనంతర పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం కమిషన్ కీలక భేటీ నిర్వహించింది. సుమారు 4 గంటలకు పైగా ఈ భేటీ జరగ్గా.. కమిషన్ సభ్యులు విడిగానే కాకుండా సీఎస్ శాంతకుమారితోనూ భేటీ అయ్యారు గమనార్హం. అనంతరం పేపర్ లీకేజీ వ్యవహారంపై చైర్మన్ మీడియాతో మాట్లాడారు. ‘‘టీఎస్పీఎస్సీ పరిధిలోని 30 లక్షల మంది వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ కింద దరఖాస్తు చేసుకున్నారు. 26 రకాల ఉద్యోగులకు నోటిఫికేషన్ జారీ చేశాం. గ్రూప్-1 పరీక్షలకు మల్టీపుల్ జంబ్లింగ్ చేశాం’’ అని ఆయన వివరించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం లేదన్న చైర్మన్.. దురదృష్టకర పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని, పేపర్లు లీక్ అయ్యాయంటూ, ఎగ్జామ్‌లు రద్దు అవుతాయంటూ వస్తున్న వదంతులకు పుల్‌స్టాప్ పెట్టాలని తాము ఇదంతా చెప్తున్నామని ఆయన అన్నారు. లీకేజీ సమాచారం అందగానే తాము పోలీసులను ఫిర్యాదు చేశామని, ఆ తర్వాతి పరిణామాలు అందరికీ తెలిసినవే అని చెప్పారాయన. రాజశేఖర్‌రెడ్డి అనే నెట్వర్క్ ఎక్స్పర్ట్ ఆరేడు ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. నెట్వర్క్ ఎక్స్పర్ట్ కావడంతో ఐపీ అడ్రస్‌లు తెలిసే అవకాశం ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డితో పాటు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ హ్యాకింగ్‌కు పాల్పడ్డాడని, ఈ ఇద్దరితో పాటు మరికొందరి వల్ల ఈ లీక్ వ్యవహారమంతా నడిచిందని తెలిపారాయన. పేపర్ లీక్ అయిన ఏఈ పరీక్షకు సంబంధించి అధికారిక నివేదిక(బుధవారం మధ్యాహ్నం కల్లా అందే అవకాశం ఉంది).. ఆపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాకే పరీక్ష వాయిదా వేయాలా? లేదా ఇతర నిర్ణయం తీసుకుని ప్రకటన చేద్దామని భావించామని తెలిపారాయన. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అనుమానాలను నివృత్తి చేయడానికే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారాయన. తన కూతురు కూడా గ్రూప్-1 రాసిందంటూ ప్రచారం జరుగుతోందన్న విషయాన్ని చైర్మన్ జనార్ధన్‌రెడ్డి తోసిపుచ్చారాయన. తన కుటుంబ సభ్యులెవరూ పరీక్ష రాయలేదని స్పష్టత ఇచ్చారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో 103 మార్కులు వచ్చిన వ్యవహారంపై స్పందించిన చైర్మన్.. అది నిజమేనని, కానీ, ప్రవీణ్ సెలక్ట్ కాలేదని, ప్రవీణ్‌కు వచ్చిన మార్కులే హయ్యెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టత ఇచ్చారు. -
TS: ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్
ఎన్నికల పోలింగ్ అప్డేట్స్: ► మహాబూబ్ నగర్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ► మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్ పర్సంటేజ్.. మధ్యాహ్నం 2:30 గంటల వరకు ( 77.11%), ఇబ్రహీంపట్నం మండలం పోలింగ్ 155 (76.32%), మంచాల మండలం పోలింగ్ 53 (85.48%), యాచారం మండలం పోలింగ్ 65 (77.64%) గా నమోదు అయ్యింది. ►మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పొలింగ్ ఉదయం 10 గంటల వరకు 19.54 శాతం నమోదైంది. ఇక జిల్లాల వారిగా చూస్తే.. మహబూబ్ నగర్ జిల్లా 19.30 శాతం, నాగర్ కర్నూల్ జిల్లా 19.20 శాతం, వనపర్తి జిల్లా 25.69 శాతం, గద్వాల్ జిల్లా 21.78 శాతం, నారాయణపేట్ జిల్లా 20.33 శాతం, రంగారెడ్డి జిల్లా 15.20 శాతం, వికారాబాద్ జిల్లా 16.19 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 17.21 శాతం, హైదరాబాద్ జిల్లా 21.00 శాతం నమోదైంది. హైదరాబాద్–రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 29,720 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 15,472, మహిళలు 14,246, ఇతరులు ఇద్దరు ఓటర్లు ఉన్నారు. 137 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. టీచర్లు వివిధ ప్రాంతాలకు బదిలీ అవ్వడంతో కొంతమందికి రెండుచోట్ల ఓట్లున్నట్టు అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తడంతో అధికారులు వాటిని తొలగించారు. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోందని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలకు ఇబ్బందికర పరిస్థితి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 317 జీవో వల్ల నష్టపోయిన టీచర్లు, బదిలీలు, పదోన్నతులపై ఆశలు సన్నగిల్లిన టీచర్లను సంతృప్తిపర్చడం ఉపాధ్యాయ సంఘాలకు ఇబ్బందికరంగా మారింది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 2017 ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీపడగా ఈసారి 21 మంది బరిలో ఉన్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ మద్దతుతో గెలవగా, ఈసారి పీఆర్టీయూ తెలంగాణ మద్దతుతో పోటీ చేస్తున్నారు. పీఆర్టీయూటీఎస్ ఈసారి గుర్రం చెన్నకేశవరెడ్డిని బరిలోకి దించింది. వీరిద్దరి మధ్య ఓట్ల విభజన ఎలా ఉంటుందనేది కీలకం. తెలంగాణ యూటీఎఫ్ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఏవీఎన్ రెడ్డిని బీజేపీ అనుకూల సంఘాలు బలపరుస్తున్నా యి. సీపీఐ అనుబంధ సంఘం ఎస్టీయూటీఎస్ అభ్యర్థిగా బి.భుజంగరావు, టీపీటీఎఫ్, బీఎస్పీ మద్దతుతో ఆచార్య వినయ్‌బాబు, బీసీటీఏ నుంచి విజయకుమార్ పోటీచేస్తున్నారు. టీయూటీఎఫ్ మద్దతులో మల్లారెడ్డి, జీటీఏ సహకారంతో ప్రభాకర్, లోకల్ కేడర్ జీటీఏ మద్దతుతో రవీందర్ పోటీలో ఉన్నారు. కాటేపల్లి జనార్దన్ రెడ్డికి అప్పట్లో టీఆర్ఎస్ మద్దతు తోడైంది. ఈసారి అధికార పార్టీ తో సంబంధం లేకుండా ప్రచారం నిర్వహించారు. ఆఖరి వరకూ ప్రచారం: ప్రచారంలో అన్ని పక్షాలూ ఉపాధ్యాయ సంఘాలు ఓట్లున్న ప్రతీ స్కూల్, కాలేజీకి వెళ్లాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నించాయి. మూడు నెలలుగా అభ్యర్థులు వారి వ్యూహాల్లో మునిగి తేలుతున్నా, ఆఖరి మూడురోజుల్లో మాత్రం పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు డబ్బులు కూడా పంచినట్టు కొందరు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. -
ఏకకాలంలో ఒక్కటైన 220 జంటలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఒకేసారి 220 జంటలు ఒక్కటైన అపురూప దృశ్యం ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆవిష్కృతమైంది. ఎంజేఆర్ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల మహోత్సవం కన్నులపండువగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కె.కేశవరావు, పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ప్రధాన వేదికపై యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకులు కల్యాణం నిర్వహించగా.. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ముత్యాల పందిరి, పురోహితుల ఆధ్వర్యంలో 220 కొత్త జంటలు ఒకే వేదిక ద్వారా ఒక్కటయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వధూవరులకు కంకణాలను అందజేశారు. కొత్తజంటలకు అవసరమైన సామగ్రిని అందజేశారు. సామూహిక వివాహాలకు హాజరైన వారందరికీ భోజనాలు ఏర్పాటుచేశారు. సంపాదనలో సగం పేదలకే.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సంపాదించిన దాంట్లో సగం పేదల కోసం ఖర్చు చేయాలనుకోవడం గొప్ప నిర్ణయం అని ఎంపీ కె.కేశవరావు అన్నారు. ఎమ్మెల్యే సొంతంగా రూ.3 కోట్లు వెచ్చించి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడం అభినందనీయమని ప్రశంసించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, తనకు అవకాశం వస్తే అనాథలు, బడుగు, బలహీనులకు వివాహాలు జరిపిస్తానని పేర్కొన్నారు. తాను గెలిచినా, ఓడినా వివాహ కార్యక్రమాలు కొనసాగిస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనార్దన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ టీచర్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డిని నిలబెడుతున్నట్టు పీఆర్టీయూ తెలంగాణ ప్రకటించింది. శుక్రవారం జరిగిన సంఘం సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎం.అంజిరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. జనార్దన్‌రెడ్డి విజయం కోసం సంఘంలోని ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, 317 జీవో వల్ల ఏర్పడ్డ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు పర్వత సత్యనారాయణ, సంఘం అధ్యక్షుడు చెన్నయ్య, ఆర్థిక కార్యదర్శి ఎన్. చంద్రశేఖర్ రావు, వ్యవస్థాపక అధ్యక్షుడు ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ నేతలు చెన్నయ్య, అంజిరెడ్డి తదితరులు శుక్రవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణను కలిశారు. ‘తొలిమెట్టు’కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీని రద్దు చేయాలని, ఎన్జీవోల భాగస్వామ్యం సరికాదని తెలిపారు. -
ఉద్యోగ నియామకాలకు రెడీ.. సర్కారు అనుమతులివ్వగానే ..
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిన వెంటనే వడివడిగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ దిశగా పకడ్భందీ ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నట్లు వివరించింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి, సభ్యులు రమావత్ ధన్సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, కారెం రవీందర్‌రెడ్డి, అరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్.సత్యనారాయణ, కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ 2020–21 వార్షిక నివేదికను సమర్పించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు కమిషన్ చైర్మన్ జనార్థన్‌రెడ్డి వివరించారు. 3 నోటిఫికేషన్లు... 4 పరీక్షలు... ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు టీఎస్పీఎస్సీ 149 ఖాళీల భర్తీకి 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తంగా 119 ఖాళీల భర్తీకిగాను 4 పరీక్షలు నిర్వహించింది. మొత్తం 10630 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల తాలూకు చర్యలు తీసుకుని 2370 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. శాఖాపరమైన పరీక్షలకు 1,26,381 మంది అభ్యర్థులు హాజరు కాగా, 53,886 మంది అర్హత సాధించారు. చదవండి: CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వరాల వర్షం -
పీఆర్సీపై దుష్ప్రచారాలు నమ్మొద్దు
సాక్షి, అమరావతి: పీఆర్సీపై కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విద్యుత్ ఉద్యోగులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మజనార్దనరెడ్డి సూచించారు. విద్యుత్ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర సదుపాయాలపై పే రివిజన్ కమిటీ(పీఆర్సీ) అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత విద్యుత్ సంస్థలు ఆ నివేదికను ఆమోదిస్తాయని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం పద్మజనార్దనరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కరోనా సమయంలో సంస్థ ఉద్యోగుల వైద్య బిల్లుల కోసం ప్రభుత్వం సకాలంలో రూ.3.02 కోట్లు చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. విద్యుత్ సంస్థలకు సబ్సిడీ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేసే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఇప్పటివరకు రూ.25 వేల కోట్లకు పైగా సబ్సిడీ బకాయిలు విడుదల చేసిందని తెలిపారు. ఇటీవల ప్రతిపాదించిన సర్వీసు నిబంధనలు కొత్తగా చేరిన వారికే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే భర్తీ చేసిన ఎనర్జీ అసిస్టెంట్(జేఎల్ఎం గ్రేడ్–2) పోస్టులను నూతన రెగ్యులేషన్స్ ద్వారా గతేడాది అక్టోబర్ రెండో తేదీ నుంచి రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఎవరికైనా సర్వీసు సమస్యలు, అనుమానాలుంటే సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలను సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడంపై ఉద్యోగులు దృష్టి సారించాలని.. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మజనార్దనరెడ్డి తెలిపారు. -
సెక్షన్ 164: అక్కడ చెబితే... అంతా నిజమేనా?
కొద్ది రోజులుగా కొన్ని మీడియా మాధ్యమాలలో పనికట్టుకొని సెక్షన్ 164, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 మీద విస్తృత చర్చలు నడుపుతున్నారు. ప్రజలలో తప్పుడు అపోహలు కలిగిస్తూ రాజకీయ దురుద్దేశంతో కొందరి వ్యక్తిత్వ హననం చేయడానికి పాటుపడుతున్నారు. సెక్షన్ 164(1) అనేది నేర ఒప్పుదల, రికార్డు చేసే ప్రక్రియ: ఈ ప్రక్రియలో, జుడిషియల్ మేజిస్ట్రేట్ తన పరిధిలో ఉన్న లేక తన పరిధిలో లేని నిందితుడిని దర్యాప్తు అధికారి అభ్యర్థన మేరకు, నేర ఒప్పుకోలు, ఇతర కథనాలను రికార్డు చేస్తారు. దీనిని రికార్డు చేసేటపుడు, మేజిస్ట్రేట్, నిందితుడిని సవివరంగా నేరం ఒప్పుకోవాల్సిన ఆగత్యం లేదని, తాను ఇస్తున్న ప్రకటన అతడికి వ్యతిరేకంగా ఉపయోగించవచ్చని లె లుపుతారు. ఆ మేరకు మేజిస్ట్రేట్ తన సంతకంతో స్టేట్మెంట్ను ముగిస్తారు. అయితే, కొన్ని మీడియాలలో వస్తున్న కథనాలు దీనికి భిన్నంగా ఉంటున్నాయి. సెక్షన్ 164లో పేర్కొన్నది అంతా వాస్తవ మని, దీనిని కోర్టులు వాస్తవ సాక్ష్యంగా పరిగణిస్తాయని చెబుతూ కావాలని కొందరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వాస్తవానికి, అత్యధిక కేసుల్లో 164 స్టేట్మెంట్లో పేర్కొన్నది నిజం కాదని, వాస్తవాలకు దూరంగా ఉంటుందని, కేసును తప్పుదారి పట్టించడానికి ఇచ్చినదిగా కూడా రుజువైంది. దీనికి ఉదాహరణ– ఆయేషా మీరా కేసులో ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత, ముద్దాయి సత్యంబాబు తాను చెల్లి పెండ్లి కోసం ఆర్థిక సహాయం పొంది తప్పుడు నేరం ఒప్పుకోలు ఇచ్చినట్లు గౌరవ హైకోర్టు అప్పీలులో మరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది రుజువై, సత్యంబాబు నిర్దోషిగా బయటకి వచ్చారు. కాబట్టి, నిందితుడు అబద్ధాలు, అవాస్తవాలను రికార్డు చేసే అవకాశాలుంటాయి. సెషన్స్ కోర్టుల్లో రుజువైంది. సెక్షన్ 164 స్టేట్మెంట్ని కోర్టులలో తారుమారు కాని, మార్పు/ సవరణకు వీలు లేని సాక్ష్యంగా మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్నో కేసులలో అప్రూవర్‌గా మారిన నిందితుడి స్టేట్మెంట్ సత్య నిరూపణకు విరుద్ధంగా ఉంటున్నాయి. సెక్షన్ 164(1) అనేది స్వచ్ఛందంగా నిందితుడి నేర ఒప్పుకోలు లేదా అప్రూవర్‌గా మారిన నిందితుడు, మేజిస్ట్రేట్ ముందు ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా, పోలీసు అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇచ్చే స్టేట్మెంట్, ఇది పూర్తి వాస్తవ సాక్ష్యం అయిపోదు. అంతేకాని, మీడియా మాధ్యమాల్లో ఇటువంటి క్రిమినల్ ట్రయల్ చేయడం చట్టపరంగా నేరం. పైగా సమాజానికి చాలా ప్రమాదకరం. - పొనకా జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది, తాడేపల్లి -
యాదాద్రి గోపురానికి 2 కిలోల బంగారం విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన 2 కేజీల బంగారాన్ని ఆలయ ఈఓ గీతారెడ్డికి విరాళంగా అందజేశారు. యాదాద్రీశుడి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అంతకుముందు బంగారం నాణేలకు ప్రతిష్టామూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన పి.మధుబాబు అనే భక్తుడు బంగారం తాపడం కోసం రూ.1,72,000ను విరాళంగా గీతారెడ్డికి అందజేశారు. నాడు భక్త రామదాసు.. నేడు సీఎం కేసీఆర్ భదాద్రి రామచంద్రస్వామి ఆలయాన్ని నాడు భక్త రామదాసు నిర్మిస్తే.. నేడు సీఎం కేసీఆర్ ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని పునర్నిర్మాణం చేస్తు న్నారని జనార్దన్‌రెడ్డి కొనియాడారు. విమాన గోపురానికి బంగారం తాపడంలో తమ కుటుంబం పాత్ర ఉండాలని బంగారాన్ని అందజేశానని, టెంపుల్ సిటీపై నిర్మిస్తున్న కాటేజీలకూ రూ.2 కోట్లను జేసీ బ్రదర్స్ కంపెనీ తరఫున ఇస్తున్నట్లు వెల్లడించారు. -
ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్: ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని జడ్చర్ల ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో నిర్మించిన పీఆర్టీయూ సంఘ భవనాన్ని ఎమ్మెల్సీ కె.జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో లక్ష్మారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయని, ఏ పథకం పెడితే ఎన్ని ఓట్లు వస్తాయో అని ఆలోచించటం సరైంది కాదన్నారు. వెనుకబడిన దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి దళితబంధు ప్రవేశపెడితే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. -
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా బి. జనార్ధన్‌రెడ్డి
-
ఏకగ్రీవాలను రద్దు చేసే అధికారం కోర్టుకు కూడా లేదు
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలతో మొదలైన ఏకగ్రీవాల పరంపర జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగేలా ఉంది. కోవిడ్ కారణంగా 2020 మార్చి 15న వాయిదా పడ్డ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల కమిషన్ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో పలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. త్వరలోనే ఎస్ఈసీ ఈ ఎన్నికలు నిర్వహించాaని భావిస్తుండగా.. గతంలోని ఏకగ్రీవాలను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై హైకోర్టు న్యాయవాది జనార్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఫారం 10లో.. ఎన్నికల్లో గెలిచినవారికి ఫారం 23లో ధ్రువీకరణ ఇస్తారు. ఏకగ్రీవమైనా.. ఎన్నికల్లో గెలిచినా.. ఒకసారి ధృవీకరణ పత్రం ఇచ్చాక రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. ఎస్ఈసీ, కోర్టులకు కూడా దీన్ని రద్దు చేసే అధికారం లేదు. కేవలం ఓడిపోయిన వ్యక్తి మాత్రమే ఆర్టికల్ 329 ప్రకారం జిల్లా కోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. విచారణ తర్వాతే కోర్టు తీర్పు ఇస్తుంది’’ అని తెలిపారు. -
13 జిల్లాల్లో కొత్తగా ఆయిల్‌ఫాం యూనిట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఆయిల్‌ఫాం ప్రాసెసింగ్ యూనిట్లు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 13 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి గురువారం ఆయిల్‌ఫెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం ఆమోదం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములు గు, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 24 జిల్లాల్లో కొత్తగా 7.73 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫాం సాగు చేయాలని సర్కా రు నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సమావేశ వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, ములుగు, జనగాం, మహబూబాబాద్, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల్లో కొత్తగా అదనంగా ఆయిల్‌ఫాం సాగు చేయనున్నారు. ఈ విషయంపై రైతులను చైతన్యం చేస్తామని ఆయన తెలిపారు. ఆయిల్‌ఫెడ్ టర్నోవర్ రూ.554 కోట్లు.. ఆయిల్‌ఫెడ్ టర్నోవర్ గణనీయంగా పెరిగింది. గత ఆరేళ్లతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా రెండింతలకు మించి పెరిగినట్లు ఆయిల్‌ఫెడ్ వర్గాలు వెల్లడించాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.237.48 కోట్లు ఉండగా, 2019–20లో ఏకంగా రూ.554 కోట్లు పెరిగినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. -
మాజీ మంత్రి అచ్చెనాయుడు ప్రధాన నిందితుడు
-
విద్యాశాఖ మంత్రి తెలుసా?
ఎల్కతుర్తి: వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తిలోని ఆదర్శ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్‌రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నైపుణ్యాలను ఆరా తీసే క్రమంలో పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పేరు ఏమిటని అడగగా విద్యార్థుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇక విద్యార్థి రాజు పాఠశాలకు రాలేదని తెలుసుకున్న జనార్ధన్‌రెడ్డి ఆయన తండ్రికి ఫోన్ చేసి వివరాలపై ఆరా తీశారు. పిల్లలకు పనులు చెప్పకుండా రోజూ బడికి పంపించాలని సూచించారు. -
ఫోన్లో పాఠాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): చదువులో వెనకబడిన విద్యార్థులకు త్వరలోనే ఫోన్ ద్వారా ప్రత్యేక బోధన అందించనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక శిక్షకుల ఆధ్వర్యంలో మాత్రమే ట్యూషన్లు చెప్పేవారు. కానీ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా టెలీ టీచర్స్ ఆధ్వర్యంలో ఫోన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. దీంతో వారు తరగతి గదుల్లో మాత్రమే విద్య నేర్చుకున్నారు. వసతి గృహాల్లో ట్యూటర్ ఉండటంతో అక్కడి విద్యార్థుల సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోగలుగుతారు. కానీ అనేక మంది విద్యార్థులు బిడియం, మొహమాటం కారణంగా తరగతి గదుల్లో తమ సందేహాలను ఉపాధ్యాయులు, ట్యూటర్లను అడగలేకపోతున్నారు. సందేహాలు అడిగితే ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఏమనుకుంటారోనన్న ఆలోచనతో అనేకమంది విద్యార్థులు తమ సందేహాలను అడగకుండా చదువులో వెనుకబడి పోతున్నారు. అయితే టెలీ టీచర్స్ ద్వారా తమకు వచ్చిన సందేహాలను ఫోన్ ద్వారా అడగొచ్చు కాబట్టి విద్యార్థులకు భయం ఉండదనే ఆలోచనతో రాష్ట్ర విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. రిటైర్డ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఖాళీ సమయాల్లో బోధించే ఆసక్తి ఉన్నవారి ద్వారా ఈ టెలీ ట్యూషన్లు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. టెలీ టీచర్స్ పద్ధతి ప్రస్తుతం మహరాçష్ట్రలో అమల్లో ఉంది. ప్రత్యేక సమయం.. ఈ టెలీ ట్యూషన్‌కు సాయంత్రం ప్రత్యేకంగా సమయం కేటాయించడం ద్వారా అటు ట్యూటర్ (టెలీటీచర్స్)కు, ఇటు విద్యార్థులకు లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పాఠశాల విద్యార్థులకు సబ్జెక్ట్‌లకు సంబంధించిన టెలీ ట్యూటర్ ఫోన్ నంబర్‌ను ఇవ్వడం ద్వారా విద్యార్థులు వారికి కేటాయించిన సమయంలో ఫోన్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. టెలీటీచర్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు అధికంగా లబ్ధి చేకూరుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు త్వరలోనే టెలీ ట్యూషన్ అందుబాటులోకి తెస్తాం. ఇందుకోసం కసరత్తు చేస్తున్నాం. భయపడే, మొహమాటపడే విద్యార్థులు పరోక్షంగా తమ పాఠ్యాంశంలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వెనుకబడిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంది. – విద్యా శాఖ పిన్సిపల్ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి -
‘ఐ లవ్ మై జాబ్’
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలో వినూత్న కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల్లో తాము చేస్తున్న వృత్తి పట్ల అంకితభావం పెంపొందిం చేందుకు ‘ఐ లవ్ మై జాబ్’, ‘యాక్ట్ నౌ’వంటి కార్యక్రమాలను చేపట్టింది.విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఆలోచన మేరకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యా కార్యాలయాల్లో ‘ఐ లవ్ మై జాబ్, యాక్ట్ నౌ’ల బోర్డును ఏర్పాటు చేసింది. తద్వారా అధికారులు, సిబ్బందిలో వృత్తి పట్ల అంకిత భావం పెంపొందించవచ్చన్నది ఉద్దేశం.అంతేకాదు ‘ఐ లవ్ మై జాబ్’అంశంపై ఉపాధ్యాయులు, అధికారులకు వ్యాస రచన పోటీలు నిర్వహించింది. పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరిగాయి. అందులో జిల్లా స్థాయిలో ఉత్తమ వ్యాసాలు రాసిన ఉపాధ్యాయులను ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపిక చేశారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఉత్తమంగా నిలిచిన వ్యాసాలు రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికయ్యాయి. రాష్ట్ర స్థాయికి వచ్చిన వ్యాసాల్లో ప్రతి భాషలో మూడు (ప్రథమ, ద్వితీయ, తృతీయ) వ్యాసాలను ఉత్తమమైనవిగా ఎంపిక చేశారు.. వాటిని రాసిన ఉపాధ్యాయులతోపాటు, జిల్లా స్థాయిలో ఆయా భాషల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా 107 మందిని ఈనెల 20న సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొననున్నారు. -
భవిష్యత్తులో ‘టెన్త్’ పునఃమూల్యాంకనం
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల పునఃమూల్యాంకనం (రీ వ్యాల్యుయేషన్) నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది కాకపోయినా, భవిష్యత్తులో అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. పునఃమూల్యాంకనం నిర్వ హించాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించినట్లు వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పునఃమూల్యాంకనానికి సంబంధించిన కోర్టు తీర్పులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపై విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో సమీక్షించారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాల్లో లోపాలు చోటుచేసుకున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాల ప్రకటనలో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. అత్యంత పకడ్బందీగా పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించామన్నారు. ఫలితాలపట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, జవాబు పత్రాల ఐదంచెల పరిశీలన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ప్రతి విద్యార్థీ గ్రేడ్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటున్నారమన్నారు. ఎవరికైనా సున్నా మార్కులొచ్చినా, గైర్హాజరని వచ్చినా, ఒక సబ్జెక్టులో ఫెయిలై మిగిలిన సబ్జెక్టుల్లో మంచి మార్కులొచ్చినా సంబంధిత విద్యార్థుల జవాబు పత్రాల పునః పరిశీలన నిర్వహించి ధ్రువీకరించుకున్నామన్నారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఇలాంటి కేసులను గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని విజయ్ కుమార్ చెప్పారు. అయితే ఫలితాల విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రెండు రోజుల ముందే ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. ప్రధానోపాధ్యాయుల లాగిన్‌కు ఫలితాలు.. ఎప్పటిలాగే పదో తరగతి ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేయడంతోపాటు ఈ ఏడాది తొలిసారిగా ప్రధానోపాధ్యాయుల లాగిన్‌కు సంబంధిత పాఠశాల విద్యార్థులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ షీట్‌ను పంపిస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు. దీనివల్ల గ్రామీణ విద్యార్థులు వారి పాఠశాలకు వెళ్లి ఫలితాలను తెలుసుకోవడంతోపాటు ప్రధానోపాధ్యాయుడి నుంచి కౌన్సెలింగ్, సలహాలు పొందొచ్చని వివరించారు. పదో తరగతి ఫలితాలపై విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు/ఫిర్యాదులు స్వీకరించేందుకు కొత్త మొబైల్ యాప్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని యాప్‌లో ఎంటర్ చేయడం ద్వారా విద్యార్థులు తమ విజ్ఞప్తిని టైప్ చేసి పదో తరగతి బోర్డుకు పంపొచ్చని, అలా పంపిన వారికి అక్నాలెడ్జ్మెంట్ సైతం పంపిస్తామన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో కొన్ని తప్పులు దొర్లాయి..
