ఓఎస్‌డీ పరిశీలన
Published Thu, Jul 28 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
కొల్లాపూర్ రూరల్ : సోమశిల సమీపంలోని పుష్కరఘాట్లను పోలీస్ శాఖ ఓఎస్‌డీ వెంకటేశ్వర్లు, సీఐ రాఘవరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల పార్కింగ్ స్థలం, సిబ్బంది క్వార్టర్లను చూశారు. భక్తులకు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
మన్ననూర్ : అమ్రాబాద్ మండలం పాతాళగంగlవద్ద ఏర్పాటు చేస్తున్న ఘాట్లను పుష్కరాల నిర్వహణ ప్రత్యేకాధికారి, డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌నాయక్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి స్నాన ఘాట్లను చూశారు. గడువులోపు పనులు నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ తనిఖీలో సరిగా ఉంటేనే బిల్లులు చెల్లిస్తామన్నారు. స్నాన ఘాట్లకు సమీపంలోనే టెంట్లు వేసేందుకు కొంతభాగాన్ని సమతలంగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పనులను పరిశీలించి సమాచారం ఇవ్వాలని ఆర్‌ఐ కృష్ణాజీని ఆదేశించారు. అనంతరం వీఐపీల వాహనాల పార్కింగ్, తాత్కాలిక టాయిలెట్స్, బస్టాండ్ కోసం సిద్ధం చేసిన స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బూదాల ప్రసాద్, స్థానికులు ప్రేమ్‌కుమార్, మహేష్, గురువయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement