tension situation
-
అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్థరాత్రి ఉద్రిక్తత
-
అల్లు అర్జున్ ఇంటి వద్ద హైటెన్షన్
-
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
-
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
-
గుడ్లవల్లేరు కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
-
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్తత
-
మేడిగడ్డ దగ్గర టెన్షన్ వాతావరణం
-
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్...ఇస్లామాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
-
మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్భందానికి పిలుపు
-
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత
-
దుబ్బాకలో ఉద్రిక్తతకు దారితీసిన బస్టాండ్ ప్రారంభం
-
రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం మనపై ఎంత?
Russia-Ukraine crisis: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అంటారు. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం మనపైన అలాగే పడుతుందన్న ఆందోళనలున్నాయి. ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ డిజిటల్ యుగంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా అన్ని దేశాలకూ కష్టనష్టాలు తప్పవు. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రత పాటు రాబోయే రోజుల్లో సహజవాయువు దగ్గర్నుంచి గోధుమల వరకు అన్ని రకాల ధరలు పెరిగిపోయి సామాన్యుడి నడ్డి విరుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ► ఉక్రెయిన్‌లో దాదాపుగా 20 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా మెడికల్ విద్యార్థులే. ఫార్మా, ఐటీ రంగ నిపుణులూ ఉన్నారు. ఇప్పుడు వారి భద్రతపై ఆందోళన నెలకొంది. వారిని వెనక్కి తీసుకురావడానికి భారత్ ప్రత్యేకంగా విమానాలు నడుపుతోంది. ► రష్యాపై ఆయుధాల కోసం మనం ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. ఎస్–400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. అమెరికా రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ఈ ఒప్పందం రద్దు కోసం అగ్రరాజ్యం నుంచి మనపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ► ఈ ఉద్రిక్తతల్లో చైనా పాత్ర కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తోంది. 2020 జూన్‌లో గల్వాన్ ఘర్షణల తర్వాత చైనాతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. డ్రాగన్ దేశంతో రష్యాకి మంచి స్నేహబంధం ఉండడంతో పాటు అక్కడ ప్రభుత్వంలో పరపతి కూడా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పుతిన్ ప్రభుత్వంపై గట్టి విమర్శలు చేయలేక, ఉక్రెయిన్‌కి మద్దతునిచ్చే పరిస్థితి లేక ఎటూ మొగ్గు చూపించకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ► 2014 నుంచి చమురు ధరలు కనీవినీ రీతిలో పెరిగిపోతున్నాయి. ముడి చమురు బారెల్ ధర 100 డాలర్లకి సమీపంలో ఉంది. యూరప్ దేశాలకు రష్యా నుంచే చమురు సరఫరా జరుగుతుంది. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలతో బారెల్ ధర 150 డాలర్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా భారత్‌లో పెట్రోల్ ధరలు లీటర్‌కి రూ.7–8 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. భారత్‌కి అవసరమైన చమురులో 85శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. దీంతో చమురు దిగుమతుల వ్యయం తడిసిమోపెడు అవుతుంది. ► కరోనా సంక్షోభం ఆహార ధాన్యాల ఎగుమతి దిగుమతులపై తీవ్రంగానే ప్రభావం చూపిస్తోంది. గోధుమల ఎగుమతిలో రష్యా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటే, ఉక్రెయిన్ నాలుగో స్థానంలో ఉంది. ఈ రెండు సమరానికి సై అనడంతో వాటి ధరలు కూడా ఆకాశాన్నంటే అవకాశాలున్నాయి. ► బీరు తయారీకి వాడే బార్లీ గింజలు అధికంగా ఉక్రెయిన్‌లో పండుతాయి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బీరు కంపెనీలకూ ధరాభారం తప్పదు. ► వంట నూనె ధరలు కూడా మరింతగా పెరిగే చాన్స్ ఉంది. ప్రపంచ దేశాల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తిలో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉన్నందున వాటి ధరలకి రెక్కలు రావచ్చు. ► రష్యాపై ఆంక్షల కారణంగా పలాడియమ్ లోహం ఎగుమతులు నిలిచిపోతాయి. ఆటోమేటివ్ ఎగ్జాస్ట్ సిస్టమ్స్, మొబైల్ ఫోన్లలో దీనిని వాడతారు. దీంతో వీటి ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు చల్లార్చే యత్నాలు
మాస్కో: ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు సోమవారం అంతర్జాతీయంగా పలు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. వీటిలో భాగంగా మాస్కోలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చర్చలు జరపగా, జర్మన్ చాన్స్‌లర్ అమెరికాలో శాంతి యత్నాలు ఆరంభించారు. మరోవైపు యథావిధిగా ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని రష్యాను యూఎస్ హెచ్చరించగా, తమకు అలాంటి ఉద్దేశాల్లేవని రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో మాక్రాన్ సోమవారం పుతిన్‌తో సమావేశమవుతున్నారు. అనంతరం ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి చర్చలు జరుపుతారు. రష్యాతో చర్చలు జరిపి ఉద్రిక్తతలు నివారించడమే తన ప్రాధాన్యాంశమని మాక్రాన్ పలుమార్లు చెప్పారు. పుతిన్‌తో సమావేశానికి ముందు ఆదివారం ఆయన బైడెన్‌తో ఫోన్లో మాట్లాడారు. పలు అంశాలపై వీరి మధ్య చర్చలు సాగాయని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కాపాడడంపై రాజీ లేదని, ఇదే సమయంలో రష్యాకు స్వీయ రక్షణపై ఉన్న సందేహాలు తీర్చాల్సిందేనని మాక్రాన్ చెప్పారు. మరోవైపు అమెరికాలో బైడెన్‌తో చర్చించిన అనంతరం జర్మన్ చాన్స్‌లర్ షుల్జ్ ఈ నెల 14– 15లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటిస్తారు. అప్పట్లో కూడా ఆ రెండే క్రిమియా ఆక్రమణ అనంతరం తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఫ్రాన్స్, జర్మనీ 2015లో మధ్యవర్తిత్వం చేశాయి. అప్పటికి రాజీ కుదిరినా, పలు అంశాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. 2019లో చివరిసారి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ నాయకులు చర్చల కోసం కలిశారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. మరోమారు నాలుగు దేశాల నేతలు సమావేశం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెనెస్కీ కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై స్పష్టత వస్తేనే చర్చలని రష్యా మొండిపట్టు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్స్, జర్మనీల దౌత్యం ఎంతమేర ఫలిస్తుందో చూడాలని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్
సాక్షి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని కోరుతూ.. రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల అరెస్ట్‌ను ఖండించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలు సరికాదని సూచించారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ మొత్తం అమలు చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగం అడ్డుకుని రభస చేశారని ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో గిరిధర్ ఫిర్యాదుతో రాజగోపాల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
Israel vs Hamas: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు!
గాజా సిటీ: ఇజ్రాయెల్ సైనిక దళాలు, పాలస్తీనా హమాస్ తీవ్రవాదుల మధ్య పోరు ఉధృతరూపం దాలుస్తోంది. ఇరువర్గాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. శాంతి స్థాపనకు కట్టుబడి ఉండాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఇజ్రాయెల్, హమాస్ పెడచెవిన పెడుతున్నాయి. గాజా సిటీలో శుక్రవారం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకు పడుతుండడంతో పాలస్తీనియన్లు తమ పిల్లలు, వస్తువులను వెంట తీసుకొని శివారు ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఇజ్రాయెల్ దూకుడుతో పాలస్తీనియన్లు బెంబేలెత్తిపోతున్నారు. గాజా సిటీ శివారులో నివసించే పాలస్తీనియన్లు ఐక్యరాజ్యసమితి నిర్వహించే పాఠశాలల్లో తల దాచుకునేందుకు తరలి వస్తున్నారు. హమాస్ తీవ్రవాదులు తమపై భూమార్గం ద్వారా దండెత్తే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. అందుకే విరుగుడు చర్యగా తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని అంటోంది. పాలస్తీనా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది. యుద్ధ సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. 9,000 మంది రిజర్విస్ట్ సైనికులను రప్పిస్తోంది. యుద్ధ ట్యాంకులను కూడా రంగంలోకి దించుతోంది. 126 మంది పాలస్తీనియన్ల మృతి పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై 1,800 రాకెట్లు ప్రయోగించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ 600కు పైగా వైమానిక దాడులు సాగించింది. కొన్ని భవనాలను నేలమట్టం చేసింది. టాడ్ పట్టణంలో శుక్రవారం యూదు, అరబ్ అల్లరి మూకలు ఘర్షణకు దిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 126 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 31 మంది చిన్నారులు, 19 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. అలాగే 950 మంది గాయపడ్డారని వెల్లడించింది. తమ సభ్యులు 20 మంది మృతి చెందినట్లు హమాస్, ఇస్లామిక్ జిహాద్ గ్రూప్‌లు ప్రకటించాయి. హమాస్ దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. శాంతి యత్నాలు విఫలం! ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణను నివారించేందుకు ఈజిప్టు సాగిస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలివ్వడం లేదు. శాంతి స్థాపనకు ఖతార్, ఐక్యరాజ్యసమితి కూడా చొరవ చూపుతున్నప్పటికీ మార్పు రావడం లేదు. -
అచ్చంపేటలో ఉద్రిక్తత: టీఆర్ఎస్, బీజేపీ బాహాబాహీ
అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శనివారం టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో అచ్చంపేటలో రోడ్ షో నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై చార్జిషీట్, కరపత్రాలను విడుదల చేశారు. అదే సమయంలో క్యాంపు కార్యాలయం నుంచి టీఆర్ఎస్ ప్రచార వాహనం, దాని వెనుకే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనం రాగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే తన వాహనాన్ని దారి మళ్లించి మరో మార్గంలో వెళ్లిపోయారు. కానీ కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం తమ వాహనాలకు దారివ్వాలని బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఓ కార్యకర్త పోలీసులపై చెప్పు విసిరాడు. దీనిపై తరుణ్ చుగ్ స్పందిస్తూ టీఆర్ఎస్ నేతల గూండాయిజానికి భయపడే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి అచ్చంపేట దాడే నిదర్శనమని విమర్శించారు. చదవండి: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత చదవండి: కీలక ఎన్నికలకు కేటీఆర్ దూరం: మంత్రులదే బాధ్యత -
