కొలువు తీరనున్న శ్రీవిద్యా గణపతి | sri vidya ganapathi | Sakshi
Sakshi News home page

కొలువు తీరనున్న శ్రీవిద్యా గణపతి

Published Sat, Sep 3 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

కొలువు తీరనున్న శ్రీవిద్యా గణపతి

కొలువు తీరనున్న శ్రీవిద్యా గణపతి

  • రేపటినుంచి పుష్కరాల రేవు వద్ద నవరాత్ర మహోత్సవాలు
  • జక్కంపూడి విజయలక్ష్మి వెల్లడి
  •  
    రాజమహేంద్రవరం కల్చరల్‌ :
    పుష్కరాల రేవు వద్ద ఈ నెల 5 నుంచి శ్రీవిద్యా గణపతి నవరాత్ర మహోత్సవాలు ప్రారంభమవుతాయని రాజమహేంద్రి గణేశ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్‌ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలి పారు. పుష్కర ఘాట్‌వద్ద నిర్మాణంలో ఉన్న ఉత్సవ వేదిక వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. లోకమాన్య బాల గంగాధర్‌ తిలక్‌ మహారాష్ట్రలో ప్రారంభించిన గణపతి ఉత్సవాల స్ఫూర్తితో తన భర్త దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ఈ ఉత్సవాలను ప్రారంభించారని తెలిపారు. ఉత్సవాలకు ఇది ఏడో సంవత్సరమని ఆమె అన్నారు. 2014లో గాజులతో సౌభాగ్య గణపతిని, 2015లో దేశవ్యాప్తంగా సేకరించిన నాణేలతో చింతామణి గణపతిని నెలకొల్పామని గుర్తు చేశారు. ఈ ఏడాది శ్రీవిద్యా గణపతి విగ్రహం తయారీలో 1,11,111 కలాలను వినియోగించనున్నామన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 7 గంటలకు పండితులను సత్కరిస్తామన్నారు. గణపతి విగ్రహ తయారీకి ఉపయోగించిన వస్తువులను భక్తులకు ప్రసాదంగా అందజేస్తున్నామ తెలిపారు. ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్‌ ఎస్‌.శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఈ ఏడాది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి రాజకీయాలు ప్రవేశించడం శోచనీయమన్నారు. విలేకర్ల సమావేశంలోౖ నగరపాలక సంస్థలో వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, బొంతా శ్రీహరి, సుంకర చిన్ని, చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాం బాబు, బీజేపీ నగర అధ్యక్షుడు బొమ్ముల దత్తు, గుత్తుల మురళీధరరా వు, జక్కంపూడి గణేశ్, మంతెన కేశవరాజు, నందెపు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement