Kandaleru Resorvier
-
‘కండలేరు’లో గల్లంతైనవారి మృతదేహాలు లభ్యం
పొదలకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : కండలేరు జలాశయంలో మంగళవారం సాయంత్రం గల్లంతైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలను పోలీసు అధికారులు జాలర్ల సాయంతో బుధవారం వెలికితీశారు. పొదలకూరు సీఐ జి.సంగమేశ్వరరావు పర్యవేక్షణలో కండలేరు ఎస్ఐ అనూషా ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను వెలికి తీయించారు. తమిళనాడుకు చెందిన పొన్నుకుమార్, బోసు కుటుంబాలకు చెందిన మొత్తం 8 మంది శ్రీరామనవమి పూర్తయిన సందర్భంగా కండలేరును తిలకించి స్నానాలు చేసేందుకు జలాశయం వద్దకు వెళ్లారు. అయితే జలాశయం లోతు, వివరాలు తెలియని వారు రివిట్మెంట్కు పట్టిన పాచి వల్ల జారిపోయి.. లోతుగా ఉన్న జలాశయంలో పడిపోయారు. బోసును అతడి భార్య చీర కొంగు అందించి ప్రాణాలు కాపాడింది. పొన్నుకుమార్(36), అతడి కుమార్తె పవిత్ర (7), బోసు కుమార్తె లక్ష్మి(11) గల్లంతయ్యారు. తమిళులైన వీరు చేజర్ల మండలం కొనపనాయుడుపల్లికి వలస వచ్చి చుట్టుపక్కల గ్రామాలకు తినుబండారాలను ద్విచక్రవాహనంపై వెళ్లి వేస్తుంటారు. కండలేరులో స్నానాలు నిషేధం : డీఎస్పీ కండలేరు జలాశయంలో స్నానఘట్టాలు లేవని, స్నానాలు, ఈత నిషేధమని ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. డీఎస్పీ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
కండలేరు జలాశయాన్ని పరిశీలించిన మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి కండలేరు జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కండలేరులో ప్రస్తుత నీటి మట్టం 53 టీఎంసీలు. తెలుగు గంగ చరిత్రలో తొలిసారిగా 60 టీఎంసీల నీటిని నిల్వచేస్తాం. జిల్లాలో ప్రతి గ్రామానికి తాగు, సాగు నీరు అందిస్తాం. వరుసగా రెండేళ్లు జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జలాశయాల కింద ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను తక్షణం పునరావాసాలకు తరలించాలి' అని అధికారులకు సూచించారు. (ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్ పరామర్శ ) -
సోమశిలలో11.741 టీఎంసీల నీరు నిల్వ
సోమశిల : సోమశిల జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 11.741 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నార్‌డెల్టాకు పవర్ టెన్నెల్ ద్వారా 1,800 క్యూసెక్కులు, స్లూయీజ్ గేట్ల ద్వారా 1,200 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 84.664 మీటర్లు, 278.77 అడుగుల నీటిమట్టం నమోదైంది. సగటున 102 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. కండలేరులో రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 24.150 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్ తెలిపారు. లోలెవల్ స్లూయీస్‌కు 37 క్యూసెక్కులు ,మొదటి బ్రాంచ్ కెనాల్‌కు 20 క్యూసెక్కులు, పికప్ ఏరుకు 50 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
కండలేరులో 24.458 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 24.458 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్ తెలిపారు. లోలెవల్ స్లూయీస్‌కు 37 క్యూసెక్కులు, మొదటి బ్రాంచ్ కెనాల్‌కు 20 క్యూసెక్కులు, పికప్ ఏరుకు 30 క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.