చీదెళ్ల గ్రామంలోని మురుగు కాల్వల్లోని పూడిక మట్టి తీస్తున్న కూలీలు
సాక్షి, పెన్‌పహాడ్ : నూతన సర్పంచ్‌లు తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని తొలగిస్తూ ముగురుకాల్వలను శూభ్రం చేస్తూ పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. ఎలాగైనా గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనులను వేగవంతంగా చేశారు.
మండలంలోని 29గ్రామపంచాయతీలకు గాను దాదాపు అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యం గా మేజర్ గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
ప్రస్తుతం చేపడుతున్న పనులు..
కాలనీల్లోని మురికి కాల్వల్లో, రోడ్లకు ఇరుపక్కల పేరుకుపోయి ఉన్న పారిశుద్ధ్య సిబ్బందితో పాటు సర్పంచ్‌లు మురికి కాల్వలను శుభ్రం చేశారు. గత సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలలపాటు గ్రామాల ప్రత్యేక అధికారుల చేతిలో ఉండడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి పలు సమస్యలు నెలకొన్నాయి.
కొత్త సర్పంచ్‌లు పదవి చేపట్టగానే వారికి అనేక సమస్యలు స్వాగతం పలికినప్పటికీ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. వీటితో పాటు గ్రామాల్లో మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండగా ప్రతి ఇంటికి నల్లా నీరు అందించే విధంగా కొత్త పైపులైన్లు వేయించి వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల మధ్యన ఉంటూ గ్రామ అభివృద్ధి పనులు చేస్తున్న సర్పంచ్‌లను గ్రామస్తులు కొనియాడుతున్నారు.
గ్రామాభివృద్ధే లక్ష్యం
గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా, మురికి కాల్వల్లో పెరిగిన పిచ్చిమొక్కలను, పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని తొలగిస్తున్నాం. దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ఉండేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నాం. లీకైన పైపులైన్‌ను సరిచేసి కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాం.
– బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్, అనంతారం
ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా..
చీదెళ్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్న అందులో భాగంగా మురికి కాల్వలు, రోడ్లపై పడిన చెత్తా, చెదారాన్ని కూలీల చేత తొలగించి పరిశుభ్రం చేయిస్తున్నాం. అలాగే వేసవికాలం ఆరంభమైన సందర్భంగా గ్రామంలో మంచినీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తాం.
– పరెడ్డి సీతారాంరెడ్డి, సర్పంచ్, చీదెళ్లగ్రామాభివృద్ధే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment