Pushkar Ghat
-
20న తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కర ప్రారంభ ముహూర్తం ఖరారైంది. 20వ తేదీ మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరాల ప్రారంభ ముహుర్తంగా దేవదాయ శాఖ నిర్ణయించింది. దేవదాయ శాఖ అర్చక ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నంలో దైవజ్ఞ సమ్మేళనంలో పంచాంగకర్తలు నిర్ధారించిన ఈ ముహూర్త వివరాలను అధికారిక అనుమతి కోసం దేవదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ మధ్య 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయి. గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. 23 పుష్కర ఘాట్లు సిద్ధం ► తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య శాఖ ఈసారి నదీ స్నానాలకు బదులుగా భక్తులు జల్లు సాన్నాలు చేయాలని సూచించింది. ఆ మేరకు ఘాట్ల వద్ద అధికార యంత్రాంగం స్ప్రింకర్లను ఏర్పాటు చేస్తోంది. ► పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది. ► పిండ ప్రదానం, తదితర కార్యక్రమాలకు రేట్లను దేవదాయ శాఖ నిర్ధారించి, ఆ వివరాలను వీటి కోసం కేటాయించిన షెడ్ల వద్ద ప్రదర్శించనుంది. ► పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించారు. దేవదాయ శాఖ కార్యక్రమాలపై ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఆయా జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు చేశారు. 20న పుష్కరాల్లో పాల్గొననున్న సీఎం జగన్ తుంగభద్ర పుష్కరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20వ తేదీన కర్నూలు జిల్లాలోని సంకల్బాగ్ పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను ముఖ్యమంత్రి అదనపు పీఎస్ కె.నాగేశ్వరరెడ్డి ప్రభుత్వ అధికారులకు సర్క్యులేట్ చేశారు. -
రాజమండ్రి: పుష్కరఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు
-
రాజమండ్రి పుష్కరఘాట్‌లో భక్తులు పుణ్యస్నానాలు
-
కొలువు తీరనున్న శ్రీవిద్యా గణపతి
రేపటినుంచి పుష్కరాల రేవు వద్ద నవరాత్ర మహోత్సవాలు జక్కంపూడి విజయలక్ష్మి వెల్లడి రాజమహేంద్రవరం కల్చరల్ : పుష్కరాల రేవు వద్ద ఈ నెల 5 నుంచి శ్రీవిద్యా గణపతి నవరాత్ర మహోత్సవాలు ప్రారంభమవుతాయని రాజమహేంద్రి గణేశ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలి పారు. పుష్కర ఘాట్‌వద్ద నిర్మాణంలో ఉన్న ఉత్సవ వేదిక వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ మహారాష్ట్రలో ప్రారంభించిన గణపతి ఉత్సవాల స్ఫూర్తితో తన భర్త దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ఈ ఉత్సవాలను ప్రారంభించారని తెలిపారు. ఉత్సవాలకు ఇది ఏడో సంవత్సరమని ఆమె అన్నారు. 2014లో గాజులతో సౌభాగ్య గణపతిని, 2015లో దేశవ్యాప్తంగా సేకరించిన నాణేలతో చింతామణి గణపతిని నెలకొల్పామని గుర్తు చేశారు. ఈ ఏడాది శ్రీవిద్యా గణపతి విగ్రహం తయారీలో 1,11,111 కలాలను వినియోగించనున్నామన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 7 గంటలకు పండితులను సత్కరిస్తామన్నారు. గణపతి విగ్రహ తయారీకి ఉపయోగించిన వస్తువులను భక్తులకు ప్రసాదంగా అందజేస్తున్నామ తెలిపారు. ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ ఎస్.శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఈ ఏడాది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి రాజకీయాలు ప్రవేశించడం శోచనీయమన్నారు. విలేకర్ల సమావేశంలోౖ నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, బొంతా శ్రీహరి, సుంకర చిన్ని, చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాం బాబు, బీజేపీ నగర అధ్యక్షుడు బొమ్ముల దత్తు, గుత్తుల మురళీధరరా వు, జక్కంపూడి గణేశ్, మంతెన కేశవరాజు, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద ఉద్రిక్తత.
