హెచ్‌ఎండీఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్: సమాజంలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ జనార్ధన్ రెడ్డి కోరారు. శిల్పకళా వేదికలో సోమవారం వ్యర్థ పదార్థాల నిర్వహణ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. పరిశుభ్రత మన ఇంటి వంటగది నుంచే ప్రారంభం కావాలన్నారు. పరిశుభ్రతతో పాటు కాలుష్యాన్ని అరికట్టాలని, ప్లాస్టిక్‌ను కూడా నిరోధించాలని కోరారు. విద్యార్థులలో ఈ అంశాలపై అవగాహన పెరగాలన్నారు.
చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తడి పొడి చెత్తను గుర్తించి వేరు చేయాలని, రెండేళ్ల కిందటే ఈ సంస్కరణలను జీహెచ్‌ఎంసీలో ప్రారంభించామని తెలిపారు. వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు. నగర వాసుల్లో కూడా చైతన్యం పెరిగిందని వ్యాఖ్యానించారు. చెత్త ఎక్కువగా ఉత్పత్తి చేసే హోటళ్లు, పంక్షన్ హాల్ నిర్వాహకులు చెత్త డీకంపోజ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment