ఆన్‌లైన్‌లో జీహెచ్‌ఎంసీ కోర్టు కేసులు | GHMC court cases in online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో జీహెచ్‌ఎంసీ కోర్టు కేసులు

Published Tue, Apr 10 2018 2:24 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

GHMC court cases in online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోర్టుల్లో కేసుల స్థితిగతులు ఆన్‌లైన్‌లో తెలుసుకునేలా లీగల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టుకు జీహెచ్‌ఎంసీ తెలియజేసింది. జీహెచ్‌ఎంసీ కేసుల పరిస్థితులను ఎవరైనా ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనా ర్దన్‌రెడ్డి తెలిపారు. ఈ వివరాల్ని రికార్డుల్లో నమోదు చేస్తున్నట్లు సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచందర్‌ రావు ప్రకటించారు. సికింద్రాబాద్‌ శివాజీ నగ ర్‌లో అనుమతి లేకుండా భవన నిర్మాణం చేస్తున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవట్లే దని పేర్కొంటూ ఎన్‌.రాజనర్సింహశర్మ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది.

ఇలాంటి అంశాలపై కింది కోర్టుల్లోని కేసుల్లో అక్రమ కట్టడాలకు పాల్పడేవారికి అనుకూలం గా ఉత్తర్వులు వెలువడకుండా జీహెచ్‌ఎంసీ న్యాయ విభాగం యత్నిస్తోందో లేదో తెలపా లని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఈ వివ రాలు ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి ఆదే శాల మేరకు సోమవారం కమిషనర్‌ హైకోర్టుకు హాజరయ్యారు. అక్రమ కట్టడాలపై కనీసం నెలకోసారి సమీక్ష చేయాలని సూచించారు. ఈ తరహా నిర్మాణాలపై సివిల్‌ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల రద్దుకు చేస్తున్న ప్రయత్నాలను తెలియజేస్తూ కౌంటర్‌ వ్యాజ్యం దాఖలు చేయా లని జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement