
సాక్షి, హైదరాబాద్: తెలంగాణాలో సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు జారీ చేస్తున్నట్లు మున్సిపల్, ఐటీమంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రోడూసర్స్ అసోసియేషన్ సదుస్సులో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు. వ్యవసాయం కోసం ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకుపోతోందన్నారు.
రాష్ట్రంలో అనుసరిస్తున్న వ్యవసాయ విధానం దేశానికే ఆదర్శమని చెప్పారు. తెలంగాణలో పరిశ్రమలకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతి మంజూరు చేసున్నామని, అలా ఇవ్వకపోతే 16వ రోజు సంబంధిత అధికారులకు ఫైన్ కూడా విధిస్తున్నామన్నారు.