బాలకృష్ణ పుష్కర స్నానం | Actor Balakrishna Takes Holy Dip At Pushkar Ghat Of mahabubnagar | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ పుష్కర స్నానం

Published Thu, Aug 18 2016 12:35 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలకృష్ణ పుష్కర స్నానం - Sakshi

బాలకృష్ణ పుష్కర స్నానం

మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాలు గురువారం ఏడో రోజుకు చేరుకున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా సోమశిల వద్ద పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా సోమశిల వద్ద బాలయ్య కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కృష్ణా పుష్కరాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు బాలకృష్ణ కుటుంబ సభ్యులు.... ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి విజయవాడలోని దుర్గాఘాట్ వద్ద  పుష్కర స్నానమాచరించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement