చట్టం నిర్వీర్యం చేస్తే సహించం
చట్టం నిర్వీర్యం చేస్తే సహించం
Published Fri, Jul 22 2016 5:25 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
అనంతసాగరం(సోమశిల) : ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ చట్టం నిర్వీర్యం చేయాలని యోచిస్తోందని అలా చేస్తే సహించేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.పుల్లయ్య అన్నారు. గురువారం మండల కేంద్రమైన అనంతసాగరంలో మండలస్థాయి సీపీఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యాన్ని వ్యసాయ కార్మికులకు సక్రమంగా అందజేయడంలేదన్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో యంత్రాల వినియోగం పెరిగి కూలీలకు పనుల లేకుండాపోతోందన్నారు. ప్రభుత్వం వ్యసాయ కూలీల చట్టం సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు కూలీలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫమైందన్నారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ కార్మిక సంఘం మండల శాఖను ఎన్నుకున్నారు.
నూతన కమిటీ :
మందా శ్రీరాములు అధ్యక్షుడిగా, ముడిమి రాజయ కార్యదర్శిగా, మరికొంతమందిని సభ్యులుగా ఎంపికచేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గంటా లక్ష్మీపతి, ఆత్మకూరు డివిజన్ మహిళా కార్యదర్శి గుర్జార్ బేగం, నాయకులు జి.సుబ్బారాయుడు, అన్వర్, మస్తాన్, జేవీవీ నాయకులు వేము పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement