
ప్రత్యేక అలంకరణలో మైసమ్మ దేవత
నవాబుపేట: మండలంలోని కాకర్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ ఆలయం ఇటు జిల్లాకేంద్రానికి, అటు మండల కేంద్రానికి మధ్యలో 9 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది.
కొత్త వాహనాలకు పూజలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల సమయంలోనూ వివిధ పార్టీల అభ్యర్థులు ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభిస్తారు. ఈ ఆలయం కూడా కొత్త సంవత్సరం వేళ రద్దీగా ఉంటుంది.
కృష్ణాతీరంలో..
కొల్లాపూర్:జనవరి ఒకటో తేదీన నియోజకవర్గంలోని కృష్ణా తీర ప్రాంతాలు, నదీతీర ఆలయాలను దర్శించుకునేందుకు ప్రజలు అధికసంఖ్యలో తరలివస్తుంటారు. సోమశిల సమీపంలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. అనంతరం ఏపీ సరిహద్దు ప్రాంతంలోని సంగమేశ్వర ఆలయానికి వెళ్తుంటారు.
సోమశిలలోని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆయా ఆలయాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. సింగోటం లక్ష్మీనర్సింహ్మస్వామి, మంచాలకట్ట రామలింగేశ్వరస్వామి, కొల్లాపూర్ రామ మందిరం, శివాలయం, వరిదెల హనుమాన్, మాధవస్వామి ఆలయాలకు కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. సోమశిల, అమరగిరి సమీపంలోని కృష్ణానదిలో విహరించేందుకు బోట్లు అందుబాటులో ఉంటాయి. జటప్రోల్ సమీ పంలోని కత్వ వాటర్ ఫాల్స్‌ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తారు.