
భోపాల్: కోడళ్లను వేధించే అత్తల గురించి అందరం వింటుంటాం. సమాజంలో ఇది మామూలే. అయితే మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలోని అట్రాలా గ్రామంలో ఓ కోడలు అత్తను అతి దారుణంగా చంపింది. కొడవలితో ఒక్కసారి కాదు ఏకంగా 95సార్లు నరికి నరికి చంపింది.
ఈ కేసు విచారించిన రెవా జిల్లా కోర్టు బుధవారం(జూన్12) మరణ శిక్ష విధించింది. 2022 జులై12న కోడలు కంచన్ చేతిలో అత్త సరోజ్‌కోల్ హత్యకు గురైంది.
అత్త సరోజ్‌కోల్ హత్యకు మామ వాల్మీకికోల్ దగ్గరుండి కోడలిని పురిగొల్పినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కానీ ఆధారాలు లేక వాల్మీకి కోల్‌ను కోర్టు విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment