జీహెచ్‌ఎంసీ కార్మికురాలు అండాలమ్మతో మాట్లాడుతున్న జనార్థన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అది సచివాలయం సమీపంలోని అన్మోల్ హోటల్. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికురాలి వద్ద సడన్‌గా ఇన్నోవా కారు ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు అధికారులు ఆమె పేరు, వివరాలు తెలుసుకున్నారు. నెలనెలా జీతం అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. ఆమెకు జీవిత భీమా సదుపాయం ఉందో లేదో తెలుసుకున్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నదీ లేనిదీ అడిగారు. తన పేరు అండాలమ్మ అని, ప్రతినెలా వేతనం సక్రమంగా అందుతోందని తెలిపిన ఆమె, ప్రతిరోజూ బయెమెట్రిక్ హాజరు తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఇంతకీ తామెవరో తెలుసా? అంటే తెలియదని సమాధానం ఇచ్చింది. తాను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌నని, ఈమె ఆరోగ్యవిభాగం అదనపు కమిషనర్ శృతిఓజా అని బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. దాంతో ఆమెకు నోట మాటరాలేదు. ఆశ్యర్యం వ్యక్తం చేసింది. కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్థాయిలోని ఉన్నతాధికారులు తనతో మాట్లాడటం ఇదే మొదటిసారి అని, తన యోగక్షేమాలు తెలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment