సోమశిలలో11.741 టీఎంసీల నీరు నిల్వ
Published Tue, Jul 26 2016 6:13 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
సోమశిల : సోమశిల జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 11.741 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నార్‌డెల్టాకు పవర్ టెన్నెల్ ద్వారా 1,800 క్యూసెక్కులు, స్లూయీజ్ గేట్ల ద్వారా 1,200 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 84.664 మీటర్లు, 278.77 అడుగుల నీటిమట్టం నమోదైంది. సగటున 102 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.
కండలేరులో
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 24.150 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్ తెలిపారు. లోలెవల్ స్లూయీస్‌కు 37 క్యూసెక్కులు ,మొదటి బ్రాంచ్ కెనాల్‌కు 20 క్యూసెక్కులు, పికప్ ఏరుకు 50 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Advertisement