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పులు దొర్లాయని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి అంగీకరించారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నివేదికను శనివారం ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికపై విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు బాగున్నా, వాటి అమలులో ఫెయిల్ అయ్యారు. ఫలితాలు వెల్లడి చేయడంలో కొన్ని తప్పులు జరిగాయి. రిజల్ట్స్ వచ్చిన రెండు, మూడు గంటల్లోనే తప్పు జరిగిందని బోర్డు దృష్టికి వచ్చింది. కోడింగ్ సరిగా జరగకపోవడం వల్లే విద్యార్థుల హాజరు విషయంలో పొరపాట్లు జరిగాయి. ఓఎమ్మార్ షీట్లలో బబ్లింగ్ చేసే సమయంలో కూడా కొన్ని మానవ తప్పిదాలు జరిగాయి. ఫలితాల ముందు డేటా అనాలసిస్ చేసి ఉంటే బాగుండేది. సర్వర్ సామర్థ్యం పెంచమని త్రిసభ్య కమిటీ సూచించింది. ఇక గ్లోబరినా ఏజెన్సీకి ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. విద్యార్థుల ఆందోళనకు కారణమైనవారిపై చర్యలు తీసుకుంటాం. 531 మంది జాగ్రఫీ విద్యార్థుల మెమోలో ప్రాక్టికల్స్ మార్కులు కనిపించలేదు. చివరి నిమిషంలో సెంటర్ మార్పుల వల్ల కొన్ని తప్పులు జరిగాయి. ఉత్తీర్ణత శాతంలో తేడాలు లేవని కమిటీ గుర్తించింది. ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. సాఫ్ట్వేర్ లోపాలు ఉండటంతో కోడింగ్, డీ కోడింగ్ సమస్యలు వచ్చాయి. గతంలో కూడా ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు దొర్లాయి. వాటిని సరిచేసాం. ఈ తప్పులు ఊహించనవి కాదు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి జరిగాయి. ఫెయిల్ అయని విద్యార్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ సదుపాయం ఉచితంగా ఇస్తాం. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇకపై మానవ తప్పిదాలు లేకుండా చూసుకుంటాం. అందరి సందేహాలు తొలగించేందుకు కమిటీ తెలిపిన ఆరు సూచనలను అమలు చేస్తాం.’ అని తెలిపారు. -
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ బాధ్యతలు కలెక్టర్లకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఆయన పలువురు అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ 12 రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ నిర్వహణ నుంచి ఇంటర్ బోర్డు కార్యదర్శిని తప్పించి.. ఆ బాధ్యతలను జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. కాగా, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీని ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు ఇంటర్ బోర్డు పేర్కొంది. మరోవైపు ఇంటర్ ఫలితాల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మరికాసేపట్లో తమ నివేదికను సమర్పించనుంది. ఇంటర్మీడియట్ ఫలితాల వైఫల్యాలపై పూర్తి స్థాయిలో పరిశీలించిన కమిటీ సుదీర్ఘ నివేదికను రూపొందిచినట్టుగా తెలుస్తోంది. -
బీజేపీది జనబలం
సాక్షి, దారూరు: దేశ ద్రోహులు, బడా బాబుల వద్ద పేరుకుపోయిన నల్లధనాన్ని నిర్మూలించేందుకే ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం ధారూరు మండల కేంద్రంలో రోడ్‌షోను నిర్వహించారు. ధారూరు బస్టాండు వద్ద హైదరాబాద్–వికారాబాద్ ప్రధాన రోడ్డుపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి ఒక్కరే ప్రధానమంత్రి ఉంటారని, ప్రతిపక్షాలు మాత్రం జమ్ముకాశ్మీర్‌లో మరో ప్రధానమంత్రి ఉండాలని కోరుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు దేశాన్ని విచ్ఛినం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. మోదీకి కుటుంబం లేకున్నా దేశ ప్రజలే తన కుటంబంగా భావించి వారి అభ్యున్నతి కోసం కంకణం కట్టుకున్నారని అన్నారు. మహిళలలు కట్టెల పొయ్యిలతో తీవ్ర ఇబ్బందులుపడుతుంటే వారికి పీఎం యోజన కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశారని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఇంటికో మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు అందజేశారని చెప్పారు. కేసీఆర్ కిట్‌కు రూ. 13 వేలు అయితే అందులో రూ. 6 వేలు కేంద్ర సర్కారు అందిస్తోందని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ఒక్కో వ్యక్తికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తామంటే భయంతో సీఎం కేసీఆర్ దానిని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేసి అనంతగిరిని టూరిజం హబ్‌గా మారుస్తామని అన్నారు. ఎంఎంటీఎస్ రైలును జిల్లాకేంద్రానికి రప్పించేందుకు తాను బాధ్యతను తీసుకుంటానని పేర్కొన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ధనబలం ఉంటే బీజేపీ మాత్రం జనబలం ఉందని ఆయన గుర్తు చేశారు. స్థానికుడైన తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. తనయుల కోసమే తాపత్రయం సీఎం కేసీఆర్ తనయుడిని సీఎం చేయాలని ఉవ్విళ్లూరుతుంటే, సోనియమ్మ రాహుల్‌గాంధీని పీఎం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వివేకానందరెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఎం. రమేశ్, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు రాజేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు జగన్‌గౌడ్, నాయకులు కృష్ణ, నవీన్, సాయి, ప్రకాశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్ళీ మోదీనే ప్రధాని అవుతారు: జనార్ధన్ రెడ్డి
సాక్షి, రంగారెడ్డి: భారతీయ జనతా పార్టీ తనపై నమ్మకంతోనే చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించిందని బీజేపీ నేత జనార్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాకు అనేక అవకాశాలు కల్పించిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్థి కోసం పాటు పడుతున్నారు. అదే రీతిలో నేను కూడా చేవెళ్ల అభివృద్థి కోసం పని చేస్తాని అన్నారు. చేవెళ్ల ప్రజలు తమ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు. కానీ ఇవన్నీ పోవాలంటే బీజేపీ గెలవాలని ప్రజలకు కోరారు. నాకు చేవెళ్ల అన్న, చేవెళ్ల ప్రజలన్నా చాలా ఇష్టమని చెప్పారు. దేశంలో విద్యార్థులకు, పేదల కోసం మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్లలో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. -
ఎల్పీ, పీఈటీలకు ఎస్ఏ హోదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రేడ్ 2 భాషా పండితులు(ఎల్పీ), పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. తెలుగు భాషా పండితుల పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తామని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని పూర్తి చేశారు. తెలంగాణలో ఇకపై గ్రేడ్–2 పండిట్ పోస్టులు ఉండవు. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 6,024 మంది భాషా పండితులకు, 793 మంది గ్రేడ్ 2 భాషా పండితులకు మేలు జరుగుతుంది. ఎమ్మెల్సీల కృతజ్ఞతలు.. తెలుగు పండిట్లు, పీఈటీలను స్కూలు అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి ప్రగతిభవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హామీ నిలబెట్టుకున్న కేసీఆర్.. గ్రేడ్–2 భాషా పండిట్లను గ్రేడ్–1 పండిట్లుగా అప్‌గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వివిధ ఉపాధ్యాయ సంఘా లు పేర్కొన్నాయి. పండిట్లు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం, సంబంధిత ఫైలుపై సంతకం చేయ డం పట్ల ధన్యవాదాలు తెలిపాయి. కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలోని పండిట్లు, పీఈటీలకు మేలు జరుగుతుందని పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, చావ రవి, టీపీఆర్టీయూ అధ్యక్షుడు అంజిరెడ్డి పేర్కొన్నారు. -
హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి బదిలీ
సాక్షి,హైదరాబాద్: హెచ్ఎండీఏ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డిని సాధారణ పరిపాలన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త అధికారిని నియమించేంత వరకు పూర్తి అదనపు బాధ్యతలను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు అప్పగించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న జనార్దన్‌రెడ్డిని ఎన్నికల నిబంధనల్లో భాగంగా గతేడాది ఆగస్టు 23న హెచ్ఎండీఏ కమిషనర్‌గా బదిలీ చేశారు. కార్యనిర్వహణాదక్షుడిగా పేరొందిన ఆయన్ను నీటిపారుదల శాఖలో కీలకమైన పోస్టులో నియమించే అవకాశముందని సమాచారం. జనవరి 14 నుంచి అమెరికా పర్యటనలో ఉన్న జనార్దన్‌రెడ్డి సోమవారం నగరానికి చేరుకున్నారు. సీఐడీ ఎస్పీ రామ్మోహన్ ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ తెలంగాణ సీఐడీలో సైబర్ క్రైమ్ ఎస్పీగా పనిచేస్తున్న రామ్మోహన్ సోమ వారం ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ ఆయ్యారు. పోలీస్ శాఖ విభజనలో భాగంగా రామ్మోహన్ ఏపీకి ఆప్షన్ ఇచ్చారు. ఇటీవలే విభజన అధికారికంగా పూర్తికావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన అయేషా మీరా హత్య కేసులో అప్పుడు ఫోరెన్సిక్ రిపోర్టు ఇచ్చింది రామ్మోహన్ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయేషా మీరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఆ కేసులో కీలకంగా పనిచేసిన అధికారులను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. -
కమిషనర్ జనార్ధన్‌రెడ్డిపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్ : హెచ్ఎండీఏ కమిషనర్ బి. జనార్ధన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. సోమవారం ఉదయం జనార్ధన్‌రెడ్డిని హెచ్ఎండీఏ కమిషనర్ బాధ్యతలనుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోస్టింగ్ ఇవ్వకుండా ప్రస్తుతానికి వెయిటింగ్లో పెట్టింది ప్రభుత్వం. హెచ్ఎండీఏ కమిషనర్‌గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. విదేశీ పర్యటనలో ఉండగానే జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది. -
కాటసాని అరెస్ట్.. బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత
-
బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత.. కాటసాని అరెస్ట్
సాక్షి, కర్నూల్ : జిల్లాలోని బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి బనగానపల్లెలో ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. రెండు రోజుల కిందట వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే సోదరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలపై దాడి అనంతరం నేడు ఎమ్మెల్యే బీసీ జానార్థన్ రెడ్డి, కాటసాని నివాస కాలనీలో పర్యటన నిర్వహించేందుకు బీసీ వర్గీయులు ఏర్పాట్లు చేస్తోన్నారు. ఈ క్రమంలో డోన్ డీఎస్పీ ఖాదిర్ భాషా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకా ముందు జాగ్రత్తగా చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో తొలిసారి పట్టణంలోకి టియర్ గ్యాస్ వాహనాన్ని కూడా రప్పించారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక పట్టణ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దాడికి దిగిన టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సోదరులపై కాటసాని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార టీడీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసినా.. వారిని అరెస్ట్ చేయని పోలీసులు.. తమ నేతను మాత్రం అరెస్ట్ చేయడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
ఎమ్మెల్యే బీసీ సోదరుల దౌర్జన్యం
కర్నూలు /బనగానపల్లె: ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి సోదరులు బీసీ రామ్‌నాథ్‌రెడ్డి, బీసీ రాజారెడ్డి దౌర్జన్యానికి దిగారు. వారి అనుచరుడు శంకర్‌తో పాటు పలువురితో కలిసి వైఎస్సార్సీపీ ప్రచార రథం డ్రైవర్ గోరే బాషాపై దాడి చేశారు. ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బనగానపల్లెలో శనివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సంబంధించిన ప్రచార రథం ఎమ్మెల్యే బీసీ ఇంటికి సమీపంలోని పాతబస్టాండ్ మీదుగా వెళ్తుండగా ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి ఆయన సోదరులు, అనుచరులు వచ్చి తనపై దాడి చేసినట్లు డ్రైవర్ గోరే బాషా తెలిపారు. ఈ సమయంలో కాటసాని రామిరెడ్డి ఇక్కడికి సమీపంలోని 101వ బూత్‌లో ఇంటింటా నవరత్నాల గురించి వివరిస్తున్నారు. దాడి విషయం తెలిసిన వెంటనే పట్టణంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాతబస్టాండ్లోనే ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే బీసీకి, ఆయన సోదరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు చేరుకుని ధర్నా విరమించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తేనే విరమిస్తామని వారు స్పష్టం చేశారు. ‘ఇక్కడికి వాహనం రాకూడదంటూ బీసీ సోదరులు నాపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. చొక్కా చింపారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? నాకు ఏమైనా అయితే ఎమ్మెల్యేదే పూర్తి బాధ్యత. ఆయన కుటుంబంతో నాకు ప్రాణహాని ఉంది’ అంటూ డ్రైవర్ గోరేబాషా ఎస్ఐ సత్యనారాయణతో వాపోయారు. దాడికి పాల్పడడం తప్పేనని, పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్ఐ సూచించారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ‘ఎమ్మెల్యే డౌన్‌డౌన్’ అంటూ ర్యాలీగా పోలీసుస్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్నారు. కాటసాని ఆధ్వర్యంలో రాస్తారోకో తమ వాహన డ్రైవర్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కార్యక్రమా న్ని మధ్యలోనే ముగించి హుటాహుటిన పెట్రోల్ బంకు సర్కిల్‌కు వచ్చారు. అక్కడే కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేశారు. తరువాత పోలీసుస్టేషన్ లోపలకు వెళ్లి ఎస్ఐతో మాట్లాడారు. పట్టణంలో వారం రోజుల నుంచి రావాలి జగన్ –కావాలి జగన్ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఓర్వలేకనే ఎమ్మెల్యే బీసీ సోదరులు ప్రచారరథం డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే బీసీ సోదరులు బీసీ రామ్‌నాథ్‌రెడ్డి, బీసీ రాజారెడ్డితో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారు. సీఐ లేదా డీఎస్పీ వచ్చి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే తప్ప తాను ఇక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అనంతరం సీఐ సురేష్‌కుమార్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. వాహనంలో ఎదురుగా వచ్చిన ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి తమ పార్టీ కార్యకర్తలు జరిగిన ఘటన గురించి వివరించేందుకు యత్నించగా.. ఆయన వినకుండా గన్‌తో కాల్చివేస్తామంటూ బెదిరించారని తెలిపారు. ఈ విషయాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఉద్రిక్త వాతావరణం ఒక దశలో సీఐ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే బీసీ వాహనంలో ఎదురు రాగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించి వేశారు. బీసీ సోదరులపై కఠిన చర్యలు తీసుకోవాలి డ్రైవర్ గోరేబాషాపై ఎమ్మెల్యే బీసీ సోదరులు వారి అనుచరులతో కలిసి కర్రలతో దాడి చేసి గాయపర్చడం హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంది. రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులకు దిగుతున్నారు. ఎమ్మెల్యే బీసీ సోదరులు, వారి అనుచరులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యాన్నీ చూపరాదు. – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే అభివృద్ధి
హైదరాబాద్: సమాజంలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎండీఏ కమిషనర్ జనార్ధన్ రెడ్డి కోరారు. శిల్పకళా వేదికలో సోమవారం వ్యర్థ పదార్థాల నిర్వహణ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. పరిశుభ్రత మన ఇంటి వంటగది నుంచే ప్రారంభం కావాలన్నారు. పరిశుభ్రతతో పాటు కాలుష్యాన్ని అరికట్టాలని, ప్లాస్టిక్‌ను కూడా నిరోధించాలని కోరారు. విద్యార్థులలో ఈ అంశాలపై అవగాహన పెరగాలన్నారు. చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తడి పొడి చెత్తను గుర్తించి వేరు చేయాలని, రెండేళ్ల కిందటే ఈ సంస్కరణలను జీహెచ్ఎంసీలో ప్రారంభించామని తెలిపారు. వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు. నగర వాసుల్లో కూడా చైతన్యం పెరిగిందని వ్యాఖ్యానించారు. చెత్త ఎక్కువగా ఉత్పత్తి చేసే హోటళ్లు, పంక్షన్ హాల్ నిర్వాహకులు చెత్త డీకంపోజ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా దానకిశోర్
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీగా పనిచేస్తున్న ఎం.దానకిశోర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేస్తున్న బి.జనార్ధన్‌రెడ్డిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్‌గా నియమించారు. హెచ్ఎండీఏ కమిషనర్‌గా పని చేస్తున్న టి.చిరంజీవులును రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ కమిషనర్‌గా బదిలీ చేశారు. దానకిశోర్‌కు అదనంగా ప్రస్తుతం పనిచేస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ బాధ్యతలతో పాటు మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించారు. -
స్వచ్ఛ ర్యాంకింగ్‌లో గ్రేటర్‌కు 27వ స్థానం
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో హైదరాబాద్ 27వ ర్యాంక్‌లో నిలిచింది. లక్ష జనాభాపైబడిన నగరాల్లో గ్రేటర్‌కు ఈ ర్యాంకు ప్రకటించారు. గతేడాది జనాభాతో సంబంధం లేకుండా 434 నగరాల్లో హైదరాబాద్ 22వ స్థానంలో నిలవగా, ఈసారి లక్ష జనాభా మించిన 500 నగరాలతో పోటీపడి 27వ స్థానంలో నిలిచింది. గతం కంటే ఈసారి మరింత ఉన్నత ర్యాంక్‌ను సాధించేందుకు ఎంతో కృషి చేసి, దేశంలోనే ఘనవ్యర్థాల నిర్వహణలో ఉత్తమ రాజధానిగా అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్.. స్వచ్ఛ ర్యాంకింగ్ల్లో మాత్రం పడిపోయింది. అయితే ఇతర మెట్రో నగరాలైన బెంగళూరు, కోల్కత్తా, చెన్నై కంటే ముందంజలోనే ఉండడం గమనార్హం. గత సంవత్సరం 29వ స్థానంలో నిలిచిన గ్రేటర్ ముంబై ఈసారి 18వ స్థానంలో నిలిచి, హైదరాబాద్ కంటే ముందుంది. తెలంగాణలోని ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీల కంటే జీహెచ్ఎంసీ ముందంజలో నిలిచింది. గతంలో చిన్న పట్టణాలు, పెద్ద నగరాలు అన్నింటికీ కలిపి స్వచ్ఛ ర్యాంకులు ప్రకటించగా, ఈసారి లక్ష జనాభా మించిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ప్రకటించింది. స్వచ్ఛ కార్యక్రమాల అమలులో జీహెచ్ఎంసీ ముందున్నా.. ప్రజల ఫీడ్‌బ్యాక్‌లో మార్కులు తగ్గినందున ఓవరాల్ ర్యాంక్ తగ్గింది. దీంతో ఈ సంవత్సరం ప్రజలను మరింత ఎక్కువగా భాగస్వాములను చేసేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రజాస్పందన తగ్గినందునే.. ప్రస్తుత 2018 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొత్తం మూడు విభాగాలకు కలిపి 4,000 మార్కులకు నిర్వహించిన సర్వేలో జీహెచ్ఎంసీకి 3,083 మార్కులు వచ్చాయి. వీటిలో సేవల ప్రగతికి 1400 మార్కులకు 973 లభించగా, స్వచ్ఛతకు నగరవాసుల స్పందనకు కేటాయించిన 1400 మార్కుల్లో 942 మాత్రమే వచ్చాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు స్వచ్ఛ కార్యక్రమాలపై నేరుగా జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో 1200 మార్కులకు 1177 వచ్చాయి. 2016లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి 2000 మార్కుల్లో 1355 (67.70శాతం), 2017లో 1605 (80శాతం) మార్కులు, ప్రస్తుత 2018లో 4000 మార్కులకు 3,083 మార్కులు (77శాతం) లభించాయి. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్ల ర్యాంకులు.. గ్రేటర్ హైదరాబాద్‌కు 27వ స్థానం అనంతరం వరంగల్ కార్పొరేషన్‌కు 31వ స్థానం, సూర్యాపేట మున్సిపాలిటీ 45వ స్థానం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 73 స్థానంలోను నిలిచాయి. ఇప్పటి దాకా జరిగిన స్వచ్ఛ ర్యాంకింగ్‌లో పాల్గొన్న పట్టణాలు, గ్రేటర్ ర్యాంకు ఇలా.. సంవత్సరం పట్టణాలు జీహెచ్ఎంసీ 2015 476 275 2016 73 19 2017 434 22 2018 500 27 ఈసారి మొత్తం 4041 నగరాలో స్వచ్ఛ ర్యాంకింగ్‌లో పాల్గొనగా, లక్ష జనాభా దాటిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ఇచ్చారు. దేశంలోని వివిధ కార్పొరేషన్ల ర్యాంకుల తీరిదీ.. నగరం 2017 2018 హైదరాబాద్ 22 27 గ్రేటర్ ముంబై 29 18 బెంగళూర్ 210 216 చెన్నై 235 100 ప్రజల భాగస్వామ్యం పెంచుతాం స్వచ్ఛ కార్యక్రమాల అమల్లో మంచి మార్కులే వచ్చినప్పటికీ, కేవలం ప్రజా స్పందన మార్కులే తగ్గాయి. ఈ అనుభవంతో ఈ ఏడాది వారి భాగస్వామ్యం పెంచుతాం. గతేడాది ఐదు లక్షల మంది విద్యార్థులతో చైతన్య కార్యక్రమాలు నిర్వహించగా, ఈసారి పది లక్షల మందికి అవగాహన కల్పిస్తాం. అలాగే నగరంలోని నాలుగున్నర లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా భాగస్వాములను చేస్తాం. ఈ సంవత్సరం స్వచ్ఛ కార్యక్రమాలను జూన్ 5న పర్యావరణ దినోత్సవంనాడే ప్రారంభించాం. ఇందులో భాగంగా కాలనీలతో పాటు పాఠశాలలు, కార్యాలయాలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లకు కూడా స్వచ్ఛ ర్యాంకింగ్ ఇవ్వాలని నిర్ణయించాం. – డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
అఖిలప్రియపై చంద్రబాబుకు ఫిర్యాదు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినేట్ మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్ధన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని జనార్ధన్ వచ్చారు. తన బాధను ఎమ్మెల్యే సీఎంకు వివరించినట్లు తెలిసింది. -
అండాలమ్మా.. బాగున్నావా
సాక్షి, హైదరాబాద్: అది సచివాలయం సమీపంలోని అన్మోల్ హోటల్. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికురాలి వద్ద సడన్‌గా ఇన్నోవా కారు ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు అధికారులు ఆమె పేరు, వివరాలు తెలుసుకున్నారు. నెలనెలా జీతం అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. ఆమెకు జీవిత భీమా సదుపాయం ఉందో లేదో తెలుసుకున్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నదీ లేనిదీ అడిగారు. తన పేరు అండాలమ్మ అని, ప్రతినెలా వేతనం సక్రమంగా అందుతోందని తెలిపిన ఆమె, ప్రతిరోజూ బయెమెట్రిక్ హాజరు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇంతకీ తామెవరో తెలుసా? అంటే తెలియదని సమాధానం ఇచ్చింది. తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌నని, ఈమె ఆరోగ్యవిభాగం అదనపు కమిషనర్ శృతిఓజా అని బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. దాంతో ఆమెకు నోట మాటరాలేదు. ఆశ్యర్యం వ్యక్తం చేసింది. కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్థాయిలోని ఉన్నతాధికారులు తనతో మాట్లాడటం ఇదే మొదటిసారి అని, తన యోగక్షేమాలు తెలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేసింది. -
ఆన్లైన్లో జీహెచ్ఎంసీ కోర్టు కేసులు
సాక్షి, హైదరాబాద్: కోర్టుల్లో కేసుల స్థితిగతులు ఆన్లైన్లో తెలుసుకునేలా లీగల్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టుకు జీహెచ్ఎంసీ తెలియజేసింది. జీహెచ్ఎంసీ కేసుల పరిస్థితులను ఎవరైనా ఆన్లైన్లో చూసుకోవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ జనా ర్దన్‌రెడ్డి తెలిపారు. ఈ వివరాల్ని రికార్డుల్లో నమోదు చేస్తున్నట్లు సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచందర్ రావు ప్రకటించారు. సికింద్రాబాద్ శివాజీ నగ ర్లో అనుమతి లేకుండా భవన నిర్మాణం చేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లే దని పేర్కొంటూ ఎన్.రాజనర్సింహశర్మ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. ఇలాంటి అంశాలపై కింది కోర్టుల్లోని కేసుల్లో అక్రమ కట్టడాలకు పాల్పడేవారికి అనుకూలం గా ఉత్తర్వులు వెలువడకుండా జీహెచ్ఎంసీ న్యాయ విభాగం యత్నిస్తోందో లేదో తెలపా లని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఈ వివ రాలు ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి ఆదే శాల మేరకు సోమవారం కమిషనర్ హైకోర్టుకు హాజరయ్యారు. అక్రమ కట్టడాలపై కనీసం నెలకోసారి సమీక్ష చేయాలని సూచించారు. ఈ తరహా నిర్మాణాలపై సివిల్ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల రద్దుకు చేస్తున్న ప్రయత్నాలను తెలియజేస్తూ కౌంటర్ వ్యాజ్యం దాఖలు చేయా లని జీహెచ్ఎంసీని ఆదేశించారు. -
30 లోపు ఆస్తిపన్ను చెల్లించకుంటే జరిమానా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ఆస్తి పన్ను బకాయిదారులు డిసెంబర్ 31లోపు చెల్లించాలని, లేకుంటే జనవరి 1వ తేదీ నుంచి జరిమానాలు విధాస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డా. బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈపాటికే ఆస్తి పన్నును చెల్లించాలని వ్యక్తిగతంగా ఎస్సెమ్మెస్‌లను పంపామన్నారు. గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పన్ను, ట్రేడ్ లైసెన్స్‌ల వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు వసూలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్తి, ట్రేడ్ లైసెన్స్ పన్నులను వసూలు చేయడంలో వెనుకబడ్డ సర్కిళ్లకు తాఖీదులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్ లైసెన్స్ కింద రూ.50 కోట్లు సేకరించాలని నిర్ణయించగా ఇప్పటికి రూ.72 కోట్లు వచ్చాయన్నారు. ఆస్తి పన్ను సేకరణలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.1206 కోట్లు వసూలు కాగా ప్రస్తుత 2017–18కి రూ.1,400 కోట్లు సేకరించాలని లక్ష్యంగా నిర్థారించామన్నారు. -
మరో వారం ఇబ్బందులు భరించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలు, రోడ్ల పరిస్థితిపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి స్పందించారు. వర్షాలు తగ్గిన తరువాతనే రోడ్లు బాగు చేస్తామన్నారు. ఈ నెల 15 వరకూ భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపారు. ఆయనిక్కడ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి రోడ్డునూ రీ కార్పెటింగ్ చేస్తామని వెల్లడించారు. 200 కి. మీ మేర రోడ్ కార్పోరేషన్ ద్వారా సిమెంట్ రోడ్లను వేయాలని నిర్ణయించామన్నారు. మరో వారం రోజుల పాటు ఇబ్బందిని సిటీ వాసులు భరించాలని చెప్పారు. రామంతాపూర్ లో నీళ్లను పంపింగ్ చేయడానికి రెండు రోజులు పడుతుందని తెలిపారు. -
17వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
వయొలెట్ స్కెచ్ పెన్‌తోనే మార్క్ చేయాలి: జిల్లా ఎన్నికల అధికారి సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న జరుగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు 17 సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారి అద్వైత్కు మార్సింగ్తో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచార కార్యక్రమాలు ముగించాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ సోమవా రం రాత్రి వరకు పూర్తి అవుతుందన్నా రు. ఓటర్లు బ్యాలెట్ పేపర్‌పై తమ ప్రాధాన్యత ఓటును పోలింగ్ కేంద్రం లోని ప్రిసైడింగ్ అధికారి అందజేసే వయొలెట్ స్కెచ్ పెన్‌తోనే మార్క్ చేయాలన్నారు. 17 సాయంత్రం 6 గంటల నుంచి 19 సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపును చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం
• టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిద్దాం: మంత్రి హరీశ్‌రావు • పీఆర్టీయూ అభ్యర్థిగా జనార్దన్‌రెడ్డి నామినేషన్ సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్ఎస్ మద్దతిస్తున్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి గెలుపు ఖాయం. ఆయన్ను మంచి మెజారిటీతో గెలిపిద్దాం. గతంలో గెలిచిన స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డిల మెజారిటీని బద్దలు కొట్టాలి. అయితే అతి విశ్వాసం వద్దు. ఆత్మవిశ్వాసంతో ముందు కెళ్దాం’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, మొదటి ప్రాధాన్య ఓటుతోనే జనార్దన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చా రు. శాసనమండలి ఉపాధ్యాయ నియోజ కవర్గానికి (మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్) జరగనున్న ఎన్నికలో టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న పీఆర్టీయూ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి నామినేషన్ దాఖలు సంద ర్భంగా శనివారం పలువు రు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు, మంత్రులు, ఉపాధ్యా యులు ఇక్కడ ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సమా వేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని మూడు జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు. శనివారమే మేడ్చెల్ సమావేశం పూర్తికాగా ఆదివారం వికారాబాద్, సోమవారం వనప ర్తిలలో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం, టీచర్లకు మధ్య వారధిగా.. దశబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని, ఉపాధ్యాయ, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోం దని ఎమ్మెల్సీ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తెలిపారు. తనను గెలిపిస్తే ప్రభుత్వం, ఉపా ధ్యాయులకు మధ్య వారధిలా పని చేస్తానన్నారు. సమావేశంలో 30 ఉపాధ్యాయ సంఘాలు జనార్దన్‌రెడ్డికి మద్దతు ప్రకటించా యి. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయం లో నామినేషన్ దాఖలు చేశారు. సమావేశం లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తలసాని, మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మండలి చీఫ్‌విప్ సుధాకర్‌రెడ్డి, విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఐదు నామినేషన్లు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ శాసనమండలి ఉపాధ్యాయ స్థానానికి శనివారం ఐదు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్‌సింగ్ తెలిపారు. నామినేషన్లు వేసినవారిలో ఇ.లక్ష్మయ్య, నర్సింగ్‌రావు, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, మీసాల సాయిబాబా, అరకల కృష్ణగౌడ్ ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. -
పాత నోట్లతో 24 వరకు పన్నులు..
సాక్షి, హైదరాబాద్: పాత నోట్లతో ఈ నెల 24వ తేదీ వరకు ప్రస్తుత సంవత్సర ఆస్తిపన్ను, గత బకాయిలు, ట్రేడ్‌లైసెన్స్ లను చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని నగరవాసులు వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు జీహెచ్ఎంసీ పౌరసేవా కేంద్రాలు ఉదయం 10:30గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని, వీటితో పాటు అన్ని మీ–సేవా, ఈ–సేవా కేంద్రాల్లో పన్నులు చెల్లించవచ్చునని తెలిపారు. అయితే ఎల్ఆర్ఎస్ ఫీజులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌లను మాత్రం జీహెచ్ఎంసీ పౌర సేవా కేంద్రాల్లో మాత్రమే జమచేయాలని తెలిపారు. -
నేడు మాంసం దుకాణాలు బంద్
సాక్షి,సిటీబ్యూరో: గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మాంసం విక్రయాలకు పాల్పడే దుకాణాలు, వ్యక్తులపైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. -
ఈ–లెర్నింగ్‌లో జీహెచ్ఎంసీ టాప్
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ భారత్ ఆశయాలపై కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ–లెర్నింగ్ పోర్టల్‌ను జీహెచ్ఎంసీకి చెందిన అధికారులు, సిబ్బంది ఇతర నగరాలకంటే అత్యధికంగా వినియోగించుకుని టాప్‌లో నిలిచినట్టు జీహెచ్ఎంసీ ఓ ప్రకట నలో తెలిపింది. స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్యాలు, పారిశుధ్యం తదితర కార్యక్రమాలకు సంబంధించి మున్సిపల్ అధికారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేం దుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. జీహెచ్ఎంసీకి చెందిన 4,323 మంది ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ లెర్నింగ్ శిక్షణ పొం దారు. వీరిలో 2,889 మంది విజయవంతంగా కోర్సును పూర్తిచేయడంతో సర్టిఫికెట్లు కూడా అందుకున్నట్టు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో ఎక్కువ మందితో కోర్సును పూర్తిచేయించిన వారిలో ఏఎంఓహెచ్ డాక్టర్ మైత్రేయి, వర్క్ ఇన్స్పెక్టర్ గజేందర్‌బాబు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్టు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ హైదరాబాద్‌సిటీ సపోర్టింగ్ యూనిట్ విశేషంగా కృషి చేస్తుండటంపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
రేపే గణేష్ నిమజ్జనం.. భారీ ఏర్పాట్లు!
-
రేపే గణేష్ నిమజ్జనం.. భారీ ఏర్పాట్లు!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతిని ఈసారి ముందుగానే నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు భక్తులకు దర్శనం కోసం అనుమతినిస్తారు. గురువారం 12గంటల లోపు ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేస్తారు. గతానికి భిన్నంగా ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడిని ముందుగానే నిమజ్జనం చేయనున్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్‌లో 10 క్రేన్లు, అప్పర్ ట్యాంకు బండ్‌పై 24 క్రేన్లను ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం నగరంలో 12వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనం రూట్లో 2వేలు, సాగర్ చుట్టూ 44 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనానికి 5వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. బంజారాహిల్స్, ఫిలింనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ఆయన పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వినాయక నిమజ్జన ప్రాంతాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. 14వ మైలు వద్ద ఉన్న ఎడమ కాల్వ వద్ద వినాయక నిమజ్జన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. నల్గొండ నుంచి 2500 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం కోసం వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో నిమజ్జనానికి హాజరయ్యారు. మరోవైపు హైదరాబాద్ బాలాపూర్ వినాయక నిమజ్జనానికి ఉత్సవకమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం అనంతరం స్వామివారిని నిమజ్జనానికి తరలిస్తారు. ఈసారి ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం అనంతరం బాలాపూర్ వినాయక శోభాయాత్ర ప్రారంభంకానుంది. -
గని ప్రమాదంలో కార్మికుని మృతి
ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్లోని ఆర్కే 5గనిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో సపోర్టుమన్ బద్రి జనార్దన్(53) మృతిచెందాడు. మరో సపోర్టుమన్ మచ్చకుర్తి రాయమల్లు గాయపడ్డాడు. వీరు శనివారం రాత్రి షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యారు. గని భూగర్భంలోని 4వ సీం, 12 లెవల్, 11 డిప్ వద్ద విత్‌డ్రాయింగ్ పనులు నడుస్తున్నాయి. వీరితోపాటు అక్కడ మరో నలుగురు సపోర్టుమన్లు, ఇద్దరు లైన్మన్లు పని చేస్తున్నారు. దిమ్మెకట్టె పనిలో ఉండగా ఒక్కసారిగా పైకప్పు బండ కూలింది. శబ్దం విని ఆరుగురు క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకోగా.. జనార్దన్ బండ కింద పడి అక్కడిక్కడే మృతిచెందాడు. రాయమల్లు దిమ్మెకు పక్కనే ఉండడంతో శిథిలాల కింద చిక్కుకున్నాడు. సర్ధార్ కుమారస్వామి సమాచారం మేరకు రెస్క్యూ సిబ్బంది మూడు గంటలు శ్రమించి జనార్దన్ మృతదేహం, రాయమల్లును బయటకు తీశారు. రాయమల్లు కుడికాలుకు గాయం కావడంతో రామకృష్ణాపూర్‌లోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
పండగలకు కట్టుదిట్టమైన భద్రత..
సాక్షి,సిటీబ్యూరో: బక్రీద్, వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాల ఉన్నతాధికారులు నిర్ణయించారు. వినాయక శోభాయాత్రకు ఆటంకాల్లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వచ్చే నెలలో గణేశ్ ఉత్సవాలు, బక్రీద్ పండుగలు జరుగునున్న నేపథ్యం బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, రెండు పండుగలు ఒకేసారి వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు.సంబంధిత అధికారులతో సర్కిళ్ల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యలపై సత్వరమే స్పందించేందుకు వీలుగా ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. వినాయక మండపాల వద్ద పారిశుధ్య నిర్వహణకు వాలంటీర్లను ఏర్పాటు చేస్తామన్నారు. బక్రీద్ రోజున రోడ్లపై వ్యర్థాలను సేకరించేందుకు పెద్దసైజు ప్లాస్టిక్ బ్యాగులను వినియోగిస్తామన్నారు. -
ప్రభుత్వ భూములు అప్పగించాలి
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు జిల్లాలో అందుబాటులో ఉన్న సర్కారు భూమిని గుర్తించి జీహెచ్ఎంసీకి అప్పగిస్తే వెంటనే నిర్మాణాలు చేపడుతామని కమిషనర్ డాక్టరు జనార్దన్‌రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జేసీ భారతిహోళి కేరి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సురేంద్రమోహన్‌లతో కలిసి ఆర్డీఓలు, తహశీల్దార్లు ,అధికారులతో ప్రభుత్వ భూముల స్వాధీనంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జంట నగరాల్లో దాదాపు 1400 మురికి వాడలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వివాదాలు లేని భూములను స్వాధీనం చేస్తే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జేసీ భారతి హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో 10 ప్రాంతాల్లో 41 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, ఇందులో 5 ఎకరాలను ఇప్పటికే జీహెచ్ఎంసీకి స్వాధీనం చేసినట్లు తెలిపారు. ఇతర శాఖల అధీనంలో ఉన్న డిఫెన్స్ భూములపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపాదనలు పంపేముందు తహశీల్దార్లు కోర్టు కేసులు, వివాదాలను పరిశీలించాలని ఆదేశించారు.అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై రెండు రోజుల్లో నివేదిక అందజేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి ఏజేసీ అశోక్‌కుమార్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హౌజింగ్ అధికారులు పాల్గొన్నారు. -
సింధుకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు
సాక్షి,సిటీబ్యూరో: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు 22వ తేదీన నగరానికి రానుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి, జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజత్ కుమార్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజేంద్ర నగర్, అత్తాపూర్, మెహిదిపట్నం, టౌలిచౌకి మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు ఉన్న మార్గాన్ని పరిశీలించారు. సింధు వచ్చే ఈ మార్గాల్లో ఎక్కడెక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి అలంకరణలు చేపట్టాలనే ప్రాంతాలను ఎంపిక చేశారు. చేపట్టాల్సిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం స్వాగత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన అనంతరం పి.వి. సింధు పై మార్గంలో గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీగా చేరుకుంటుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మార్గం ప్రధాన కూడళ్ల వద్ద పాఠశాలల విద్యార్థులు, నగర పౌరులు సింధుకు పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలుకుతారని కమిషనర్ తెలిపారు. అనంతరం గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున నగర పౌరులు, క్రీడాకారుల సమక్షంలో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ఈ స్టేడియంలో జరిగే సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను జోనల్ కమిషనర్ గంగాధర్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ సమీక్షించారు. కాగా, సింధు ప్రయాణించే శంషాబాద్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు పెద్ద ఎత్తున స్వాగత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. -
రసాయన విగ్రహాలు హానికరం:జనార్ధన్ రెడ్డి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మానవాళికి హాని కల్గించే వినాయక విగ్రహాన్ని తయారుచేసి పూజించటం సరికాదని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్థన్‌రెడ్డి అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రసాయన వినాయకుడు వద్దు – మట్టి వినాయకుడే ముద్దు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ.. ఏ పండగనైనా పర్యావరణానికి అనుకూలంగా నిర్వహించుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ కనబరచాలని, బాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఆత్మ విశ్వాసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సభకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీగేటు నుంచి సుందరయ్య పార్కు వరకు మట్టి విగ్రహాల ప్రయోజనాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ కళాశాల విద్యార్థులు కమిషనర్‌కు మట్టి విగ్రహాలను బహూకరించారు. జేవీవీ నగర అధ్యక్షులు నాగేశ్వర్రావ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, జేవీవీ జాతీయ కార్యదర్శి టి. రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక కోరుకున్న మొక్కలు మన చెంతకు
సాక్షి,సిటీబ్యూరో: వచ్చే సంవత్సరం వర్షాకాల సీజన్లో హరిత హారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రజలు తమకు ఏ మొక్కలు కావాలో తెలియజేస్తే వాటినే అందజేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 85 లక్షల మొక్కలకు పైగా నాటినట్లు పేర్కొన్నారు. చాలామంది తాము కోరుకునే మొక్కలు లభించడం లేవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో తమకెలాంటి మొక్కలు కావాలో green hyderabad.cgg.gov.in వెబ్సైట్లో పేర్కొంటే వాటినే అందజేయగలమని పేర్కొన్నారు. ఫలాల మొక్కలు, సామాజిక వనాలు, ఇళ్లలో పెంచుకునే మొక్కలు ఏవైనా ఆ వివరాలను పేర్కొంటూ తమ చిరునామా, ఫోన్‌నెంబర్, ఈమెయిల్ లను వెబ్సైట్లో పొందుపరచాలని కోరారు. -
శిథిలావస్థ భవనాల కూల్చివేత
హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో.. పాత భవనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు శిథిలావస్థకు వచ్చిన పాత భవనాలపై దృష్టి సారించారు. సికింద్రాబాద్ పరిధిలో ఈ రోజు పర్యటించిన జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్థన్‌రెడ్డి శిథిలావస్థకు చేరిన పలు భవనాలను గుర్తించి కూల్చివేయాలని సిబ్బందికి సూచించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పురాతన బిల్డింగులు కూల్చి వేస్తున్నారు. -
జరిమానాలు వేసేందుకు ప్రత్యేక అధికారులు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారు, బహిరంగ మూత్ర విసర్జన చేసే వారిపై జరిమానాలు విధించేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ జరిమానాల వసూళ్లలో పారదర్శకత కోసం ఈ–చలాన్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. గురువారం జీహెచ్ఎంసీ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నుంచి చెత్త తరలించే వారికి అందజేసిన 1830 ఆటోట్రాలీలకు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు. అవసరాలకు అనుగుణంగా కొత్త ఆటోలకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాలు, ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిర్వాహకులే తరలించాలి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లనుంచి వెలువడే వ్యర్థాలను నిర్వాహకులే తరలించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని యాజమాన్యాలకు స్పష్టంగా తెలియజేయాల్సిందిగా డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లలో ఆహార పదార్థాల వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సేంద్రియ ఎరువుల పిట్లను ఎవరికి వారుగా ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఏఎంఓహెచ్‌లకు సూచించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఇక మొబైల్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్స్..
హైదరాబాద్: త్వరలోనే ఇంటిగ్రేటేడ్ మొబైల్ యాప్ ప్రవేశపెడుతున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ యాప్‌తో ఇక మొబైల్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్స్ పొందవచ్చునని ఆయన తెలిపారు. మంగళవారం కమిషనర్ జనార్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదులను మొబైల్ యాప్ ద్వారా స్వీకరిస్తామన్నారు. ఈ మొబైల్ యాప్ రెడీగానే ఉందనీ, త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అదేవిధంగా వంద రోజుల ప్రణాళికను దాదాపు అమలు చేశామని తెలిపారు. బిల్డింగ్, లే అవుట్ లకు ఆన్లైన్ అనుమతుల విధానం త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. డస్ట్ బిన్ పంపిణీ 100 శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. 1116 గార్బేజ్ సెంటర్లను పూర్తిస్థాయిలో తీసేశామన్నారు. 1817 చెత్త ఆటో ట్రాలీలను పంపిణీ చేశామని తెలిపారు. నాలాల పూడికతీత 94 శాతం పూర్తి చేశామని కమిషనర్ జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే మోడల్ మార్కెట్లు కేవలం నాలుగు మాత్రమే సిద్ధమయ్యాయని, మిగతావి 80 శాతం పూర్తి చేసినట్టు చెప్పారు. టాయిలెట్ల నిర్వహణ ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయిందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. -
'గాలివాన బీభత్సానికి 300 చెట్లు నేలకొరిగాయి'
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లో శుక్రవారం సాయంత్రం 100 కి.మీ వేగంతో గాలులు వీచాయని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ... గాలి వాన బీభత్సానికి 300 చెట్లు నేలకొరిగాయని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకున్నామన్నారు. అలాగే ట్రాఫిక్‌ను పునరుద్ధరించామని తెలిపారు. ఈ గాలివానకు ఇద్దరు చనిపోయారని... మరికొందరికి గాయాలయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. -
రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా జరిమానా
ఉప్పల్ (హైదరాబాద్) : రోడ్డుమీద ఉమ్మేస్తున్నారా జాగ్రత్త. ఇక నుండి హైదరాబాద్ నగర వ్యాప్తంగా రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా జరిమానా విధిస్తామని గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆయన మంగళవారం పర్యటించారు. గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే భాగంలో చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా నగరంలోని చాలావరకు చెత్త ఓపెన్ పాయింట్లు దాదాపు తొలగించినట్లు తెలిపారు. వంద రోజులు ముగిసేనాటికి రోడ్లపై ఎక్కడా ఓపెన్ చెత్త కనబడకుండా చేస్తామన్నారు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మేసినా మూత్ర విసర్జన చేసినా, గోడలపై రాసినా, ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు కట్టినా జరిమానా విధిస్తామని తెలిపారు. చిన్నరావులపల్లిలో ఏర్పాటు చేయనున్న.. చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రతి కార్మికుడు ఇంటింటికి వెళ్లి తడి,పొడి చెత్తపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. విద్యార్థులను సైతం ఇన్వాల్వ్ చేయనున్నట్లు తెలిపారు. తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించేందుకు, ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు పరచడం తదితర అంశాలలో వచ్చే నెల 2వ తేదీన ఎస్ఎఫ్ఏలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తమ సేవలందించిన పారిశుద్ద్య కార్మికులకు, అధికారులకు, గుర్తింపునిచ్చే విధంగా పూలదండలు వేసి సన్మానం చేస్తామని తెలిపారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్, డీసీ విజయకృష్ణ, ఈఈ నాగేందర్‌లతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఉప్పల్ కూరగాయల మార్కెట్, మండే మార్కెట్లలోని మోడల్ మార్కెట్ల భవనాన్ని పరిశీలించారు. సర్కిల్ కార్యాలయం ఆవరణలోని షటిల్ కోర్టును, ఉప్పల్ బస్ బే, సిటీజన్ సెంటర్, బిల్ కలెక్టర్లు పనిచేసే విధానం తదితర అంశాలను పరిశీలించారు. ఉద్యోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిటిజన్ సర్వీస్ సెంటర్ తనిఖీ.. ఎర్లీబర్డ్ ఆఫర్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలోని సిటిజన్ సర్వీస్ సెంటర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తనిఖీ చేశారు. ఏరియాలకు సంబంధించిన బిల్ కలెక్టర్లను ఆస్తి పన్ను చెల్లింపు అంశాలపై ఆరా తీశారు. అవసరమైతే అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. -
ప్రక్షాళనకు శ్రీకారం!
