సమస్యలను పరిష్కరించకుంటే టెన్త్ పరీక్షల బహిష్కరణ | Tenth exam boycott if Without solving problems | Sakshi
Sakshi News home page

సమస్యలను పరిష్కరించకుంటే టెన్త్ పరీక్షల బహిష్కరణ

Published Mon, Feb 22 2016 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

Tenth exam boycott if Without solving problems

పీఆర్టీయూ-టీఎస్ తీర్మానం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే మార్చి 21వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను బహిష్కరించాలని పీఆర్టీయూ-టీఎస్ తీర్మానించింది. హైదరాబాద్‌లో ఆదివారం యూనియన్ రాష్ట్ర ప్రథమ కార్యనిర్వాహక సమావేశం జరిగింది.

అధికారులు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఉపాధ్యాయుల హాజరు సమాచారం తెలుసుకోవడాన్ని ఉపసంహరించాలని, వేసవిలో రెండు పూటలా బడులను నిలిపివేయాలని, ఈ సమావేశం డిమాండ్ చేసింది. 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని కోరింది. యూనియన్ అధ్యక్షుడు పి.సరోత్తంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement