వదినపై మరిది కత్తితో దాడి
-
తెగి పడిన చెయ్యి, తలకు తీవ్రగాయం
-
పరిస్థితి విషమం
పీకేపాడు (సోమశిల) : ఇంటి స్థలం విషయంపై వదినపై మరిది కత్తితో దాడి చేయడంతో ఎడమ చేయి తెగి పడి పోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడులో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పెరుమాళ్ల పెద సుబ్బరాయుడు భార్య వెంకటమ్మ ఇంట్లో పని చేసుకుంటుండగా ఆమె మరిది మస్తానయ్య తన స్థలంలో గోడ కట్టారని వాదనకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మస్తానయ్య బాకు వంటి కత్తితో దాడి చేశాడు. తలకు తగులుతుందని చెయ్యి అడ్డం పెట్టింది. దాడిలో ఆమె ఎడమ చెయ్యి తెగి పడింది. అయినా విచక్షణా రహితంగా ఆమె తలపై కత్తితో దాడి చేశాడు. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో మస్తానయ్య అక్కడి నుండి పరారయ్యాడు. 108 వాహనంలో ఆమెను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో నెల్లూరుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆత్మకూరు సీఐ ఖాజావలి సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పోలీసులు మస్తానయ్య కోసం గాలిస్తున్నారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.