ఉద్యోగ నియామకాలకు రెడీ.. సర్కారు అనుమతులివ్వగానే .. | TSPSC Ready To Conduct Recruitment For 81K Jobs: Chairman B Janardhan Reddy | Sakshi
Sakshi News home page

ఉద్యోగ నియామకాలకు రెడీ.. సర్కారు అనుమతులివ్వగానే ..

Published Wed, Mar 16 2022 8:21 AM | Last Updated on Wed, Mar 16 2022 3:12 PM

TSPSC Ready To Conduct Recruitment For 81K Jobs: Chairman B Janardhan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిన వెంటనే వడివడిగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ దిశగా పకడ్భందీ ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నట్లు వివరించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి, సభ్యులు రమావత్‌ ధన్‌సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, కారెం రవీందర్‌రెడ్డి, అరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్‌.సత్యనారాయణ, కార్యదర్శి అనితా రామచంద్రన్‌ మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ 2020–21 వార్షిక నివేదికను సమర్పించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు కమిషన్‌ చైర్మన్‌ జనార్థన్‌రెడ్డి వివరించారు. 

3 నోటిఫికేషన్లు... 4 పరీక్షలు... 
ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2021 వరకు టీఎస్‌పీఎస్సీ 149 ఖాళీల భర్తీకి 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తంగా 119 ఖాళీల భర్తీకిగాను 4 పరీక్షలు నిర్వహించింది. మొత్తం 10630 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల తాలూకు చర్యలు తీసుకుని 2370 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. శాఖాపరమైన పరీక్షలకు 1,26,381 మంది అభ్యర్థులు హాజరు కాగా, 53,886 మంది అర్హత సాధించారు. 
చదవండి: CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ వరాల వర్షం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement