‘ఫిట్‌మెంట్’ విడుదల చేయాలని డిమాండ్
గుంటూరు ఈస్ట్: జూనియర్ లెక్చరర్లకు ఫిట్‌మెంట్ ఫార్ములా జీవో వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కరరావు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. జూనియర్ లెక్చరర్ కేడర్ నుంచి డిగ్రీ కళాశాలకు పదోన్నతి పొందినవారికి గత ఆరేళ్ల నుంచి యూజీసీ స్కేల్‌లో ఫిట్‌మెంట్ ఫార్ములా రాలేదన్నారు. ఈ కారణంగా జీతం తగ్గి అధ్యాపకులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఫిట్‌మెంట్ ఫార్ములా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన ఫైల్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.నరేంద్రనా«ద్, కార్యదర్శి వి.ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.