సాక్షి, కర్నూల్ : జిల్లాలోని బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి బనగానపల్లెలో ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. వైఎస్సార్‌సీపీ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. రెండు రోజుల కిందట వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే సోదరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలపై దాడి అనంతరం నేడు ఎమ్మెల్యే బీసీ జానార్థన్ రెడ్డి, కాటసాని నివాస కాలనీలో పర్యటన నిర్వహించేందుకు బీసీ వర్గీయులు ఏర్పాట్లు చేస్తోన్నారు. ఈ క్రమంలో డోన్ డీఎస్పీ ఖాదిర్ భాషా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకా ముందు జాగ్రత్తగా చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో తొలిసారి పట్టణంలోకి టియర్ గ్యాస్ వాహనాన్ని కూడా రప్పించారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక పట్టణ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దాడికి దిగిన టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సోదరులపై కాటసాని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార టీడీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసినా.. వారిని అరెస్ట్ చేయని పోలీసులు.. తమ నేతను మాత్రం అరెస్ట్ చేయడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment