సాక్షి, హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థలో పనిచేసే జూనియర్ లెక్చరర్లు ఆందోలనకు దిగిన విషయం తెలిసేందే. కనీసం వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని యజమాన్యాన్ని కోరారు. గత 21 రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, పుల్లారెడ్డి బ్రాంచ్‌లలో జూనియర్ లెక్చరర్లు మహా ధర్నాకు దిగారు.
ఐదారు వేల జీతానికే తమతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని వారు మండిపడ్డారు. తాము పడుతున్న కష్టాన్ని చూసైనా యజమాన్యం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రస్తుతం పనివేళలు అధికంగా ఉన్నాయని.. వాటిని 8 గంటలకు అమలు చేయాలని జూనియర్ లెక్చరర్లు ధర్నా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment