Sanitation works
-
వరద బాధితులకు కొండంత అండ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తోంది. వరద వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటినుంచే అప్రమత్తమై ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు రంగంలోకిదిగి అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఉన్నతాధికారులు, ఆ జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుని యుద్ధప్రాతిపదికన పునరావాస ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించారు. అందుకనుగుణంగా చకచకా పునరావాస ఏర్పాట్లు జరిగాయి. గతంలో మాదిరిగా వరద ప్రభావం తగ్గిన తర్వాత తాపీగా అరకొర నిధులు విడుదల చేయడం కాకుండా.. ఐదుజిల్లాలకు అవసరమైన రూ.12 కోట్లు వెంటనే విడుదల చేశారు. ఫలితంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కార్యకలాపాలు పక్కాగా అమలవుతున్నాయి. 216 గ్రామాలకు వరద ముంపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 216 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఆ గ్రామాల నుంచి 52,753 మందిని తరలించారు. వీరిలో 48,345 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. 79 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. వరద ముంపు ప్రభావం అల్లూరి సీతారామరాజు జిల్లాపై ఎక్కువగా ఉండడంతో అక్కడ నాలుగు మండలాల పరిధిలోని 96 గ్రామాల ప్రజల కోసం 51 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో 43,587 మంది ఆశ్రయం పొందుతున్నారు. పారిశుధ్య పనులు ముమ్మరం వరద తగ్గిన తర్వాత బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి తమ ఇళ్లకు వెళ్లేటప్పుడు వారికి రూ.వెయ్యి నుంచి రూ. 2 వేల ఆర్థికసాయం అందించాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టంగా ఆదేశాలు జారీచేయడంతో అధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ డబ్బు పంపిణీ కోసం ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉత్వర్వులు జారీచేసింది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ ఇస్తున్నారు. ఐదు వరద ప్రభావిత జిల్లాల్లో దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచారు. గతంలో ఇది రూ.5 వేలు ఉండగా సీఎం సూచనతో దాన్ని రూ.10 వేలకు పెంచుతూ జీవో జారీ అయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సరఫరా పథకాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఇప్పటికే పునరుద్ధరించారు. ఆ గ్రామాల్లో పారిశుధ్యం దిగజారకుండా బ్లీచింగ్ చల్లడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. గ్రామ వలంటీర్లు చురుగ్గా పనిచేస్తూ స్థానికంగా ఉన్న పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారమిస్తున్నారు. గ్రామ సచివాలయాల నుంచే గ్రామాల వారీగా సహాయక చర్యలు జరుగుతున్న తీరును కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని ముంపు గ్రామాల్లో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చింతూరు కేంద్రంగా డివిజన్లోని ముంపు ప్రాంతాలకు లాంచీలు, మరబోట్ల ద్వారా బియ్యం, కందిపప్పు, కూరగాయలు, పాలప్యాకెట్లు, కొవ్వొత్తులు, టార్పాలిన్లు సరఫరా చేస్తున్నారు. వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పట్టణ ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు రప్పిస్తున్నారు. వరదలకు చింతూరు డివిజన్లో 250 గ్రామాలకు చెందిన 17 వేల కుటుంబాలు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. ఎటపాక మండలం నెల్లిపాకకు చెందిన దేదారి రాముడు (50) అనే వ్యక్తి పశువులు మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ వరదనీటిలో పడి మృతిచెందాడు. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వరద బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. పునరావాస కేంద్రాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. బాధితులకు ఆహార, తాగునీటి అవసరాలు తీరుస్తూ, అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నారు. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 1,321 కుటుంబాలకు చెందిన 3,787 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికుల రాకపోకలకు అనువుగా 172 పడవలు ఏర్పాటు చేశారు. వరదలకు బాధితులకు పునరావాసం కల్పించడంతోపాటు భోజన ప్యాకెట్లు అందిస్తున్నారు. కె.గంగవరం మండలం కోటిపల్లి వద్ద మత్స్యకార కాలనీ ముంపు బారిన పడింది. ఇక్కడ 300 మందికి భోజన వసతి కల్పించారు. ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో 700 మందికి ఆహార పొట్లాలు అందించారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి, పాశర్లపూడిలంకల్లో సుమారు 400 మందికి భోజన ప్యాకెట్లను పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పంపిణీ చేశారు. జిల్లాలో 20 పునరావాస కేంద్రాలు నడుస్తూండగా, బాధితులకు 21,756 భోజన ప్యాకెట్లు అందజేశారు. 33 వేల మంచినీటి ప్యాకెట్లు, 4,400 వరకు 20 లీటర్ల వాటర్ టిన్నులను అందించారు. -
Hyderabad: టీచర్ల నిర్వాకం.. విద్యార్థులతో పారిశుద్ధ్య పనులు..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో సర్కారు బడుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. కనీస అవసరాలకు నిధులు విదిల్చని సర్కారు తీరు, విద్యాశాఖాధికారుల ప్రేక్షక పాత్ర నిరుపేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన గురువులు విద్యార్ధులతో పారిశుద్ధ్య పనులు చేయించడం విస్మయానికి గురిచేస్తోంది. కరోనా కంటే ముందు సర్కారు బడుల్లో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నా.. ఆ తర్వాత సరైన నిర్వహణ లేకుండా పోయింది. ఒక వైపు ఉపాధ్యాయుల కొరతతో బోధన అంతంత మాత్రం కాగా, మరోవైపు వసతుల లేమి, పారిశుధ్య పనులు కూడా సమస్యగా తయారయ్యాయి. పాఠశాల నిర్వహణకు నిధులేవీ..? గత రెండేళ్లుగా పాఠాశాల నిర్వహణకు నిధుల కొరత వెంటాడుతోంది. గతంలో స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో ప్రతి పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం నిధులు కేటాయించేది. 1 నుంచి 15 మంది విద్యార్థులు గల పాఠశాలకు ఏడాదికి రూ.12,500, 16 నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25,000, అదేవిధంగా 101 నుంచి 250 మంది ఉంటే రూ.50,000, 251 నుంచి 1000 మంది ఉంటే రూ,75,000, వెయ్యికి పైగా విద్యార్థులు గల పాఠశాలలకు రూ. లక్ష కేటాయించేవారు. ఆయా స్కూళ్లకు ఇచి్చన నిధులను రిజిస్టర్లు, చాక్‌పీస్‌లు, విద్యుత్ బిల్లులు, కంప్యూటర్ల మరమ్మతుల ఖర్చుతోపాటు, స్కావెంజర్ల వేతనాలు చెల్లింపునకు వినియోగించేవారు. మొత్తం మీద విడుదలైన నిధులను హెచ్ఎంలు సర్దుబాటు చేస్తూ పనులను పూర్తి చేసేవారు. స్కావెంజర్లు లేక.. సర్కారు బడుల్లో తరగతి గదులు, మరుగుదొడ్లను శుభ్రం చేసే ఒక్కో స్కావెంజర్‌కు రూ.2,500 నుంచి రూ.3000 చెల్లించేవారు. కరోనాతో 2020 మార్చిలో పాఠశాలలు మూతపడినప్పటి నుంచి స్కూల్ మెయింటనెన్స్ నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో స్కావెంజర్ల సమస్య ఏర్పడింది. రెండేళ్లుగా స్కూల్ మెయింటెనెన్స్ నిధులను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కొన్ని స్కూళ్లలో టీచర్లు సొంతంగా డబ్బులు సమకూర్చుకుని స్కావెంజర్లను నియమించుకున్నారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్ధులతో తరగతి గదులు, టాయిలెట్లను శుభ్రం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్కారు బడులు ఇలా ►మహానగర పరిధిలో సుమారు 2497 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 3.67 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ►హైదరాబాద్ జిల్లాలో 691 పాఠశాలల్లో 1,12, 686 మంది విద్యనభ్యసిస్తున్నారు. ►రంగారెడ్డిలో 1301 స్కూళ్లలో 165,856 మంది విద్యార్థులు చదువు తున్నారు. ►మేడ్చల్‌లోని 505 బడుల్లో 90,358 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. సరూర్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్లు, స్కావెంజర్లు లేకపోవడంతో విద్యార్థినులతో తరగతి గదులు, టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచి్చంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి సదరు ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. తరగతి గదులు శుభ్రం చేస్తే తప్పేంటని, ఇష్టం లేకుంటే స్కూల్ నుంచి టీసీ తీసుకెళ్లండని ఆయన దురుసుగా సమాధానం ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. నగరంలో సుమారు 40 శాతం పైగా స్కూళ్లల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
గ్రామాల్లో పారిశుధ్యంపై ‘యాప్’
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేసింది. తమ ఇళ్ల పరిసరాల్లో అపరిశుభ్రతపై స్థానికులు మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా సర్పంచ్ ఆధ్వర్యం లో సంబంధిత పంచాయతీ కార్యదర్శి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టింది. గ్రామాలను పరి శుభ్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకునే చర్యల ఆధా రంగా పంచాయతీ కార్యదర్శుల పనితీరుకు రేటింగ్ ఇవ్వనున్నారు. యాప్ ద్వారా అందే ఫిర్యాదుల పరి ష్కారంపై పర్యవేక్షణకు జిల్లా డీపీవో కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూంలతో పాటు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలో మరొకటి ఇప్పటికే ఏర్పాటయ్యాయి. ఫిర్యాదు అందిన తర్వాత 72 గంటలపాటు కంట్రోల్ రూం ద్వారా పర్య వేక్షిస్తారు. పరిష్కరించిన తర్వాత ఫిర్యాదుదారుడికి ఎస్ఎంఎస్ ద్వారా వివరాలు తెలియజేస్తారు. ఒకవే ళ సంతృప్తి చెందకున్నా, పంచాయతీ కార్యదర్శి ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వకున్నా మరోసారి ఫిర్యాదు చేసే వీలుంది. ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే పంచాయతీ కార్యదర్శి పనితీరుపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటారు. అతి త్వరలో అందుబాటులోకి యాప్.. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ‘జేఎస్ఎస్’ పేరుతో ఇప్పటికే మొబైల్ యాప్ సిద్ధమైంది. రెండు మూడు రోజుల్లో ప్లే స్టోర్ ద్వారా యాప్ అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. తప్పుడు ఫిర్యాదులకు అవకాశం లేకుండా అప్పటికప్పుడు తీసిన ఫోటో లేదా చిన్నపాటి వీడియోను మాత్రమే ఫిర్యాదుతో జోడించేలా యాప్‌ను రూపొందించారు. యాప్ ద్వారా పంపిన ఫిర్యాదు వెంటనే సంబంధిత గ్రామ కార్యదర్శికి చేరుతుంది. 24 గంటల తర్వాత మండల స్థాయి ఈవోపీఆర్డీకి, 48 గంటల తర్వాత జిల్లా డీపీవో కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం వద్దకు ఆటోమెటిక్‌గా సమాచారం అందుతుంది. ఏ అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు? క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గ్రామాలను సైతం పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభించిన విషయం తెలిసిం దే. పల్లెల్లోనూ ప్రతి ఇంటినుంచి చెత్తసేకరణ కార్య క్రమాన్ని చేపడుతున్నారు. తమ ఇళ్ల నుంచి నిర్ణీత గడువు ప్రకారం రోజువారీ చెత్తను సేకరించక పో యినా, రోడ్లపక్కన ఒకేచోట పెద్దమొత్తంలో పేరుకు పోయినా, మురుగు కాల్వలు సక్రమంగా లేకున్నా, మురుగునీటి గుంతలున్నా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వీలుంది. ఫిర్యాదులో వివరాలు నమోదు చేసేలా వీలు కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతో.. గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీలకు అవసరమైన సామగ్రిని ప్రభుత్వ మే అందజేస్తోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు, ఆటో రిక్షాలు లాంటివి అన్ని గ్రామాలకు సరఫరా చేసింది. అక్టోబరు 2న జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభమైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 55.41 లక్షల ఇళ్ల నుంచి రోజువారీ చెత్త సేకరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరుగుదొడ్లను శుభ్రం చేసే హై ప్రెజర్ క్లీనర్స్, దోమల నివారణకు ప్రతి గ్రామానికి ఒక ఫాగింగ్ మిషన్, ఇతర యంత్రాల సరఫరాకు చర్యలు చేపట్టారు. 2022 డిసెంబరు వరకు పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షించే ఈ కార్యక్రమాలు తర్వాత పంచాయతీ, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతాయి. -
పరిశుభ్ర గ్రామాల కోసం జూలై 8 నుంచి జగనన్న స్వచ్ఛ సంకల్పం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8వ తేదీన సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. అప్పటిలోగా పంచాయతీల్లో అన్ని వనరులను సమీకరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణకు జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చేనెల 8వ తేదీ నుంచి ప్రతి 250 నివాసాల నుంచి చెత్తను సేకరించే ఒకరిని గ్రీన్ అంబాసిడర్‌గా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం సన్నాహక కార్యక్రమాల ద్వారా కోవిడ్ సమయంలో గ్రామాల్లో పారిశుధ్యం, శుభ్రత విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని, వారిని కూడా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయాలని సూచించారు. జగనన్న కాలనీల్లో గృహనిర్మాణ పనులు ఈ ఏడాది పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్నాయని, ఆయా కాలనీల్లో ఉపాధిహామీ పథకంలో అవెన్యూ ప్లాంటేషన్ భారీగా చేపట్టాలని చెప్పారు. నీడనిచ్చే చెట్లతో పాటు పండ్ల మొక్కలు నాటాలని, అవసరమైతే ప్రైవేటు నర్సరీల నుంచి కూడా కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ ఏడాది, గత ఏడాది నాటిన మొక్కల్లో 66 శాతం బతికాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ ఎం.గిరిజాశంకర్, సెర్ఫ్ సీఈవో రాజాబాబు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, ఉపాధిహామీ పథకం డైరెక్టర్ చిన్నతాతయ్య, పంచాయతీరాజ్ ఈఎన్సీ సుబ్బారెడ్డి, ఆర్‌డబ్లు్యఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ పారిశుద్ధ్య కార్మీకులకు ప్రత్యేక కిట్లు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వర్తించే వారికి పీపీఈ కిట్ల తరహాలో ప్రత్యేక కిట్లను సమకూర్చింది. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపుల ఉండే మురుగు కాల్వల్లో పూడిక తీత, రోడ్లను శుభ్రం చేయడం, ఇంటింటి చెత్త సేకరణ వంటి పనులు చేసే వారికి ప్రత్యేకంగా ఈ కిట్లను అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 16,165 కిట్లను గ్రామపంచాయతీలకు సమకూర్చినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఒక్కో కిట్‌లో రెండు జతల బూట్లు, రెండు జతల ప్లాస్టిక్ గ్లౌజులు, ఒక కోట్ ఉంటాయి. కార్మీకులు పనిచేసిన తర్వాత ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుని, తిరిగి ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక కిట్లను తయారు చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. -
పారిశుధ్యం నిరంతరం కొనసాగాలి
