శ్రీశైలం : శ్రీశైలదేవస్థానం పరిధిలోని పాతాళగంగలో మంగళవారం హైద్రాబాద్ చంపాపేటకు చెందిన సంతోష్ (17) అనే యువకుడు మృతి చెందాడు. ఏఎస్‌ఐ జి రామచంద్ర గౌడ్ చెప్పిన వివరాల మేరకు హైద్రాబాద్ నుంచి 19 మంది స్నేహితులతో కలిసి గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు శ్రీశైలం వచ్చినట్లు తెలిపారు. లింగాలగట్టులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరం శ్రీ భ్రమరాంభికామల్లికార్జునస్వామి వార్లను దర్శించుకునేందుకు క్షేత్రానికి వచ్చారని అన్నారు. దర్శనానికి ముందుగా పాతాళగంగలో పుణ్యస్నానాలు చేయాలనే సంకల్పంతో పాతాళగంగకు వెళ్లారు.
అక్కడ స్నానాలాచరిస్తుండగా అకస్మాత్తుగా సంతోష్ మునిగిపోవడంతో వారి స్నేహితులు మత్సకారులకు తెలిపారని, వారు వెంటనే వలలు వేసి మృతదేహాన్ని బయటకు తీశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందజేసినట్లు పేర్కొన్నారు. వెంటనే ఎఎస్‌ఐ రామచంద్రగౌడ్, రాములు అక్కడికి చేరుకుని వారి స్నేహితులతో వివరాలను తెలుసుకుని బంధువులకు సమాచారాన్ని అందజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీశైలంప్రాజెక్టు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాతాళగంగలో హైద్రాబాద్ యువకుడి మృతి
Published Tue, Sep 22 2015 10:03 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement