
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ శాఖల్లో 581 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వసతిగృహ సంక్షేమాధికారి గ్రేడ్–1, గ్రేడ్–2, మ్యాట్రన్ గ్రేడ్–1, గ్రేడ్–2, వార్డెన్ గ్రేడ్–1, గ్రేడ్–2 శిశు గృహాల్లో మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 2023 జనవరి 6 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది.
చదవండి: ఆదిలోనే అడ్డంకులు!.. వాయిదా పడ్డ గ్రూప్-4 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