గ్రేటర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పలువురిపై బదిలీ వేటు అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ‘సాక్షి’ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రక్షాళన మొదలైంది. పెచ్చుమీరిన అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు నడుం బిగించారు. బీఆర్ఎస్ దర ఖాస్తులకు నిర్ణీత గడువు ముగిశాక కూడా అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండటం.. క్షేత్రస్థాయి సిబ్బంది వాటిని చూసీ చూడనట్లు వదిలేస్తుండటం, టౌన్ ప్లానింగ్ విభాగంలోని అవినీతి, అక్రమాలపై ‘కాసులిస్తే .. సై’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గురువారం టౌన్‌ప్లానింగ్ విభాగంలోని 33 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయినవారిని వెంటనే రిలీవ్ చేయాలని విభాగాధిపతులకు సూచించారు. సిటీబ్యూరో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలోని అక్రమార్కులపై చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. తొలిదశలో భాగంగా 33 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషర్ డా.బి.జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఒకేసారి పెద్దఎత్తున ఇంతమందిని బదిలీ చేయడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. టౌన్‌ప్లానింగ్ విభాగంలో పెచ్చుమీరిన అవినీతిపై ‘సాక్షి’లో కథనం రావడంతో...ఇకనైనా ఇలాంటి అక్రమాలు జరుగకుండా ఉండేందుకుగాను టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లు (టీపీఎస్)/ సెక్షన్ ఆఫీసర్లు, డ్రాఫ్ట్స్మన్లు, తదితరులను బదిలీ చేశారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు పరిశీలించేది, ఉన్నతాధికారులకు, నిర్మాణదారులకు మధ్య వ్యవహారాలు నెరిపేది వీరే కావడంతో తొలిదశలో వీరిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో రెండేళ్ల పైబడిన వారి నుంచి 14 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నవారు సైతం ఉన్నారు. ఆయా ప్రాంతాల నుంచి అందిన ఫిర్యాదులు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్ విభాగం వారికి ఎక్కువ ఆదాయ వనరులున్న సర్కిళ్లలో ఒకటైన ఖైరతాబాద్ సర్కిల్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న శాంసన్‌ను పాతబస్తీకి బదిలీ చేశారు. ఖైరతాబాద్ సర్కిల్లోనే నాలుగేళ్లుగా పనిచేస్తున్న నర్సింగ్రావును ఎల్బీనగర్ సర్కిల్‌కు బదిలీ చేశారు. జి.నరేష్‌ను కూకట్పల్లి సర్కిల్‌కు బదిలీ చేశారు. అలాగే నిర్మాణ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి సర్కిళ్లలో పనిచేస్తున్న రాజేందర్, సురేందర్‌రెడ్డిలను ఖైరతాబాద్, ఉప్పల్ సర్కిళ్లకు బదిలీ చేశారు. అయితే వారు బదిలీ అయిన సర్కిళ్లు కూడా పెద్దవే కావడం గమనార్హం. రెండేళ్లకు పైగా జీహెచ్ఎంసీకి పాలకమండలి లేకపోవడం.. కార్పొరేటర్లు లేకపోవడంతో టౌన్‌ప్లానింగ్ లోని వారికి ఎలాంటి ఆటంకం లేకుండా పోయిందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్ల రాకతో కొన్ని సర్కిళ్లలో వారికీ, వీరికీ పొసగడం లేదని తెలుస్తోంది. అలాంటి సర్కిళ్లలో ఉప్పల్ తదితరమైనవి ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ సర్కిల్లోని ఓ మహిళా ఉద్యోగి గత 14 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నారు. ఈ బదిలీల్లో భాగంగా ఆమెను ఎల్బీనగర్కు పంపారు. ఇదే సర్కిల్‌కు చెందిన ఫిలిప్స్‌ను పాతబస్తీలోని సర్కిల్-5కు పంపించారు. కూకట్పల్లి సర్కిల్‌కు చెందిన రాజేశ్వర్‌ను పాతబస్తీ పరిధిలోని సర్కిల్-4కు బదిలీ చేశారు. అవినీతి ఆగేనా..? బదిలీల్లో భాగంగా కొందరిని మాత్రం ఆదాయం తక్కువగా ఉండే సర్కిళ్లకు బదిలీ చేసినప్పటికీ, ఎక్కువమందిని తిరిగి నిర్మాణ కార్యకలాపాలు ఎక్కువగా ఉండే సర్కిళ్లకే బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త సర్కిళ్లలో కొంతకాలం వరకైనా అక్రమాల్ని తగ్గింవచ్చుననేది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. దానికి తోడు ఉన్న సిబ్బందే తక్కువ కావడంతో ఎవరో ఒకరిని నియమించక తప్పదు కనుక వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ బదిలీలు చేసినట్లు సమాచారం. మరో 40 రోజుల్లోగా 10 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని పరిష్కరిస్తామని మునిసిపల్ మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చినందున ఆ అంశాన్ని సైతం పరిగణనలోకి తీసుకొని ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్న సర్కిళ్లకు వీరిని పంపించినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో 11 మంది టీపీఎస్/సెక్షన్ ఆఫీసర్లు, 18 మంది డ్రాఫ్ట్స్మన్లు, ముగ్గురు ఏఏడీఎం, ఒక టీపీబీఓ తదితరులున్నారు. -
హనుమాన్ జయంతి ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
హైదరాబాద్ : గౌలిగూడలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా వందల కెమెరాలతో నిరంతర భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం గౌలిగూడలో రేపు జరగనున్న హనుమాన్ జయంతి ఊరేగింపు ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితోపాటు మహేందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 5 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మహేందర్‌రెడ్డి వివరించారు. -
పన్ను ‘పోటు’ తప్పదు..!
గ్రేటర్లో ఆస్తి పన్ను మదింపునకు చర్యలు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటన సిటీబ్యూరో: గ్రేటర్లో ఆస్తి పన్ను పెరగనుంది. జీహెచ్ఎంసీ అధికారులు త్వరలో ఇందుకు సంబంధించిన కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం రూ.1200 లోపు ఆస్తిపన్ను ఉన్నవారికి ప్రభుత్వం మినహాయింపునివ్వడంతో రూ. 101 చెల్లిస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నవారికి.. వాణిజ్య భవనాలకు పన్ను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో 2002 తర్వాత ఆస్తిపన్ను సవరణ చేయలేదన్నారు. అలాగే వాణిజ్య భవనాలకు 2007 తర్వాత సవరించలేదని చెప్పారు. ఇకపై ఆస్తిపన్నును ప్రతియేటా లేదా ఐదేళ్లకోసారి పునర్ వ్యవస్థీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఆస్తిపన్ను మదింపులో అవకతవకలకు తావులేకుండా జీఐఎస్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా చేపట్టే అవకాశం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆస్తిపన్ను నిర్ధారణను కాన్పూర్‌లో విజయవంతంగా అమలు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. శాస్త్రీయంగా జరిగే ఆస్తిపన్ను మదింపుతో ప్రస్తుతం రూ. 1200 లోపు పన్ను ఉన్నవారికి సైతం పెరిగే అవకాశముంది. లేదా వీరి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇస్తుందో వేచి చూడాలి. సర్కిళ్ల సంఖ్య 30కి పెంపు.. ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీ 24 సర్కిళ్లను 30కి పెంచేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్టు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. వంద రోజుల ప్రణాళికలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ అంశాన్ని ప్రకటించినందున గడువులోగా వీటి సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు వేగంగా జరగుతున్నాయని చెప్పారు. మోడల్ మార్కెట్ల నిర్మాణం పురోగతిలో ఉందని, రాజేంద్రనగర్ సర్కిల్లో ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. మొత్తం రూ. 130 కోట్లతో 200 మార్కెట్లు నిర్మాణం లక్ష్యం కాగా, వీటిల్లో 70 మార్కెట్ల నిర్మాణం రెండు నెల ల్లో పూర్తవుతుందని కమిషనర్ తెలిపారు. ఎస్సార్డీపీలో భాగంగా ఫ్లై ఓవర్ల పనులకు సంబంధించి భూసేకరణ సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. త్వరలో ఏఎంఓహెచ్ పోస్టుల భర్తీ.. జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న ఏఎంఓహెచ్ఓ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా వైద్య, ఆరోగ్యశాఖకు లేఖ రాశామని ఆయన తెలిపారు. నగరంలో ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టేందుకు త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. జీహెచ్ఎంసీలో 15 ఏళ్లకు పైబడి ఉన్న వాహనాలను దశలవారీగా తొలగిస్తామని, 30 ఏళ్లకు పైబడిన వాహనాలను స్క్రాప్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వేలం వేస్తామని చెప్పారు. నీటి పొదుపు పాటించండి.. గతంలో ఎప్పుడూ లేని విధంగా నగరానికి తీవ్ర నీటికొరత ఏర్పడే ప్రమాదముందని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలని కోరారు. కనీసం 30 నుంచి 40 శాతం నీటిని ఆదా చేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వెయ్యి ఇంకుడు గుంతల ఏర్పాటు లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకొచ్చే కాలనీ, స్వచ్ఛంద సంఘాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు సి.రామకృష్ణారావు, జె. శంకరయ్య పాల్గొన్నారు. -
సమస్యలను పరిష్కరించకుంటే టెన్త్ పరీక్షల బహిష్కరణ
పీఆర్టీయూ-టీఎస్ తీర్మానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే మార్చి 21వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను బహిష్కరించాలని పీఆర్టీయూ-టీఎస్ తీర్మానించింది. హైదరాబాద్‌లో ఆదివారం యూనియన్ రాష్ట్ర ప్రథమ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. అధికారులు ఎస్ఎంఎస్ల ద్వారా ఉపాధ్యాయుల హాజరు సమాచారం తెలుసుకోవడాన్ని ఉపసంహరించాలని, వేసవిలో రెండు పూటలా బడులను నిలిపివేయాలని, ఈ సమావేశం డిమాండ్ చేసింది. 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని కోరింది. యూనియన్ అధ్యక్షుడు పి.సరోత్తంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
8 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగుల సస్పెన్షన్
ముజ్రా పార్టీ ఎఫెక్ట్ సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో జరిగిన ముజ్రా పార్టీలో పోలీసులకు పట్టుబడ్డ 8 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులను క మిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్ చేశారు. వీరిలో శేరిలింగంపల్లి సర్కిల్-11 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్(53), సర్కిల్-12 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ అలియాస్ పద్మభూషణ్ రాజు(48), సర్కిల్-14 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవీందర్(54), సర్కిల్-11 బిల్ కలెక్టర్లు ఆర్.జా‘నేశ్వర్(30), వై.నరహరి(30), కె.కృష్ణ(26) రణవీర్ భూపాల్(40), సర్కిల్-12 బిల్ కలెక్టర్ వై.బాబురావు ఉన్నారు. ఈ ఉద్యోగులందరినీ సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు వెస్ట్ జోనల్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ఆయన విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. శనివారం రాత్రి మాదాపూర్ ఖానామెట్‌లోని ఫాతిమా గెస్ట్‌హౌస్‌లో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. మద్యం సేవిస్తూ యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తుండగా అక్కడున్న 24 మందిని అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ 188, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
సాయంత్రం 5 గంటల తర్వాత ఫలితాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాతే వెల్లడిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి చెప్పారు. ఓట్ల లెక్కింపు విషయమై ఆయన గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే కౌంటింగ్ మొదలవుతుందని, మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారని అన్నారు. అయితే.. పురానాపూల్‌లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీ పోలింగ్ ఉన్నందున.. అది ముగిసిన తర్వాత మాత్రమే మొదటి ఫలితాన్ని వెల్లడిస్తారని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, అందువల్ల కేవలం పాస్‌లు ఉన్నవారు మాత్రమే కేంద్రాల వద్దకు రావాలని జనార్దన రెడ్డి చెప్పారు. పాస్‌లు లేనివాళ్లు అక్కడకు రావల్సిన అవసరం లేదని, ఎటూ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఫలితాలను వెల్లడిస్తున్నందున ఆ కాంపౌండ్ వద్ద ఉన్నా, ఇంట్లో ఉన్నా తేడా ఏమీ ఉండబోదని చెప్పారు. ఈవీఎంలు వచ్చిన తర్వాత కౌంటింగ్ దగ్గర వివాదాలు ఏమీ ఉండబోవని, కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తామని ఆయన అన్నారు. అలాగే, ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు ఏవీ నిర్వహించకూడదని కమిషనర్ చెప్పారు. -
పోలింగ్ 37 శాతమే..
సాయంత్రం 4.30 గంటల వరకు నమోదు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగలేదు. 2009 ఎన్నికల తో పోలిస్తే ఈసారి కొంత తగ్గింది. 2009లో 42.92 శాతం పోలింగ్ నమోదు కాగా.. మంగళవారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 4.30 గంటల వరకు 37.70 శాతం మాత్రమే నమోదైంది. సర్కిళ్ల నుంచి పూర్తి సమాచారం అందకపోవడంతో బుధవారం తుది ఓటింగ్ శాతాన్ని వెల్లడించనున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు ప్రకటించాయి. అంతకుముందు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సుమారు 45 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించినా.. ఆ తర్వాత 37.70 శాతమే అని అధికారులు తెలిపారు. ఆదిలో ప్రశాంతం.. చివర్లో ఘర్షణలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగినప్పటికీ చివరల్లో ఘర్షణలు చోటుచేసుకున్నారు. మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాలకుగాను తొమ్మిది కేంద్రాల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో ఆయా చోట్ల కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. 15 నిమిషాల్లోనే కొత్త పరికరాలు అందుబాటులోకి తేవడంతో పోలింగ్ సజావుగా సాగింది. ఎనిమిది కేంద్రాల్లో లో బ్యాటరీతో ఈవీఎంలు మొరాయించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరోవైపు వెబ్సైట్, మొబైల్ యాప్స్ ద్వారా ఓటరుస్లిప్‌లు డౌన్లోడ్ చేసుకోవడంలో కనిపించిన స్పందన పోలింగ్‌లో కనిపించలేదు. పోల్‌స్లిప్‌ల డౌన్లోడ్లు, జీహెచ్ఎంసీ పంపిణీ చేసిన పోల్స్లిప్లను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి 60 శాతానికి పైగా పోలింగ్ నమోద వుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటర్ల నుంచి స్పందన కనిపించలేదు. వెబ్‌కాస్టింగ్‌తో అంతా సజావుగా.. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును ఎన్నికల సంఘం, నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం, జీహెచ్ ఎంసీ కార్యాలయాల నుంచి పర్యవేక్షించారు. దీంతో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పోలింగ్ జరగడమే కాక, అక్కడక్కడ తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కొన్నిచోట్ల చెలరేగిన ఘర్షణలు పోలింగ్ కేంద్రాల్లోకానీ, కేంద్రాలకు వంద మీటర్ల లోపు కానీ జరిగినవి కావని ఆయన పేర్కొన్నారు. అయినా.. ఆ ఘర్షణలతో ప్రజలు భయభ్రాంతులకు గురైనట్లు ,రిగ్గింగ్ జరిగినట్లు, ప్రిసైడింగ్, రిటర్నింగ్ అధికారులు నివేదిస్తే ఎన్నికల సంఘానికి తెలియజేసి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రేటర్‌లోని ఐదు జోన్లలో సౌత్ జోన్లో ఎక్కువ పోలింగ్ జరిగినట్లు తమకు సమాచారం ఉందన్నారు. పాతబస్తీ సౌత్‌జోన్ పరిధిలో ఉంది. 5వ తేదీన ఫలితాలు జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుందని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల కే తొలి ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండవచ్చని తెలిపారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45శాతం ఓటింగ్ నమోదు
హైదరాబాద్ : ఇప్పటివరకూ తమకు అందిన సమాచారం ప్రకారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం సాయంత్రం ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఇంకా రెండు లేదా మూడు శాతం ఓటింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో కంటే స్వలంగా ఓటింగ్ శాతం పెరిగినట్లు చెప్పారు. 2 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టామని.. లైవ్ వెబ్ కాస్టింగ్ పెట్టడం వల్ల ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెప్పారు. ఎక్కడ ఏ చిన్న సమాచారం వచ్చినా పోలీసులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. గ్రేటర్ పరిధిలో ఎక్కడా హింసాత్మక ఘటనలు, పోలింగ్ బూత్‌లను ఆక్రమించడం జరగలేదని కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు ఉదయం పోలింగ్ మొదలైన అరగంటలో కేవలం ఎనిమిది ఈవీఎంలు మొరాయించాయని, అయితే పది నిమిషాల్లోనే వాటిని సరిచేయడం జరిగిందన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ బాగానే జరిగిందని, ఒకటి, రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. ఎంఐఎం, కాంగ్రెస్ గొడవపై ప్రిసైడింగ్ అధికారి నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. -
'గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రూ.2.58 కోట్లు స్వాధీనం'
హైదరాబాద్: నగరంలో రేపు(మంగళవారం) జీహెచ్ఎంసీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అంధులు ఓటు వేసేందుకు వీలుగా బ్రెయిలి లిపి బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ స్టేషన్లలో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో 2.58 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.1.5 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. -
అంధులు ఓటేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్
♦ బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ రూపకల్పన ♦ వెల్లడించిన కమిషనర్ జనార్దన్‌రెడ్డి బంజారాహిల్స్: అంధులు ఓటేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ రూపొందించామని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ బ్యాలెట్ పేపర్‌ను ఈవీఎంపై ఉంచి ఎవరి సహాయం లేకుండా అంధులు సొంతంగా ఓటు వేయొచ్చన్నారు. మొట్టమొదటిసారిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే దీనిని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజ ఇంజినీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా ముగిసిందన్నారు. ప్రతి వార్డు కార్యాలయం, పోలింగ్ స్టేషన్లలో ఓటర్ సౌలభ్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 9,352 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 1500 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని తెలిపారు. మూడు వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు వెబ్‌కాస్టింగ్‌లో శిక్షణనిచ్చామని చెప్పారు. సమస్యాత్మకంగా గుర్తించిన మూడు వేల పోలింగ్ స్టేషన్లను వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామన్నారు. ఎన్నికల రోజున సినిమా థియేటర్లు, హోటళ్లు, మాల్స్ దుకాణాలకు సెలవు ప్రకటించాలని కార్మికశాఖకు లేఖ రాస్తామన్నారు. -
వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఫిబ్రవరి 2న జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు హాజరయ్యే వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి , కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. వికలాంగులకు, నడవలేని వారికి సాధ్యమైనన్ని పోలింగ్ కేంద్రాల్లో వీల్చైర్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సౌకర్యాలను సహచర ఓటర్లు కూడా స్వాగతించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వీరిని పోలింగ్ కేంద్రాల సమీపంలోకి అనుమతించాల్సిందిగా పోలీసులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షలకుపైగా తొలగింపు... ఎన్నికల నియమావళి మేరకు ఇప్పటివరకు 2,00,745 అక్రమహోర్డింగులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు,పోస్టర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. ఇందులో 7,654 కటౌట్లు, 52,672 ఫ్లెక్సీలు, 60,000 బ్యానర్లు, 81,000 పోస్టర్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2,54,28,200 స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. శుక్రవారం గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ. 37 లక్షలు స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది 7 గంటలకల్లా చేరుకోవాలి... ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 7 గంటలలోపు తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పొరుగుజిల్లాల నుంచి వచ్చేవారి కోసం నగరంలోని ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. - సాక్షి, సిటీబ్యూరో -
ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
♦ 46 వేల మంది సిబ్బంది నియామకం ♦ జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి లింగోజిగూడ: ఫిబ్రవరి 2న నిర్వహించనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్, ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు గాను 46 వేల మంది సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎల్బీనగర్ జంట సర్కిళ్ల(3ఎ, 3బి) కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని విభాగాల అధికారులకు శిక్షణ పూర్తి చేశామని, ఈవీఎం యంత్రాలను ఆయా కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచామని చెప్పారు. ఈవీఎంలు మొరాయిస్తే ముందు జాగ్రత్తగా అదనంగా 27 శాతం మిషిన్లను అందుబాటులో ఉంచామన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 50 లక్షల ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారన్నారు. మరో రెండు రోజుల్లో అందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహన శిబిరాలు నిర్వహించామని పేర్కొన్నారు. విద్యార్థులకు సంకల్ప పత్రాలు అందజేసి వారి తల్లిదండ్రులు ఓటేసే విధంగా కృషి చే స్తున్నామన్నారు. అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక టీమ్‌లు ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నాయని చెప్పారు. అందరూ సమన్వయంతో పనిచేయాలి... ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ కోరారు. పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా సిబ్బందికి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి అధికారుల నియామకానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. జోనల్ అధికారులు, ఆర్ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేసేందుకు అందరూ నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. జోనల్ అధికారులకు వాహనాలు అందుబాటులో ఉంటాయని, పోలింగ్ సందర్భంగా గంటకు ఒకసారి డేటాను పంపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జంట సర్కిళ్ల ఎన్నికల పరిశీలకులు దినకర్‌బాబు, ఒమర్ జలీల్, జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డీసీలు పంకజ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ. 2 కోట్ల విలువైన ఎన్నికల మద్యం స్వాధీనం
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్ ఎన్నిలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గ్రేటర్ పీఠం తమదంటే తమదేనని పలుపార్టీలు ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే జోరుగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల మద్యం ఏరులైపారుతోంది. నగరంలో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల 15 లక్షల 28 వేల 200 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 86వేల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ప్రతిపాదించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఓటర్లకు అన్ని వసతులు
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 7802 పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు కనీస మౌలికసదుపాయాల కోసం ప్రత్యేకచర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, టెంట్లు, వికలాంగుల కోసం ర్యాంపులు, టాయ్లెట్లు తదితర సదుపాయాలు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికి దాదాపు 2వేల పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, మిగతా కేంద్రాల్లోనూ మరో రెండు మూడు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. 27న బ్యాలెట్ పేపర్ల తనిఖీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల జాబితాతో కూడిన బ్యాలెట్‌పత్రాల ముద్రణ పూర్తయిందని కమిషనర్ తెలిపారు. ఈనెల 27న వాటిని తనిఖీ చేయాల్సిందిగా రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు/ వారు ప్రతిపాదించే ఏజెంట్ల సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహించాల్సిందిగా డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. ఈనెల 28వ తేదీన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల పనితీరు, నిర్వహణపై కూడా తనిఖీ నిర్వహించాల్సిందిగా సూచించారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న 70 వేల మంది ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ఇప్పటి వరకు 70 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ఈ యాప్‌ద్వారా 69 వేలమంది తమ ఓటరుస్లిప్‌లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా 3.12 లక్షల మంది ఓటరుస్లిప్లో డౌన్లోడ్ చేసుకున్నారని, తమ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగతంగా 40 శాతం మంది ఓటర్లకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశారన్నారు. ఎన్నికల సిబ్బంది ఫిబ్రవరి 1నే చేరుకోవాలి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 7 గంటలకు సంబంధిత డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్,కరీంనగర్ జిల్లాలకు చెందిన ఉద్యోగులను ఎన్నికల విధులకు నియమించామన్నారు.