-
పుష్కర ఘాట్‌లో వాలంటీర్ల అందోళన
-
ఆసరాగా ఉంటారనుకుంటే..
పుష్కర ఘాట్‌లో ఇద్దరి గల్లంతు శోకసంద్రంలో కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం: ఆసరాగా ఉంటారనుకుంటే అందనంత దూరాలకు వెళ్లిపోయారని మృతుల కుటుంబ సభ్యులు విలపించారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో స్నేహితులతో స్నానానికి వెళ్లిన విజయనగరం జిల్లా సాలూరు గ్రామానికి చెందిన సిగడపు చైతన్య కుమార్ (19) రాజమండ్రికి చెందిన యందం వెంకట గణేష్(16) గల్లంతయ్యారు. చైతన్య కుమార్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. ఆసరాగా ఉంటాడనుకుంటే ఇలా అయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. తన అవసరాల కోసం ఓ హోటల్లో పని చేస్తూ చదువుకుంటున్నాడని, తన బిడ్డ బీటెక్ చదువుతున్నాడని తెలిపారు. మరో మృతుడు యందం వెంకట గణేష్‌కు తల్లి, తండ్రి కూడా గతంలోనే మృతి చెందారు. దివాన్ చెరువులోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. జాలర్లన గజ ఈత గాళ్ళను రప్పించి పోలీసులు గాలిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకూ మృత దేహాలు లభ్యం కాలేదు. రక్షణ కరువంటూ రాస్తారోకో... పుష్కర ఘాట్‌లో స్నానం చేసేందుకు వచ్చే భక్తులకు రక్షణ కరువైందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా నాయకులు వైరాల అప్పారావు ఆరోపించారు. ఘాట్‌లో స్నానం చేసేందుకు వచ్చే భక్తులు మృత్యువాత పడుతున్నారని ఘాట్‌లో రెయిలింగ్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్య వైఖరి అవలంభించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పుష్కర ఘాట్ వద్దగల రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దండోరా నగర అధ్యక్షుడు యందం గోవింద్, తోలేటి రాం ప్రసాద్, గోరింత భాగ్యరాజ్, కుడిల్లి రత్న కిశోర్, వైరాల రమేష్, వైరాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాలకృష్ణ పుష్కర స్నానం
మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాలు గురువారం ఏడో రోజుకు చేరుకున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా సోమశిల వద్ద పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా సోమశిల వద్ద బాలయ్య కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా పుష్కరాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు బాలకృష్ణ కుటుంబ సభ్యులు.... ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి విజయవాడలోని దుర్గాఘాట్ వద్ద పుష్కర స్నానమాచరించిన విషయం విదితమే. -
పుష్కరఘాట్ల వద్ద తగ్గిన భక్తుల రద్దీ
-
తృటిలో తప్పిన ప్రమాదం
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని ఐల్లూరు ఘాట్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రొక్లైనర్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఘాట్పైకి దూసుకొచ్చింది. ఆ ప్రాంతంలో పుణ్య స్నానం ఆచరిస్తున్న భక్తులు ఇది గుర్తించి వెంటనే పక్కకు తప్పుకోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. లారీ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. ఘాట్ మెట్ల సమీపంలో పనులు నిర్వహించిన ప్రొక్లైనర్‌ను లారీ పై ఎక్కించి తీసుకెళ్తుండగా.. అదుపుతప్పిన లారీ నదిలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అక్కడ స్నానం చేస్తున్న సుమారు 10 మంది భక్తులు ఇది గుర్తించి పక్కకు తప్పుకోవడంతో.. ప్రమాదం తప్పింది. -
పుష్కర ఘాట్ వద్ద కరెంట్ షాక్‌తో భక్తుడు మృతి
నల్గొండ : నల్గొండ జిల్లా పానగల్ పుష్కర ఘాట్ వద్ద ఓ భక్తులు కరెంట్ షాక్ తో మరణించాడు. శనివారం పుష్కర స్నానం చేసేందుకు ఘాట్ వద్దకు వెళుతుండగా అతడికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో భక్తుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ విషయాన్ని గమనించిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడి వివరాలు మత్రం తెలియరాలేదు. -
ఉధృతంగా గోదావరి
కొవ్వూరు: గోదావరిలో వరద ఉధృతి భారీగా పెరిగింది. పుష్కర ఘాట్ల వద్ద ఉధృతంగా ప్రవహించడంతో ధవళేశ్వరం ఆనకట్టకు ఉన్న 175 గేట్లను రెండు మీటర్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సోమవారం సాయంత్రం 6 గం టలకు 8.70 అడుగుల నీటమట్టం నమోదైంది. ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 13,100 క్కూసెక్కుల నీరు వి డుదల చేస్తున్నారు. ఆనకట్ట నుంచి 4,90,601 క్యూసెక్కుల మిగులు జలాల ను సముద్రంలోకి వదులుతున్నారు. ఎ గువన భద్రాచలంలో ఆదివారం సాయంత్రం 38.20 అడుగులున్న నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 35.70 అడుగులకు తగ్గింది -
ఆలయం తొలగించరాదని రాస్తారోకో
గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెమ్‌మోడి పుష్కర ఘాట్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించరాదని పేర్కొంటూ పెన్‌మోడి గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. పెన్‌మోడి- పులిగడ్డ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రజల ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. -
గోదావరికి వరద ఉధృతి...
- కొవ్వూరు వద్ద రెండు ఘాట్లు మూసివేత కొవ్వూరు(పశ్చిమగోదావరి జిల్లా) పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి నదికి వరదఉధృతి పెరగడంతో గోషఅపాదక్షేత్రంలో రెండు పుష్కర ఘాట్లను ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. గోష్పాదక్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం వరకూ 80 వేల మంది పుష్కర స్నానాలు చేశారు. -
పుష్కరఘాట్లకు పెరిగిన భక్తుల రద్దీ
-
వేగంగా పుష్కరఘాట్ నిర్మాణ పనులు
నేరేడుచర్ల : మండలంలోని మహంకాళిగూడెం వద్ద పుష్కర ఘాట్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. ఘాట్ ఇన్చార్జి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ పర్యవేక్షణలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ఘాట్ నిర్మాణానికి రూ. 2.65 కోట్లు మంజూరు కాగా, గతంలో ఉన్న ఘాట్‌కు అదనంగా 60 మీటర్ల మేరకు విస్తరించి మెట్లు నిర్మించారు. ప్రస్తుతం రక్షణ కోసం ఇనుప జాలీలను నిర్మిస్తున్నారు. పుష్కర ఘాట్‌లో యాత్రికుల సౌకర్యార్ధం 10 స్నానపు గదులు, 10 మరుగు దొడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మహంకాళీగూడెంనకు బీటీ రెన్యువల్ పనులు మండలంలోని నర్సయ్యగూడెం నుంచి గుడగుండ్ల పాలెం వరకు పూర్తి చేశారు. పుష్కరఘాట్ నుంచి 1.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహంకాళీగూడెం దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లే రహదారికి రూ. 45 లక్షలు మంజూరు చేయగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేరేడుచర్లలోని బైపాస్ రోడ్డుకు హుజుర్నగర్ రోడ్డు నుంచి జాన్‌పహాడ్ రోడ్డు వరకు బీటీ నిర్మాణ పనులు చేపడుతుండగా, మిర్యాలగూడ రోడ్డు నుంచి జాన్‌పహాడ్ రోడ్డు వరకు రూ. 20 లక్షలతో మెటల్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఘాట్ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మంచినీటి సౌకర్యం కోసం రూ. 15.32 లక్షలతో నీటి శుద్ధి యంత్రాన్ని అమర్చేందుకు తాత్కాలిక గదిని నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం పలు చోట్ల మంచినీటి నల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కొరకు మహంకాళీగూడెం గ్రామ శివారులోని పార్కింగ్ స్థలాలను చదును చేస్తున్నారు. నీరు వస్తేనే పుష్కరస్నానం పుష్కర ఘాట్ వద్ద ప్రస్తుతం ఉన్న నీటి మట్టానికి సుమారు 15 అడుగుల ఎత్తులో ఘాట్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో నదిలో నీటి మట్టం పెరిగితేనే ఘాట్‌లో స్నానం ఆచరించేందుకు వీలు ఉంటుంది. ఆగస్టు 12 పుష్కరాల ప్రారంభం రోజు వరకు ఘాట్‌లోకి నీరు వస్తుందని అటు అధికారం యంత్రాంగం, ఇటు ప్రజలు భావిస్తున్నారు. గతంలో పుష్కరాలకు హాజరైన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. -
వాడపల్లి పుష్కరఘాట్‌ను పరిశీలించిన మంత్రులు
దామరచర్ల మండలంలోని వాడపల్లి పుష్కరఘాట్ పనులను తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు పరిశీలించారు. పుష్కరఘాట్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పుష్కర ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం సమీపంలోని శ్రీమీనాక్షి అగస్తేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఆ ముగ్గురూ ‘సిద్ధార్థ’ విద్యార్థులు
హోలీ పండుగనాడు విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర ఘాట్ రైల్వే వంతెన వద్ద కృష్ణా నదిలో మునిగి ముగ్గురు యువకులుమృతి చెందారు. బుధవారం ఉదయం హోలీ వేడుకల అనంతరం స్నానానికి వచ్చిన వీరు ఇలా మృత్యువాతపడడం స్థానికంగా విషాదం నింపింది. కాగా.. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందిన ముగ్గురు విద్యార్థులు విజయవాడ సిద్ధార్థ కళాశాల విద్యార్థులని తేలింది. సాయికృష్ణ, సంతోష్, సుభాష్‌లు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. స్వస్థలం విజయవాడ నగరం పటమటలోని కొత్తపేటగా గుర్తించారు. మరి కొందరు స్నేహితులతో కలిసి బుధవారం హోలీ వేడుకలు జరుపుకున్న అనంతరం స్నానం చేసేందుకు కృష్ణా నదిలో దిగినట్లు తెలిసింది. -
భద్రాద్రి తీరంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభం
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలోని గోదావరి పుష్కర ఘాట్‌ను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆర్డీవో అంజయ్య, ఏఎస్పీ భాస్కరన్ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. 12 రోజుల పాటు భక్తుల స్నానాలతో రూపు మారిన గోదావరి తీరాన్ని సుమారు 300 మంది కార్మికులు శుభ్రం చేయనున్నారు. చెత్తా చెదారాన్ని తొలగించడంతోపాటు, బ్లీచింగ్ చల్లనున్నారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో భక్తులను స్నానాలకు అనుమతించారు. ఆదివారం స్నానం కోసం వచ్చిన భక్తులను అధికారులు వెనక్కి పంపేశారు. -
పుష్కర స్నానం చేసిన చిరంజీవి
-
పోచంపాడు ఘాట్ వద్ద పరిస్థితిపై పోచారం సమీక్ష
నిజామాబాద్: ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ట్యాక్స్ వసూల్ చేయొద్దని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడు ఘాట్ వద్ద గోదావరి పుష్కరాల పరిస్థితిపై ఉన్నతాధికారులతో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి ఈ సందర్భంగా ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. టోల్ గేట్ వద్ద వాహన పన్ను చెల్లించేందుకు వాహనాలు నిలపడంతో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పుష్కరాల కోసం వెళ్లే వాహనదారులు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద ట్యాక్స్ వసూల్ వెంటనే నిలిపివేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే పోచంపాడు వద్ద పరిస్థితిపై పోచారంకు కేసీఆర్ ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. -
పుష్కరాలకు తరలివచ్చిన వరణుడు!
-
కాలయాపనే కారణం..
