
ఎం.దానకిశోర్, బి.జనార్ధన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీగా పనిచేస్తున్న ఎం.దానకిశోర్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేస్తున్న బి.జనార్ధన్‌రెడ్డిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కమిషనర్‌గా నియమించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పని చేస్తున్న టి.చిరంజీవులును రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ కమిషనర్‌గా బదిలీ చేశారు. దానకిశోర్‌కు అదనంగా ప్రస్తుతం పనిచేస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ బాధ్యతలతో పాటు మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించారు.