అక్రమంగా దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సోమశిల: అక్రమంగా దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం గోవిందమ్మపల్లి గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. ఇళ్లలో ఎర్రచందనాన్ని దాచి ఉంచారనే సమాచారం అందుకున్న సోమశిల పోలీసులు గోవిందమ్మపల్లిలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి విలువ అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.