కరీంనగర్ (మంథని) : కరీంనగర్ జిల్లా మంథనిలోని పుష్కరఘాట్ను శుక్రవారం కాంగ్రెస్ నేతల బృందం పరిశీలించింది. పుష్కర ఘాట్ల వద్ద చేసిన ఏర్పాట్ల పట్ల కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇవి గోదావరి పుష్కరాలు కాదని, గులాబీ పుష్కరాలని ఎద్దేవా చేశారు. గుళ్లు, గోపురాలకు గులాబి రంగు వేశారని, దేవుళ్లకు రాజకీయ రంగు పూయడం మంచిది కాదని ఆయన అన్నారు. పుష్కరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.