భద్రాచలం పుష్కరఘాట్ వద్ద చేసిన ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాలు లోపించాయి.
ఖమ్మం (భద్రాచలం) : భద్రాచలం పుష్కరఘాట్ వద్ద చేసిన ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాలు లోపించాయి. ఏడు రోజుల క్రితం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఆరు విద్యుత్ స్తంభాలు గురువారం నేలకొరిగాయి. వీటికి రెండు రోజుల క్రితమే విద్యుత్ సరఫరా కూడా ప్రారంభించారు.
తాజాగా పెద్ద శబ్ధం చేస్తూ ఆ ఏడు స్తంభాలు నేలకొరగడంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో పుష్కరఘాట్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లలోని డొల్లతనం బయటపడింది.