'జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ప్రమోషన్లు' | junior lecturers promotions in this year, says kadiyam srihari | Sakshi
Sakshi News home page

'జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ప్రమోషన్లు'

Published Fri, Jan 8 2016 2:42 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

'జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ప్రమోషన్లు'

'జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ప్రమోషన్లు'

హైదరాబాద్ :  ఈ ఏడాది వేసవిలో జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ప్రమోషన్లు ఉంటాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అలాగే ఈ విద్యా సంవత్సరానికి అన్ని జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ డైరీ, క్యాలెండర్ను కడియం శ్రీహరి ఆవిష్కరించారు.

అనంతరం కడియం మాట్లాడుతూ... ఇంటర్ బోర్డుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందులో భాగంగా అన్ని సేవలను ఆన్లైన్ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 3,678 కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేసేందుకు పరిశీలన చేస్తున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement