Somasila
-
తెలంగాణలో మినీ మాల్దీవులు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
సెంటిమెంట్ దేవత.. పర్వతాపూర్ మైసమ్మ
నవాబుపేట: మండలంలోని కాకర్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ ఆలయం ఇటు జిల్లాకేంద్రానికి, అటు మండల కేంద్రానికి మధ్యలో 9 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది. కొత్త వాహనాలకు పూజలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల సమయంలోనూ వివిధ పార్టీల అభ్యర్థులు ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభిస్తారు. ఈ ఆలయం కూడా కొత్త సంవత్సరం వేళ రద్దీగా ఉంటుంది. కృష్ణాతీరంలో.. కొల్లాపూర్:జనవరి ఒకటో తేదీన నియోజకవర్గంలోని కృష్ణా తీర ప్రాంతాలు, నదీతీర ఆలయాలను దర్శించుకునేందుకు ప్రజలు అధికసంఖ్యలో తరలివస్తుంటారు. సోమశిల సమీపంలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. అనంతరం ఏపీ సరిహద్దు ప్రాంతంలోని సంగమేశ్వర ఆలయానికి వెళ్తుంటారు. సోమశిలలోని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆయా ఆలయాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. సింగోటం లక్ష్మీనర్సింహ్మస్వామి, మంచాలకట్ట రామలింగేశ్వరస్వామి, కొల్లాపూర్ రామ మందిరం, శివాలయం, వరిదెల హనుమాన్, మాధవస్వామి ఆలయాలకు కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. సోమశిల, అమరగిరి సమీపంలోని కృష్ణానదిలో విహరించేందుకు బోట్లు అందుబాటులో ఉంటాయి. జటప్రోల్ సమీ పంలోని కత్వ వాటర్ ఫాల్స్‌ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తారు. -
సోమశిల బ్యాక్ వాటర్‌లో ఎన్ని అందాలో.. డోంట్ మిస్.. ఎప్పటికీ గుర్తుంచుకుంటారు
ఆహ్లాదకర తీరం..పాపికొండలను తలపించే విధంగా వాతవరణం..కనుచూపు మేర జలసోయగం..రెండుకొండల నడుమ ఒయ్యారాలు ఒలికించే పెన్నా నది.. నీటిలో ఎగిరే చేపలు.. దేశ విదేశాల నుంచి వచ్చే విహంగాలు అరుదైన పక్షిజాతుల ఇక్కడి సందడి చేస్తుంటాయి. అదే సోమిశిల వెనుకజలాలు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జంపేట : వైఎస్సార్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ పెనుశిల అభయారణ్యం ఏర్పాటుచేయాలని పాతికేళ్ల కిందట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1997 డిసెంబరు 15 జీవో నంబరు 106ను జారీ చేశారు. కడప డివిజన్ పరిధిలోని ఒంటిమిట్ట, సిద్ధవటం రేంజ్ పరిధిలో 43,491,608 హెక్టార్లు , నెల్లూరు జిల్లాలోని 40,443,265 హెక్టార్లను అభయారణ్యంలోకి చేర్చారు. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులు, జలచరాలకు అవాసంగా మారింది. కోటపాడు నుంచి.. ఒంటిమిట్ట(రాజంపేటనియోజకవర్గం)మండలంలోని కోటపాడు శివారులో సోమశిల వెనుకజలాల్లో ఎకో టూరిజం ఏర్పాటు చేయాలని 2010లో నిర్ణయం తీసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబరు 26న ఈ దిశగా అడుగులు పడ్డాయి. తర్వాత రాష్ట్ర విభజన, టీడీపీపాలనలో ఎకో టూరిజం పడకేసింది.ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎకోటూరిజంతో పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని స్ధానిక శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి దృష్టి సారించారు. సోమశిల జలాశయం నిల్వసామర్ధ్యం 77.988 టీఎంసీలు. ప్రస్తుతం 52.3 టీఎంసీలు నిల్వ ఉంది. కోటపాడు, కుడమలూరు, బెస్తపల్లె, ఉప్పరపల్లె, మాధవరం, బోయనపల్లె, చిన్నపురెడ్డిపల్లె, కురుగుంటపల్లె, పొన్నాపల్లి, కొండమాచుపల్లె, మదిలేగడ్డ, గుండ్లమాడ, దొంగలసాని, నెమళ్లగొంది, నర్సనాయనిపేట, వాకమాడ, ఒగూరు, వట్రపురాయి, కొత్తూరు తదితర గ్రామాలు సోమశిల అంతర్భాగంలో ఉండిపోయాయి. బోటు షికారు ఎప్పుడో.. ఒంటిమిట్ట, నందలూరు, మండలాల్లోని బ్యాక్‌వాటర్‌లో బోటుషికారుకు అనుకూలంగా ఉంటుందని పర్యాటకులు భావిస్తున్నారు. ఒంటిమిట్ట రామాలయం ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు, యాత్రికులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. అటువంటప్పుడు సోమశిల బ్యాక్‌వాటర్‌లో షికారు చేయడానికి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. నిధులు కేటాయింపులిలా.. 2020 ఆగస్టు 30న వనవిహారి కోసం రూ.50లక్షలు అనుమతిచ్చారు. 2021 జూలైలో రూ.120 లక్షలతో చేపట్టాలని పరిపాలన ఆమోదం ఇచ్చారు. కోటపాడు శ్రీరామఎత్తిపోతల పంపుహౌస్ సమీపంలో అనువైన స్ధలాన్ని ఎంపిక చేశారు. తొలి విడతలో ఆరుపనులను అటవీశాఖ ఉన్నతాధికారులు రూ.42,84,795లతో చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ఆన్లైన్లో ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. గిట్టుబాటుకాదని పనులు చేయడానికి ఎవరు ముందుకురాకపోవడం గమనార్హం. మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. నాటుపడవలో ఎమ్మెల్యే పరిశీలన.. కొడమలూరులో జరిగిన జాతర సందర్భంగా అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే సోమశిల వెనుకజాలలను పరిశీలించారు. అక్కడ ఆయనకు అందుబాటులో నాటుపడవ కనిపించింది. ప్రమాదకరమని తెలిసినా ధైర్యంగా బ్యాక్‌వాటర్‌లో పర్యటించారు. ఒంటిమిట్ట రేంజ్‌కి ఇచ్చిన బోటు పనిచేయక మూలనచేరింది. అయిదేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని సంగతి తెలిసిందే. ఎకో టూరిజం అభివృద్ధికి కృషి సోమశిల బ్యాక్‌వాటర్‌లో బోటుషికారు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం సెంటర్ అభివృద్ధి చేసుకోవాలి. గతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలో ఎకో టూరిజం ఏర్పాటుచేశారు.దీనిని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒంటిమిట్ట, నందలూరులో కూడా సోమశిల బ్యాక్‌వాటర్ ఉంది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తాం – మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట -
గాజు వంతెన కింద గలగలా కృష్ణమ్మ!
సాక్షి, హైదరాబాద్: గలగలాపారే కృష్ణా నది.. చుట్టూ పాపికొండలను తలపించే పచ్చిక కొండలు.. పక్షుల కిలకిలారావాలు.. ప్రశాంత వాతావరణం.. ఇది సోమశిల వద్ద సీన్. ఇంతకాలం నది ఇవతలో, ఆవలి తీరం వద్దో నిలబడి ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సి వచ్చేది. కానీ నదిపై గాజు వంతెన మీదుగా నడుస్తూ కింద నీటి ప్రవాహాన్ని చుట్టూ ఉన్న అందాలను వీక్షించడమంటే.. ఆ మజానే వేరు. త్వరలోనే సోమశిల వద్ద కృష్ణా నదిపై గాజు వంతెన ఏర్పాటు కానుంది. దానిపైనే వాహనాలు వెళ్లేందుకు వీలుగా మరో వంతెన ఏర్పాటు చేయనున్నారు. అంటే రెండంతస్తుల వంతెన అన్నమాట. ఇందుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదించినట్టు తెలిసింది. ఈ ఏడాదిలోనే పనులు షురూ రెండు వరసల (మల్టీ లెవల్) వంతెనలు చాలా కనిపిస్తాయి. నదులపై వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గం, రైలు ట్రాక్ కోసం మరో మార్గం ఒకదాని పైన ఒకటి ఉండేలా నిర్మించినవి కనిపిస్తాయి. కానీ పర్యాటకులు అక్కడి ప్రకృతిని వీక్షించేందుకు ప్రత్యే క కారిడార్‌తో కూడిన బహుళ అంతస్తుల వంతెన లు విదేశాల్లో ఉన్నా, మనదేశంలో లేవు. తొలిసారి అలాంటి రెండంతస్తుల ఐకానిక్ సస్పెన్షన్ వంతెన (కేబుల్ బ్రిడ్జి)ను సోమశిల వద్ద నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ దుర్గం చెరువుపై నిర్మించిన తరహాలో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తారు. ఇందులో పైన నాలుగు వరసల రోడ్డు, దిగువున పర్యాటకుల కోసం చుట్టూ గాజు ప్యానెల్స్‌తో కూడిన వంతెన ఉంటుంది. దాదాపు 800 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మిస్తారు. ఇందుకు దాదాపు రూ.650 కోట్ల వరకు ఖర్చు కానుంది. ఈ సంవత్సరమే పనులు మొదలు కానున్నాయి. కొల్లాపూర్ మీదుగా నంద్యాలకు.. తెలంగాణ నుంచి నంద్యాల, తిరుపతిలకు వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణానదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గుతుంది. అందుకే గతంలో ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి, విస్తరించాలని ప్రతిపాదించారు. కానీ రకరకాల కారణాలతో అటకెక్కిన ఈ ప్రా జెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్– శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్ నుంచి కల్వ కుర్తి, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్ మీదుగా కృష్ణాతీ రంలోని మల్లేశ్వరం (సోమశిల సమీపంలోని) వర కు ప్రస్తుతం రోడ్డు ఉంది. ఇందులో కొల్లాపూర్ వరకు డబుల్ రోడ్డు ఉండగా, అక్కడి నుంచి కృష్ణా తీరం వరకు సింగిల్ రోడ్డే ఉంది. ఇప్పుడు కోట్రా జంక్షన్ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని నంద్యాల వరకు 173.73 కి.మీ. మేర నాలుగు వరసల రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ జాతీయ రహదారికి 167కె నంబరు కేటాయించారు. ఈ రోడ్డులో భాగంగానే కృష్ణా నది మీద వంతెన నిర్మించాల్సి ఉంది. ఆ ప్రాంతం అద్భుత సౌందర్యానికి ఆలవాలం కావ డంతో అక్కడ నిర్మించే వంతెనను సాధారణంగా కాకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని నిర్ణయించారు. స్తంభాలు లేని వంతెన.. సోమశిలకు నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. పాపికొండలను మించిన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సేద తీరుతుంటారు. ఇప్పుడు గాజు వంతెన అందుబాటులోకి వస్తే పర్యాటకులు పోటెత్తే అవకాశం ఉంది. ఇది స్తంభాలు లేని వంతెన. ఇటు తెలంగాణ వైపు మల్లేశ్వరం తీరం, అటు ఏపీలోని సంగమేశ్వరం తీరంను అనుసంధానిస్తూ రెండు భారీ పైలాన్లను నిర్మిస్తారు. తీరం నుంచి 160 మీటర్ల తర్వాత పైలాన్లు ఉంటాయి. రెండు పైలాన్ల మధ్య 460 మీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 30 జతల భారీ కేబు ల్స్ ఏర్పాటు చేసి వాటి ఆలంబనగా వంతెన నిలి చేలా నిర్మిస్తారు. ఇందులో సెంట్రల్ మీడియన్ భాగంలో గాజు ప్యానెల్ కారిడార్ ఉంటుంది. దానికి రెండు వైపులా వాక్ వేస్ ఉంటాయి. మళ్లీ ఆ చివర, ఈ చివర గాజు ప్యానెల్స్ ఉంటాయి. దీనిద్వారా చుట్టూ ప్రకృతిని, గాజు ప్యానెల్స్ నుంచి దిగువ కృష్ణమ్మ సోయగాలను వీక్షించొచ్చు. నదిలో నడుస్తున్న అనుభూతిని పొందొచ్చు. వంతెన ప్రారంభంలోని యాంకర్ బ్లాక్ వద్ద మెట్లు నిర్మించి, అక్కడి నుంచి పాదచారులు దిగువ వరసలోకి (గాజు కారిడార్) ప్రవేశించే ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ ప్రాంతం పర్యాటకంగా ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మారనుంది. సోమశిలకు 10 కి.మీ దూరంలోని మల్లేశ్వరం వద్ద ఈ నిర్మాణం ఉంటుంది. -
దేశం దృష్టిని ఆకర్షించేలా సోమశిల
సాక్షి, నాగర్‌కర్నూల్: దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించే పర్యాటక ప్రాంతంగా సోమశిలను తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సోమశిల వద్ద కృష్ణా బ్యాక్‌వాటర్‌లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన నూతన బోటును, కాటేజీలను ప్రారంభించారు. అనంతరం బోటులో సోమశిల నుంచి సిద్ధేశ్వరం, అమరగిరి తదితర ప్రాంతాలను వీక్షించారు. అనంతరం బోటులోనే మంత్రి విలేకరులతో మాట్లాడారు. కొల్లాపూర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని అర్హతలు, అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకప్పుడు నక్సల్స్, గ్రేహౌండ్స్ దళాల కాల్పులతో దద్దరిల్లిన కొల్లాపూర్ ప్రాంతం.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కొల్లాపూర్‌ను ఎకో టూరిజం సెంటర్‌గా మారుస్తామన్నారు. కృష్ణా నది తీరంతో కనువిందు చేస్తున్న సోమ శిల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. సోమశిల–సిద్ధేశ్వరం వంతెన నిర్మాణం విషయంలో ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు కలసి ముందుకెళ్తాయని చెప్పారు. -
లక్షల్లో అవినీతి... వందల్లో రికవరీ
సాక్షి, సోమశిల: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఏడాది కాలంపాటు జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామీణ స్థాయిలో నిర్వహించిన సామాజిక తనిఖీ బృందం లక్షల్లో అవినీతిని వెలికితీస్తే చర్యలు చేపట్టాల్సిన అధికారులు మమ అంటూ వందల్లో రికవరీలు చూపుతూ తూతూ మంత్రంగా ప్రజావేదికను నిర్వహించారు. అధికారుల తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతసాగరం మండలంలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉపాధిహామీ పథకం కింద 3,686 అభివృద్ధి పనులను 24 పంచాయతీల్లో చేపట్టారు. ఇందుకు సంబంధించి రూ.1,00,5,38,311 నిధులు విడుదల చేశారు. పది రోజులుగా స్టేట్ ఉపాధిహామీ సామాజిక తనిఖీ మానిటరింగ్ అధికారి దుర్గమ్మ పర్యవేక్షణలో మండలంలోని అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించి ఆయా గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి అవినీతిని వెలికితీశారు. అనంతసాగరంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ ప్రజావేదికను సోమవారం ఏర్పాటు చేశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అడిషనల్ పీడీ నాసర్‌రెడ్డి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగిన విచారణను ఆడిట్ బృందం వెల్లడించారు. సోమశిల నుంచి మొదలుపెట్టి అన్ని గ్రామాలకు రాత్రి వరకు కొనసాగుతున్నాయి. ఉపాధిహామి పథకం కింద జరిగిన అభివృద్ధి పనుల వివరాలను ఆయా పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఆయా పంచాయతీల్లో బోర్డుల నిమిత్తం నగదు మళ్లించాల్సి ఉండగా మండలం మొత్తానికి ఒకే వ్యక్తి ఖాతాలో దాదాపు రూ.4 లక్షలు అప్పటి ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ మళ్లీంచడం ఏమిటంటూ మాజీ ఎంపీపీ కమతం శోభ అధికారులను ప్రశ్నించారు. రసాభాస ప్రజావేదికలో అమనిచిరువెళ్ల ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి అక్రమాలను తెలియచేసేందుకు అధిక సంఖ్యలో కూలీలు వచ్చి అధికారులకు వెల్లడించబోగా ఆయన వారించడంతో సభలో రసాభసా చోటు చేసుకుంది. కూలీలతో అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు సొంత వాళ్లకు ఇష్టం వచ్చినంత కూలీలు వేస్తూ పనులకు రాకపోయినా వ్యాపారులు చేసుకునేవాళ్లకు కూడా ఉపాధి కూలీలుగా చిత్రీకరించడం, అవినీతిని ఆడిట్ బృందం వెల్లడి చేయగా అధికారులు అతనికి వంతు పాడడంతో ఒక్కసారి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్థుబాటు చేశారు. మాజీ సర్పంచ్ వనిపెంట రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కమతం శోభలు గ్రామంలో జరుగుతున్న అవినీతిని నిగ్గుతేల్చాలంటూ పట్టుబట్టారు. దీంతో ఏపీడీ నాసరయ్య మరో 10 రోజుల్లో గ్రామంలో ప్రజావేదిక నిర్వహించి అందరికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో సభ సద్దుమణిగింది. అనంతసాగరం పంచాయతీలో పలు అవినీతి ఆరోపణలతోపాటు ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులకు గృహ నిర్మాణశాఖ ద్వారా పక్కా ఇళ్లు మంజూరు చేసి ఉపాధి నిధులు మంజూరు చేయడం పట్ల మాజీ ఎంపీపీ అధికారులను నిలదీశారు. దీంతోపాటు ఇంకుడుగుంతల నిర్మాణంలో కూడా ఉపాధి సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని, వాటిపై అధికారులు చర్యలు చేపట్టకపోవడం ఏమిటంటూ నిలదీశారు. శంకరనగరంలో లక్షలాది రూపాయల ఉపాధి, పంచాయతీరాజ్, ఐకేపీ, గృహ నిర్మాణశాఖ ద్వారా నిధులు మంజూరయ్యాయని వాటిలో లక్షల రూపాయల అవినీతి జరిగిందంటూ గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు పార్లపల్లి రవికుమార్‌రెడ్డి అధికారులకు తెలియచేశారు. ఆడిట్ బృందం గ్రామంలో చేపట్టిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఉపాధి సిబ్బందికి వత్తాసు పలుకుతున్నారని రవికుమార్‌రెడ్డి ధృజమెత్తారు. రాత్రి వరకు పలు గ్రామాల్లో జరిగిన ఆడిట్‌పై ప్రజావేదిక కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా డ్వామా విజిలెన్స్ అధికారి వెంకటేశ్వరరావు, ఏపిడి మృదుల ఆడిట్ బృందం కోనయ్య, లోకేష్, ఎంపీడీఓ మధుసూధన్, ఇతర మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
కనురెప్పలు కాటేశాయ్
♦ ముగ్గురు బాలికలకు విషమిచ్చి బావిలో తోసిన తండ్రి ♦ ఇద్దరు మృతి.. ప్రాణాపాయ స్థితిలో మరో బాలిక ♦ నాయుడుపేటలో చంటిబిడ్డతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి తండ్రే కాలయముడై.. కనురెప్పలే కంటిని కాటేశాయి. భార్య వదిలి వెళ్లిపోయిందన్న అక్కసుతో ముగ్గురు కుమార్తెలకు విషం తాగించి బావిలో తోసేశాడు ఓ తండ్రి. వారిలో ఇద్దరు బాలికలు మృత్యువాత పడగా.. మరో బాలిక ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు ఏం కష్టవచ్చిందో తెలీదుగానీ కడుపు తీపిని చంపుకున్న ఓ తల్లి ఏడాది బిడ్డతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. నాయుడుపేట పట్టణ పరిధిలోని తూమ్మురు గ్రామ సమీపంలో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. కామిరెడ్డిపాడు (సోమశిల) : పేదరికంలో పుట్టినా వారిది అందమైన జీవితం. ముత్యాల్లాంటి ముగ్గురు ఆడ పిల్లలు ఆ ఇంట్లో సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు తెగమురిసిపోయారు. అంతలోనే సంతో షం ఆవిరైంది. కుటుంబానికి ఆర్థిక ఉన్నతి కల్పించాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం అప్పు చేసి మరీ ఆ ఇంటాయన కువైట్ వెళ్లాడు. ఇదే అదునుగా మరో వ్యక్తితో చనువు పెంచుకున్న ఆ ఇంటావిడ 20 రోజుల క్రితం బిడ్డల్ని వదిలేసి అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసి ఆమె భర్త రెండురోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. మనసులో రగిలిన సంఘర్షణ అతణ్ణి స్థిమితంగా ఉండనివ్వలేదు. మానవ మృగంలా మారి తన ముగ్గురు బిడ్డలకు విషమిచ్చాడు. అక్కడితో ఆగకుండా వారిలో ఇద్దర్ని నూతిలోకి విసిరేశాడు. మూడో బిడ్డనూ విసిరేయబోతుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికే విష ప్రభావానికి గురైన ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో హరిత(8), కీర్తి(6) అనే చిన్నారులు మరణించగా.. ప్రేమ (4) ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బతుకుదెరువు కోసం కువైట్‌కు.. గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన నల్లు పెంచలరత్నంకు వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లి ఎగువమిట్టకు చెందిన భానుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు ఆడపిల్లలు. పెంచలరత్నం జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం అప్పు చేసి కువైట్ వెళ్లి గొర్రెల కాపరిగా పనిలో చేరాడు. ఈ క్రమంలో అతని భార్య భాను గ్రామంలోని సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుని 20 రోజుల క్రితం పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటనపై అనంతసాగరం పోలీసులకు ఫిర్యాదు సైతం అందింది. విషయం తెలుసుకున్న పెంచలరత్నం రెండు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్నాడు. ముగ్గురు బిడ్డల్ని గ్రామానికి సమీపంలోని పొలాల్లో గల దిగుడు బావి వద్దకు తీసుకెళ్లాడు. ముగ్గురికీ పురుగు మందు తాగించి హరిత, కీర్తిలను బావిలోకి తోసేశాడు. కాలనీ వాసులు గమనించి మూడో కుమార్తె ప్రేమను బావిలో పడేయనివ్వకుండా అడ్డుకున్నారు. బాలికను ఆత్మకూరు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. పెంచలరత్నంను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ కేఎస్వీ సుబ్బారెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సోమశిల ఎస్సై శివరాకేష్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆత్మకూరు తరలించారు. గ్రామంలో విషాదం ఇద్దరు పసికందులు తండ్రి ఘాతుకానికి బలైపోయారన్న విషయం తెలిసి ఘటనా స్థలానికి గ్రామస్తులు తండోతండలుగా తరలివచ్చారు. బిడ్డల్ని చంపేందుకు చేతులెట్టాడాయిరా అంటూ వాపోయారు. అందరితో కలివిడిగా తిరిగే చిన్నారులు దుర్మరణం పాలవడంతో కాలనీలో విషాదం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధమే కొంప తీసింది పెంచలరత్నం కువైట్ వెళ్లడంతో అతని భార్య సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తితో కలిసి తరచూ భర్త పెంచలరత్నంకు సెల్‌ఫోన్ ద్వారా వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడేది. దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఆరా తీసిన భర్త ఫోన్లో ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో 20 రోజుల క్రితం ఆమె ఆ వ్యక్తితో కలిసి పరారైంది. విషయం తెలిసి స్వగ్రామానికి చేరుకున్న పెంచలరత్నం భార్యపై కోపాన్ని బిడ్డలపై చూపాడు. ఆమెకు పుట్టిన బిడ్డలు తనకొద్దంటూ ఘాతుకానికి పాల్పడ్డాడు. -
త్యాగానికి ప్రతిఫలం ఇదేనా!
- వ్యవసాయానికి అధికారులు అడ్డుపడితే సహించేది లేదు - సోమశిల ముంపువాసులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, బోనస్ ఇవ్వాలి - ఉద్యోగావకాశాలు, పునరావాసం కల్పించాలి - పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి డిమాండ్ కడప కార్పొరేషన్: సోమశిల ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులను సాగు చేయనీయకుండా అడ్డుకోవడం దారుణమని, రైతుల త్యాగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ప్రశ్నించారు. సోమశిల ముంపు వాసులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. రాజీవ్ స్మృతివనం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సెంట్రల్ జైలు, వైఎస్ఆర్ సర్కిల్, మినీబైపాస్, అంబేడ్కర్ కూడలి మీదుగా కొత్త కలెక్టరేట్‌కు చేరింది. ఈ సందర్భంగా అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పించాలని రైతులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. సోమశిల ప్రాజెక్టు కారణంగా 120 గ్రామాల్లోని 20వేల కుటుంబాల ప్రజలు ఆశ్రయం కోల్పోయి, పంటభూములను వదులుకొని నెల్లూరుకు సాగునీరు, చెన్నైకి తాగునీరు ఇచ్చారని తెలిపారు. ఇంతటి త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయలేదని, బోనస్ అసలే లేదన్నారు. ఎకరాకు రూ.2లక్షలివ్వాలని రైతులు అడిగితే దివంగత సీఎం వైఎస్సార్ రూ.2.50లక్షలు ఇచ్చారని, ఆయన ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని జారీ చేసిన జీఓను ప్రస్తుత ప్రభుత్వం మూలనపడేసిందన్నారు. రైతులు తమ భూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే ఒక మహిళా అధికారిణి అడ్డుకుంటూ ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించడం దారుణమని మండిపడ్డారు. ఆమె వైఖరి మారకపోతే అలాంటి కేసులనే ఆమె కూడా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం పూర్తిగా పరిహారం అందించి, పునరావాసం కల్పించేవరకూ రైతులను వ్యవసాయం చేసుకోనివ్వాలని కోరారు. 78 టీఎంసీల సామర్థ్యంతో సోమశిల ప్రాజెక్టు నిర్మాణానికి జిల్లా రైతులు కన్నీళ్లు పెట్టుకొని భూములను త్యాగం చేశారన్నారు. అదే సోమశిల నీటిని ఒంటిమిట్ట, కడపలకు తాగునీటి కోసం 2 టీఎంసీలు తెచ్చుకుంటుంటే ప్రస్తుత టీడీపీ నేత సోమిరెడ్డి ఆనాడు నెల్లూరులో ధర్నా చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న ఆ పెద్దమనిషి మనకు న్యాయం చేస్తారా... అని అయన అనుమానం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ సోమశిల ముంపు బాధితుల సమస్యలను జిల్లా పరిషత్ సమావేశంలో చర్చించి, వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం, పునరావాసం అందించాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచైనా ముంపుబాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పదిహేను రోజులుగా అటవీశాఖ అధికారులు రైతులను సాగు చేసుకోనివ్వకుండా కేసులు పెట్టడం దారుణమన్నారు. కదంతొక్కిన శ్రేణులు, ముంపువాసులు ముంపు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో పార్టీశ్రేణులు, ముంపువాసులు కదం తొక్కారు. లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రగా వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డికి బైపాస్ సర్కిల్లో జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బీ అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం బైపాస్‌లో ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటునుంచి అందరూ పాదయాత్రలో కలిసి నడిచి కొత్త కలెక్టరేట్ చేరుకున్నారు. అనంతరం ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ–2 శివారెడ్డికి అందజేశారు. పోలవరం రైతులకు ఇచ్చిన పరిహారం తరహాలో ఇవ్వాలి: పోలవరం ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి ప్రభుత్వం ఎకరాకు రూ.50లక్షల పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, బోనస్ ఇచ్చిం ది. సోమశిల ముంపువాసులకు కూ డా అదే తరహా పరిహారం ఇవ్వాలి. రైతులు పంటలు పండించుకోకుండా అధికారులు అడ్డుపడటం దారుణం. సోమశిల ముంపువాసుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం. – పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే ఎకరాకు ఐదారు లక్షలు ఇవ్వడం అన్యాయం: నష్టపరిహారం రాక ఐదేళ్లుగా ముంపువాసులు ఇబ్బందులు పడుతున్నా రు. భూములను సాగు చేసుకుందామంటే అధికారులు ఆటంకా లు కల్పిస్తున్నారు. సోమశిల ముంపువాసుల సమస్యలను ఎంపీ అవినాష్‌రెడ్డి కేంద్రమంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకుపోయారు. గండికోట ప్రాజెక్టు వల్ల మునకకు గురైన చౌటపల్లివాసులకు ఎకరాకు రూ.7లక్షలు ఇస్తే సోమశిల కింద భూములు కోల్పోయిన వారికి ఐదువేలు, పదివేలు ఇవ్వడం అన్యాయం. – కె. సురేష్‌బాబు, కడప మేయర్ రైతులంటే టీడీపీ ప్రభుత్వానికి అలుసు సోమశిల కింద భూములు కోల్పోయి న వారికి నష్టరిహారం ఇవ్వాలని ఎన్టీఆర్ జీఓ ఇస్తే ఆయన తర్వాత సీఎం అయిన చంద్రబాబు దాన్ని పక్కనబెట్టారు. వైఎస్ఆర్ సీఎం అయ్యాకే ముంపువాసులకు నష్టపరిహారం అందించారు. బద్వేల్, రాజంపేట, పెనగలూరు రైతులు నెల్లూరుకు సాగునీరు, చెన్నైకి తాగునీరు ఇవ్వడానికి సహకరిస్తే, ప్రభుత్వం వారికి చిప్పచేతికిచ్చింది. 9900 ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులు నోటిఫై చేశారు. ఆ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆదుకుంటాం. – కొరముట్ల శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే రైతులకు అన్యాయం తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 80శాతం మం ది రైతులకు నష్టపరిహారం ఇచ్చారు. మిగిలిన 20 శాతం మందికి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది. ఇంటికో ఉద్యోగం ఇచ్చేలా జారీ చేసిన జీవోను తుంగలో తొక్కారు. నష్టపరిహారం చెల్లించేవరకూ పంటలు పండించుకోనివ్వాలి. – ఎస్బి అంజద్‌బాషా, కడప ఎమ్మెల్యే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలి అన్ని ప్రాజెక్టులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేస్తున్నారు. సోమశిలకు మాత్రమే లేదు. రైతులు ఎకరాకు రూ.2లక్షలు కావాలంటే రూ.2.50లక్షలు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దే. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆయన జీఓ జారీ చేసి 82మందికి ఉద్యోగాలిచ్చారు. పూర్తి స్థాయిలో పరిహారం, బోనస్ ఇస్తేనే న్యాయం జరుగుతుంది. – ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ పారించుకొనేది నెల్లూరులో, తాగేది చెన్నైలో... నష్టపోయేది మేమా..! సోమశిల ప్రాజెక్టు వల్ల నెల్లూరులో సాగునీరు పారించుకుంటున్నారు. చెన్నైకి తాగునీరు అందిస్తున్నారు, వారికోసం మేము నష్టపోవాలా...! ఎకరాకు రూ.5వేలు చొప్పున అతి తక్కువ నష్టపరిహారం ఇచ్చిన ప్రాజెక్టు సోమశిలే. అది కూడా పొలానికిస్తే ఇంటికివ్వలేదు, ఇంటికిస్తే పొలానికి ఇవ్వలేదు. – ఏ. రామక్రిష్ణారెడ్డి, అట్లూరు రైతు నాయకుడు పైర్లు పెట్టవద్దని అటవీ అధికారులు భయపెడుతున్నారు.. అక్రమార్కులు అడవులు, కొండలను ఆక్రమించి దున్నుతుంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకుంది. పేద ఎస్సీలు, బీసీలు పైర్లు పెట్టుకుంటుంటే మాత్రం ఫారెస్ట్ అధికారులు కేసులు పెడతామని భయపెడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పెంచిన సామాజిక అడవులను నరికితే పట్టించుకొనే వారు లేరుగానీ, రైతులు ఒకటి, అర ఎకరాల్లో పైరు పెట్టుకుంటే తప్పేంటి..? – గోపిరెడ్డి, నందలూరు రైతు -
‘సోమశిల’ పరిహారం తేల్చాల్సిందే!
► భూముల ‘సాగు’కు అటవీ అధికారుల అడ్డంకి ► ఇంటికో ఉద్యోగమేది..కలగానే పునరావాసం ► సోమశిల ముంపువాసులకు వర్తించని ఆర్ఆర్ ప్యాకేజీ ► 28 న ముంపుబాధితులతో వైఎస్సార్సీపీ కలెక్టరేట్ వరకు ర్యాలీ నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం కోసం జిల్లాలోని వేలాదిమంది రైతులు తమ భూములను.. ఇళ్లను కోల్పోయారు. ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా ఎటో తరలిపోయారు. వారి త్యాగాన్ని గుర్తించి సరైన పరిహారం ఇవ్వాల్సిన పాలకులు పట్టించుకోకపోవడంతో వారు దుర్భర పరిస్థితిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నెల్లూరు, తమిళనాడుకు నీళ్లిచ్చేందుకు జిల్లావాసులు త్యాగం చేసినప్పటికి.. వారిపట్ల నేటి పాలకులు నిర్లక్ష్య వైఖరి చూపుతున్నారు. దీనిపై ముంపుబాధితులు ఆగ్రహం.. అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. రాజంపేట: జలాశయం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. ఆ జలాశయంలో నీళ్లు నింపాలంటే మన జిల్లాలోని ఊర్లకు ఊర్లు..భూములకు భూములను కోల్పోవాల్సిన పరిస్థితి. ఇది ఇప్పటి మాట కాదు...40 యేళ్ల కిందటి నుంచి కొనసాగుతూనే ఉంది. అదే సోమశిల జలాశయం. 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయంలో 71 టీఎంసీ రెండుసార్లు మాత్రమే నింపగలిగారు. ఈ సోమశిల జలాశయం వెనుక ప్రాంతంలో 105 గ్రామాలు బ్యాక్‌వాటర్‌లో మునకకు గురయ్యాయి. దాదాపు 20 వేల కుటుంబాలు అరకొర పరిహారంతో ఊర్లు ఖాళీ చేయాల్సి వ చ్చింది. దాదాపు లక్ష ఎకరాల భూమి మునకలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి సరైన జీవనాధారం లేక ముంపుబాధితులు విలవిలలాడుతున్నారు. పెండింగ్‌లో పరిహారం సోమశిల వెనుకజలాల్లో మునకకు గురయ్యే నందలూరు, ఒంటిమిట్ట, గోపవరం, అట్లూరు మండలాలు ఉన్నాయి. 1977 నుంచి ఈ మండలాల్లోని ముంపుగ్రామాల్లోని కట్టడాలకు, భూములకు పరిహారం చెల్లింపు ప్రకియ మొదలైంది. ఇప్పటివరకు ఇంకా కొంతమేర భూములకు, ఇళ్లకు పరిహారం చెల్లింపు అసంపూర్తిగానే ఉంది. చివరి బాధితులు తమ పరిహారం కోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కనుక పెండింగ్‌లో ఉన్న భూములు, ఇళ్లకు పరిహారం ఇవ్వాల్సి వస్తే రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని ముంపుబాధితులు, నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు కారణం చాలా గ్రామాల్లో అధికారులు పాక్షికంగా పరిహారం పంపిణీ చేసి చేతులుదులుపుకోవడమే. ఇదే విషయాన్ని రైతుసంఘ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. భూముల సాగుకు అడ్డంకిగా అటవీశాఖ.. సోమశిల మునక ప్రాంతాన్ని 1997 సెప్టెంబరులో పెనుశిల అభయారణ్యంలోకి చేర్చారు. అటవీ చట్టం ప్రకారం అక్కడ అనుమతి లేనిదే ఎవరు ప్రవేశించరాదనే నిబంధన అమలుచేశారు. ఈ అమలు ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. సోమశిల ముంపునకు సంబంధించి ఒంటిమిట్ట మండలంలోని పెన్నపేరూరు భూములకు పరిహారం కొంతమేర మాత్రమే చెల్లించారు. అయితే ఈ భూ ములు అక్కడి రైతులు సాగుచేసుకుంటుంటే అట వీశాఖ అడ్డుతగిలింది. దీన్ని రైతులు వ్యతిరేకించా రు. తమ ఇళ్లకు కూడా పరిహారం, భూములకు పూర్తిగా పరిహారం ఇవ్వాలని తేగేసి చెబుతున్నా రు.ఇది పెనువివాదంగా మారుతోంది. ఈ పరిస్థితి ఒక్క పెన్నపేరూరే కాదు.. ముంపుగ్రామాల పరిధి లో భూములు సాగుచేసుకుంటున్న వారిందరిది. వైఎస్సార్ హయాంలో ... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముంపుబాధితులను కోట్లాది రూపాయలను పరిహారం కింద ఇచ్చి సాధ్యమైనంత వరకు ఆదుకోగలిగారు. ముంపువాసుల సమస్యలను పరిష్కరించేందుకు అనేక విధాలుగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముంపుబాధితుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పునరావసం కల్పించాలని అనేక విధాలు ముంపుబాధితులకు తన ప్రభుత్వం ద్వారా సాయపడ్డారు. ముంపుబాధితుల పక్షాన వైఎస్సార్సీపీ ర్యాలీ సోమశిల ముంపుబాధితుల పక్షాన వైఎస్సార్సీపీ ఈనెల 28న ర్యాలీ చేపడుతోంది. కడప కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాల నేతలు, నాయకులు, ముంపువాసులు ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆర్ఆర్ ప్యాకేజీ లేకపోవడం దారుణం అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే సోమశిల ప్రాజెక్టుకు ఆర్ఆర్ ప్యాకేజీ లేకపోవడం దారుణం. ముంపుబాధితుల పరిహారంకు సంబంధించి బోనస్ లేదు. ఇంటికో ఉద్యోగం కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారు. వైఎస్సార్ హయాంలో ముంపువాసులకు న్యాయం జరిగింది. ఇప్పటివరకు చాలా గ్రామాల్లో భూములకు, ఇళ్లకు పరిహారం పెండింగ్‌లోనే ఉంది. –ఎల్లారెడ్డి, న్యాయవాది, ముంపువాసుల ప్రతినిధి డీకేటీ భూములకు పరిహారం ఇవ్వలేదు ముంపుగ్రామాలకు సమీపంలో ఉన్న డీకేటీ భూములను ఎన్నో ఏళ్లుగా బాధితులు చేసుకుంటున్నారు. ఆ భూములకు ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. ముంపుబాధితులకు పరిహారం చెల్లింపుపై నేటి పాలకులు, ప్రభుత్వం చూపుతున్న వైఖరి సరిగ్గాలేదు. – బీమయ్య, మాజీ సర్పంచి, చాపరవారిపల్లె భూములు సాగుచేసుకోవద్దంటే ఏలా తరతరాలుగా భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నాం. ఇప్పుడు అటవీశాఖ భూములను సాగుచేసుకునేందుకు వీల్లేదని ఆంక్షలు పెట్టడం అన్యాయం. ఇళ్లకు కూడా పరిహారం ఇచ్చేస్తే గ్రామాలే వదిలి వెళ్లిపోతాం. అప్పటివరకు భూములు సాగుచేసుకునేందుకు అనుమతివ్వాల్సిందే. –ఎం.నారాయణరెడ్డి, పెన్నపేరూరు రైతు -
కృష్ణాపై మరో భారీ వంతెన
నాగర్‌కర్నూలు జిల్లా సోమశిల వద్ద నిర్మాణం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనకు ప్రతిరూపం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ లను అనుసంధానిస్తూ కృష్ణా నదిపై మరో భారీ వంతెన నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. 1.2 కి.మీ.పైగా పొడవుండే ఈ వంతెన రెండు రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్యంతో రూపుదిద్దుకోనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనను తెలంగాణ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంచింది. నాగర్‌కర్నూలు– కర్నూలు జిల్లాల మధ్య కృష్ణా నదిపై సోమశిల వద్ద ఈ వంతెన రూపుదిద్దుకోనుంది. దాదాపు రూ.400 కోట్ల మేర వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ రూ.200 కోట్లు భరించాల్సి ఉంది. ఆ రాష్ట్రం ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. త్వరలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఓ ప్రతినిధి బృందం విజయవాడ వెళ్లి అక్కడి అధికారులతో చర్చించనున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మంజూరు చేసిన ఈ వంతెన విషయంలో ఎట్టకేలకు ఇప్పుడు కదలిక వచ్చింది. చాలాకాలంగా డిమాండ్ ఉన్నా.. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా ఏపీలోకి ప్రవేశించాలంటే ప్రస్తుతం 44వ నంబర్ జాతీయ రహదారే దిక్కవుతోంది. ప్రత్యామ్నాయం లేకపోవటంతో భూత్పూర్ మీదుగా రంగాపూర్, బీచ్పల్లి వంతెన దాటి వెళ్లాల్సి వస్తోంది. దీంతో చాలా దూరం తిరగాల్సి వస్తోంది. కృష్ణా నదికి చేరువగా ఉండే కొల్లాపూర్ వాసులు ఏపీలోని నంద్యాల, ఆత్మకూరుకు వెళ్లాలంటే వంద కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగివెళ్లాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన వారు కూడా ఈ దూరాభారాన్ని భరించాల్సి వస్తోంది. ఆత్మకూరు, నంద్యాల పరిసరాల నుంచి సిమెంట్ లోడు లారీలు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తి లారీలు నిత్యం హైదరాబాద్‌కు తిరుగుతుంటాయి. ఇవి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ వంతెన కోసం చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. బీచ్పల్లి వద్ద ఉన్న రంగాపూర్ వంతెనకు ప్రత్యామ్నాయంగా కొల్లాపూర్ సమీపంలోని సోమశిల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే వంద కిలోమీటర్ల చుట్టు తిరుగుడు తప్పుతుంది. ఫలితంగా రెండు, మూడు గంటల సమయం, విలువైన ఇంధనం ఆదా అవుతాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో.. ఈ ప్రత్యామ్నాయ వంతెన ఆలోచన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది. 2007లో నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని సింగోటం జాతర కోసం రాయలసీమ ప్రాంతం నుంచి వస్తున్న భక్తులు కృష్ణా నది దాటే సమయంలో పుట్టిమునిగి 60 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తీవ్రంగా చలించిపోయిన నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆ ప్రాంతానికి చేరుకుని సోమశిల వద్ద వంతెన నిర్మాణానికి నిర్ణయించారు. దాదాపు 1,200 మీటర్ల పొడవుతో భారీ వంతెన నిర్మాణానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈలోపు రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆ ఆలోచన అటకెక్కింది. తర్వాత రాష్ట్ర విభజన ఆందోళనలతో అది ముందుకు సాగలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వమే ముందుకొచ్చి వంతెన నిర్మాణానికి మరోసారి ప్రతిపాదించింది. ఇది రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉన్నందున ఖర్చును చెరిసగం భరించాలని ఏపీకి ప్రతిపాదన పంపింది. కానీ ఆ రాష్ట్రం ముందుకు రాలేదు. తాజాగా మరోసారి ఆ రాష్ట్రానికి ప్రతిపాదనలు పంపి చర్చలకు సిద్ధమైంది. త్వరలో ప్రతినిధి బృందం అమరావతి వెళ్లి ఆ రాష్ట్ర అధికారులతో చర్చించబోతున్నారు. ఇప్పుడు వారు కూడా సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థతో అక్కడ సర్వే చేయించింది. భూమి పటుత్వం కోసం మట్టి నమూనాలను కూడా పరీక్ష చేయించింది. అందులో సానుకూల ఫలితమే వచ్చింది. దీంతో నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని సోమశిల, ఏపీలోని సిద్ధేశ్వరం మధ్య ఈ వంతెన నిర్మాణానికి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. -
కృష్ణానదిలో తేలిన పురాతన సంగమేశ్వరాలయం
కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల సమీపంలోని కృష్ణానది ఆవలి ఒడ్డున ఉన్న సంగమేశ్వరాలయం తేలింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ గుడి పూర్తిగా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయిన విషయం విదితమే. తూర్పుభాగంలోని గర్భగుడిలో మోకాళ్లలోతు వరకూ ఇంకా నీళ్లు ఉన్నాయి. వారం రోజులుగా నీటి మట్టం భారీగా తగ్గడంతో గుడి పడమటి భాగం పూర్తిగా తేలింది. దీంతో ఆలయ అర్చకులు రఘురామశర్మ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం శివమాలధారులు గర్భగుడిలోని వేపలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
సోమశిలకు సొబగులు!
టూరిజం అధికారులతో మంత్రి కృష్ణారావు భేటీ సాక్షి, హైదరాబాద్: కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఇప్పటికే బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయగా.. తాజాగా స్వదేశ్ దర్శన్ పథకం క్రింద సోమశిల సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రిస్టీనా జడ్ ఛోంగ్తూ, జీఎం మనోహర్‌లతో మంత్రి చర్చించారు. సోమశిలలో గెస్ట్‌హౌస్‌తో పాటు సింగోటం చెరువులో రెండు డీలక్స్ బోట్ల ఏర్పాటుపై కూడా చర్చించారు. అనంతరం లుంబినీ పార్కుకు చేరుకుని హుస్సేన్‌సాగర్‌లో ఉన్న డీలక్స్ అమెరికన్ బోట్‌ను స్వయంగా జూపల్లి కృష్ణారావు నడిపి పరిశీలించారు. 4 నెలలల్లో రెండు బోట్లను అమెరికా నుంచి తెప్పించి సింగోటంలో ఏర్పాటు చేసేందుకు టూరిజం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
సోమశిల 39.69 టీఎంసీలు
సోమశిల: సోమశిల జలాశయంలో శుక్రవారం సాయంత్రానికి 39.690 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3542 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 4150 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే జలాశయం నుంచి ఉత్తర కాలువకు 400 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 375 క్యూసెక్కులు వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 94.089 మీటర్లు, 308.69 అడుగుల నీటి మట్టం నమోదైంది. సగటున 152 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. -
వదినపై మరిది కత్తితో దాడి
తెగి పడిన చెయ్యి, తలకు తీవ్రగాయం పరిస్థితి విషమం పీకేపాడు (సోమశిల) : ఇంటి స్థలం విషయంపై వదినపై మరిది కత్తితో దాడి చేయడంతో ఎడమ చేయి తెగి పడి పోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడులో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పెరుమాళ్ల పెద సుబ్బరాయుడు భార్య వెంకటమ్మ ఇంట్లో పని చేసుకుంటుండగా ఆమె మరిది మస్తానయ్య తన స్థలంలో గోడ కట్టారని వాదనకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మస్తానయ్య బాకు వంటి కత్తితో దాడి చేశాడు. తలకు తగులుతుందని చెయ్యి అడ్డం పెట్టింది. దాడిలో ఆమె ఎడమ చెయ్యి తెగి పడింది. అయినా విచక్షణా రహితంగా ఆమె తలపై కత్తితో దాడి చేశాడు. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో మస్తానయ్య అక్కడి నుండి పరారయ్యాడు. 108 వాహనంలో ఆమెను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో నెల్లూరుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆత్మకూరు సీఐ ఖాజావలి సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పోలీసులు మస్తానయ్య కోసం గాలిస్తున్నారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సోమశిలకు 29 వేల క్యూసెక్కులు
సోమశిల: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి గురువారం సాయంత్రానికి 29 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో జలాశయంలో నీటి మట్టం 11.3 టీఎంసీలకు చేరింది. నంద్యాల సమీపంలోని రాజోలుబండ ఆనకట్టవద్ద ఉదయం 22 వేల క్యూసెక్కులుగా ఉన్న వరద సాయంత్రానికి 12 వేల క్యూసెక్కులకు తగ్గింది. పెన్నానది ప్రధాన హెడ్ రెగ్యులేటర్ అయిన వైఎస్సార్‌జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద ఉదయం 32 వేల క్యూసెక్కులు వరద కొనసాగగా, రాత్రికి 19వేల క్యూసెక్కులుగా నమోదైంది. చెన్నూరు గేజ్వద్ద ఉదయం 35వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా, రాత్రికి 26వేల క్యూసెక్కులకు తగ్గుముఖం పట్టింది. సోమశిల జలాశయానికి ఉదయం 22వేల క్యూసెక్కుల వంతున కొనసాగిన వరద, మధ్యాహ్నం 27 వేల క్యూసెక్కులకు పెరిగింది. రాత్రికి 29వేల క్యూసెక్కుల వంతున ప్రవహిస్తోంది. జలాశయంలో ఉదయం 10.01 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం రాత్రికి 11.321 టీఎంసీలకు చేరుకుంది. వరద ప్రవాహం కొనసాగితే నీటిమట్టం 15 టీఎంసీలకు చేరుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. -
డెల్టాకు నీరు నిలిపివేత
సోమశిల: సోమశిల జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు విడుదలవుతున్న నీటిని శనివారం అధికారులు నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ దేశ్ నాయక్ మాట్లాడుతూ జలాశయం నుంచి 2500 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్న నేపథ్యంలో డెల్టా ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు నీటిని నిలిపామన్నారు. రెండో పంటకు సెప్టెంబర్ 15 తేదీ వరకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 23.5 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఇంకా 4 టీఎంసీల వరకు ఇవ్వాల్సి ఉందన్నారు. పెతట్టు ప్రాంతాల నుంచి జలాశయానికి 569 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 7.365 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. జలాశయంలో 82.156 మీటర్లు, 269.54 అడుగు మట్టం నీటి మట్టం ఉందన్నారు. -
ఇరిగేషన్ నిర్వాకం.. ఆయకట్టు రైతులకు శాపం
ఆధునీకరణ పనులు జరిగినా ఊరుముందర కాలువకు పారని నీరు ఆందోళనలో అన్నదాతలు రూ.కోట్లతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.. పొలాలకు సాగునీరు అందుతుందని భావిస్తున్న రైతులు అడియాశలయ్యేలా ఉన్నాయి. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలోపంతో పనులు జరిగినా రైతులకు ఎటువంటి ఉపయోగం లేకుండాపోయింది. సోమశిల : అనంతసాగరం మండలంలోని అమానిచిరివెళ్ల చెరువు నుంచి మొదలయ్యే కొమ్మలేరువాగు ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి, బట్టేపాడు వరకు సాగుతుంది. ఈ వాగు పూడికతో నిండిపోవడంతో సుమారు రూ.23 కోట్లతో 2013 సంవత్సరంలో ఆధునీకరణ పనులు ప్రారంభించారు. మండలంలోని రేవూరు సమీపంలో కొమ్మలేరు వాగుకు ఊరుముందర కాలువనే చీలుకాలువ ఉంది. దీని కింద రేవూరు, ఇస్కపల్లి గ్రామాల్లో సుమారు 250 ఎకరాలు సాగులో ఉంది. కొమ్మలేరు వాగు ఆధునీకరణలో ఊరుముందర కాలువకు ఏర్పాటుచేయాల్సిన ఆనకట్ట సక్రమంగా నిర్మాణం చేపట్టకపోవడంతో ఊరుముందర కాలువకు నీళ్లు ఎక్కడంలేదు. ఫలితంగా ఈ కాలువ ఆయకట్టు రైతులు వారి పొలాల్లో పంట వేసుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
ఉత్తరకాలువలో నీరు సజావుగా సాగేలా చూస్తాం
తెలుగుగంగ సీఈ సుధాకర్‌బాబు ఆత్మకూరురూరల్: ఉత్తరకాలువ 96వ ప్యాకేజీలో 70వ కిలోమీటరు వరకు 750 క్యూసెక్కుల నీరు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటామని తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు అన్నారు. మండలంలోని వెన్నవాడ – ఆరవీడు మధ్య ఉత్తరకాలువను ఆయన గురువారం పరిశీలించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూటూరు మురళీకన్నబాబుతో కలిసి మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పరిధిలో ఉత్తర కాలువను పరిశీలించి నీటి పారుదలలో ఎదురయ్యే సమస్యలను వివరించారు. వెన్నవాడ, ఆరవీడు మధ్య సుమారు 5 కిలోమీటర్ల మేర భూస్వాభావం వల్ల నీటిని ముందుకుసాగని పరిస్థితి ఉందని పరిశీలించామన్నారు. ఈ ప్రాంతంలో కాలువ డిజైన్‌లోని లోపాలను సరిదిద్ది కాలువకు ఇరువైపులా రిటైనింగ్‌గోడలు కట్టి సాగునీరు సజావుగా సాగేలా చేస్తామన్నారు. దీనికిగాను ఎస్టిమేషన్లు, జరగాల్సిన పనుల గురించి నివేదిక అందచేయాలని ఈఈ, డీఈలను ఆదేశించారు. ఉత్తర కాలువ ద్వారా సోమశిల జలాలు ప్రస్తుతం ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం, కలిగిరి, దగదర్తి వరకు సరఫరా అవుతుందన్నారు. కొత్తగా కొండాపురం మండలంతో పాటు రాళ్లపాడు ప్రాజెక్టుకు 1.20 లక్షల ఎకరాల సాగునీటికి సరఫరా అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 2017 సంవత్సరం చివరినాటికి పనులు పూర్తయ్యేలా చేస్తామన్నారు. ప్రస్తుతం సోమశిల ప్రాజెక్టు వద్ద ఉత్తర కాలువకు 750 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే ఏఎస్‌పేట మండలం రాజవోలు వరకు కేవలం 200 క్యూసెక్కుల మేరకే వస్తున్నాయన్నారు. దీంతో కాలువ పరిధిలో పరిశీలించి లోపాలను గుర్తించామన్నారు. గుర్తించిన పనులు పూర్తి చేసిన అనంతరం విడుదలయ్యే 750 క్యూసెక్కుల నీరు రాజవోలు వరకు 460 క్యూసెక్కులు చేరేలా చర్యలు తీసుకునేలా పనులు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ దేశ్‌నాయక్, డీఈ ఎం.రవి, ఏఈలు, రైతులు పాల్గొన్నారు. -
బాలకృష్ణ పుష్కర స్నానం
మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాలు గురువారం ఏడో రోజుకు చేరుకున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా సోమశిల వద్ద పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా సోమశిల వద్ద బాలయ్య కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా పుష్కరాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు బాలకృష్ణ కుటుంబ సభ్యులు.... ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి విజయవాడలోని దుర్గాఘాట్ వద్ద పుష్కర స్నానమాచరించిన విషయం విదితమే. -
సోమశిలకు 2206 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సోమశిల: రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల జలాశయానికి మంగళవారం ఉదయానికి 2206 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 9.383 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 3000 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 83.390 మీటర్లు, 273.59 అడుగుల మట్టం నమోదైంది. సగటున 74 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. కండలేరులో రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 23.553 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్ తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 200, పిన్నెరువాగుకి 5, మొదటి బ్రాంచ్ కెనాల్‌కు30, లోలెవల్ స్లూయీస్‌కు 30 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
సోమశిలకు 3,472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సోమశిల : రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల జలాశయానికి సోమవారం ఉదయం కల్లా 3,472 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సోమశిలకు పైతట్టు ప్రాంతాలైన పెన్నా నది ప్రధాన హెడ్ రెగ్యులేటర్ ఉన్నæ వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద 700 క్యూసెక్కుల వంతున వరద ప్రహిస్తోంది. చెన్నూరు వద్ద 1,100 క్యూసెక్కుల వరద నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 11.069 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నారు డెల్టాకు 2వేల క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 84.32 మీటర్లు, 276.64 అడుగుల మట్టం నమోదైంది. సగటున 55 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. -
సకాలంలో పూర్తి చేయాలి
– మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్: పుష్కరాల పనులను సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గురువారం సోమశిలలోని హరిత హోటల్లో పుష్కరాల పనులు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర పనుల ప్రగతిని సంబంధితశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్య చర్యలు, దేవాలయాల అభివృద్ధి పనులు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కొత్తగా నిర్మిస్తున్న రహదారులపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు తిరగకుండా చూడాల్సిన బాధ్యత గ్రామస్థాయి అధికారులపైనే ఉందన్నారు. ఎక్కడైనా కేజీ వీల్స్‌తో రోడ్లు పాడైతే అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుష్కరాల కోసం ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఏవైనా ఉంటే వాటి కోసం త్వరగా ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని, వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని వెల్లడించారు. దేవాలయాల వద్ద విద్యుద్దీపాలంకరణతో పాటు వసతి సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, దేవాదాయ శాఖల అధికారులతో పాటు ఎంపీపీలు నిరంజన్‌రావు, వెంకటేశ్వర్రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, తదితరులు పాల్గొన్నారు. -
ఓఎస్డీ పరిశీలన
కొల్లాపూర్ రూరల్ : సోమశిల సమీపంలోని పుష్కరఘాట్లను పోలీస్ శాఖ ఓఎస్డీ వెంకటేశ్వర్లు, సీఐ రాఘవరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల పార్కింగ్ స్థలం, సిబ్బంది క్వార్టర్లను చూశారు. భక్తులకు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మన్ననూర్ : అమ్రాబాద్ మండలం పాతాళగంగlవద్ద ఏర్పాటు చేస్తున్న ఘాట్లను పుష్కరాల నిర్వహణ ప్రత్యేకాధికారి, డీఆర్డీఏ పీడీ మధుసూదన్‌నాయక్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి స్నాన ఘాట్లను చూశారు. గడువులోపు పనులు నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ తనిఖీలో సరిగా ఉంటేనే బిల్లులు చెల్లిస్తామన్నారు. స్నాన ఘాట్లకు సమీపంలోనే టెంట్లు వేసేందుకు కొంతభాగాన్ని సమతలంగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పనులను పరిశీలించి సమాచారం ఇవ్వాలని ఆర్ఐ కృష్ణాజీని ఆదేశించారు. అనంతరం వీఐపీల వాహనాల పార్కింగ్, తాత్కాలిక టాయిలెట్స్, బస్టాండ్ కోసం సిద్ధం చేసిన స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బూదాల ప్రసాద్, స్థానికులు ప్రేమ్‌కుమార్, మహేష్, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. -
సోమశిలలో11.741 టీఎంసీల నీరు నిల్వ
సోమశిల : సోమశిల జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 11.741 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నార్‌డెల్టాకు పవర్ టెన్నెల్ ద్వారా 1,800 క్యూసెక్కులు, స్లూయీజ్ గేట్ల ద్వారా 1,200 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 84.664 మీటర్లు, 278.77 అడుగుల నీటిమట్టం నమోదైంది. సగటున 102 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. కండలేరులో రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 24.150 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్ తెలిపారు. లోలెవల్ స్లూయీస్‌కు 37 క్యూసెక్కులు ,మొదటి బ్రాంచ్ కెనాల్‌కు 20 క్యూసెక్కులు, పికప్ ఏరుకు 50 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
చట్టం నిర్వీర్యం చేస్తే సహించం
అనంతసాగరం(సోమశిల) : ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ చట్టం నిర్వీర్యం చేయాలని యోచిస్తోందని అలా చేస్తే సహించేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.పుల్లయ్య అన్నారు. గురువారం మండల కేంద్రమైన అనంతసాగరంలో మండలస్థాయి సీపీఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యాన్ని వ్యసాయ కార్మికులకు సక్రమంగా అందజేయడంలేదన్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో యంత్రాల వినియోగం పెరిగి కూలీలకు పనుల లేకుండాపోతోందన్నారు. ప్రభుత్వం వ్యసాయ కూలీల చట్టం సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు కూలీలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫమైందన్నారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ కార్మిక సంఘం మండల శాఖను ఎన్నుకున్నారు. నూతన కమిటీ : మందా శ్రీరాములు అధ్యక్షుడిగా, ముడిమి రాజయ కార్యదర్శిగా, మరికొంతమందిని సభ్యులుగా ఎంపికచేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గంటా లక్ష్మీపతి, ఆత్మకూరు డివిజన్ మహిళా కార్యదర్శి గుర్జార్ బేగం, నాయకులు జి.సుబ్బారాయుడు, అన్వర్, మస్తాన్, జేవీవీ నాయకులు వేము పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.