భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలోని గోదావరి పుష్కర ఘాట్‌ను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆర్డీవో అంజయ్య, ఏఎస్పీ భాస్కరన్ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. 12 రోజుల పాటు భక్తుల స్నానాలతో రూపు మారిన గోదావరి తీరాన్ని సుమారు 300 మంది కార్మికులు శుభ్రం చేయనున్నారు.
చెత్తా చెదారాన్ని తొలగించడంతోపాటు, బ్లీచింగ్ చల్లనున్నారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో భక్తులను స్నానాలకు అనుమతించారు. ఆదివారం స్నానం కోసం వచ్చిన భక్తులను అధికారులు వెనక్కి పంపేశారు.
భద్రాద్రి తీరంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభం
Published Sun, Jul 26 2015 10:40 AM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM
Advertisement