pathalaganga
-
ఓఎస్డీ పరిశీలన
కొల్లాపూర్ రూరల్ : సోమశిల సమీపంలోని పుష్కరఘాట్లను పోలీస్ శాఖ ఓఎస్డీ వెంకటేశ్వర్లు, సీఐ రాఘవరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల పార్కింగ్ స్థలం, సిబ్బంది క్వార్టర్లను చూశారు. భక్తులకు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మన్ననూర్ : అమ్రాబాద్ మండలం పాతాళగంగlవద్ద ఏర్పాటు చేస్తున్న ఘాట్లను పుష్కరాల నిర్వహణ ప్రత్యేకాధికారి, డీఆర్డీఏ పీడీ మధుసూదన్‌నాయక్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి స్నాన ఘాట్లను చూశారు. గడువులోపు పనులు నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ తనిఖీలో సరిగా ఉంటేనే బిల్లులు చెల్లిస్తామన్నారు. స్నాన ఘాట్లకు సమీపంలోనే టెంట్లు వేసేందుకు కొంతభాగాన్ని సమతలంగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పనులను పరిశీలించి సమాచారం ఇవ్వాలని ఆర్ఐ కృష్ణాజీని ఆదేశించారు. అనంతరం వీఐపీల వాహనాల పార్కింగ్, తాత్కాలిక టాయిలెట్స్, బస్టాండ్ కోసం సిద్ధం చేసిన స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బూదాల ప్రసాద్, స్థానికులు ప్రేమ్‌కుమార్, మహేష్, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాతాళగంగలో హైద్రాబాద్ యువకుడి మృతి
శ్రీశైలం : శ్రీశైలదేవస్థానం పరిధిలోని పాతాళగంగలో మంగళవారం హైద్రాబాద్ చంపాపేటకు చెందిన సంతోష్ (17) అనే యువకుడు మృతి చెందాడు. ఏఎస్ఐ జి రామచంద్ర గౌడ్ చెప్పిన వివరాల మేరకు హైద్రాబాద్ నుంచి 19 మంది స్నేహితులతో కలిసి గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు శ్రీశైలం వచ్చినట్లు తెలిపారు. లింగాలగట్టులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరం శ్రీ భ్రమరాంభికామల్లికార్జునస్వామి వార్లను దర్శించుకునేందుకు క్షేత్రానికి వచ్చారని అన్నారు. దర్శనానికి ముందుగా పాతాళగంగలో పుణ్యస్నానాలు చేయాలనే సంకల్పంతో పాతాళగంగకు వెళ్లారు. అక్కడ స్నానాలాచరిస్తుండగా అకస్మాత్తుగా సంతోష్ మునిగిపోవడంతో వారి స్నేహితులు మత్సకారులకు తెలిపారని, వారు వెంటనే వలలు వేసి మృతదేహాన్ని బయటకు తీశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందజేసినట్లు పేర్కొన్నారు. వెంటనే ఎఎస్ఐ రామచంద్రగౌడ్, రాములు అక్కడికి చేరుకుని వారి స్నేహితులతో వివరాలను తెలుసుకుని బంధువులకు సమాచారాన్ని అందజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీశైలంప్రాజెక్టు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.