మాంసం దుకాణాలు మూసి ఉంచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
సాక్షి,సిటీబ్యూరో: గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మాంసం విక్రయాలకు పాల్పడే దుకాణాలు, వ్యక్తులపైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.