సాక్షి, సంగారెడ్డి/సాక్షి, కామారెడ్డి/సాక్షి, వికారాబాద్: పారిశుధ్యం, పచ్చదనం కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. ఈ నెల 1 నుంచి పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లా ల్లో గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ ఎలా ఉందో ప్రత్యక్షంగా చూడడానికి అధికారులకు సమాచారం లేకుండా ఆకస్మికంగా వచ్చానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం లోని ఎద్దుమైలారం, కొండాపూర్ మండలంలోని గుంతపల్లి గ్రామాల తనిఖీ సందర్భం గా మాట్లాడుతూ..జిల్లాలో రెండు గ్రామాలను పరిశీలిస్తే పారిశుధ్య కార్యక్రమాలు బాగా చేసినట్లు ఉందన్నారు. గ్రామ పంచాయతీకో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను రాష్ట్ర వ్యాప్తం గా ఇవ్వడం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. త్వరలో హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని, మొక్కలను విరివిగా నాటా లని, ప్రతి గ్రామంలో ఓ నర్సరీ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా రూ.380 కోట్లు.. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి, కామారెడ్డి మండలంలోని గుర్గుల్ గ్రామాల్లో తనిఖీల సందర్శంగా సీఎస్ మాట్లాడుతూ, గ్రామాల్లో మొదటి, రెండో దశల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా రూ.380 కోట్లు మంజూరు చేస్తోందన్నారు. వికారాబాద్ జిల్లా పెండ్లిమడుగు, దాతాపూర్ గ్రామాల్లో తనిఖీ పూర్తయిన అనంతరం మాట్లాడుతూ, ఆకస్మిక తనిఖీ తనకు సంతృప్తి నిచ్చిందన్నారు. కామారెడ్డి జిల్లాలో వైకుంఠధామాల్లో బాడీ ఫ్రీజర్లు ఉంచాలన్న ఆలో చన నచ్చిందని, వికారాబాద్‌లో నర్సరీలు బాగున్నాయని చెప్పారు. త్వరలోనే రైతుల ద్వారా ఆగ్రోఫారెస్టీ విధానం అమలులోకి తెస్తామన్నారు. ఆయన వెంట పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. -
విషాద జ్ఞాపకాల్ని కడిగేసి..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విష వాయువు చేదు జ్ఞాపకాలను కడిగేశారు. స్టైరీన్ అవశేషాలు ఒక్క శాతం కూడా లేకుండా తుడిచేశారు. మూగజీవాల మృత కళేబరాలను తొలగించారు. ప్రతి గ్రామం.. వీధి.. ప్రతి ఇంటినీ జల్లెడపట్టి కాలుష్య ఛాయలు లేకుండా క్లీన్ చేశారు. ప్రమాదానికి గురైన ఆర్ఆర్ వెంకటాపురం, నందమూరి నగర్, కంపర పాలెం, పద్మనాభ నగర్, ఎస్సీ, బీసీ కాలనీ రూపురేఖలను కేవలం ఐదు రోజుల్లో మార్చేసిన ప్రభుత్వ యంత్రాంగం గ్రామాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చింది. (గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ) సీఎం ఆదేశాలతో.. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు 5 గ్రామాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇందుకోసం 700 మంది సిబ్బందిని మోహరించారు. ► గ్రామాల్లోని ప్రధాన, అంతర్గత రహదారులను శుభ్రం చేశారు. వాయు కాలుష్యానికి మాడిపోయిన చెట్లు, మొక్కలను, కాలువల్లో పూడికను తొలగించారు. చనిపోయిన పశు కళేబరాలను తరలించారు. ► వాటర్ ట్యాంకర్ల సాయంతో ఇళ్ల లోపల కూడా రసాయనిక వాయువుల జాడ లేకుండా శుభ్రం చేశారు. ► 30 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో 5 బెల్ మిస్ట్ భారీ యంత్రాలు, 6 టాటా ఏస్ వాహనాల ద్వారా ప్రధాన రోడ్లపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేసి బ్లీచింగ్ చల్లారు. ► వ్యాధులు ప్రబలకుండా 100 మంది మలేరియా సిబ్బంది పర్యవేక్షణలో పనులు చేపట్టారు. గ్రామాల్లోకి వచ్చాక ప్రజలు చేయాల్సిన పనులు, చేయకూడని పనులను వివరిస్తూ అవగాహన కల్పించారు. ► సోమవారం సాయంత్రానికి ఐదు గ్రామాల ప్రజలను వారి ఇళ్లకు తరలించారు. ► వాటర్ వర్క్స్ ఏఈల ఆధ్వర్యంలో స్టోరేజ్ ట్యాంకుల్లో నీటిని శుభ్రం చేశారు. గ్రామాల్లో తాగునీరు, ఇతర అవసరాలకు ఎస్ఈ వేణుగోపాల్ ఆదేశాలతో 30 ట్యాంకర్లతో 80 ట్రిప్పులు సరఫరా చేశారు. ► కుళాయిల ద్వారా కూడా గృహాలకు మంచినీటి సరఫరా చేశారు. అలాగే యూసీడీ పీడీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం రాత్రికి గ్రామస్తులకు అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించారు. ► ఐదు గ్రామాల ప్రజలకు 20 వేల మాస్కులను పంపిణీ చేశారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అన్ని వసతులు కల్పించారు ప్రభుత్వం చెప్పిన విధంగానే మాకు అన్ని వసతులు కల్పించారు. ఈ ప్రాంతంలో అంతటి ప్రమాదం జరిగిందన్న ఆనవాళ్లు లేకుండా ఊళ్లను శుభ్రం చేయించారు. – పుల్లేటికుర్తి పుష్ప, వెంకటాపురం ప్రభుత్వ చర్యలు బాగున్నాయి ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించిన తీరు అద్భుతం. ఆసుపత్రుల్లో ఉన్న బాధితులకు సైతం భరోసా కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా బాగుంది. – వెంకటరమణరావు, న్యాయవాది, వెంకటాపురం జీవితాంతం రుణపడి ఉంటాం ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే మమ్మల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చారు. సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటాం. – యడ్ల వరలక్ష్మి, వెంకటాపురం నాలుగు రోజుల తర్వాత అమ్మ ఒడికి... నాలుగు రోజుల తర్వాత చంటి బిడ్డ కనిపించడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో అస్వస్థతకు గురైన ఎ.నాగమణి ఈ నెల 7 నుంచి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. సోమవారం ఆమె కోలుకోవడంతో రెండు నెలల పసికందును బంధువులు తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. కన్నబిడ్డకు కడుపునిండా పాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నానని నాగమణి కంటతడి పెట్టడంతో అక్కడున్న అందరి కళ్లూ చెమర్చాయి. దీంతో మంత్రులు, ఇతర అధికారులు ఆమెను ఓదార్చారు. ఊళ్లకు కళొచ్చింది స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనతో చెల్లాచెదురైన గ్రామాలు కోలుకున్నాయి. ఐదు గ్రామాలను అన్నివిధాలా నివాసయోగ్యంగా తీర్చిదిద్దటంతో ప్రజలను వారి ఇళ్లల్లోకి సోమవారం అనుమతించారు. రాత్రి సమయానికి 70 శాతం ప్రజలు ఇళ్లకు చేరుకున్నారు. క్షేమంగా చేరారు ► ఎల్జీ పాలిమర్స్‌కి ఆనుకుని ఉన్న వెంకటాపురంలో 1,250 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ నివసించే 5 వేల మందిలో 3 వేల మంది ఇళ్లకు చేరుకున్నారు. మిగతా వారు షెల్టర్లు, బంధువుల ఇళ్లలో ఉన్నారు. అస్వస్థతకు గురైన వారు కేజీహెచ్‌లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారు. ► కంపెనీకి కిలోమీటరు దూరంలో ఉన్న నందమూరి నగర్లో 600 వరకూ ఇళ్లు, 2,250 మంది జనాభా ఉన్నారు. వారిలో 70 శాతం మంది సోమవారమే తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. ► 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభ నగర్లో 500 వరకూ ఇళ్లు, 2,200 మంది జనాభా ఉంది. గ్రామస్తులంతా ఇళ్లకు చేరుకున్నారు. మేఘాద్రి గెడ్డ నీరు సురక్షితమే ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకైన ఘటనలో మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ స్టైరీన్‌తో కలుషితమైపోయిందన్న సందేహాలను నివృత్తి చేస్తూ కాలుష్య నియంత్రణ మండలి నివేదిక విడుదల చేసింది. దుర్ఘటన జరిగిన నాటి నుంచి రోజూ రిజర్వాయర్ నీటి శాంపిళ్లని పరీక్షల కోసం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ రీజనల్ వాటర్ లేబొరేటరీకి పంపించింది. ఈ నెల 7న పంపించిన శాంపిళ్లకు సంబంధించిన నివేదికను జీవీఎంసీకి కాలుష్య నియంత్రణ మండలి అందించింది. తొలి రోజు తీసుకున్న శాంపిళ్లలో స్టైరీన్ మోనోమర్ అవశేషాలు లేవని నివేదికలో పేర్కొంది. నీరు వినియోగించేందుకు సురక్షితంగా ఉందని తెలిపింది. -
ప్రజలంతా భౌతిక దూరం పాటించాలి: గ్రంధి శ్రీనివాస్
-
ఉంగుటూరులో ముమ్మరంగా శానిటేషన్ పనులు
-
గుడులను ‘ఊడ్చే’ గుత్తేదార్!
సాక్షి, విజయవాడ: టీడీపీ హయాంలో విజయవాడలోని కనకదుర్గ గుడితోపాటు మరో ఆరు దేవాలయాల్లో పారిశుధ్య పనుల కాంట్రాక్టును అత్యధిక ధరలకు దక్కించుకున్న సంస్థ దీన్ని మరి కొన్నేళ్లు పొడిగించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సంస్థకు టెండర్ కొనసాగించడం దేవస్థానానికి భారంగా మారుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు. లోకేష్ బంధువు సంస్ధ.... మాజీ మంత్రి నారా లోకేష్‌కు బంధువైన తిరుపతికి చెందిన భాస్కరనాయుడు ఆధ్వర్యంలోని పద్మావతి హాస్పిటాలిటీస్ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ పలు దేవాలయాల్లో పారిశుధ్య పనులను నిర్వహిస్తోంది. గతంలో టీటీడీలో స్వీపింగ్, క్లీనింగ్ కాంట్రాక్టు పనులను దక్కించుకున్న ఈ సంస్థ తీరు వివాదాస్పదం కావడంతో పక్కనపెట్టారు. అయితే టీడీపీ పెద్దల ఒత్తిడితో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం తదితర చోట్ల స్వీపింగ్, క్లీనింగ్ పనులను ఇదే సంస్థకు కట్టబెట్టారు. ఎలాంటి టెండర్లు లేకుండానే అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ మూడేళ్ల పాటు ఈ పనులను కాంట్రాక్టుపై అప్పగించడం గమనార్హం. 2018లో మరో ఏడాది పాటు దీన్ని పొడిగించారు. ఈ ఏడాది ఆగస్టుతో కాంట్రాక్టు గడువు ముగియనుంది. దేవస్థానంపై అదనపు భారం... 2015 వరకు దుర్గగుడిలో పారిశుద్ధ్య పనులకు స్థానికంగా దేవస్థానం అధికారులే టెండర్ పిలిచి అర్హత కలిగిన సంస్థకు అప్పగించేవారు. సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించి స్వీపింగ్, క్లీనింగ్ మెటీరియల్‌ను దేవస్థానమే కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించింది. ఇందుకోసం నెలకు రూ.25 లక్షల వరకు దేవస్థానానికి ఖర్చు అయ్యేది. టీడీపీ పాలనలో లోకేష్ సిఫారసుతో పద్మావతి సంస్థకు నెలకు రూ. 33 లక్షల చొప్పున కాంట్రాక్టుపై ఇచ్చారు. దీంతో దుర్గగుడి దేవస్థానంపై ఏడాదికి అదనంగా రూ.96 లక్షల వరకు భారం పడింది. గత నాలుగేళ్లుగా ఈ కాంట్రాక్టు కొనసాగింది. అయితే పారిశుధ్య పనులను నిర్ణీత ప్రమాణాల మేరకు నిర్వహించడంలో కాంట్రాక్టు సంస్థ విఫలమైంది. మరోవైపు పద్మావతి సంస్థలో పనిచేసే సిబ్బందికి సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదు. ‘పద్మావతి’ పైరవీలు మరో మూడేళ్లు తమనే కొనసాగించాలని పద్మావతి సంస్థ ప్రతినిధులు దేవదాయశాఖ ఉన్నతాధికారుల వద్ద పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా టెండర్ ఖరారు చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దుర్గగుడి టెండర్ ఖరారు అయితే మిగిలిన దేవాలయాల్లో కూడా పొడిగించుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సంస్థను పక్కన పెట్టి ఈ టెండర్లు ద్వారా తక్కువ రేటుకు పారిశుధ్య పనులు నిర్వహించే సంస్థకు పనులు అప్పగించాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు. -
ముమ్మరంగా పారిశుధ్య పనులు
సాక్షి, పెన్‌పహాడ్ : నూతన సర్పంచ్‌లు తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని తొలగిస్తూ ముగురుకాల్వలను శూభ్రం చేస్తూ పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. ఎలాగైనా గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనులను వేగవంతంగా చేశారు. మండలంలోని 29గ్రామపంచాయతీలకు గాను దాదాపు అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యం గా మేజర్ గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న పనులు.. కాలనీల్లోని మురికి కాల్వల్లో, రోడ్లకు ఇరుపక్కల పేరుకుపోయి ఉన్న పారిశుద్ధ్య సిబ్బందితో పాటు సర్పంచ్‌లు మురికి కాల్వలను శుభ్రం చేశారు. గత సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలలపాటు గ్రామాల ప్రత్యేక అధికారుల చేతిలో ఉండడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి పలు సమస్యలు నెలకొన్నాయి. కొత్త సర్పంచ్‌లు పదవి చేపట్టగానే వారికి అనేక సమస్యలు స్వాగతం పలికినప్పటికీ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. వీటితో పాటు గ్రామాల్లో మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండగా ప్రతి ఇంటికి నల్లా నీరు అందించే విధంగా కొత్త పైపులైన్లు వేయించి వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల మధ్యన ఉంటూ గ్రామ అభివృద్ధి పనులు చేస్తున్న సర్పంచ్‌లను గ్రామస్తులు కొనియాడుతున్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యం గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా, మురికి కాల్వల్లో పెరిగిన పిచ్చిమొక్కలను, పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని తొలగిస్తున్నాం. దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ఉండేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నాం. లీకైన పైపులైన్‌ను సరిచేసి కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాం. – బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్, అనంతారం ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా.. చీదెళ్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్న అందులో భాగంగా మురికి కాల్వలు, రోడ్లపై పడిన చెత్తా, చెదారాన్ని కూలీల చేత తొలగించి పరిశుభ్రం చేయిస్తున్నాం. అలాగే వేసవికాలం ఆరంభమైన సందర్భంగా గ్రామంలో మంచినీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తాం. – పరెడ్డి సీతారాంరెడ్డి, సర్పంచ్, చీదెళ్లగ్రామాభివృద్ధే లక్ష్యం -
అండాలమ్మా.. బాగున్నావా
సాక్షి, హైదరాబాద్: అది సచివాలయం సమీపంలోని అన్మోల్ హోటల్. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికురాలి వద్ద సడన్‌గా ఇన్నోవా కారు ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు అధికారులు ఆమె పేరు, వివరాలు తెలుసుకున్నారు. నెలనెలా జీతం అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. ఆమెకు జీవిత భీమా సదుపాయం ఉందో లేదో తెలుసుకున్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నదీ లేనిదీ అడిగారు. తన పేరు అండాలమ్మ అని, ప్రతినెలా వేతనం సక్రమంగా అందుతోందని తెలిపిన ఆమె, ప్రతిరోజూ బయెమెట్రిక్ హాజరు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇంతకీ తామెవరో తెలుసా? అంటే తెలియదని సమాధానం ఇచ్చింది. తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌నని, ఈమె ఆరోగ్యవిభాగం అదనపు కమిషనర్ శృతిఓజా అని బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. దాంతో ఆమెకు నోట మాటరాలేదు. ఆశ్యర్యం వ్యక్తం చేసింది. కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్థాయిలోని ఉన్నతాధికారులు తనతో మాట్లాడటం ఇదే మొదటిసారి అని, తన యోగక్షేమాలు తెలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేసింది. -
నిబంధనలు గాలికి.. నిధులు అక్రమార్కులకు!
- జిల్లా ఆసుపత్రుల పారిశుధ్య పనుల్లో అక్రమాల ఆరోపణలు - రిజిస్ట్రరైన సంస్థలకే టెండర్లివ్వడంపై సందేహాలు సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల్లో పారిశుధ్య పనుల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయా..? ప్రభుత్వ సంకల్పాన్ని అమలు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారా.. జిల్లా ఆస్పత్రుల్లో పారిశుధ్య టెండర్ల ప్రక్రియ చూస్తుంటే ఈ అనుమానాలు రాకమానవు. జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న పారిశుధ్యం, సెక్యూరిటీ, కీటకాల నివారణ, పేషెంట్ కేర్ వంటి టెండర్ పనులను కనీస గుర్తింపు లేని సంస్థలు దక్కించుకుంటున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. గత మార్చిలో టెండర్ నోటిఫికేషన్ వెలువడ్డాక రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంస్థలు కూడా టెండర్లు దక్కించుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఆస్పత్రుల్లో ఆయా పనులకు మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కలెక్టర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్లు టెండర్లు నిర్వహించి ఏజెన్సీలకు పనులు అప్పజెప్పాలి. కానీ టెండర్ల నిర్వహణ పూర్తిగా పక్కదారి పట్టిందన్న విమర్శలున్నాయి. ఈ పనులకు ఏమాత్రం సంబంధం లేని సంస్థలు తెరమీదకొచ్చాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిబంధనలకు పాతర: ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన నిబంధనలను గాలికొదిలేశారు. టెండర్లలో పొందుపరిచిన కనీస నిబంధనలను చూడకుండా సంస్థలకు పనులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పనుల నిర్వహణకు సంబంధించి అనుభవం లేకపోయినా కొన్ని సంస్థలకు టెండర్లు కట్టబెట్టారు. కొన్ని సంస్థలైతే కీటకాల నిర్వహణ లైసెన్సులు నకిలీవి సృష్టించి టెండర్లు వేశాయి. సంగారెడ్డి జిల్లాలో టెండరు దక్కించుకున్న ఒక కాంట్రాక్టరుకు అర్హతలేమీ లేకుండానే ఇచ్చినట్టు విమర్శలు వస్తున్నాయి. అయితే స్థానిక నేతల అండతో కొందరు కాంట్రాక్టర్లు ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. టెండరు ప్రమాణాలు లేకుండానే.. ► టెండరు దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలించాలి. కానీ అధికారులు వాటిని పరిశీలించనే లేదు. ► జీవో నంబర్ 9 ప్రకారం పేషెంట్ కేర్‌కు సంబంధించి అనుభవం ఉండాలి. అవేమీ లేకుండానే సంస్థలకు అనుమతులిస్తున్నారు. ► టెండర్లలో పాల్గొన్న పలు సంస్థలు నకిలీ అనుభవ ధ్రువపత్రాలు సమర్పించాయి. దీంతో చిన్న మండల కేంద్రాల్లో ఉన్న లోకల్ ఏజెన్సీలు కూడా తెరమీదకొచ్చాయి. ► చాలామంది కాంట్రాక్టర్లు కీటకాల నిర్వహణకు సంబంధించిన లైసెన్సులను టెండర్ నోటిఫికేషన్ విడుదలయ్యాక తెచ్చుకున్నవిగా తేలింది. అంటే వీళ్లకు ఏమాత్రం ముందస్తు అనుభవం లేదు. -
పుష్కరాల్లో పక్కాగా పారిశుద్ధ్యం
విజయవాడ సెంట్రల్ : పుష్కరాల్లో పారిశుధ్యపనుల్ని యాక్షన్‌ప్లాన్ ప్రకారం పక్కగా నిర్వహించాలని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సీడీఎంఏ) కన్నబాబు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్పొరేషన్ కౌన్సిల్హాల్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ తేదీన ప్రీ పుష్కర పనుల్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు తాము సరఫరా చేయాల్సిన కార్మికుల్ని ఆ తేదీనాటికి విధుల్లో చేర్చాలన్నారు. ప్రతిరోజు మూడు షిప్టులుగా విభజించి పనులు కేటాయిస్తామని, విధులకు అరగంట ముందే ఘాట్లలోని శానిటరీ ఇన్స్పెక్టర్లకు కార్మికులు రిపోర్టు చేయాలని ఆదేశించారు. విధుల మధ్యలో కార్మికులు వెళ్లిపోయినట్లైతే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవన్నారు. ప్రతి ఐదు రోజులకు ఒకసారి కార్మికులకు జీతాలు విడుదల చేస్తామన్నారు. సక్రమంగా జీతాలు ఇవ్వని కాంట్రాక్టర్లపై జరిమానా విధించడంతో పాటు బిల్లుల చెల్లింపుల్ని నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. చెత్త కనిపించరాదు చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజారోగ్యశాఖ అధికారులు కృషి చేయాలని కన్నబాబు ఆదేశించారు. మేజర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్ల సిల్టును తొలగించేందుకు నగరపాలక సంస్థ సిబ్బందినిమాత్రమే వినియోగించాల న్నారు. పారిశుద్ధ్య పనిముట్లను కాంట్రాక్టర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. పిండప్రదానాల షెడ్లలో మౌలిక వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు వినియోగించే వాహనాల వివరాలను రూట్ మ్యాపులను పోలీస్‌శాఖకు ముందుగానే అందించి అనుమతులుపొందాలన్నారు. మరుగుదొడ్లు ఉండే ప్రాంతాల్లో నిరంతర నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ ఎంఏ.షుకూర్, జేడీ పూర్ణచంద్రరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, ఈఈలు జీఆర్టి. ఓం ప్రకాష్, ధనుంజయ, వివిధ మునిసిపాల్టీల కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
అవినీతి కంపు!
► పారిశుద్ధ్య కార్మికుల ప్రోత్సాహకాల్లో చేతివాటం ► రూ.130 కొబ్బరి నూనెకు రూ.260 బిల్లు ► రూ.16 సబ్బుకు రూ.23 దండుకున్న వైనం ► చెప్పుల పంపిణీలోనూ చిలక్కొట్టుడు ► చిత్తూరు కార్పొషన్‌లో ఇదీ సంగతి పారిశుద్ధ్య కార్మికులు.. ఎండనక వాననక, పగలనక రాత్రనక రోడ్లపై చెత్తను తీసి, కాలువల్లో మురుగును తొలగిస్తూ సేవలందించే వాళ్లు. ఎంతటి వారైనా చేతనైతే వీళ్లకు సాయం చేస్తారనుకుంటారే తప్ప, వారి వద్ద దోచుకోవాలని అనుకోరు. కానీ చిత్తూరు కార్పొరేషన్లో చెత్త తీసే కార్మికుల్నీ వదల లేదు. కార్మికులకు ఇచ్చే కొబ్బరి నూనె, చెప్పులు, సబ్బుల్లో చేతివాటం చూపించి రూ.లక్షలు మింగేస్తున్నారు. చిత్తూరు (అర్బన్): చిత్తూరు కార్పొరేషన్లో పారిశుద్ధ్య పనులుచేసే కార్మికులకు ప్రతి నెలా 350 మి.లీ కొబ్బరినూనె, నెలకు ఓ సబ్బు, ఆర్నెళ్లకు జత పాదరక్షలు ఇవ్వాలి. కాలువల్లో దిగి పనులు చేసేటప్పుడు, చెత్తను శుభ్రం చేసేటప్పుడు నూనెను చర్మానికి రాసుకోవడం, పనులు పూర్తయిన తరువాత సబ్బుతో కడుక్కోవడానికి ఇలా ఇవ్వాలనేది నిబంధన. ఇందుకోసం ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి టెండర్లు పిలిచి, ఎవరైతే నాణ్యమైన వస్తువుల్ని అందిస్తారో అలాంటి వారికి పనులు అప్పగించాలి. ఇలా జరిగింది.. 2015-16 ఆర్థిక సంవత్సరానికి చిత్తూరు కార్పొరేషన్లో పనిచేస్తున్న 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు (శాశ్వత ప్రాతిపదికన) ఇటీవల అధికారులు ఈ వస్తువులను అందచేశారు. ఇందులో కాంట్రాక్టర్ చెప్పిందే వేదంగా అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు విమర్శలకు, ఆరోపణలకు దారితీస్తోంది. ఏడాదికి ఒక్కో కార్మికుడికి 4.200 లీటర్ల కొబ్బరి నూనెను ఇవ్వాల్సి ఉండగా, 4.100 లీటర్లు మాత్రమే ఇచ్చారు. ఇందులో వంద గ్రాములు కొట్టేశారు. ఇక కార్మికులకు రూ.23 వెచ్చించి ఒక్కొక్కరికీ 12 సర్ఫ్ఎక్సెల్ సబ్బు ఇచ్చినట్లు చూపించారు. కానీ ఇచ్చింది మాత్రం రూ.16 విలువ చేసే రిన్ సబ్బు. ఒక్కో సబ్బుపై రూ.7 కమీషన్ దక్కింది. అది కూడా 11 సబ్బులే ఇచ్చారు. రెండు జతల చెప్పులకు రూ.900 పైగా బిల్లులు చేసుకున్న వ్యక్తులు కార్మికులకు రూ.400 విలువ కూడా చేయని చెప్పుల్ని అంటగట్టారు. వీటిని ఏ మాత్రం తనిఖీ చేయకుండా, పరిశీలించని అధికారులు దాదాపు రూ.7 లక్షల వరకు బిల్లులు చెల్లించేశారు. ఇందులో కార్పొరేషన్లో గతంలో పనిచేసిన ఓ అధికారికి, ప్రస్తుతం పనిచేస్తున్న మరో ఉన్నతాధికారికి భారీగా ముడుపులు అందాయని తెలిసింది. తాజాగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 176 మంది పారిశుద్ధ్య కార్మికులకు సైతం ఇదే తరహా వస్తువులు పంపిణీ చేసి మరోమారు దోపిడీ చేయడానికి రంగం సిద్ధమవుతుండటం కొసమెరుపు. ‘చిత్తూరు కార్పొరేషన్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఇటీవల పంపిణీ చేసిన కొబ్బరి నూనె డబ్బా ఇది. దీనిపై ఎక్కడా ఐఎస్ఐ మార్కు లేదు. బ్యాచ్ నంబరు లేదు. 15 కిలోల కొబ్బరి నూనె రూ.2 వేలని ముద్రించి ఉంది. అంటే కిలో రూ.133 అన్నమాట. పెద్ద మొత్తంలో కొంటే దీన్ని రూ.వందకు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ ఈ నూనెకు కార్పొరేషన్లో అధికారులు ఇచ్చిన బిల్లు లీటరుకు రూ.240.’ విచారిస్తా ఈ వ్యవహారం నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేయిస్తా. ఎక్కడైనా అవినీతి జరినట్లు నిర్ధారణయితే డబ్బును రికవరీ చేయడంతో పాటు, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెడతా. ప్రస్తుతం సెలవులో ఉన్నా. రెండు రోజుల్లో వచ్చేస్తా.. దీనిపై విచారణకు ఆదేశిస్తా. - జేఆర్.సురేష్, కమిషనర్, చిత్తూరు కార్పొరేషన్ -
క్రియాశీలకంగా పనిచేయండి
స్వచ్ఛభారత్ ప్రచారకర్తలకు రాష్ట్రపతి పిలుపు * స్వచ్ఛభారత్ గీతావిష్కరణ.. ప్రచారకర్తలకు సత్కారం * సత్కార గ్రహీతల్లో తొమ్మిది మంది తెలుగువారు సాక్షి, న్యూఢిల్లీ: పారిశుద్ధ్యం పనులను దత్తత తీసుకునేలా ప్రజలను ప్రభావితం చేయాలని స్వచ్ఛభారత్ ప్రచారకర్తలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కోరారు. ప్రతి పట్టణం శుభ్రం అయ్యేంతవరకు ప్రచారకర్తలు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన రాష్ట్రపతి భవన్లో స్వచ్ఛభారత్‌పై జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్‌పై ప్రఖ్యాత సినీగేయ రచయిత ప్రసూన్ జోషి రచించిన గేయాన్ని ఆయన విడుదల చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతమవడానికి ప్రచారకర్తలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. ‘స్వచ్ఛభారత్’గా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న ప్రచారకర్తలుగా ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సత్కరించారు. సత్కారం పొందిన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుద్దాల అశోక్ తేజ(సినీగేయ రచయిత),జీఎస్ రావు (యశోదా హాస్పిటల్స్) అక్కినేని అమల (బ్లూక్రాస్ చైర్పర్సన్), రామోజీరావు (ఈనాడు గ్రూప్), టి.నరేంద్రనాథ్ చౌదరి (ఎన్టీవీ), డాక్టర్ జె.రామేశ్వరరావు (మై హోంగ్రూప్), జె.ఎ.చౌదరి (టాలెంట్ స్ప్రింట్), సి.ఎం.దేవరాజరెడ్డి (ఉపాధ్యక్షులు, ఐసీఏఐ), మంచు లక్ష్మి (సినీనటి) ఉన్నారు. సత్కారం పొందిన వారిలో ప్రముఖులు: యూపీ సీఎం అఖిలేశ్, సచిన్, కమల్‌హాసన్, శంకర్ మహాదేవన్, సురేష్ రైనా, బి.డి.లీసారామ్, అనిల్ అంబానీ, స్వామి రాందేవ్, ప్రనవ్ పాండే, బ్రహ్మకుమారి పుష్పా. -
డెంగీ పంజా!
పల్లెలు మంచం పట్టాయి.. జ్వరాలతో వణుకుతున్నాయి.. అసలే వర్షాకాలం.. ఆపై వైరల్ ఫీవర్, డెంగీ స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మెతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. సిద్దిపేట రూరల్ : సిద్దిపేట మండలం శంకర్‌నగర్, సీతారాంపల్లి గ్రామాల్లో ఇటీవల కొందరు జ్వరాల బారిన పడడంతో వైద్యాధికారులు క్యాంపు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో 13 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. 13 మందిలో తొమ్మిది మందికి డెంగీ పాజిటివ్, నలుగురికి వైరల్ ఫీవర్ ఉన్నట్లు తేలింది. ఇందులో సీతారాంపల్లికి చెందిన పడిగె రాజయ్య, జీర్కపల్లి నగేష్, శంకర్‌నగర్‌కు చెందిన పడిగె సత్తయ్య, పడిగె గణేష్, పడిగె బాలయ్య, పిట్ల దివ్య, రెడ్డి దివ్యతో పాటు అనిల్‌కుమార్‌లకు డెంగీ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా సుమారు పక్షం రోజుల నుంచి సీతారాంపల్లి, శంకర్‌నగర్‌లో ఇంటికి ఇద్దరు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా.. జ్వరాలు నమోదు అవుతున్న గ్రామాల్లో వైద్య సిబ్బంది శిబిరాలు నిర్వహిస్తూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. వైరల్ గ్రామాలు... నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పలువురు విషజ్వరాల బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. సిద్దిపేట మండలం మాచాపూర్ మదిర గ్రామాలైన సీతారాంపల్లి, శంకర్‌నగర్, బక్రిచెప్యాల, చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, రామునిపట్ల, నంగునూరు మండలం ఓబులాపూర్, నాగరాజుపల్లి గ్రామాల్లో వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. చింతమడకలో కూడా వైరల్ ఫీవర్ ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఓబులాపూర్‌లో డీప్తిరియాతో నక్కల నిర్మల (35) ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. పడకేసిన పారిశుద్ధ్యం.. పంచాయితీ కార్మికుల సమ్మెతో వీధులు, మోరీలు చెత్తతో నిండిపోయాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. తీరా పరిస్థితి విషమించాక అధికారులు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. పారిశుద్ధ్యం లోపించడం వ ల్లే దోమలు వృద్ది చెంది మలేరియా, ఫైలేరియా, మెదడు వాపు, డెంగీ, చికున్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా సిద్దిపేట మండలంలోని సీతారాంపల్లి, శంకర్‌నగర్ గ్రామాల్లో మరుగుదొడ్లు ఉన్నా.. వాడకంలోలేవు. వాడుకోవాలని ప్రచారం చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో మూలానపడుతున్నాయి. భయమేసింది... మొదట తలనొప్పి రావడంతో సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాను. నొప్పితో పాటు జ్వరం రావడంతో వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. అయినా జ్వరం తగ్గలేదు. దీంతో హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాను. కొంచెం జ్వరం తగ్గడంతో ఇంటికి వచ్చాను. మళ్లీ జ్వరం రావడంతో ప్రభుత్వ వైద్యులు గ్రామంలో క్యాంపు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. అందులో డెంగీ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. - పడిగె చిన్న నారాయణ, వ్యాధిగ్రస్తుడు శంకర్‌నగర్ ప్రజలకు అవగాహన కల్పించాలి... గ్రామానికి చెందిన నక్కల నిర్మల డిప్తీరియాతో మరణించింది. దీంతో ప్రజలు భయపడుతున్నారు. గ్రామంలో మూడు రోజులుగా వైద్య సిబ్బంది క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. - సందబోయిన వెంకటేశం, సర్పంచ్ ఓబులాపూర్ ఆందోళన చెందవద్దు టైగర్ మస్కిటో కుట్టడంతోనే డెంగీ వ్యాధి సోకుతుంది. దీనికి మందులు లేవు. నివారణకు చర్యలు తీసుకోవాలి. జ్వరం సోకగానే వెంటనే వైద్యుల సలహా సూచనలు తీసుకోవాలి. ఇంటి పరిసరాలు, వ్యక్తిగత పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఐదేళ్లలోపు పిల్లలకు, 60 ఏళ్లు పైబడిన వారికి, గర్భిణులకు సోకే ప్రమాదం ఉంది. ఇంట్లో దోమల నివారణకు తెరలు ఉపయోగించుకోవాలి. సిద్దిపేట నియోజకవర్గంలోని ఏడు గ్రామాల్లో డెంగీ లక్షణాలు బయటపడ్డాయి. అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. - శివానందం, క్లస్టర్ వైద్యాధికారి సిద్దిపేట -
భద్రాద్రి తీరంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభం
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలోని గోదావరి పుష్కర ఘాట్‌ను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆర్డీవో అంజయ్య, ఏఎస్పీ భాస్కరన్ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. 12 రోజుల పాటు భక్తుల స్నానాలతో రూపు మారిన గోదావరి తీరాన్ని సుమారు 300 మంది కార్మికులు శుభ్రం చేయనున్నారు. చెత్తా చెదారాన్ని తొలగించడంతోపాటు, బ్లీచింగ్ చల్లనున్నారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో భక్తులను స్నానాలకు అనుమతించారు. ఆదివారం స్నానం కోసం వచ్చిన భక్తులను అధికారులు వెనక్కి పంపేశారు. -
నీళ్లు బంద్.. కరెంట్ కట్
సంగారెడ్డి మున్సిపాలిటీ : మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చింది. పారిశుద్ధ్య పనులు ఇప్పటికే నిలిచిపోగా, ఆదివారం నుంచీ జిల్లా వ్యాప్తంగా ఆయా మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో విద్యుత్, తాగునీటి సేవలనూ బంద్ చేశారు. శనివారం కార్మికశాఖ మంత్రితో నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందులో భాగంగా ఆదివారం నుంచి అత్యవ సర సేవల్ని నిలిపివేశారు. దీంతో జిల్లాలోని 5 మునిసిపాలిటీలు, 2 నగర పంచాయతీలతో పాటు 2 గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లలో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. వీధి దీపాలు వెలగలేదు. ఎక్కడెక్కడ ఎలా ఉందంటే.. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని మునిసిపల్ తాగునీటి విభాగంలో పనిచేస్తున్న 90 మంది కాంట్రాక్ట్ కార్మికులు సేవల్ని నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. మంజీర, రాజంపేట ఫిల్టర్బెడ్ల వద్ద నీటి సరఫరా విభాగాలకు తాళం పడింది. దీంతో మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పరిస్థితి చక్కదిద్దడానికి మునిసిపల్ కమిషనర్ జోక్యం చేసుకోగా.. కార్మికులు తిరగబడ్డారు సదాశివపేట మునిసిపాలిటీలోనూ మంజీర నీటి సరఫరా వ్యవస్థ స్తంభించింది జోగిపేట నగర పంచాయతీలో నీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సత్యసాయి నీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న నీళ్లు కాలనీలకు చేరడం లేదు మెదక్ మునిసిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది ముఖ్యమంత్రి ఇలాఖాలోని గజ్వేల్ నగర పంచాయతీలో కార్మికులు నీటి సరఫరా నిలి పివేశారు. వీధి దీపాలు వెలగక పట్టణం అంధకారంలో మునిగింది సిద్దిపేట మున్సిపాలిటీలో 300 మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. దీంతో కొద్దిపాటి రెగ్యులర్ ఉద్యోగులు అందిస్తున్న సేవలు ప్రజలకు ఆశించిన స్థాయిలో అందడం లేదు. ఆదివారం పట్టణానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్లలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎటుచూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. అధికారులు తాగునీటి విభాగంలో పనిచేస్తున్న కార్మికులపై ఒత్తిడి తెచ్చి నీటిని వదిలేందుకు యత్నించగా, కార్మిక సంఘాలు ప్రతిఘటించాయి. -
అయినా సరే... టెండర్లకే మొగ్గు
చిత్తూరు(ఎడ్యుకేషన్): ఉద్యోగ భద్రత కోసం పక్షం రోజులుగా దీక్షలు చేస్తున్న పంచాయతీ కార్మికుల కడుపు కొట్టడానికి రంగం సిద్ధమైం ది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు పల్లెల్లో పారిశుధ్య పనులు చేస్తున్న వారిని ఇంటికి సాగనంపనుంది. సోమవారం చిత్తూరులోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో నూతన కార్మికుల కోసం టెండర్లను దాఖలు చేయనుండడమే తరువాయి. జిల్లాలోని 42 మండలాల్లో 1192 మంది కాంట్రాక్టు పద్ధతిన పారిశుధ్య పనులు చేస్తున్నా రు. ఇప్పటి వరకు వీళ్లంతా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పనులను రెన్యూవల్ చేసుకుని ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నారు. అయితే కలెక్టర్ సిద్దార్థజైన్ కల్పించుకుంటూ ఈ పద్ధతి సరికాదని, కార్మికులంతా కాంట్రాక్టర్ కింద పనిచేయాలని కొత్తగా టెండర్లు పిలవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగాలకు వెళ్లకుండా సమ్మె బాట పట్టారు. అయితే ఇంతలోపు అధికారులు కొత్త టెండర్ల కోసం ఏర్పాట్లు చకచకా చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు వేయడానికి చివరి గడువుగా అధికారులు నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తవుతుండటంతో తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుండటంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్ చేతికి తమను అప్పగిస్తే అతనికి నచ్చకపోతే ఉద్యోగాల్లోంచి తీసేస్తాడని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్లను సైతం తొలగించడం ఎంత వరకు సమంజసమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకే టెండర్ల ప్రక్రియను నిరసిస్తూ కార్మిక సంఘ నాయకులు కోర్టును ఆశ్రయించారు. అయితే టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చేయడంతో టెండర్ల ప్రక్రియ జరిగినా తుదిగా తమ అనుమతి లేనిదే కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ ఇవ్వకూడదని న్యాయస్థానం షరతు పెట్టింది. సంక్రాతి సెలవుల తరువాత న్యాయస్థానం ఇచ్చే తదుపరి ఉత్తర్వుల వరకు టెండర్లను ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుతాం. -ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి -
అధికారులపై మంత్రి అసహనం
సమన్వయంతో పనిచేయాలని ఆదేశం సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం సర్వజనాస్పత్రిలో సమీక్షా సమావేశం అనంతపురం మెడికల్: నగరంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి అధికారులపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ దివాకర్‌రెడ్డి, కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూపరింటెండెంట్, హెచ్ఓడీలు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వైద్యులు..మేధావులు, విద్యావంతులైన మీ మధ్య సమన్వయ లోపమెందుకని ప్రశ్నించారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ఎంపీ మాట్లాడుతూ పరిశుభ్రత లేనికారణంగానే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారన్నారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? అని ఆర్ఎంఓతో ఆరా తీశారు. సానిటేషన్ పనులు సక్రమంగా చేయాలని కాంట్రాక్టర్‌ను ఎంపీ ఆదేశించారు. చేతకాకపోతే మానుకోవాలన్నారు. వైద్యుల కొరత ఉందని, సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఒక్కరూ లేరని మంత్రి అడిగిన ప్రశ్నకు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సమాధానంగా చెప్పారు. ఎంపీ జేసీ కలుగజేసుకుని సూపర్ స్పెషాలిటీ వైద్యులను ఏర్పాటు చేసే బాధ్యత మంత్రి తీసుకోవాలని కోరారు. అందుకు ఈ నెల 15న జరిగే కేబినెట్లో మాట్లాడుతామన్నారు. సమావేశంలో మేయర్ స్వరూప, హెచ్ఓడీలు సంపత్ కుమార్, మల్లేశ్వరి, యండ్లూరీ ప్రభాకర్, రామస్వా మి నాయక్, జేసీ రెడ్డి, నవీన్, పెంచలయ్య, సంధ్య, రాధారాణి తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం ‘హెచ్‌డీఎస్ సమావేశం జరిగినప్పటి నుంచి మూడుసార్లు నాతో సమావేశమయ్యారు.. కానీ ఎందుకు పనులు పూర్తి కాలేదు.. కనీసం ఈ సమస్య ఉందని ఎందుకు తెలుపలేదు..’ అని సూపరింటెండెంట్‌పై కలెక్టర్ మండిపడ్డారు. వాషింగ్ మిషన్, సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆరోగ్యశ్రీ నిధుల నుంచి వాడాలని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. కొటేషన్ వేస్తున్నామని సూపరింటెండెంట్ సమాధానం ఇచ్చారు. ప్రతిరోజూ సిబ్బందితో మాట్లాడి పర్యవేక్షించాలని సూచిం చారు. సమావేశం అనంతరం కలెక్టర్ సీరియస్‌గా వెళ్లిపోయారు. -
పూడికతీతకు ప్రత్యేక ప్రణాళిక
=‘చెత్త’శుద్ధికి వందరోజుల కార్యక్రమం =రోజుకు 30 మందితో పారిశుద్ధ్య పనులు =జోనల్ కమిషనర్ అడపాల శ్రీనివాస్ అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లిలో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్టు జీవీఎంసీ అనకాపల్లి జోన్ కమిషనర్ అడపాల శ్రీనివాస్ తెలి పారు. జనవరి 25 లోగా పచ్చదనం-పరిశుభ్రతతో కూడిన అనకాపల్లిని చూపిస్తామన్నారు. ‘చెత్త’గించగలరు శీర్షికన గురువారం సాక్షిలో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. పట్టణంలో మురుగునీటి కాలువల్లో పూడికతీతకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు. ఇరవై ఏళ్లుగా ఇక్కడ పూడిక పేరుకుపోయిందని విశ్లేషించారు. ఈ పనులకు కనీసం 100 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాల్సి ఉందన్నారు. పట్టణంలో 20 డంపర్ బిన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుద్ధ్యం మెరుగుదలకు రోజుకు 20 నుంచి 30 మందితో ప్రత్యేక డ్రైవ్‌ను చేపడతామన్నారు. 14 అంశాలతో వంద రోజుల పాటు ‘చెత్త’పై సమరానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇంటింటికి చెత్త సేకరణ, పూడికతీత పనులు, ప్లాస్టిక్ వ్యర్థాలపై యుద్ధం, స్థానికులతో సమావేశాలు, కాలువల శుభ్రత, తడిచెత్తను, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే పద్ధతి, చెత్తను విసిరే స్థలాలను సుందరవనాలుగా మార్పు, దోమల నియంత్రణ, చెత్తను వేసే వారికి జరిమానా, ప్లాస్టిక్ సంచుల నిషేధం, సులభ్ కాంప్లెక్స్‌లపై ప్రచారం, హోటళ్ల పర్యవేక్షణ, మరుగుదొడ్ల ఏర్పాట్లపై పర్యవేక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.