వెలగపూడి ఘటన బాధాకరం: హోంమంత్రి సుచరిత
సాక్షి, గుంటూరు: తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసింది. ఆర్చి వ్యవహారంలో మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో రెండు వర్గాలవారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిలో మరియమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు కోల్పోయింది. దాంతో మృతురాలి బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఘర్షణల విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. పరిస్థితిని సమీక్షించేందుకు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి వెలగపూడికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను, ఘర్షణలో గాయపడినవారిని పరమర్శించారు. మరియమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. వెలగపూడి ఘటన దురదృష్టకరమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని సూచించారు. మరియమ్మ మృతి బాధాకరమని ఘర్షణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. స్థానికంగా పోలీసులపై వస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. గ్రామంలో పోలీస్ పికెట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే బాధితులను పరామర్శించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. తక్షణ సాయంగా మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హోంమంత్రి ప్రకటించారు. మరియమ్మ కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్తామని అన్నారు. -
కోల్‌కతాలో యుద్ధ వాతావరణం
కోల్‌కతా/హౌరా: బీజేపీ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం సందర్భంగా గురువారం కోల్‌కతా, హౌరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలకు నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణలకు దిగారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దాంతో, పోలీసులు వారిపై వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. ఘర్షణల్లో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో కోల్‌కతా, హౌరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రోడ్లపై ఎక్కడ చూసినా.. కాల్చిన టైర్లు, రువ్విన రాళ్లు కనిపించాయి. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా, వేలాది కార్యకర్తలు మధ్నాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సచివాలయం వైపునకు వెళ్లడం ప్రారంభించారు. హౌరా మైదాన్ నుంచి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ మార్చ్ ప్రారంభించారు. వారిని మాలిక్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఒక కార్యకర్త నుంచి బుల్లెట్లతో ఉన్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు తమపై నాటు బాంబులు వేశారని పోలీసులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు నేతృత్వంలో సాగిన మార్చ్‌ను సాంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడా ఘర్షణ జరిగింది. పోలీసులతో ఘర్షణల్లో బీజేపీ నేత రాజు బెనర్జీ, ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతో గాయపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్ఘీయ, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్‌ల నేతృత్వంలో సాగిన చలో సెక్రటేరియట్ మార్చ్‌ను కోల్‌కతాలోని హాస్టింగ్స్–ఖిద్దర్‌పోర్ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీఎంసీ గూండాలు తమపై దాడి చేశారని విజయ్‌వర్ఘీయ ఆరోపించారు. దాదాపు వంద మందికి పైగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం తలపెట్టిన మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. మమత సర్కారును సాగనంపాలని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. మమత బెనర్జీ అవినీతిమయ, హింసాత్మక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోరాటం కొనసాగిస్తారన్నారు. మమత పాలనకు బీజేపీ అంతం పలకడం ఖాయమన్నారు. ‘మమత తన సచివాలయాన్ని మూసివేసుకునేలా ధీరులైన మా బీజేవైఎం కార్యకర్తలు పోరాడారు. ఆమె ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారనేందుకు ఇదే ఉదాహరణ’ అని నడ్డా ట్వీట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే విషయంలో మాత్రం గత వామపక్ష ప్రభుత్వం కన్నా మమత సర్కారు మెరుగ్గా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లాఠీచార్జీలో గాయపడి, రోడ్డుపైనే పడిపోయిన ఓ కార్యకర్త -
దేనికైనా సిద్ధంగా ఉన్నాం: నరవణే
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత నెలకొందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యూహాత్మక మోహరింపులు చేశామని, మన సరిహద్దులను, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి పూర్తి సంసిద్ధులై ఉన్నామని తెలిపారు. దేశం తమపై పూర్తి విశ్వాసం ఉంచవచ్చన్నారు. లద్దాఖ్‌లో నరవణే శుక్రవారం రెండోరోజు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పలు ఆర్మీ పోస్టులను సందర్శించి... సైనికులు, సీనియర్ కమాండర్లతో మాట్లాడారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ‘మన సైనికులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడటానికి వారు పూర్తి సంసిద్ధంగా ఉన్నారనే విశ్వాసం నాకు కలిగింది’అని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన చర్చలతో సహా అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామన్నారు. ఐదురోజుల కిందట తూర్పు లద్ధాఖ్లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో చైనా దుస్సాహసంతో అతిక్రమణకు దిగగా... భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వేగంగా స్పందించిన భారత్ అదనపు బలగాలను, ఆయుధ సామగ్రిని ఈ ప్రాంతానికి తరలించి పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలోని కీలక పర్వత ప్రాంతాల్లో మోహరించింది. ఫింగర్ 2, ఫింగర్ 3 ప్రాంతాల్లో ఆర్మీపోస్టులను బలోపేతం చేసింది. కమాండర్ల చర్చల్లో దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా... తమ భూభాగంలోనే మోహరించామని, వెనక్కితగ్గే ప్రసక్తేలేదని భారత్ తేల్చిచెప్పింది. దశాబ్దాల్లో అతిపెద్ద సవాల్: ష్రింగ్లా లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు గడిచిన కొన్ని దశాబ్దాల్లో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌గా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అభివర్ణించారు. దేశ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి పూర్తి కంకణబద్ధులమై ఉన్నామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధమని, అన్నిరకాలుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. మరో దఫా మిలిటరీ చర్చలు భారత్– చైనాల మధ్య మరోదఫా మిలిటరీ చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌లో శుక్రవారం బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో పురోగతి ఏంటనేది వెంటనే తెలియరాలేదు. -
ఉద్రిక్తతలకు దారి తీసిన యువకుడి ఆత్మహత్య
సాక్షి, కృష్టా: యువకుడి ఆత్మహత్య జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వివరాలు.. పరిటాలకు చెందిన మంగిన రాజశేఖర్ రెడ్డి నిన్న రాత్రి కృష్ణా బ్యారేజ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం పేకాట ఆడుతూ పట్టుబడ్డ రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేత కోగంటి బాబు, రాజశేఖర్ రెడ్డిని స్టేషన్ నుంచి విడిపించాడు. దాంతో మృతుడు, బాబుని పొగుడుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి రాజశేఖర్ రెడ్డిని స్టేషన్‌కి పిలిపించారు. అనంతరం అతడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అకారణంగా తనని స్టేషన్‌కి పిలిచి కొట్టారనే మనస్తాపంతోనే రాజశేఖర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువుల ఆరోపిస్తున్నారు.(చదవండి: టిక్‌టాక్ దంపతుల ఆత్మహత్య!) ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజశేఖర్ రెడ్డి బంధువులు జాతీయ రహదారిపై మృత దేహంతో ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని వారిని అక్కడి నుంచి తరలిచే ప్రయత్న చేశారు. -
మళ్లీ ‘డ్రాగన్’ షాక్!
స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. దీంతో ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి చైనా బలగాలు మళ్లీ తూర్పు లద్దాఖ్‌లో చొరబడటంతో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా ముదురుతాయనే భయాలు దీనికి ప్రధాన కారణం. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,400 పాయింట్లు దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ట్రేడింగ్ ఆరంభంలోనే కీలకమైన స్థాయిలకు ఎగియడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, క్యూ1 జీడీపీ గణాంకాలు ఎలా ఉండనున్నాయో అనే అనిశ్చితి, నేటి(మంగళవారం) నుంచి కొత్త ‘మార్జిన్’ నిబంధనలు అమల్లోకి రానుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు పతనం కావడం....ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 839 పాయింట్ల నష్టంతో 38,628 పాయింట్ల వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు క్షీణించి 11,388 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.13 శాతం, నిఫ్టీ 2.23 శాతం చొప్పున నష్టపోయాయి. గత మూడు నెలల కాలంలో ఈ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 1,614 పాయింట్లు పతనమైంది. ఇక జపాన్ సూచీ లాభపడగా, మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెబీ కొత్త ‘మార్జిన్’ నిబంధనలు... స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన మార్జిన్ నిబంధనలు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు కఠినంగా ఉన్నాయని, మార్పులు, చేర్పులు చేస్తే మంచిదని, ఈ నిబంధనల అమలుకు సాంకేతికంగా సిద్ధంగా లేమని, ఒకవేళ మార్పులు చేయకపోయినా, వీటి అమలును ఈ నెల 30కు వాయిదా వేయాలని పలు బ్రోకరేజ్ సంస్థలు విన్నవించాయి. ఈ విన్నపాన్ని సెబీ మన్నించలేదు. ఈ నేపథ్యంలో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో జోరుగా లాభాల స్వీకరణ జరిగింది. మరిన్ని మార్కెట్ విశేషాలు... ► సన్‌ఫార్మా షేర్ 7 శాతం నష్టంతో రూ.518 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ► ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ డీల్ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లన్నీ అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్ 20 శాతం లాభంతో రూ.163కు చేరింది. ► స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ► రూ.4.55 లక్షల కోట్ల సంపద ఆవిరి ► స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూ.4.55 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,55,915 కోట్లు హరించుకుపోయి రూ.153.76 లక్షల కోట్లకు పడిపోయింది. -
రా.. రా.. రఫేల్!
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్సు నుంచి బయలుదేరాయి. చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇవి చేరుకోవడంతో ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదటి బ్యాచ్‌లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి ఈనెల 29వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్‌ధఫ్రా ఎయిర్‌బేస్‌లో సోమవారం సాయంత్రం దిగాయి. ఫ్రాన్సుకు చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో మొదటి రఫేల్ జెట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది. ఈ విమానం ప్రత్యేకతలు.. శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం రఫేల్ జెట్లకు ఉంది. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించగలిగే మెటియోర్, స్కాల్ప్ క్షిపణులను ఇది తీసుకెళ్లగలదు. క్షిపణి వ్యవస్థలతోపాటు ఈ జెట్లలో భారత్ కోరిన విధంగా..ఇజ్రాయెలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, రాడార్ వార్నింగ్ రిసీవర్లు, లో–బ్యాండ్ జామర్లు, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్, ఇన్ఫ్రా రెడ్ సెర్చ్, ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి అదనపు ఏర్పాట్లున్నాయి. మొత్తం భారత్‌కు వచ్చే 36 రఫేల్ విమానాల్లో 30 యుద్ధ విమానాలు(ఒకటే సీటుండేది) కాగా, 6 శిక్షణ విమానాలు రెండు సీట్లుండేవి. ఈ తేడా తప్పితే రెండింటి సామర్థ్యం ఒక్కటే. ఒక స్క్వాడ్రన్ రఫేల్ జెట్లను అంబాలా ఎయిర్ బేస్‌లో. మరో స్క్వాడ్రన్‌ను బెంగాల్‌లోని హసిమారా బేస్‌లోనూ ఉంచనున్నారు. వీటి పరిరక్షణ, నిర్వహణ ఏర్పాట్లకు ఐఏఎఫ్ రూ.400 కోట్లు వెచ్చించింది. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్ సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచేందుకు రఫేల్‌లను మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో భారత్‌కు సంఘీభావ సూచకంగా వైద్య పరికరాలు, నిపుణులతో కూడిన విమానాన్ని కూడా ఫ్రాన్సు పంపిస్తోందని ఫ్రాన్సులోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
రఫేల్‌కు తోడుగా హ్యామర్
న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఆర్మీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు వస్తున్న సమయంలోనే వాటి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి హ్యామర్ క్షిపణుల్ని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలుకు సంబంధించిన అధికారాలను అత్యవసర పరిస్థితుల కింద నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ సాయుధ బలగాలకు కట్టబెట్టింది. ఈ క్షిపణులు గగనతలం నుంచి ఉపరితలానికి 60–70 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలవు. తూర్పు లద్దాఖ్ పర్వత శ్రేణుల నుంచి సరిహద్దుల్లో బంకర్లు, ఇతర శిబిరాలపై దాడులు చేసే అవకాశం హ్యామర్ క్షిపణి ద్వారా వీలు కలుగుతుంది. ‘హ్యామర్ క్షిపణులు కొనుగోలుకి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. అత్యంత స్వల్ప వ్యవధిలోనే రఫేల్ యుద్ధ విమానాలతో పాటు ఈ క్షిపణుల్ని సరఫరా చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించింది’’అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు అత్యవసరంగా ఈ క్షిపణులు అవసరం ఉండడంతో ఇప్పటికే మరొకరికి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్న క్షిపణుల్ని ఫ్రాన్స్ అధికారులు మన దేశానికి తరలిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29న ఫ్రాన్స్ నుంచి అయిదు రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి. ‘ప్రశాంతతే బంధాలకు పునాది’ చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట శాంతి, సంయమనం నెలకొనడంపైననే ప్రధానంగా ఆధారపడి ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ విషయంలో చైనా నిజాయితీతో వ్యవహరిస్తుందనే ఆశిస్తున్నామని పేర్కొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపునకు సంబంధించి రెండు దేశాల మధ్య మరో విడత దౌత్య చర్చలు త్వరలో ప్రారంభమవుతాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. ఎల్ఏసీ వెంట యథాపూర్వ స్థితిలో ఎలాంటి ఏకపక్ష మార్పులను భారత్ ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా జులై 5న భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి దాదాపు 2 గంటల పాటు ఫోన్లో చర్చలు జరిపిన అనంతరం జూలై 6 నుంచి గల్వాన్ లోయలోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. -
వెనక్కి తగ్గిన చైనా
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో శాంతి, సంయమనం దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఉద్రిక్తతలకు కేంద్ర స్థానమైన గల్వాన్‌లోయ నుంచి సోమవారం చైనా దళాలు వెనక్కు వెళ్లాయి. పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 14 వద్ద నిర్మించిన తాత్కాలిక శిబిరాలు, ఇతర నిర్మాణాలను తొలగించాయి. దాదాపు కిలోమీటరుకు పైగా చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, ఎంత దూరం వెనక్కు వెళ్లాయో కచ్చితంగా తెలియదన్నాయి. ఇరుదేశాల కమాండర్ స్థాయి ఆర్మీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల మేరకు చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని వెల్లడించాయి. అయితే, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగిన తరువాతే ఈ ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ధోవల్ ఆదివారం ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. బలగాల ఉపసంహరణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ చర్చల సందర్భంగా నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే ముందు బలగాల ఉపసంహరణ జరగాలని, అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకుండా జాగ్రత్త పడాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు. ధోవల్, వాంగ్ యి భారత్, చైనాల తరఫున సరిహద్దు చర్చల్లో ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. రెండు దేశాల ఆర్మీలకు భారీగా ప్రాణనష్టం సంభవించిన జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల తరువాత ఈ ఇద్దరు చర్చించుకోవడం ఇదే ప్రథమం. సరిహద్దుల్లో ఇటీవలి పరిణామాలపై ఆదివారం నాటి చర్చల్లో ధోవల్, వాంగ్ నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. వాస్తవాధీన రేఖను ఇరుదేశాలు గౌరవించాలని, య«థాతథ స్థితిని ఏకపక్షంగా ఎవరూ ఉల్లంఘించరాదని అంగీకారానికి వచ్చారని తెలిపింది. సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనేవరకు దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగించాలని ధోవల్, వాంగ్ యి నిర్ణయించారని పేర్కొంది. వేగంగా, దశలవారీగా వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే విషయంపై అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఇరు దేశాల ఆర్మీ కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారని పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత సానుకూలంగా ముందుకు సాగాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనడం ఆవశ్యకమని ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపింది. ధోవల్, వాంగ్ యి మధ్య జరిగిన చర్చలపై చైనా విదేశాంగ శాఖ కూడా ప్రకటన విడుదల చేసింది. ఇరువురి మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి లోతైన చర్చ జరిగిందని పేర్కొంది. భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని వాంగ్ చర్చల్లో ప్రస్తావించారని వెల్లడించింది. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచి వెనక్కు.. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచే కాకుండా, గొగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి కూడా చైనా బలగాలు, వాహనాలు సోమవారం వెనక్కు వెళ్లాయి. పాంగాంగ్ సొ నుంచి వెనక్కు వెళ్లాయా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా భారత్‌కు పెరిగిన మద్దతు, ఇటీవల లేహ్ పర్యటనలో ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన సందేశం.. చైనా తాజా నిర్ణయానికి దోహదపడి ఉండొచ్చని పేర్కొన్నాయి. సరిహద్దు వివాదంపై చైనాతో దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చర్చలే ప్రారంభం కానట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేదని వ్యాఖ్యానించారు. ‘కరోనా మహమ్మారి సమయంలో దౌత్య సంబంధాలు’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ‘దేశాలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. చర్చలు జరగాలి. అలా జరగని పక్షంలో, సమస్యలు, ఘర్షణలు పెరుగుతాయి. ఉదాహరణకు, చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరగనట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేది’ అని వివరించారు. -
ఎలక్ట్రానిక్స్‌కు ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయ్..
ముంబై: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎలక్ట్రానిక్స్ దిగుమతులను భారత్ నిజంగానే తగ్గించుకోదల్చుకుంటే ప్రత్యామ్నా య మార్కెట్లు చాలానే ఉన్నాయని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముంబై (డబ్ల్యూటీసీ) వెల్లడించింది. సింగపూర్, మలేసియా, తైవాన్, అమెరికా నుంచి దిగుమతులను పెంచుకునే అంశం పరిశీలించవచ్చని పేర్కొంది. డబ్ల్యూటీసీ గణాంకాల ప్రకారం చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, టీవీ సెట్లు ఉంటున్నాయి. చమురుయేతర ఉత్పత్తుల దిగుమతుల్లో చైనాకు 14% వాటా ఉంటోంది. ‘2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలం లో మొత్తం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతుల విలువ రూ.3.59 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో చైనా నుంచి దిగుమతుల విలువ సుమారు రూ. 1.42 లక్షల కోట్లు.. అంటే దాదాపు మొత్తం దిగుమతుల్లో 40% వాటా’ అని డబ్ల్యూటీసీ తెలిపింది. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతుల్లో అత్యధిక వాటా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులదే (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక దిగుమతులు, కంప్యూటర్, ఐటీ హార్డ్‌వేర్, మొబైల్ ఫోన్స్ మొదలైనవి) ఉంటోంది. మొబైల్ దిగుమతులు తగ్గినా.. చైనాదే హవా.. గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల దిగుమతులు మొత్తం మీద తగ్గినప్పటికీ చైనా వాటా మాత్రం పెరగడం గమనార్హం. 2019 ఏప్రిల్ – 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో సెల్ ఫోన్ దిగుమతులు సగానికి సగం పడిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోని రూ. 11,304 కోట్ల నుంచి రూ. 6,313 కోట్లకు క్షీణించాయి. దేశీయంగా తయారీ పెరగడం, హ్యాండ్‌సెట్స్‌పై దిగుమతి సుంకాలు పెంచడం ఇందుకు కారణం. అయితే, చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గినప్పటికీ మొత్తం దిగుమతుల్లో దాని వాటా 55 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది. దేశీయంగా ఉత్పత్తికి ఊతం... కేంద్రం ఇటీవల కొన్నాళ్లుగా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకోవడంతో పలు స్కీములను అమలు చేస్తోంది. దీంతో 2014–2020 మధ్య కాలంలో దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 20.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.73 లక్షల ఓట్లుగా ఉన్న స్థానిక ఉత్పత్తి 2019–20లో రూ. 5.33 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ పరిస్థితులు చూస్తే ఇది మరింత వేగంగా వృద్ధి చెందనుందని డబ్ల్యూటీసీ అంచనా వేసింది. అయితే, దేశీయంగా ఉత్పత్తి గణనీయంగా పెరిగే దాకా చైనా నుంచి దిగుమతులను తగ్గించుకునే క్రమంలో ఇతర మార్కెట్లవైపు చూడవచ్చని తెలిపింది. సింగపూర్, అమెరికా, మలేసియా, జపాన్ నుంచి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, కలర్ టీవీ సెట్లను, సింగపూర్, తైవాన్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్ నుంచి టెలికం పరికరాలను దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. -
విషం చిమ్మిన చైనా..
న్యూఢిల్లీ: ఇండో–చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వారి దాడిలో తెలుగువాడైన ఒక కల్నల్, ఇద్దరు జవాన్లు అమరులైనట్లు మొదట ఆర్మీ ప్రకటించింది. కానీ, ఘర్షణలు పెద్ద ఎత్తున జరిగాయని, భారీగా మోహరించిన రెండు దేశాల సైనికులు కొన్ని గంటల పాటు ముఖాముఖి తలపడటంతో ఇరు వర్గాల సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారని అనంతరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్–చైనా సరిహద్దు ఊహాచిత్రం... ఆ తరువాత, లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు అమరులైనట్లు మంగళవారం రాత్రి ఆర్మీ ప్రకటించింది. ఘటనాస్థలి నుంచి రెండు దేశాల సైనికులు వెనక్కు వెళ్లారని పేర్కొంది. చైనాకు కూడా భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 43 మంది చైనా సైనికులు భారత సైనికుల దాడిలో చనిపోయి ఉండొచ్చని సమాచారం. అయితే, ఐదుగురు చైనా సైనికులు చనిపోయారని, 11 మంది గాయపడ్డారని పేర్కొంటూ చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ సీనియర్ రిపోర్టర్ చేసినట్లుగా చెబుతున్న ట్వీట్ ఒకటి వైరల్ అయింది. ప్రధాని సమీక్ష ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే స్పందించారు. గాల్వన్ లోయ ప్రాంతంలో సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటన, తదనంతర పరిణామాలు, వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. అంతకుముందు, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్యాంగ్యాంగ్ సొ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ, గాల్వన్ లోయ ప్రాంతాల్లో భారత బలగాల సంఖ్యను భారీగా పెంచాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఆ తరువాత, జై శంకర్, ఆర్మీ చీఫ్ నరవణెలతో రాజ్‌నాథ్ మళ్లీ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం పఠాన్‌కోట్ పర్యటనను ఆర్మీ చీఫ్ రద్దు చేసుకున్నారు. మరోవైపు, హోం మంత్రి అమిత్ షా కూడా ప్రధాని మోదీతో సమావేశమై చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు. మే తొలివారం నుంచి.. మే 5వ తేదీ నుంచి చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దులకు భారీగా బలగాలను, ఆయుధ సామగ్రిని తరలించాయి. పలుమార్లు రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగి, గాయాల పాలయ్యారు. అనంతరం, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మేజర్ జనరల్ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక అవగాహన మేరకు రెండు దేశాలు తమ సైన్యాలను వెనక్కు తరలించడం ప్రారంభించాయి. ఆ క్రమంలోనే సోమవారం రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ ప్రారంభమై తీవ్రరూపు దాల్చిందని సైనిక వర్గాలు తెలిపాయి. దాడుల అనంతరం మంగళవారం ఇరుదేశాల సైన్యంలోని ఉన్నతాధికారులు ఘటనాస్థలంలో సమావేశమయ్యారని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఫింగర్ ఏరియా కీలకం ప్యాంగ్యాంగ్ సొ సరస్సు చుట్టూ ఫింగర్ ఏరియాలో భారత్ చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని, గాల్వన్ లోయలో దార్బుక్– షాయొక్– దౌలత్ బేగ్ ఓల్డీలను అనుసంధానించే భారత్ చేపట్టిన మరో రోడ్డు నిర్మాణాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్యాంగ్యాంగ్ సొ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం భారత్‌కు అత్యంత కీలకం. చైనా వ్యతిరేకతను పట్టించుకోకుండా, తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని సరిహద్దుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది. 2022 నాటికి చైనా సరిహద్దుల్లో 66 కీలక రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. చైనా తీరు ఏకపక్షం సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా చేసిన ప్రయత్నం కారణంగానే తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఉన్నత స్థాయిలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా గౌరవించి ఉంటే.. రెండు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కాదని పేర్కొంది. వాస్తవాధీన రేఖకు ఇవతలి(భారత్) వైపుననే భారత్ చేపట్టే అన్ని కార్యకలాపాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. చైనా నుంచి కూడా అదే తీరును ఆశిస్తున్నామంది. భారత్‌దే తప్పు: చైనా జూన్ 15న భారత దళాలు వాస్తవాధీన రేఖను రెండుసార్లు దాటి వచ్చి, తమ సైనికులపై దాడులు చేసి రెచ్చగొట్టారని చైనా ఆరోపించింది. దాంతో రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ‘గతంలో అంగీకారానికి వచ్చిన ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని, తమ దళాలు సరిహద్దు దాటకుండా చూసుకోవాలని, పరిస్థితులు విషమించేలా ఏకపక్ష చర్యలకు దిగకుండా చూసుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియాన్ వ్యాఖ్యానించారు. గాల్వన్ లోయ ప్రాంతం చైనాదేనని ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి కల్నల్ జాంగ్ షుయిలీ మంగళవారం పేర్కొన్నారు. ‘నాకందిన సమాచారం మేరకు అక్కడ జరిగింది ముఖాముఖీ పోరాటమే. కొందరు చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దుందుడుకుగా వ్యవహరించవద్దని, చైనా సంయమనాన్ని బలహీనతగా భావించవద్దని భారత్‌కు చెబుతున్నా. భారత్‌తో ఘర్షణను చైనా కోరుకోవడం లేదు. అలా అని మేమేం భయపడడం లేదు’ అని అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు జీజిన్ ట్వీట్ చేశారు. చైనా దుందుడుకుతనం గాల్వన్లోయతో పాటు తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సొ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో నెలరోజులకు పైగా సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలుమార్లు ప్యాంగ్యాంగ్ సొ సహా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దును దాటి చైనా దళాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. వాస్తవాధీన రేఖ సమీపానికి శతఘ్నులను, ఇతర ఆధునిక ఆయుధ సామగ్రిని భారీగా తరలించింది. సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో బాహాబాహీకి దిగిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చొరబాట్లను భారత్ తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే వెనక్కు వెళ్లాలని చైనాను హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 6న లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మేజర్ జనరల్ ల్యూ లిన్ల మధ్య 7 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆ తరువాత మేజర్ జనరల్ స్థాయి చర్చలు రెండు దఫాలుగా జరిగాయి. ఆ చర్చల్లో, ఉద్రిక్తతల ముందు నాటి యథాతథ స్థితి ఏర్పడాలని, చైనా దళాలు వెంటనే వెనక్కు వెళ్లాలని భారత్ డిమాండ్ చేసింది. రెండు దేశాలు తమ దళాలను క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయని శనివారం భారత ఆర్మీ చీఫ్ నరవణె తెలిపారు. చర్చలు ఫలవంతమయ్యాయని, గాల్వన్ లోయకు ఉత్తరం వైపు నుంచి భారత దళాల ఉపసంహరణ ప్రారంభమైందని చెప్పారు. భారత్, చైనా సరిహద్దులు ఇలా .. ► భారత్, చైనా సరిహద్దుల్ని మూడు సెక్టార్ల కింద విభజించారు. వీటిలో పశ్చిమ సెక్టార్ ఎప్పుడూ ఉద్రిక్తతలకి, చొరబాట్లకి కేంద్ర బిందువుగా ఉంటోంది. ► కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి 1,597 కి.మీ. ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్ అంటారు. ► హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో 545 కి.మీ. పొడవునా మధ్య సెక్టార్ ఉంది. ► తూర్పు సెక్టార్లో 1,346 కి.మీ. మేర సరిహద్దు ఉంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఈ సెక్టార్ ఉంది. తెలుగువాడి వీర మరణం చైనా సైనికులతో ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోశ్ బాబు, మరో ఇద్దరు జవాన్లు మృతి చెందారని ఆర్మీ ప్రకటించింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ గాల్వన్ లోయ ప్రాంతంలో 16 బిహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. చనిపోయిన ఇద్దరు జవాన్లను హవల్దార్ పళని, సిపాయి ఓఝా అని ఆర్మీ తెలిపింది. ఈ ఘర్షణల సందర్భంగా కాల్పులు చోటు చేసుకోలేదని, తుపాకుల వంటి మారణాయుధాలను ఉపయోగించలేదని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు. రాళ్లు, కర్రలు, ఐరన్ రాడ్లను ఉపయోగించినట్లు సమాచారముందన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. గాల్వన్‌లోయలోని ఒక ప్రాంతం నుంచి చైనా దళాలు వెనక్కు వెళుతుండగా, ఘర్షణ ప్రారంభమైందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మొదట కల్నల్ సంతోష్, కల్నల్‌తో పాటు ఉన్న సైనికులపై చైనా దళాలు దాడి చేశాయని, భారత్ ప్రతిదాడికి దిగడంతో ఘర్షణ తీవ్రరూపు దా ల్చిందని వివరించాయి. గత ఐదు దశాబ్దాల్లో ఈ స్థాయి ఉద్రిక్తత రెండు దేశాల మధ్య నెలకొనలేదు. చైనా టెంట్‌ను తొలగించమన్నందుకే.. న్యూఢిల్లీ: భారత్–చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీసిన పరిణామం ఏమిటన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అధికార వర్గాల కథనం ప్రకారం.. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ 14 అనే చోట చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) టెంట్ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. ఈ నెల ప్రారంభంలోనే ఈ టెంట్ వేసినట్లు సమాచారం. ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. వాస్తవాధీన రేఖకు(ఎల్ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్ ఏర్పాటు చేశారు. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్ పాయింట్ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. ఇనుప రాడ్లతో దాడికి దిగారు. భారత సైనికులు కూడా ధీటుగా బదులిచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్ పాయింట్ 14 గాల్వన్, ష్యోక్ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్ కమాండర్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. ఐరాస ఆందోళన ఐక్యరాజ్యసమితి: భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన మంగళవారం పిలుపునిచ్చారు. ఉద్రిక్తతను చల్లార్చేందుకు భారత్–చైనా చర్యలు ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. -
సానుకూలంగా భారత్–చైనా చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో శనివారం రెండు దేశాల సైనికాధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు సానుకూలంగా ముగిశాయి. లదాఖ్‌లోని గాల్వాన్ లోయ, పాంగోంగ్ త్సో, గోగ్రా ప్రాంతాల్లో సరిహద్దులకు సమీపంలో మునుపటి పరిస్థితులను నెలకొల్పాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ కోరిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. మున్ముందు కూడా సంప్రదింపులు జరుపుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను సైనిక, దౌత్యపరమైన మార్గాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అయితే, భారత్ గానీ, చైనా గానీ ఈ చర్చలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. చైనా భారీగా సైన్యాన్ని తరలించడం, సైనిక నిర్మాణాలను చేపట్టడంతో నెల రోజులుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో చైనా భూభాగంలోని చెషుల్ సెక్టార్ మాల్దోలో జరిగిన ఈ చర్చలకు భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా చైనా పక్షాన టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరయ్యారు. ఉదయం 8.30 గంటలకే సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో మూడు గంటలు ఆలస్యంగా మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల రోజుల్లో రెండు దేశాల స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో 12 రౌండ్లు, మేజ ర్ జనరల్ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
భారత్ నుంచి చైనీయులు ఖాళీ!
న్యూఢిల్లీ/ బీజింగ్: కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న చైనీయులందరినీ ఖాళీ చేసి స్వదేశానికి తరలించాలని పొరుగుదేశం నిర్ణయించింది. కరోనా కాలంలో భారత్‌లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు కష్టాలు ఎదుర్కొంటున్నారని స్వదేశానికి వెళ్లాలని అనుకునేవారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని చైనా అధికార వెబ్సైట్లో సోమవారం ఒక ప్రకటన వెలువడింది. స్వదేశానికి వెశ్లాలని నిర్ణయించుకున్న వారందరూ అక్కడ క్వారంటైన్, ఇతర వైద్యపరమైన ఏర్పాట్లకు అంగీకరించాలని ఈ నోటీసులో స్పష్టం చేశారు. విమానం ఎక్కేలోపు శరీర ఉష్ణోగ్రత 37.3 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువైనా, ఇతర లక్షణాలేవైనా ఉన్న వారికి అనుమతి నిరాకరిస్తామని నోటీసులో స్పష్టం చేశారు. మాండరిన్ భాషలో ఉన్న ఆ ప్రకటన ప్రకారం కరోనా వైరస్‌కు చికిత్స పొందిన వారు లేదా గత 14 రోజుల్లో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక విమానాల్లో చోటు లేదు. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఉండిపోయిన చైనీయులను కూడా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ ప్రకటనలో సూచనప్రాయంగా తెలిపారు. భారత్ –చైనాల మధ్య లదాఖ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో చైనీయులందరినీ ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూండటం గమనార్హం. చైనాలో 51 కేసుల గుర్తింపు వూహాన్లో తాజాగా 51 కరోనా కేసులను గుర్తించామని, ఇందులో 40 కేసుల్లో లక్షణాలేవీ కనిపించలేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆదివారం విదేశాల నుంచి తిరిగి వచ్చిన చైనీయులు 11 మందిలో వైరస్ గుర్తించామని చెప్పారు. స్థానికంగా వ్యాప్తి చెందిన కేసులు ఆదివారం ఏవీ నమోదు కాలేదని చెప్పారు. లక్షణాలేవీ కనిపించని 40 కేసుల్లో 38 వూహాన్ ప్రాంతానికి చెందినవని, ఆ నగరంలోని మొత్తం కోటీ 12 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. -
నెట్టుకున్నారు.. తోసేసుకున్నారు!
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల మలి దశ తొలి రోజే లోక్‌సభ దద్ధరిల్లింది. ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు ఆవేశంగా ఒకరినొకరు గట్టిగా తోసుకోవడంతో సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సభలో నెలకొన్న తోపులాటపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను నిర్వహించలేనంటూ అశక్తత వ్యక్తం చేశారు. సభలో తమ మహిళా సభ్యులపై అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మలి దశ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే.. ఫిబ్రవరి 28వ తేదీన మరణించిన జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్‌కు నివాళి అర్పించి, అనంతరం ఆయనకు గౌరవ సూచకంగా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే గందరగోళం మొదలైంది. ఇటీవలి ఢిల్లీ అల్లర్ల అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు కూర్చున్న వైపు కూడా వెళ్లి అమిత్‌షా రాజీనామా డిమాండ్ ఉన్న నల్లని బ్యానర్‌ను ప్రదర్శించారు. ‘అల్లర్లకు కారణం వీరే. వీరే రెచ్చగొట్టారు. 1984లోనూ వీరు 3000 మందిని హతమార్చారు. వీరికి శాంతి నెలకొనడం ఇష్టం లేదు’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో విపక్ష సభ్యులు మరింత బిగ్గరగా.. ‘వి వాంట్ జస్టిస్’, ‘అమిత్ షా ముర్దాబాద్’ అని నినాదాలు చేయసాగారు. ఈ సమయంలో, కాంగ్రెస్ సభ్యులు నల్ల బ్యానర్‌తో అధికార పక్ష సభ్యుల వైపు వెళ్లారు. బీజేపీ సభ్యులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు చేతిలోని కాగితాలను చించి, విసిరేశారు. ఈ సమయంలో, ఇరు వర్గాల సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గట్టిగా నెట్టివేసుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. 3 గంటలకు సభ ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. తమవైపు నుంచి వెల్‌లోకి వెళ్లనివ్వకుండా బీజేపీ సభ్యులు విపక్ష సభ్యులను అడ్డుకున్నారు. ఈ సమయంలో బీజేపీ మహిళా ఎంపీ ఒకరు తనపై దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. గందరగోళం మధ్య సభ పదేపదే వాయిదాపడింది.దీంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, బీజేపీ మహిళా సభ్యులతో కాంగ్రెస్ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని మంత్రి స్మృతి ఇరానీ సభ వెలుపల మీడియాకు తెలిపారు. వాయిదా పడిన రాజ్యసభ ఢిల్లీ అల్లర్లపై రాజ్యసభలో దుమారం రేగింది. ఢిల్లీ తగులబడుతుంటే కేంద్రం నిద్ర పోతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. హోం మంత్రి రాజీనామా చేయాలని కోరాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. వెల్‌లోకి వచ్చి నిలబడిన సభ్యులను సీట్లలో కూర్చోవాల్సిందిగా అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలు పర్యాయాలు కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆయన సభను మధ్యాçహ్నానికి వాయిదావేశారు. ఆ తర్వాతా అదే తీరు కొనసాగడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మంగళవారానికి వాయిదా వేశారు. గొడవ మధ్యనే తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ సహా మూడు సంస్కృత వర్సిటీలను సెంట్రల్ వర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టారు. గౌరవంగా వ్యవహరిద్దాం సభ్యులను సముదాయించేందుకు స్పీకర్ ఓం బిర్లా పలు సందర్భాల్లో విఫల యత్నం చేశారు. దేశ ప్రజలు చూస్తున్నారని, గౌరవ సభ్యులుగా హుందాగా వ్యవహరిద్దామని సభ్యులకు సూచించారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందన్నారు. గందరగోళం మధ్యనే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(అమెండ్మెంట్) బిల్లు, మినరల్ లాస్ అమెండ్మెంట్ బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ‘వివాద్ సే విశ్వాస్’ బిల్లుపై చర్చ జరిగింది. -
సడలిన ఉద్రిక్తత
టెహ్రాన్: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు గురువారం నాటికి కొంత సడలాయి. అమెరికా, లేదా అమెరికన్లు లక్ష్యంగా ఎలాంటి దాడులకు పాల్పడవద్దని ఇరాన్ తన అనధికార సైనిక బృందాలకు సమాచారమిచ్చినట్లు తమకు నిఘా సమాచారం అందిందని అమెరికా పేర్కొంది. ఇరాన్ ఇదే తీరును భవిష్యత్తులో కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ గురువారం వ్యాఖ్యానించారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన అనంతరం ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలోనూ శాంతి ప్రతిపాదన చేశారు. ఇరాన్లో అధికార మార్పిడి జరగాలని అమెరికా కోరుకోవడం లేదని, అధికారంలో ఉన్నవారి తీరు మారాలని కోరుకుంటోందని పెన్స్ వ్యాఖ్యానించారు. ఇరాన్ క్షిపణి దాడుల్లో అమెరికా దళాలకు కానీ, ఇరాకీ దళాలకు కానీ ఎలాంటి ప్రాణ నష్టం కలగకపోవడం తమ దళాల సమర్ధవంతమైన సన్నద్ధత వల్లనే సాధ్యమైందన్నారు. ఇరాన్ గత 20 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అలాంటి దేశంతో ఘర్షణ విషయంలో తామెప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగానే ఉంటామని పేర్కొన్నారు. ఇరాన్ టాప్ కమాండర్ సులేమానీ చనిపోయాక ప్రపంచం మరింత సురక్షితమైందన్నారు. కాగా, అమెరికాతో ఘర్షణకు సంబంధించి ఇరాన్ నుంచి విభిన్న ప్రకటనలు వెలువడ్డాయి. సులేమానీ హత్యకు భవిష్యత్తులో తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఉన్నతస్థాయి సైనికాధికారి అబ్దొల్లా అరాఘి వ్యాఖ్యానించారు. వందలాది మిస్సైల్స్ ఉన్నాయి ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై 13 క్షిపణులను ప్రయోగించామని ఇరాన్ వైమానిక దళ ఉన్నతాధికారి బ్రిగేడియర్ జనరల్ ఆమిర్ అలీ హజీజాదేహ్ వెల్లడించారు. తమవద్ద ఇంకా వందలాది క్షిపణులు ఉన్నాయన్నారు. క్షిపణి దాడులతో పాటు ఇరాక్‌లోని అమెరికా మిలటరీ మానిటరింగ్ సర్వీసెస్‌పై సైబర్ దాడి చేశామన్నారు. ఇరాన్ దాడిలో తమ సైనికులెవరూ చనిపోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, అమెరికా మరో తప్పు చేస్తే ప్రతీకారం అత్యంత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరించారు. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడి న్యాయమైనదేనన్నారు. తమ అణు కార్యక్రమానికి సంబంధించి ఐరాస పర్యవేక్షకులకు సహకరించడం కొనసాగిస్తామన్నారు. రౌహానీ గురువారం బ్రిటన్ ప్రధాని జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడారు. సులేమానీ హత్యను ఖండించాలని ఈ సందర్భంగా జాన్సన్‌ను కోరారు. సులేమానీ కృషి వల్లనే సిరియా, ఇరాక్‌ల్లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను అణచివేయగలిగామని, ఆ కారణంగానే బ్రిటన్‌లో ప్రజలు శాంతిగా ఉంటున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బోరిస్ జాన్సన్‌తో రౌహానీ వ్యాఖ్యానించారు. గల్ఫ్‌లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని జాన్సన్ రౌహానీని కోరారు. భారత్ ఆకాంక్ష ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సాధ్యమైనంత త్వరగా తగ్గాలని భారత్ ఆకాంక్షించింది. గల్ఫ్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొనేందుకు భారత్ తీసుకునే చర్యలను స్వాగతిస్తామని బుధవారం భారత్‌లో ఇరాన్ రాయబారి పేర్కొన్న విషయం తెలిసిందే. -
కోర్టులకు సీఐఎస్ఎఫ్ భద్రత?
న్యూఢిల్లీ: హింసాత్మక ఘటనలను నివారించేందుకు కొన్ని న్యాయస్థానాల్లో ప్రత్యేక తరగతికి చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రత ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. గత నవంబరులో జరిగిన ఈ ఘటనలో న్యాయవాదులు, పోలీసులు పరస్పరం దాడులకు దిగిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ నిర్ణయం తరువాత ప్రత్యేక సీఐఎస్ఎఫ్ జవాన్లను ఏర్పాటు చేసే అంశాన్ని చేపట్టాలని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలిపారు. జవాన్ల ఏర్పాటు న్యాయవాదులకు ఇబ్బందికరం కావచ్చునని ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సహాయపడుతున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అన్నారు. -
ఇరాన్ క్షిపణుల వర్షం అమెరికా శాంతి మంత్రం
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్–అమెరికాల మధ్య ఉద్రిక్తతలు బుధవారం కీలక మలుపు తీసుకున్నాయి. ఒకవైపు, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మంగళవారం రాత్రి క్షిపణుల వర్షం కురిపించగా, మరోవైపు, అమెరికా అనూహ్యంగా శాంతి మంత్రం జపించింది. ఇరాన్ క్షిపణి దాడిలో తమ సైనికులెవరూ చనిపోలేదని, తమ మిలటరీ స్థావరాలకు కొంత నష్టం మాత్రం వాటిల్లిందని బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శాంతిని కోరుకునే అందరితో శాంతియుత సంబంధాలనే కోరుకుంటామన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థను నిర్మూలించేందుకు కలసిరావాలని ఇరాన్‌ను కోరారు. దీంతో, తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు కొంతమేరకు చల్లబడ్డాయి. అమెరికా సైనికులు, సంకీర్ణ దళాలు ఉన్న అల్ అసద్, ఇర్బిల్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ప్రకటించింది. ఈ దాడి అమెరికాకు చెంపపెట్టులాంటిదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ‘అమెరికాకు భయపడి వెనక్కువెళ్లబోం’ అని ఈ దాడి ద్వారా స్పష్టం చేశామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని అమెరికా చంపినందుకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ అధికార టీవీ ప్రకటించింది. ‘ఈ దాడుల్లో అమెరికాకు చెందిన 80 టెర్రరిస్ట్ సైనికులు హతమయ్యారు’ అని వ్యాఖ్యానించింది. ‘అమెరికా సైనికులు ఉన్న రెండు స్థావరాలపై 22 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడిలో ఇరాకీ సైనికులకు గాయాలు కాలేదు’ అని ఇరాక్ మిలటరీ ప్రకటించింది. ‘నేరానికి పాల్పడితే.. తగిన జవాబు సిద్ధంగా ఉంటుందని ఆమెరికాకు తెలియాలి’ అని హసన్ రౌహానీ పేర్కొన్నారు. ‘వారు తెలివైన వారైతే.. ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోరు’ అని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భయాందోళనలకు తెర ఇరాన్ క్షిపణి దాడులపై అమెరికా ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ, మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేవనుందనే ఊహాగానాల మధ్య బుధవారం ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘శాంతిని కోరుకునే అందరితో అమెరికా సామరస్యపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది’ అని ఇరాన్ నాయకత్వానికి, ప్రజలకు స్పష్టం చేశారు. ‘ఇరాన్ ప్రజలు, ఆ దేశ నాయకులు కోరుకున్న భవిష్యత్తు, గొప్ప భవిష్యత్తు లభించాలనే మేమూ కోరుకుంటున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారనివ్వబోనని ప్రతినబూనారు. ‘నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతవరకు ఇరాన్ అణ్వాయుధ దేశం కాబోదు’ అన్నారు. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని తక్షణమే విడనాడాలన్నారు. ప్రస్తుతం ఇరాన్‌తో ప్రపంచ దేశాలు మరింత సమర్ధవంతమైన అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉందన్నారు. సులేమానీని క్రూరుడైన ఉగ్రవాదిగా ట్రంప్ మరోసారి అభివర్ణించారు. అమెరికా, ఇరాన్ రక్తంతో సులేమానీ చేతులు తడిచాయన్న ట్రంప్.. అతడిని అంతమొందించడం ద్వారా ఉగ్రవాదులకు కఠిన సందేశమిచ్చామన్నారు. ఉగ్ర సంస్థ ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీని అంతమొందించడం వల్ల ఇరాన్‌కు మంచి జరిగిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్‌పై తక్షణమే మరిన్ని ఆర్థిక ఆంక్షలను విధించనున్నామని ప్రకటించారు. ఇరాన్ తన తీరును మార్చుకునే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ దాడి చేసిన సైనిక కేంద్రాల్లోని తమ సైనికులంతా క్షేమంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. ఇరాన్ దాడులకు తెగబడే అవకాశముందన్న సమాచారం నేపథ్యంలో ఇరాక్‌లో తమ దళాలున్న అన్ని మిలటరీ స్థావరాల్లో తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్నామని అమెరికా మిలటరీ కేంద్రం పెంటగన్ అధికార ప్రతినిధి జొనాథన్ హాఫ్మన్ తెలిపారు. తమ దళాలు, మిత్ర పక్షాల సంకీర్ణ దళాల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు, ట్రంప్ బుధవారం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానికి ఫోన్ చేసి ఇరాన్ – ఇరాక్ పరిస్థితిపై చర్చించారు. జర్మనీ చాన్సెలర్ మెర్కెల్‌తో ఉద్రిక్త పరిస్థితిపై ట్రంప్ చర్చించారు. చావుదెబ్బ తీస్తాం: ఇజ్రాయెల్ మాపై దాడికి దిగితే చావుదెబ్బ తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తమ బద్ధ శత్రువు ఇరాన్‌ను హెచ్చరించారు. సులేమానీని హతమార్చినందుకు అమెరికాకు అభినందనలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్లో ఘర్షణల్లో అమెరికాకు తమ సంపూర్ణ మద్దతుంటుందన్నారు. ఇజ్రాయెల్ నగరాలను నేలమట్టం చేస్తామని ఇటీవల ఇరాన్ మిలటరీ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో నెతన్యాహూ పై వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ వెళ్లకండి న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాక్ వెళ్లాలనుకునే పర్యాటకులకు భారత్ పర్యాటక సూచన జారీ చేసింది. ‘అంతగా అవసరం లేని ప్రయాణమైతే రద్దు చేసుకోండి’ అని ఇరాక్ వెళ్లే భారత ప్రయాణీకులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇరాక్‌లోని భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు అస్సలు చేయవద్దని సూచించింది. శాంతికి భారత్ కృషి చేయాలి ఇరాన్–అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తీసుకునే ఎలాంటి శాంతి చర్యలనైనా ఇరాన్ స్వాగతిస్తుందని భారత్‌లో ఆ దేశ రాయబారి అలీ చెగెనీ పేర్కొన్నారు. ఇరాన్–అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగబోవని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. సులేమానీకి నివాళులర్పించేందుకు ఇరాన్ ఎంబసీలో బుధవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. -
లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు పెంపు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలపై పడింది. దీంతో సోమవారం దేశంలో పెట్రోల్ లీటర్‌పై 15 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెరిగింది. ఇక ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.76.69 ఉండగా.. డీజిల్ లీటర్‌కు రూ.68.68లకు చేరింది. కాగా 2018 నవంబర్ తర్వాత పెట్రోల్ ధర ఇదే అత్యధికం. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వరుసగా ఇది ఐదోరోజు. -
జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జి
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపునకు నిరసనగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ వర్సిటీ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఆయిషీ ఘోష్ సహా దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఫీజులు తగ్గించాలన్న డిమాండ్‌తో జేఎన్‌యూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో నినాదాలు చేసుకుంటూ ముందుకుసాగారు. పార్లమెంటు భవనం వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు సఫ్దర్‌గంజ్ సమాధి వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమీపంలో ఉన్న మూడు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. నెల్సన్ మండేలా మార్గ్, అరబిందోమార్గ్, బాబా గంగానాథ్ మార్గ్‌లలో పలు ఆంక్షలు విధించారు. విద్యార్థుల ఆందోళనలతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, పోలీసుల తీరుపై విద్యార్థులు విరుచుకుపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థుల చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఎమర్జెన్సీ ఇన్ జేఎన్‌యూ’పేరుతో ట్యాగ్ చేశారు. ఈ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. త్రిసభ్య కమిటీ ఏర్పాటు.. జేఎన్‌యూలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటుచేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ కమిటీలో యూజీసీ మాజీ చైర్మన్ వీఎస్ చౌహాన్, ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధ, యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీకి యూజీసీ సహకారం అందించనుంది. -
సొంత హెలికాప్టర్‌ను కూల్చడం పెద్ద తప్పు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఫిబ్రవరి చివరలో.. తమ సొంత హెలికాప్టర్‌ను కశ్మీర్లో తామే కూల్చివేయడం అతిపెద్ద తప్పిదమని వైమానిక దళ(ఐఏఎఫ్) ప్రధానాధికారి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా అంగీకరించారు. పాక్ వైపు నుంచి జరిగే ఏ దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తక్కువ సమయంలోనే స్పందించి, సైన్యం, నౌకాదళంతో సమన్వయం చేసుకుని దాడులు చేయగలమన్నారు. ఫిబ్రవరి 27న పొరపాటున బుద్గాం జిల్లాలో ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ 17 చాపర్‌ను వైమానిక దళం భూమి మీది నుంచి ఆకాశంపై ప్రయోగించగల క్షిపణి ద్వారా కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఐఏఎఫ్ అధికారులు, ఒక పౌరుడు మరణించారు. ఈ ఘటనపై జరిపిన అంతర్గత విచారణ ముగిసిందని, బాధ్యులుగా తేలిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని భదౌరియా శుక్రవారం తన తొలి ప్రెస్మీట్లో వెల్లడించారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రక్రియ ప్రారంభించామన్నారు.అంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ చేసిన దాడులకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ప్రదర్శించారు. చాపర్‌లోని సిబ్బంది, కంట్రోల్ సెంటర్లోని అధికారుల మధ్య సమాచార లోపం విచారణలో స్పష్టంగా కనిపించిందని భదౌరియా తెలిపారు. కూల్చివేతకు గురైన సమయంలో చాపర్‌లోని ‘ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ ఫో’(ఐఎఫ్ఎఫ్– మిత్రుడా, శత్రువా గుర్తించడం) సిస్టమ్ నిలిపేసి ఉందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి. దాంతో శత్రు చాపర్‌గా భావించి దానిని క్షిపణి ద్వారా కూల్చివేశారన్నారు. ఫిబ్రవరి 27న కశ్మీర్‌లోని నౌషేరాలో భారత్, పాక్‌ల మధ్య యుద్ధ విమానాలు భీకర పోరు సలుపుతున్న సమయంలో భారత్‌కు చెందిన ఎంఐ 17 కూల్చివేతకు గురైన విషయం తెలిసిందే. డ్రోన్లతో ముప్పు సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడవడం కొత్త ముప్పుగా మారిందని భదౌరియా పేర్కొన్నారు. పాక్‌లోని ఉగ్ర సంస్థలే దీనికి పాల్పడుతున్నాయన్నారు. టిబెట్ ప్రాంతంలో చైనా భారీగా మిలటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటాన్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు.అయితే, దానిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాక్ ఒప్పుకోకపోయినా, ఫిబ్రవరి 27న పాక్‌కు చెందిన ఎఫ్ 16ను భారత్ కూల్చివేయడం వాస్తవమేనని స్పష్టం చేశారు. మరో బాలాకోట్ తరహా దాడులకు సిద్ధమేనా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ ఆదేశాలపై, లక్ష్యాలేవైనా, వాటి పని పడ్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత వైమానిక దళ సమాచార వ్యవస్థను భవిష్యత్తులో పాక్ అడ్డుకునే వీలు లేకుండా సాంకేతికతను మెరుగుపర్చామన్నారు. పాక్ ఎఫ్ 16ను కూల్చేసిన అనంతరం భారత వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు భారత వాయుసేన నుంచి సందేశాలు నిలిచిపోవడం వల్లనే, ఆయన ప్రయాణిస్తున్న మిగ్ 21ను పాక్ దళాలు కూల్చివేయగలిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
సరిహద్దు శిబిరాలకు ఆర్మీ చీఫ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్‌తో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, ఆ దేశ నాయకుల రెచ్చగొట్టే ప్రకటనల నేపథ్యంలో భారత్ అప్రమత్తమయింది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం శ్రీనగర్‌కు చేరుకున్నారు. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి సైనిక పోస్టులను సందర్శించారు. బలగాల కార్యాచరణ సన్నద్ధత, ముఖ్యంగా ఎల్వోసీ వెంట వాస్తవ పరిస్థితులపై సైనిక కమాండర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాదామీబాగ్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో రాష్ట్రంలో అంతర్గత పరిస్థితులపైనా ఆయన సమీక్షించనున్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం ఆర్మీ చీఫ్ రాష్ట్రంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఇలా ఉండగా, కశ్మీర్ లోయతోపాటు శ్రీనగర్‌లో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు విధించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మలయాళ మనోరమ న్యూస్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. -
కర్ణాటకలో హైఅలర్ట్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ప్రధాన పట్టణాల్లో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. బెంగళూరుతో పాటు కలబురిగి, రాయచూర్, చిత్రదుర్గ, మంగళూరు, ఉడిపి, మైసూరు, తుమకూరు సహా ముఖ్యమైన పట్టణాల్లో భారీగా పోలీసులను మోహరించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్‌మాల్స్, మార్కెట్లు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఉగ్రవాదులు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా జనసమ్మర్ధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులుచేసే అవకాశముందని చెప్పాయి’ అని అన్నారు. కల్బుర్గీ హత్య కేసులో చార్జిషీట్ హేతువాదులు కల్బుర్గీ, గౌరీ లంకేశ్‌ల హత్య కేసులో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ శనివారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. షూటర్ గణేశ్ మిస్కిన్, అమోల్ కాలే, ప్రవీణ్‌ప్రకాశ్, వసుదేవ్ భగవాన్, శరద్ కలస్కర్, అమిత్ రామచంద్ర వీరి హత్యలకు కుట్రపన్నారని సిట్ తెలిపింది. హిందూ అతివాద గ్రూపు ‘సనాతన సంస్థ’ ప్రచురించిన ‘క్షేత్ర ధర్మ సాధన’ అనే పుస్తకంతో వీరంతా స్ఫూర్తి పొందారంది. 2014, జూన్ 9న మూఢనమ్మకాలపై కల్బుర్గీ ఇచ్చిన ప్రసంగంతో ఆయన్ను చంపాలని ఈ బృందం నిర్ణయించుకుందని పేర్కొంది. అనుకున్నట్లుగానే ఓ తుపాకీని సేకరించి తర్ఫీదు పొందారనీ, దాడికోసం బైక్‌ను దొంగిలించారని సిట్ చెప్పింది. కల్బుర్గిని ఇంట్లోనే మిస్కిన్ కాల్చిచంపాడని తెలిపింది. -
కశ్మీర్లో టెన్షన్.. టెన్షన్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం ఆదివారం నాటికి మరింత ముదిరింది. ఉగ్రవాదులు దాడిచేయొచ్చన్న వార్తల నేపథ్యంలో శ్రీనగర్‌ను వీడాలని రాష్ట్ర క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను అధికారులు ఆదేశించారు. అదే సమయంలో జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో సమావేశమైన అఖిలపక్ష నేతలు పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేసేందుకు ఇదే సరైన సమయమని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ కశ్మీర్‌పై ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలుచెప్పాయి. కలసికట్టుగా పోరాడుతాం: అఖిలపక్షం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన ఈ సమావేశానికి కాంగ్రెస్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జేఅండ్‌కే మూవ్మెంట్, ఎన్సీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అనిశ్చితిని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు వివరించేందుకు వీలుగా ఓ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాలని నేతలు నిర్ణయించారు. ఈ విషయమై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనల్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా పోరాడాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. ఆర్టికల్ 35 ఏ, ఆర్టికల్ 370లను రాజ్యాంగవిరుద్ధంగా రద్దుచేయడమంటే జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రజలపై దాడిచేయడమే. ఈ విషయంలో పరిస్థితులు మరింత దిగజారేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాం’ అని చెప్పారు. మరోవైపు పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నోటీసులు జారీచేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎవరి పేరునైనా మౌఖికంగా లేదా ఇతర మార్గాల్లో సిఫార్సు చేశారో, లేదో చెప్పాలని కోరింది. దీంతో ప్రజల్ని ఏకంచేయకుండా ప్రధాన రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనీ, ఇలాంటి ప్రయత్నాలు ఫలించబోవని ముఫ్తీ స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించనున్న నేపథ్యంలో మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఇంట్లోంచి బయటకు రాకూడదని పోలీసులు ఆదేశించారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగామిలను అరెస్ట్ చేశారు. జమ్మూలోనూ బలగాల మోహరింపు.. జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాల మోహరింపుతో ఏర్పడిన అనిశ్చితి కొనసాగుతోంది. ఉగ్రముప్పు నేపథ్యంలో కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరాలు, పోలీస్ ప్రధాన కార్యాలయం, విమానాశ్రయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను ఆదివారం కట్టుదిట్టం చేశారు. అలాగే జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను భారీగా మోహరించారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. కశ్మీర్లో పరిస్థితులు మరింత దిగజారవచ్చన్న భయంతో స్థానికులు నిత్యావసర సరుకులు, పెట్రోల్ కొనేందుకు షాపుల ముందు భారీ సంఖ్యలో బారులుతీరారు. మరోవైపు పుల్వామా తరహాలో ఉగ్రవాదులు వాహనాలతో ఆత్మాహుతిదాడికి పాల్పడకుండా ఉండేందుకు భద్రతాబలగాలు రోడ్లపై చాలాచోట్ల బారికేడ్లను ఏర్పాటుచేశాయి. యాజమాన్యం ఆదేశాలతో నిట్–శ్రీనగర్ విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. అమిత్ షా–దోవల్ కీలక భేటీ.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి, భారత్‌లో చొరబాటుకు యత్నించిన 5–7 మంది పాక్ బ్యాట్ కమాండోలను ఆర్మీ హతమార్చడం తదితర అంశాలపై దాదాపు గంటపాటు చర్చలుజరిపారు. మరోవైపు జమ్మూ, ఉధమ్‌పూర్, కర్తా ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లలో రాబోయే 48 గంటలపాటు టికెట్ల తనిఖీ చేయబోమని రైల్వేశాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉన్న అమర్నాథ్ యాత్రికులు రిజర్వేషన్ లేకపోయినా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని వీడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అధికారులు, వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లరాదనీ, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని కార్గిల్ కలెక్టర్ ఆదేశించారు. దీటుగా బదులిస్తాం: పాక్ భారత్ ఎలాంటి దుస్సాహసానికి, దురాక్రమణకు పాల్పడినా దీటుగా బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. కశ్మీరీలకు తమ దౌత్య, నైతిక, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశానికి రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, విదేశాంగమంత్రి ఖురేషీ, త్రివిధ దళాధిపతులు, ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం పాక్ స్పందిస్తూ..‘భారత్ చర్యల కారణంగా ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి విఘాతం కలుగుతుంది. కశ్మీర్ అన్నది సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యే. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని పరిష్కరించాలని భారత్‌ను కోరుతున్నాం. తాజాగా బలగాల మోహరింపుతో కశ్మీర్లో పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది’ అని హెచ్చరించింది. ట్రంప్ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని చెప్పారనీ, అందుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. జమ్మూలో హైదరాబాద్ రైలు ఎక్కుతున్న విద్యార్థులు -
మళ్లీ భారత్‌పై దాడి జరిగితే..
వాషింగ్టన్: భారత్‌పై మరో ఉగ్రదాడి కనుక జరిగితే పాక్ ప్రమాదంలో పడినట్లేనని అమెరికా హెచ్చరించింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. భారత ఉపఖండంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదని అమెరికా కోరుకుంటున్నట్లు బుధవారం వైట్‌హౌజ్‌లో సీనియర్ అధికారి చెప్పారు. ‘ఉగ్రసంస్థలపై పాకిస్తాన్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల భారత్‌పై మళ్లీ ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్‌కు అది తీవ్ర సమస్యాత్మకంగా మారుతుంది. దీనివల్ల భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఆస్కారం ఉంది’అని ఆయన పేర్కొన్నారు. ‘గతంలో కూడా చాలా మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ అరెస్ట్ చేయడం చూశాం. కానీ కొద్ది నెలలకే వారిని విడుదల చేశారు. కొందరు ఉగ్రవాద నేతలు దేశవ్యాప్తంగా ప్రయాణించేందుకు ఇంకా అనుమతి ఉంది’అని చెప్పారు. ఆర్థికంగా అందుతున్న సహాయసహకారాలు కావాలో వద్దో పాకిస్తానే తేల్చుకోవాలని ఆయన సూచించారు. పాక్‌ను చైనా కాపాడొద్దు.. పాకిస్తాన్‌ను కాపాడటం చైనా బాధ్యత కాదని, దీనికి బదులు ప్రపంచ దేశాలతో కలసి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్‌పై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి పేర్కొన్నారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పెట్టిన ప్రతిపాదనను చైనా వీటో అధికారంతో అడ్డుకోవడం ఎంతో నిరాశ కలిగించిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు సాంకేతిక కారణాలు చూపి నాలుగు సార్లు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. -
భారత్‌తో చర్చలకు సిద్ధం : ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : భారత వైమానిక దళం మెరుపుదాడుల నేపథ్యంలో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌తో చర్చలకు సిద్ధమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం పాక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కలిసి కూర్చుని మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందాం. శాంతియుత వాతావరణంలో చర్చించుకుంటే మంచిది. సహనం కోల్పోతే పరిస్థితులు మరోలా ఉంటాయి. యుద్ధం మొదలైతే.. అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. అప్పుడు ఇక పరిస్థితులు మోదీ అదుపులోగాని.. నా అదుపులోగాని ఉండవు. యుద్ధం వస్తే రెండు దేశాలకు మంచిది కాద’న్నారు. అంతేకాక ‘మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో.. మా దగ్గర కూడా అవే ఆయుధాలు ఉన్నాయి. ఉగ్రవాదం నిర్మూలనకు ఏం చేయాలో చెప్పండి. చర్చల ద్వారా మాత్రమే పరిస్థితులను అదుపు చేయగలం. పుల్వామా దాడి వల్ల మీకు దుఃఖం కల్గింది.. దానికి మేము బాధపడ్తున్నాము. ఇందుకు యుద్ధం పరిష్కారం కాదు. చర్చలతో మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది ’ అని తెలిపారు. అంతేకాక రెండు భారత యుద్ధ విమనాలను కూల్చేశామని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. -
కాటసాని అరెస్ట్.. బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత
-
బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత.. కాటసాని అరెస్ట్
సాక్షి, కర్నూల్ : జిల్లాలోని బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి బనగానపల్లెలో ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. రెండు రోజుల కిందట వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే సోదరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలపై దాడి అనంతరం నేడు ఎమ్మెల్యే బీసీ జానార్థన్ రెడ్డి, కాటసాని నివాస కాలనీలో పర్యటన నిర్వహించేందుకు బీసీ వర్గీయులు ఏర్పాట్లు చేస్తోన్నారు. ఈ క్రమంలో డోన్ డీఎస్పీ ఖాదిర్ భాషా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకా ముందు జాగ్రత్తగా చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో తొలిసారి పట్టణంలోకి టియర్ గ్యాస్ వాహనాన్ని కూడా రప్పించారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక పట్టణ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దాడికి దిగిన టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సోదరులపై కాటసాని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార టీడీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసినా.. వారిని అరెస్ట్ చేయని పోలీసులు.. తమ నేతను మాత్రం అరెస్ట్ చేయడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
నవాజ్ షరీఫ్‌కు షూ దెబ్బ!
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం జమియా నమీయా ఇస్లామిక్ విశ్వవిద్యాలయంలో ఓ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నవాజ్‌పై ఓ విద్యార్థి షూ విసిరాడు. ఆయన ప్రసంగించేందుకు మైక్ వద్దకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షూ నేరుగా నవాజ్ భుజాలు, చెవులకు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడితో పాటు అతని సహాయకుడ్ని భద్రతాధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. -
‘మహా’ బంద్ హింసాత్మకం
ముంబై/పుణే: మహారాష్ట్రలో ‘భీమా–కోరేగావ్’ ఘటన తాలూకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా ముంబై, పుణే సహా మహారాష్ట్రలోని పలు సున్నిత ప్రాంతాల్లో పరిస్థితి మరింత హింసాత్మకంగా మారింది. ముంబైలో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థతోపాటుగా జనజీవనం స్తంభించింది. హార్బర్ లైన్ సహా రెండుచోట్ల రాళ్లురువ్విన ఘటనలూ చోటుచేసుకున్నాయి. భీమా–కోరేగావ్ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ వర్గం చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారటంతో ఈ వివాదం మొదలైన సంగతి తెలిసిందే. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) బహుజన మహాసంఘ్, దళిత నేత ప్రకాశ్ అంబేడ్కర్ బుధవారం ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. ముంబై, పుణేల్లో వందలమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఆందోళలు జరిగాయని ప్రకాశ్ అంబేడ్కర్ తెలిపారు. నవీ ముంబై, థానే, పుణే, ఔరంగా బాద్, నాందేడ్, పర్భణీ, వాషిం, అకోలా, సింధుదుర్గ్, రాయ్‌గఢ్, కోల్హాపూర్ ప్రాంతాల్లోనూ పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఉద్రిక్తతలకు కారకులైన వారిని వదిలిపెట్టబోమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. బాంబే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామన్నారు. స్తంభించిన ముంబై చెంబూర్, ఘాట్కోపర్, కామ్రాజ్ నగర్, దిందోషి, కాందివలి, జోగేశ్వరి, కళానగర్, మాహిమ్‌లలో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. హార్బర్ లైన్‌లోని గోవండీ, మార్‌ఖుర్ద, కుర్లా, నాలా సోపారా ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై నిరసనకారులు బైఠాయించారు. దీంతో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్నినస్‌కి రావాల్సిన రైళ్లు శివారు స్టేçషన్లలోనే నిలిచిపోయాయి. ముంబైకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన డబ్బావాలాలు కూడా తమ సేవలను నిలిపివేశారు. స్కూలు బస్సులు నడవకపోవటంతో బుధవారం కూడా పాఠశాలలు మూసే ఉంచారు. పుణేలోనూ విధ్వంసం పుణేలోనూ నిరసనకారులు బస్సులు, రైళ్లపై రాళ్లు రువ్వారు. రెండ్రోజులుగా పుణేలో జరుగుతున్న ఆందోళనల్లో 42 ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. ఇవి కాకుండా నగరంలో బంద్ ప్రశాంతంగానే జరిగిందన్నారు. కాగా, ‘భీమా–కోరేగావ్’ సంస్మరణ సంబరాలను వ్యతిరేకించిన సమస్త హిందూ అఘాడీ చీఫ్ మిలింద్ ఎక్బోటే ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన దళిత సంఘాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, డిసెంబర్ 31న పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ, జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్‌లు విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ ఫిర్యాదు రావటంతో పుణే పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలో ట్రాఫిక్‌ను అడ్డగిస్తున్న ఆందోళనకారులు -
ధర్నాచౌక్ ప్రజల ప్రాథమిక హక్కు: లక్ష్మణ్
హైదరాబాద్: ధర్నాచౌక్ రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ధర్నాచౌక్ వద్ద జరిగిన ఘటనలపై ఆయన స్పందిస్తూ.. స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిమితితో కూడిన ధర్నా చౌక్‌ను కొనసాగించాలి. ప్రత్యామ్నాయ మార్గం చూయించాలి. ధర్నాచౌక్ అంశాన్ని అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. తెలంగాణ కొరకు అనేక ఆందోళనలు, ఉద్యమాలు చేసిన అనుభవం ప్రజలకు ఉందని అన్నారు. -
ప్రభుత్వమే నడిపిస్తోంది: వీహెచ్
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్ద కాలనీవాసులు ఎవరూ ఆందోళన చేయడంలేదని, ప్రభుత్వమే ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు అన్నారు. సోమవారం ఆయన జేఏసీ పిలుపు మేరకు మద్దతు తెలుపుతూ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్నాచౌక్ వద్ద బైఠాయించి సేవ్ ధర్నాచౌక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఏమీ తెలియనట్టుగా నటిస్తోందన్నారు. ఏదిఏమైనా ధర్నాచౌక్‌ను ఇక్కడి నుంచి తరలించకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. -
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత
-
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ సోమవారం పోటాపోటీ ఆందోళనతో దద్దరిల్లింది. ధర్నా చౌక్ తరలింపుపై అనుకూల, ప్రతికూల వర్గాల నినాదాలతో హోరెత్తింది. ధర్నాచౌక్ తరలింపును నిరసిస్తూ టీజేఏసీ చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అలాగే ధర్నాచౌక్ తరలించాలంటూ స్థానిక కాలనీవాసులు చేపట్టిన ఆందోళనకూ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఉదయం టీ. జేఏసీ నేతలు, వామపక్షాల నేతలతో పాటు స్థానికులు కూడా ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. ధర్నాచౌక్‌ను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నినాదాలు చేస్తుండగా.. సీపీఐ కార్యకర్తలు ధర్నా చౌక్‌ను తరలించొద్దని పెద్ద ఎత్తున దూసుకురావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు, కర్రలు, జెండాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో స్థానికులకు పలువురు వాకర్స్‌కు గాయాలయ్యాయి. మఫ్టీలో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఇరు వర్గాల వారి నినాదాలు, దాడుల మధ్య ఇందిరాపార్క్ రణరంగాన్ని తలపిస్తోంది. కాగా ఇరు వర్గాలు సంయమనం పాటించి తమ సమస్యలను శాంతియుతంగా చెప్పుకోవాలని పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండు నెలలుగా ధర్నాచౌక్‌లో ఎలాంటి ఆందోళనలకు అనుమతి ఇవ్వడంలేదని... అయితే ఈ ఒక్క రోజు మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా... చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత
కృష్ణా: కృష్ణాజిల్లా గుడివాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సోమవారం మరోసారి ఉద్రిక్త వాతావరణ నెలకొంది. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కృష్ణాజిల్లా గుడివాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని పోలీసులు ఆదివారం బలవంతంగా ఖాళీ చేయించి, అడ్డుకున్న ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)ను అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యేని నాటకీయ పరిణామాల మధ్య కైకలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలనే సివిల్ వ్యవహారంలో దాదాపు 200 మంది పోలీసులు ఈ దాడికి పూనుకోవటం కలకలం సృష్టిం చింది. ఈ వ్యవహారం వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శిస్తున్నారు.పోలీసులు ఎమ్మెల్యేను సాయంత్రం గుడివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి సొంత పూచీకత్తు మీద విడుదల చేశారు. కానీ సోమవారం టీడీపీ నేతలు హడావిడి సృష్టించడంతో అక్కబ మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో ఉదిక్తత