
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ల నియమాకానికి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,395 జూనియర్ లెక్చరర్లతోపాటు 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ పోస్ట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్‌ఈ తెలిపింది. డిసెంబర్ 16 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా అర్హులైన అభ్యర్తులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. జూన్ లేదా జూలైలో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది.
కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. జూనియర్ లెక్చరర్ల పోస్టులకు విడుదలైన తొలి నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం. 1100 జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఉమ్మడి రాష్ట్రంలో 2008లో చివరగా నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
చదవండి: స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. సివిల్ సప్లయ్ చైర్మన్‌గా సర్దార్
Comments
Please login to add a commentAdd a comment