కాకినాడ: సుదీర్ఘ కాలయాపన వల్లే రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు వీవీఐపీలు, వీఐపీల కోసం పుష్కరఘాట్‌ను గంటలతరబడి మూసివేయడం, ఆ తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 27 మంది మృతి చెందిన దుర్ఘటనపై జిల్లా కలెక్టర్... రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను పంపించారు. పుష్కరాల ప్రారంభం రోజైన మంగళవారానికి 2రోజుల ముందునుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు రాజమండ్రికి రావడం ప్రారంభించారని నివేదికలో పేర్కొన్నారు. పుష్కరాలు ప్రారంభం కాగానే నదిలో స్నానం చేయాలనే ఉత్సుకతతో మంగళవారం తెల్లవారు జామునే పెద్ద సంఖ్యలో పుష్కర ఘాట్ కు భక్తులు తరలి వచ్చారని తెలిపారు. భక్తుల సంఖ్య గంట గంటకు పెరిగిపోయినట్లు పేర్కొన్నారు. అయితే చంద్రబాబుతో పాటు వీవీఐపీ లు, వీఐపీలు ఉదయం 6.26 గంటల నుంచి పుష్కర ఘాట్‌లో ఉన్నారని, గోదావరి పుష్కరాల్లో తొలుత స్నానం చేసి పుష్కరాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారని కల్టెక్టర్ నివేదిక లో స్పష్టం చేశారు. వారు స్నానాలు పూర్తయ్యి బయటకు వచ్చేసరికి 8.30 గంటలైం దని తెలిపారు. తెల్లవారుజామునుంచి 8.30 గం టలవరకూ భక్తులను అనుమతించకపోవడం తో తాకిడి మరింతగా పెరిగిపోయిందన్నారు.ఆ తర్వాత కూడా ఒక్కగేటునే తెరవడంతో భక్తుల తాకిడితో తొక్కిసలాట జరిగిందని, పోలీసులు నిలువరించలేకపోయారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ద్వారా జిల్లా కలెక్టర్ తన నివేదికను కేంద్ర హోంశాఖకు పంపారు. కాగా చంద్రబాబు కార్యక్రమాలు పూర్తయ్యే వరకు భక్తులను నదీలోకి స్నానం చేయడానికి అనుమతించనందునే తొక్కిసలాట జరిగినట్లు దీనిద్వారా తెలుస్తోంది. తెల్లవారు జామునుం చి వచ్చిన వారిని వచ్చినట్లే నదిలోకి స్నానానికి అనుమతించినట్లైతే పెద్ద ఎత్తున భక్తులు గుమికూడటం, తొక్కిసలాట జరిగి ఉండేది కాదని కలెక్టర్ నివేదిక పరోక్షంగా స్పష్టం చేస్తోంది. -
ఇప్పటికి కళ్లు తెరిచారు
* దుర్ఘటన తర్వాత మేల్కొన్న ఏపీ ప్రభుత్వం * ఘాట్లు, రోడ్లపై రద్దీ లేకుండా జాగ్రత్తలు రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రచార యావతో భక్తులను గాలికొదిలేసిన ప్రభుత్వం పుష్కరఘాట్‌లో 27 మందిని బలిగొన్న తర్వాత మేల్కొంది. ఊహల్లో విహరిస్తూ అంతా అద్భుతంగా ఉందనే ప్రచారంతో నేల విడిచి సాము చేసిన ప్రభుత్వ పెద్దలు.. విపక్షాలు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. అదనపు పోలీసు బలగాలను దింపి దుర్ఘటన జరిగిన పుష్కరఘాట్ మొదలు మిగిలిన ఘాట్లలోనూ మోహరించారు. తొక్కిసలాట జరిగిన ఘాట్ ఎదుట కోటగుమ్మం సెంటర్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంగళవారం సీఎం వాహనశ్రేణి సులభంగా తిరిగేందుకు బారికేడ్లను ఏర్పాటు చేయలేదు. దీనివల్ల భక్తులు ఒకేచోట పోగుపడి మళ్లీ ఇబ్బందులు నెలకొంటాయని రాత్రికి రాత్రి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీంతో గోదావరి రైల్వేస్టేషన్లో దిగిన భక్తులు నేరుగా క్యూలైన్లోకి వెళ్లి పుష్కరఘాట్‌లోకి ప్రవేశించే వీలు ఏర్పడింది. స్టేషన్లో ఎక్కువమంది దిగితే రద్దీని పక్కనున్న కోటిలింగాల రేవుకు మళ్లించారు. క్యూలైన్లు, ఘాట్లలో పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. భక్తులు రోడ్లపైకి రాకుండా క్యూలైన్లలో వెళ్లేలా చూశారు. అదే సమయంలో క్యూలైన్లలోనూ భారీగా జనం ఉండకుండా జాగ్రత్తపడ్డారు. దృష్టంతా పుష్కరఘాట్పైనే: పుష్కరఘాట్లోనూ ఎక్కడా జనం నిలబడకుండా వెంటనే స్నానం చేసి వెళ్లిపోయేలా చూశారు. పోలీసులు, వలంటీర్లు నదిలో స్నానం చేసిన వెంటనే భక్తులను తీసుకొచ్చి బయటకు పంపించివేశారు. మంగళవారం మంచినీరు లేక జనం అల్లాడిపోవడంతో బుధవారం మంచినీటి ప్యాకెట్లను ఘాట్లు, క్యూలైన్లలో పంపిణీ చేయించారు. ఇదంతా కేవలం పుష్కరఘాట్‌లోనే కనిపించింది. మిగిలిన ఘాట్లలో ఈ స్థాయి ఏర్పాట్లు చేయలేదు. ఘాట్లలో అర్ధరాత్రి తిరిగిన ముఖ్యమంత్రి మంగళవారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాట్లలో అర్ధరాత్రి తిరిగారు. సరస్వతి, కోటిలింగాల, పుష్కరఘాట్లలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమీక్షలు నిర్వహించనున్నారు. పోలీసులకు మరిన్ని వాకీటాకీలు సాక్షి, రాజమండ్రి: రాజమండ్రి పుష్కరఘాట్ ఘటన నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలీసుల మధ్య మరింత సమన్వయం కోసం మరిన్ని వాకీటాకీలు మంజూరు చేసిం ది. వీటిని రాజమండ్రిలోని 18 ఘాట్లకు కేటాయించారు. ముఖ్యంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే పుష్కరఘాట్‌కు ఎనిమిదింటిని కేటాయించారు. మంగళవారం నాటి దుర్ఘటన తర్వాత ఈ ఘాట్‌వద్ద పోలీసు బందోబస్తును పెంచారు. 11 మంది ఐపీఎస్‌లు ప్రస్తుతం ఇక్కడ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. -
కొవ్వూరు ఫుష్కర ఘాట్‌కు పోటెత్తుతున్న భక్తులు
-
పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట
-
పుష్కరఘాట్లను తనిఖీ చేసిన ఏపీ సీఎం
పారిశుద్ధ్య లోపంపై ఆగ్రహం శానిటరీ ఇన్స్పెక్టర్, మేస్త్రీల సస్పెన్షన్ సాక్షి, రాజమండ్రి, కొవ్వూరు: గోదావరి పుష్కరాల ఏర్పాటు పనులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తనిఖీ చేశారు. పారిశుద్ధ్య లోపం, అడ్డదిడ్డంగా బ్యారికేడ్ల ఏర్పాటుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజమండ్రి 30వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ సతీశ్, మేస్త్రీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అవసరం లేకున్నా పుష్కర ఘాట్ మార్గాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేయడమేమిటని అసహనం వ్యక్తం చేశారు. రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణపై సీరి యస్ అయ్యారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ సీఎం నేరుగా ఘాట్ల పరి శీలనకు బయల్దేరారు. మధ్యలో ఆగుతూ కోటిలింగాల ఘాట్‌ను, పుష్కరాల ఘాట్లను పరిశీలించారు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జిల్లా ఆర్యవైశ్య సంఘం యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం గోష్పాద క్షేత్రంలో పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ పుష్కర సాన్నాలకు వీలుగా 5 అడుగుల నీటి నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి 3 గంటలకు నీటిని శుభ్రం చేయటానికి శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశామని సీఎంకు వివరించారు. ఘాట్లను, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, బ్యారికేడ్లను సీఎం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వెల్డన్ అంటూ.. కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి చేరుకున్నారు. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై పుష్కరాల ఏర్పాట్ల్లపై సమీక్షించారు. కొవ్వూరు పర్యటనలో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కె.నారాయణ, పీతల సుజాత, ఎంపీ మురళీమోహన్ తదితరులు ఉన్నారు. -
గోదావరి పుష్కరాలు కాదు.. గులాబీ పుష్కరాలు
కరీంనగర్ (మంథని) : కరీంనగర్ జిల్లా మంథనిలోని పుష్కరఘాట్‌ను శుక్రవారం కాంగ్రెస్ నేతల బృందం పరిశీలించింది. పుష్కర ఘాట్ల వద్ద చేసిన ఏర్పాట్ల పట్ల కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇవి గోదావరి పుష్కరాలు కాదని, గులాబీ పుష్కరాలని ఎద్దేవా చేశారు. గుళ్లు, గోపురాలకు గులాబి రంగు వేశారని, దేవుళ్లకు రాజకీయ రంగు పూయడం మంచిది కాదని ఆయన అన్నారు. పుష్కరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
పుష్కర ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు
రాజమండ్రి (తూర్పుగోదావరి జిల్లా) : గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలకశాఖ కార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పుష్కర ఘాట్లతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో 31 కిలోమీటర్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రిలయన్స్ జియో ఇన్కామ్ కార్పొరేట్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
పుష్కర ఘాట్ వద్ద నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
ఖమ్మం (భద్రాచలం) : భద్రాచలం పుష్కరఘాట్ వద్ద చేసిన ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాలు లోపించాయి. ఏడు రోజుల క్రితం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఆరు విద్యుత్ స్తంభాలు గురువారం నేలకొరిగాయి. వీటికి రెండు రోజుల క్రితమే విద్యుత్ సరఫరా కూడా ప్రారంభించారు. తాజాగా పెద్ద శబ్ధం చేస్తూ ఆ ఏడు స్తంభాలు నేలకొరగడంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో పుష్కరఘాట్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లలోని డొల్లతనం బయటపడింది. -
'పుష్కరఘాట్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తాం'
రాజమండ్రి : గోదావరి పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల నిర్మాణానికి అవరసమైన నిధులను త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం రాజమండ్రిలో దేవినేని ఉమా పర్యటించారు. అందులోభాగంగా పుష్కరఘాట్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగర రూరల్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతోపాటు పలువురు నేతలు, టీడీపీ కార్యకర్తలు మంత్రి దేవినేని ఉమా వెంటనే ఉన్నారు. -
సకల సౌకర్యాలు
* గోదావరి పుష్కరాలకు 13 ఘాట్లు * స్థలాలు పరిశీలించిన కలెక్టర్ నవీపేట : జిల్లాలో ప్రతిపాదించిన పదమూడు పుష్కర ఘాట్ల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలి పారు. నవీపేట మండలంలోని కోస్లీ, బినో ల, తుంగిని గ్రామాల శివారులో గల గోదావరి నదీతీరాలను శుక్రవారం కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు జరుగనున్నందున ఏర్పాట్ల కోసం వివిధ శాఖల అధికారులతో సమావేశం జరుపుతామన్నారు. గతంలో కంటే ఈసారి పుష్కర ఘాట్లు ఎక్కవ సంఖ్యలో నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఘాట్ల వద్ద స్నానపు గదులు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, దారుల విస్తరణ వంటి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దూరప్రాం తాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అధికారుల తో సమీక్ష అనంతరం పనులను ప్రారంభిస్తామన్నా రు. యంచ గ్రామ శివారులో గల బాసర బ్రిడ్జికి ఇవతల పుష్కర ఘాట్‌ను ఏర్పాటు చేయాలని, ఆ ప్రాం తంలో గత పుష్కరాలలో కూడా అనేక మంది భక్తు లు స్నానాలు ఆచరించారని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నర్సింగ్ రావ్, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. కందకుర్తిలో అదనంగా రెండు ఘాట్లు రెంజల్/నందిపేట : గోదావరి పుష్కరాలకు కందకుర్తిలో అదనంగా మరో రెండు ఘాట్లు, తాడ్‌బిలోలిలో ఘాట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కందకుర్తి, తాడ్‌బిలోలి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్యను అడిగితెలుసుకున్నారు. పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, స్త్రీలు బట్ట లు మార్చుకునే గదులు, విశ్రాంతి గదులు, కందకుర్తి గోదావరిలోని పురాతణ శివాలయం నుంచి నదిపై నిర్మించిన వంతెన వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. నిధుల కొర త లేదని, పుష్కరక్షేత్రాల్లో అవసరమైన సదుపాయాలను కల్పించనున్నామన్నారు. కందకుర్తి వంతెనపై నుంచి మహారాష్ట్రలోని సంగమేశ్వరాలయాన్ని పరిశీలించారు. మూడు నదుల కలయిక స్థలమైన కందకుర్తికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని స్థానిక నాయకులు కలెక్టర్‌కు వివరించారు. కందకుర్తి విశిష్టను అడిగితెలుసుకున్నారు. అక్కడి నుండి పోలీస్ జీపులో బోర్గాం చేరుకున్నారు. గోదావరికి వెళ్లే రోడ్డు గురించి రైతులు వివరించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సంబందిత అధికారులతో మాట్లాడు రూ. 40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మెటల్‌రోడ్డు నిర్మించుకోవాలన్నారు. తాడ్‌బిలోలి గ్రామంలో పుష్కరాల ఏర్పాట్లకు రూ. 2.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. నందిపేట మండలంలోని ఉమ్మెడ గ్రామ శివారులో గల గోదావరి నదీతీరాన ఏర్పాటు చేయనున్న పుష్కరఘాట్ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడగల పురాతన చరిత్ర కలిగిన ఉమమహేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కిలో మీటర ు దూరం వరకు కాలిబాటన నడిచి గోదావరి నదిలో మునిగిపోయిన ఉమ్మెడ పాత గ్రామాన్ని సం ద ర్శించారు. పాత గ్రామంలో గల విగ్నేశ్వర, కాలభైరవ, పోచమ్మ ఆలయాలను, వాటిలోని అతి పురాతన విగ్రహాలను, రాళ్లకు చెక్కిన జైనుల శిలాశాసనాలను పరిశీలించారు. పురాతన విగ్రహాల ఫొటోల ను, వాటికి సంబంధించిన చరిత్రను తనకు అందుబాటులో ఉంచాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీవో యాదిరెడ్డి, డీఎస్పీ ఆనంద్‌కుమార్, బోధన్ ఆర్డీవో శ్యాం ప్రసాద్‌లాల్, డీపీవో కష్ణమూర్తి, జిల్లా వైధ్యాధికారి గోవింద్ వాగ్మారే, ఐకేపీ పీడీ వెంకటేశం, బోధన్ డీఎస్పీ రాంకుమార్, ఎంపీపీ మోబిన్‌ఖాన్, జడ్పీటీసీ సభ్యుడు నాగభూషణం రెడ్డి, సర్పంచ్‌లు ఖలీంబేగ్, తెలంగాణ శంకర్, జావీదోద్దిన్, విండో చెర్మైన్లు అహ్మద్‌బేగ్, సాయరెడ్డి, తశీల్దార్ బావయ్య, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు.... గ్రామస్తుల వినతి ఉమ్మెడ గ్రామం నుంచి పుష్కరఘాట్‌తో పాటు పాత గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచు పోశెట్టి, ఎంపీటీసీ సభ్యుడు దూడ వెంకటేష్‌లు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే గోదావరి నది పరీవాహక ప్రాంతంలో పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.