పుష్కర స్నానం చేసిన చిరంజీవి | Chiranjeevi holy bath at Rajahmundry VIP pushkar ghat | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 22 2015 6:25 PM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM

రాజమండ్రిలోని వీఐపీ పుష్కరఘాట్లో కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి బుధవారం పుణ్యస్నానమాచరించారు. చిరంజీవితోపాటు ఆయన బావమరది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా పుణ్యస్నానం చేశారు. అనంతరం వారిద్దరు తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పుష్కర స్నానానికి చిరంజీవి వస్తున్నారని తెలిసి... కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో వీఐపీ పుష్కర ఘాట్ వద్దకు చేరుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement