Junior lecturers
-
తెలంగాణ: 2,391 కొత్త ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వగా... వీటి భర్తీకి సంబంధించిన ఏర్పాట్లను గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) పూర్తి చేసింది. తాజాగా మరో 2,225 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బీసీ గురుకుల పాఠశాలలకు సంబంధించి 2,132 పోస్టులకుగాను ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేయగా... జనరల్ గురుకులాల పరిధిలో 93 ఉద్యోగాలకు మరో జీఓ జారీచేశారు. అలాగే, సమాచార, పౌరసంబంధాల శాఖ పరిధిలో 166 పోస్టుల భర్తీకి మరో జీవోను ఆర్థిక శాఖ జారీ చేసింది. గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీ బాధ్యతలు టీఆర్‌ఈఐఆర్‌బీకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీకి, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీని టీఎంహెచ్ఎస్ఆర్బీకి అప్పగించింది. -
గుడ్‌న్యూస్! తెలంగాణాలో మరో భారీ నోటిఫికేషన్.. పరీక్ష ఎప్పుడంటే?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ల నియమాకానికి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,395 జూనియర్ లెక్చరర్లతోపాటు 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్ట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్ఈ తెలిపింది. డిసెంబర్ 16 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అర్హులైన అభ్యర్తులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. జూన్ లేదా జూలైలో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. జూనియర్ లెక్చరర్ల పోస్టులకు విడుదలైన తొలి నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం. 1100 జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఉమ్మడి రాష్ట్రంలో 2008లో చివరగా నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. చదవండి: స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. సివిల్ సప్లయ్ చైర్మన్‌గా సర్దార్ -
గుడ్‌న్యూస్: గెస్ట్ లెక్చరర్ల వేతనాలు.. గంటకు రూ. 90 పెంపు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని గెస్ట్ లెక్చరర్ వేతనాలు గంటకు రూ.300 నుంచి 390 వరకూ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి రొనాల్డ్ రాస్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నెలకు 72 గంటలపాటు బోధించే అవకాశం కల్పించాలని, నెలసరి వేతనం రూ. 28,080కి పరిమితం చేయాలని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాదాపు 2 వేలమంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. వేతనం పెంపు నిర్ణయం పట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణ చేయకుంటే 12న ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కళా శాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీ కరించాలని, ఆ జాబితాను ఈ నెల 12లోగా ప్రభుత్వానికి పంపకుంటే అదేరోజు ఆందోళన చేపడతామని ఇంటర్ విద్యా పరి రక్షణ సమితి హెచ్చరించింది. ఈ మేరకు ఇం టర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్, సమన్వయకర్త మైలారం జంగయ్య, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీ కరణ సాధన సమితి సమన్వయకర్త కొప్పిశెట్టి సురేష్ ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. -
రేపటి నుంచి లెక్చరర్లకు ఆన్లైన్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ఆన్లైన్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 15 రోజుల పాటు ‘డిజిటల్ దిశ’ పేరుతో ఆన్లైన్ క్లాసులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 5300 మంది లెక్చరర్లను 12 బ్యాచ్‌లుగా విభజించి డిజిటల్ తరగతులు, ఆన్లైన్ విద్యా బోధనపై శిక్షణ ఇవ్వనున్నారు. కాగా మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. అదే విధంగా కరోనా విజృంభణ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే విద్యా సంస్థలు తెరిచే అవకాశం కనబడటం లేదు. దీంతో డిజిటల్ తరగతులకు ప్రాధాన్యం పెరగడంతో ఆ దిశగా లెక్చరర్లను సమాయత్తం చేసేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడనుంది.(ఆన్లైన్ పాఠాలు; ఆసక్తికర అంశాలు) -
‘గంటా వల్లే జూనియర్ లెక్చరర్లకు అన్యాయం’
సాక్షి, విజయవాడ: మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు అవినీతి పనుల వల్ల జూనియర్ లెక్చరర్స్‌కు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్య నారాయణ ఆరోపించారు. ఏపీ డైరెక్ట్ రిక్రూటెడ్ జూనియర్ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కె ఆర్ సూర్య నారాయణతోపాటు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె ఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ప్రమోషన్ల వల్ల డైరెక్ట్ రిక్రూట్ వారికి అన్యాయం జరిగిందని తెలిపారు. అక్రమ ప్రమోషన్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. గత ప్రభుత్వంలో జూనియర్ లెక్చరర్స్ నుంచి ప్రిన్సిపాల్స్‌గా అక్రమంగా ప్రమోషన్స్ పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి అవినీతి చర్యలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య శాఖలను ప్రక్షాళన చేయాలని భావిస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారావు మాట్లాడుతూ శాఖాపరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూటెడ్ జూనియర్ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్ల ప్రమోషన్స్ అవకతవకలు సరిచేస్తామని హామీ ఇచ్చారు. -
గురుకులాల్లో 960 ఖాళీ భర్తీకి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో ఖాళీగా ఉన్న 960 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, 360 జూనియర్ లెక్చరర్లు, 103 పీజీటీ, 206 టీజీటీ, 51 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. గతంలో టీఎస్పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయగా ఈసారి కొత్తగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వివిధ విభాగాల్లో మరో 39 ఖాళీల భర్తీ: ఎస్సీ డెవలప్మెంట్ డైరెక్టర్ పరిధిలో జిల్లా స్థాయి యూనిట్లలో ఖాళీగా ఉన్న 30 పోస్టుల భర్తీకి కూడా ఆమోదం తెలుపుతూ ఆర్థికశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. జిల్లా ఆఫీసుల్లో 17 జూనియర్ అసిస్టెంట్లు, 11 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఆనందనిలయాల్లో 2 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. సహకార సంస్థల రిజిస్ట్రార్ కమిషనర్ పరిధిలో ఖాళీగా ఉన్న 3 జూనియర్ అసిస్టెంట్లు, చక్కెర శాఖ డైరెక్టర్ కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న 5 జూనియర్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టును భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. -
ఐదారు వేల జీతానికే వెట్టి చాకిరి..
సాక్షి, హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థలో పనిచేసే జూనియర్ లెక్చరర్లు ఆందోలనకు దిగిన విషయం తెలిసేందే. కనీసం వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని యజమాన్యాన్ని కోరారు. గత 21 రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నగరంలోని దిల్సుఖ్నగర్, పుల్లారెడ్డి బ్రాంచ్‌లలో జూనియర్ లెక్చరర్లు మహా ధర్నాకు దిగారు. ఐదారు వేల జీతానికే తమతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని వారు మండిపడ్డారు. తాము పడుతున్న కష్టాన్ని చూసైనా యజమాన్యం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రస్తుతం పనివేళలు అధికంగా ఉన్నాయని.. వాటిని 8 గంటలకు అమలు చేయాలని జూనియర్ లెక్చరర్లు ధర్నా చేస్తున్నారు. -
జూనియర్ లెక్చరర్లుగా టీచర్లకు పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హతలు కలి గిన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చ రర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రభు త్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పంచాయతీరాజ్ టీచర్ పోస్టులను లోకల్ కేడర్‌గా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆర్గనైజ్ చేయిం చిన ప్రభుత్వం.. పంచాయతీరాజ్, ప్రభుత్వ టీచర్లకు ఒకే రకమైన (ఏకీకృత) సర్వీసు రూల్స్ రూపక ల్పనలో పడింది. మరోవైపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్న తులు కల్పించేందుకు సిద్ధం అవుతోంది. స్కూల్ అసిస్టెంట్లకే జూని యర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించే ఉత్తర్వులను రద్దు చేస్తూ 2008 సెప్టెంబర్ 18న ప్రభుత్వం జారీ చేసిన జీవో 223ని ఉపసంహరించే దిశగా ఆలోచనలు చేస్తోంది. నేడు ఉన్నతస్థాయి సమావేశం ఈనెల 26న పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్లు, ఇతర అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జీవో 223ని సవరించాలా లేక ఉపసంహరించాలా? ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏం చేయాలన్న అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటర్మీడియెట్ విద్యలో ఉద్యోగాల భర్తీకి అనుసరించాల్సి నిబంధనలపై కూడా చర్చిస్తారు. -
‘ఫిట్మెంట్’ విడుదల చేయాలని డిమాండ్
గుంటూరు ఈస్ట్: జూనియర్ లెక్చరర్లకు ఫిట్మెంట్ ఫార్ములా జీవో వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కరరావు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. జూనియర్ లెక్చరర్ కేడర్ నుంచి డిగ్రీ కళాశాలకు పదోన్నతి పొందినవారికి గత ఆరేళ్ల నుంచి యూజీసీ స్కేల్లో ఫిట్మెంట్ ఫార్ములా రాలేదన్నారు. ఈ కారణంగా జీతం తగ్గి అధ్యాపకులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఫిట్మెంట్ ఫార్ములా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన ఫైల్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.నరేంద్రనా«ద్, కార్యదర్శి వి.ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
జూనియర్ అధ్యాపకులకు జరిమానా
మంచిర్యాల సిటీ: ‘మీరు ఇంటర్ మూల్యాంకనం సరిగా చేయలేదు. విద్యార్థుల జవాబు పత్రాలు సరిగా దిద్దలేదు. జవాబుకు తగిన మార్కులు వేయలేదు. మార్కులను సరిగా కూడకుండా తప్పు వేశారు. మీరు చేసిన తప్పులకు విద్యార్థులు నష్టపోయారు. విద్యార్థులు నష్టపోయినందు కు మీరు బోర్డుకు జరిమానా చెల్లించాలి’ అంటూ ఇంటర్ బోర్డు జూనియర్ అధ్యాపకులకు నోటీసులు జారీ చేసింది. 2015 ఏప్రిల్‌లో మూల్యాంకనానికి హాజరై తప్పు లు చేసిన అధ్యాపకులకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో వందల సంఖ్యలో విద్యార్థులు రీవాల్యూయేషన్‌కు వెళ్లడంతో డొల్లతనం బట్టబయలైంది. నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనంటూ ఇంటర్ బోర్డు అధికారులు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు చెందిన(ఱ(ఖమ్మం జిల్లాకు సంబంధించి సమాచారం లభించలేదు) 2,387 మంది అధ్యాపకులకు నోటీసులు జారీ చేసింది. ఒక్కో అధ్యాపకుడికి వారు చేసిన తప్పుల అధారంగా రూ. వెయ్యి నుంచి 15,000 వరకు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. -
'జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ప్రమోషన్లు'
హైదరాబాద్ : ఈ ఏడాది వేసవిలో జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ప్రమోషన్లు ఉంటాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అలాగే ఈ విద్యా సంవత్సరానికి అన్ని జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ డైరీ, క్యాలెండర్‌ను కడియం శ్రీహరి ఆవిష్కరించారు. అనంతరం కడియం మాట్లాడుతూ... ఇంటర్ బోర్డుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందులో భాగంగా అన్ని సేవలను ఆన్లైన్ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 3,678 కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేసేందుకు పరిశీలన చేస్తున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు. -
అయ్యవార్ల ఆకలి కేకలు !
శ్రీకాకుళం: జిల్లాలోని గురువులు ఆకలితో అలమటిస్తూనే శుక్రవారం పూజలందుకోబోతున్నారు. సెప్టెంబర్-5న గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులను సత్కరిస్తూ వస్తుండడం పరిపాటి. అయితే ఈ ఏడాది పలువురు కాంట్రాక్టు అధ్యాపకులకు మూడు నెలలుగా జీతాలు అందక పోవడంతో వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఇటువంటి వాటిపై దృష్టి సారించని ప్రభుత్వం గురుపూజోత్సవాన్ని మాత్రం ఘనంగా నిర్వహించాలని, డీఎస్సీని ప్రకటించాలని నిర్ణయించింది. జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిన 332 మంది జూనియర్ లెక్చరర్లు, మరో 58 మంది ఒకేషనల్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. టైంస్కేల్ కింద ఆరుగురు అధ్యాపకులు, 14 మంది ఒకేషనల్ అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ జూన్ నెల నుంచి నేటి వరకు జీతాలు చెల్లించడం లేదు. టైంస్కేల్ కింద పనిచేస్తున్న ఒకేషన ల్ జూనియర్ లెక్చరర్లకు నేటికీ పోస్టులో కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేయక పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఏటా జూన్ నెల లో వీరికి కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తుండగా ఈ ఏడాది ఇవ్వక పోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. కాంట్రాక్టు, టైం స్కేల్ పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల సమయంలో హామీఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తరువాత అందుకు భిన్నంగా వ్యవహరి స్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా గురువుల సమస్యలను తీర్చి అటు తరువాత గురుపూజోత్సవాలు వంటివి జరిపిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
రసాభసగా ప్రభుత్వ జూ,,లెక్చలర్ల సదస్సు